– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కుటుంబ సభ్యులు, స్నేహితులతో కొంత విభేదిస్తారు. విద్యార్థులకు కొంత నిరాశ. చిన్ననాటి స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారులు సామాన్య లాభాలు అందు కుంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులు, వైద్యరంగం వారికి  విదేశీ పర్యటనలు వాయిదా. 20,21 తేదీల్లో శుభ వార్తలు. ధనలాభం. ఆదిత్య హృదయం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

శుభవార్తా శ్రవణం. ఆదాయం మరింత పెరుగు తుంది. స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. నిరుద్యోగు లకు ఉద్యోగలాభం. వ్యాపారులు గతం కంటే పుంజు కుంటారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచ యితలకు మరింత ఉత్సాహం. 23,24 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్య సూచనలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు కొన్ని వసూలయ్యే అవకాశం. వ్యాపారస్తులు గతం కంటే మెరుగైన లాభాలు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.18,19 తేదీల్లో  శారీరక రుగ్మతలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కుటుంబసమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మార్చు కుంటారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగు తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు. ఇంటి నిర్మాణా లకు శ్రీకారంచుడతారు. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు సన్మానాలు, అవార్డులు రావచ్చు. 22,23 తేదీల్లో వృథాఖర్చులు. అనారోగ్యం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

మీ ఆలోచనలు అమలు చేస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సంగీత, సాహిత్య విష యాలపై ఆసక్తి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం. పారి శ్రామిక వేత్తలు, కళాకారులు, రచ యితలకు పూర్వ వైభవం కలిగే సూచనలు. 23,24 తేదీల్లో వృథా ఖర్చులు. అనా రోగ్యం. అంగారక స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

మీ ప్రతి పాదనలు కుటుంబంలో అంగీకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు పొందుతారు. వాహనసౌఖ్యం. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో అవాంతరాలు. రాజకీయవేత్తలు, పరిశోధకులు, క్రీడా కారుల యత్నాలు సఫలం. 19,20 తేదీల్లో ప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. దేవా లయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితల ఆశలుఫలిస్తాయి. 18,19 తేదీల్లో బంధు వులతో తగాదాలు.ఆంజనేయ దండకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారులకు గతంకంటే మెరుగైన లాభాలు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవేత్తలు, పరి శోధకులు, రచయితలకు ఒక సమాచారం ఊరట నిస్తుంది. 20,21 తేదీల్లో ప్రయాణాలు వాయిదా. వృథా ఖర్చులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఆలోచనలు అమలులో ప్రతి బంధకాలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు మరింత ఊరిస్తాయి. ఉద్యోగులు కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు. 23,24తేదీలలో దూరప్రయాణాలు. బంధువర్గంతో విభేదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమాచారం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరిగి ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలు, రచయితలు, క్రీడా కారులకు పురస్కారాలు అందుకుంటారు. 23,24 తేదీల్లో దూరప్రయాణాలు. శివస్తుతి మంచిది.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన,కుటుంబసౌఖ్యం. ప్రత్యర్థులను కూడా ఆకట్టు కుంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. వ్యాపారులు మరింతగా లాభపడతారు. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరి శోధకులు విదేశీ పర్యటనలు జరుపుతారు. 19,20 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

చేపట్టిన కార్యక్రమాలను శ్రమకోర్చి పూర్తి చేస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. ప్రత్య ర్థులను సైతం ఆకట్టుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వివాహయత్నాలు సానుకూలమవు తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు అందే సూచనలు. 21,22 తేదీల్లో ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE