– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరతాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు క్రమేపీ తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఊహించని హోదాలు. రచయితలు, క్రీడాకారులు,  రాజకీయవర్గాలకు విశేష గుర్తింపు, సత్కారాలు జరుగుతాయి. 11,12 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. వివాదాలు.  శివాష్టకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆత్మీయులు, బంధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయట పడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సంభవం. వైద్యులు,పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు అన్ని విధాలా సానుకూలత ఉంటుంది. 14,15 తేదీల్లో అనారోగ్యం. మానసిక అశాంతి.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుం టాయి. వాహనాలు, భూములు కొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలు సజావుగా సాగు తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. వైద్యులు, రచయితలు, క్రీడాకారులకు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.11,12తేదీల్లో ఆరోగ్యభంగం. మిత్రులతో కలహాలు.  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆదాయం విషయంలో మరింత పురోగతి కని పిస్తుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. అత్యంత చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్క రించుకుంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి పొందుతారు. రాజకీయవేత్తలు, కళా కారులు, వైద్యులకు మరింత ప్రోత్సాహకరమైన కాలం. 12,13 తేదీల్లో అనారోగ్యం. శ్రమాధిక్యం.  ఆదిత్య హృదయం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

సమాజంలో పరపతి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఒక వివాదం నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగాలలో అనుకూల పరి స్థితులు నెలకొంటాయి. వివాదాలు కొన్ని తీరతాయి. 15,16 తేదీల్లో మానసిక అశాంతి. కుటుంబంలో కొన్ని సమస్యలు.  అన్నపూర్ణాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని స్తాయి. ఆలయాల సందర్శన. వాహనాలు, భూములు కొనుగోలు. విద్యార్థులకు ఫలితాలు రావచ్చు.  వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగాలలో కోరుకున్న రీతిలో మార్పులు. రచ యితలు, వ్యవసాయదారుల ఆశలు ఫలిస్తాయి.  16, 17 తేదీల్లో అనారోగ్యం.  లక్ష్మీస్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం కొంత నిరాశపర్చినా అవసరాలకు లోటు ఉండదు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రముఖులతో ముఖ్య విషయాలపై ఉత్తర ప్రత్యుత్తరాలు. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి. 12,13లలో వ్యయప్రయాసలు. నృసింహస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతం. భూములు, వాహనాలు  సమకూర్చుకుంటారు. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి. వివాహ, ఉద్యోగయత్నాలలో పురోగతి. కొత్త భాగ స్వాములతో  విస్తరిస్తారు. వైద్యులు, వ్యవసాయ దారులు, రచయిత లకు అన్ని విధాలా అనుకూల సమయం. 11,12 తేదీల్లో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొన్ని వ్యవహారాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆదాయం కొంత నిరుత్సాహపరుస్తుంది. అయితే అవసరాలు తీరతాయి.  స్వల్ప అనారోగ్య సూచనలు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి.  ఉద్యోగాలలో కొన్ని మార్పులు సంభవం. పారిశ్రామిక, రాజకీయవేత్తలు క్రీడాకారులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది.  14,15 తేదీల్లో సన్నిహితులతో విభేదాలు. శ్రమ తప్పదు. ఆంజనేయ దండకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆదాయానికి లోటు ఏర్పడి అప్పులు చేస్తారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, కళా కారులు, వైద్యులకు విదేశీ పర్యటనలు వాయిదా. 13,14 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం.   శ్రీరామస్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుం టారు. విద్యార్థులు  ప్రతిభను నిరూపించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యవసాయ దారులు, రాజకీయవేత్తలు, కళాకారులు కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. 16,17 తేదీల్లో మానసిక ఆందోళన. విష్ణుధ్యానం చేయండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. రాబడి మరింత మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో  అనుకోని హోదాలు రావచ్చు. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు గౌరవ పురస్కారాలు, విదేశీయానం. 13,14 తేదీల్లో శ్రమాధిక్యం. గణేశ్‌ ‌స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE