సెప్టెంబర్‌ 15 ఆదివారం అర్థరాత్రి కృష్ణా జిల్లా పెడనలో బస్‌ స్టాండ్‌ వెనుక ఉన్న గణపతి మందిరంపై, నవరాత్రి ఉత్సవ పందిరిపై ఇస్లామీయులు రాళ్లతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే రాళ్లు విసిరారు. ఆ రాళ్ల దాడిలో రక్షకభటులకు సైతం దెబ్బలు తగిలాయి. అయితే మాకేం కాలేదని, తమకు రాళ్ల దెబ్బలు తగలలేదని పోలీసులు అనటం ఈ మొత్తం వ్యవహారంలో విడ్డూరం. తమపై దాడి చేసిన అల్లరి మూకలపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. తమపై దాడికి దిగిన వారిపై హిందువులు కేసు పెట్టారు. అందుకు సాక్షులు పోలీసులే. తమపై దాడి జరగలేదని బుకాయించిన పోలీసులు రేపు హిందువులపై దాడి జరగలేదని కూడా బుకాయించవచ్చు.

పత్రికలలో రెండు మత వర్గాల మధ్య ఘర్షణగా దీన్ని చిత్రీకరిస్తూ కథనాలు రాశారు. కానీ ఇది హిందువులపై ఏకపక్షంగా జరిగినదాడి. స్థానిక హిందువులు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ లేదు. గణపతి మందిరం, పందిరి దగ్గరకు  ముస్లింలే వచ్చి అల్లాహో అక్బర్‌ అంటూ ఫ్లెక్సీలు, జెండాలు (మిలాదున్నాభి సందర్భంగా) కడుతుంటే హిందు వులు అడ్డుకున్నారు. ఆపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి వచ్చారు. హిందువులను దూరంగా వెళ్లమన్నారు. పోలీసులు చెప్పినట్లుగా హిందువులు నడుచుకున్నారు. ముస్లింలు వారిని ఖాతరు చేయలేదు. పోలీసులు నచ్చ చెబుతున్నకొద్దీ రెచ్చిపోయారు. మరికొన్ని స్తంభాలకు జెండాలను కట్టారు. ఆ సన్నివేశం ఎలా ఉందంటే పోలీసులే దగ్గరుండి ముస్లిం యువకుల చేత స్తంభాలకు జండాలను కట్టిస్తున్నట్లుగా ఉంది.

వెనకకు వెళ్లిన హిందువులు తిరిగి వచ్చారు. మరి కొంతమంది హిందువులు వచ్చి చేరారు. తమ పందిళ్ల దగ్గరకు, గుడుల దగ్గరకు వచ్చి జెండాలు కడుతూ, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుంటే, ప్రేక్షక పాత్ర వహించడానికి కారణం ఏమిటని పోలీసులను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఒక పోలీసు అధికారి భిన్నత్వంలో ఏకత్వం గురించి హిందువులకు ఉపన్యాసం ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటే, ఆ విషయం అవతలి వర్గానికి కూడా చెప్పమన్నారు హిందువులు. ఇంతలో సాయుధులైన పోలీసులు మరి కొంత మంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అదే సమయంలో రెండు నుండి మూడు వందల మంది సైలెన్సర్లు లేని మోటార్‌ వెహికిల్స్‌ మీద అల్లా హా అక్బర్‌ అంటూ నినాదాలు చేస్తూ అక్కడకు వచ్చారు. వారందరూ స్థానికేతరులే. పెడన పట్టణం బయటవారిని సమీకరించారు. గుడివాడ, బంటుమిల్లి, గూడూరు, మచిలీపట్నం నుంచి వచ్చిన అల్లరిమూకలు వచ్చీ రాగానే రాళ్ల వర్షం కురిపించారు. గుంపులుగా విడిపోయి అన్ని దిక్కుల నుండి రాళ్లు రువ్వారు. ఇదంతా పోలీసులు కళ్లముందే జరిగింది. కానీ పోలీసులు అల్లరిమూకలను అడ్డుకోవడానికి ముందు తటపటాయించారు. ఆ రాళ్ల దాడిలోనే ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. హిందువులకూ గాయాలయ్యాయి. హిందువులు ఎదురుదాడికి సిద్ధమవుతుండటంతో పరిస్థితి చేయి జారిపోతుందని గ్రహించిన పోలీసులు లాఠీలు ప్రయోగించారు. ముందుగా హిందువులపై తమ ప్రతాపం చూపారు.

బయటినుండి వచ్చిన అల్లరిమూకలను అదుపు చేయటానికి పోలీసులు జిల్లా ఎస్‌పీ వచ్చేవరకు గట్టి ప్రయత్నం చెయ్యలేదు. ఆ తర్వాత అల్లరిమూకలను చెదరగొట్టటం ప్రారంభించారు. పారిపోతూ కూడా వారి మత పెద్దలు వారి మీద పెట్టిన బాధ్యతను గుర్తు పెట్టుకొని రాళ్లు విసురుతూ పారిపోయారు. రాత్రి 11 గంటల నుంచి 2:30 గంటల వరకు ఈ రభస జరుగుతూనే ఉంది.

క్షణికావేశంలో జరిగింది కాదు

పెడన పరిసర ప్రాంతాల నుండి మూడు వందల మందిని సమీకరించారంటే ఇదంతా అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగినదికాదని తెలుస్తుంది. స్థానికులు జెండాలు కట్టి రెచ్చగొట్టారు. బయట నుండి వచ్చిన వాళ్లు సర్వ సన్నద్ధంగా తమతో పాటు రాళ్లను తెచ్చుకొని రాళ్ల వర్షం కురిపించారు. అంటే పెడన బస్టాండ్‌ వెనుక ఉన్న పందిరిని, మందిరాన్ని లక్ష్యంగా చేసుకొని, వాటిని నిర్వహిస్తున్న అక్కడున్న హిందువులపై దొమ్మికి దిగి, హత్య చేయాలన్న కుతంత్రంతో అంత రాత్రిపూట వచ్చినట్లు ఉన్నారు.

ఇంతకీ హిందువులపై అంత కోపం దేనికి?

కొన్ని నెలలుగా పెడన హిందువులలో చైతన్యం పెరుగుతున్నది. దేవాలయాలు, వాటి ఆస్తులను పరిరక్షించుకోవాలన్న ఆలోచనలతో తరచూ సమావేశాలు జరుపుతున్నారు. బక్రీద్‌ సందర్భంగా గోవధ జరగకుండా అప్రమత్తంగా ఉంటున్నారు. అక్రమ రవాణా చేస్తున్న గోవులను పట్టి పోలీసులకు అప్పగించారు.

పురాతన దేవాలయ భూముల మీద కొందరు ముస్లిం రాజకీయ పెద్దలు కన్నువేశారు.  ఆక్రమించుకునే ప్రయత్నానికి తెర లేపారు. హిందువులు వారి ప్రయత్నాలకు అడ్డు చెప్పారు. సెక్యులర్‌ రాజకీయ నాయకులు ముస్లింల అక్రమాలకు మద్దతుగా నిలబడుతుంటే, హిందువులు వారికి ఎదురు తిరిగారు.

ఇదంతా ముస్లిం మతోన్మాదశక్తులకు నచ్చటం లేదు. తాము ఆడిరది ఆటగా పాడిరది పాటగా ఇంతవరకు వారికి నడిచింది. ఏదైనా సమస్య వస్తే వారికి మద్దతుగా నిలబడేందుకు రాజకీయ నాయకులు ఉన్నారు. సెక్యులర్‌ రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో ఉన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌, వైయస్సార్‌, ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతు ఎప్పుడు ముస్లిం మతోన్మాద శక్తులకే. వారిని అడ్డుకునే ప్రయత్నం ఇప్పుడు స్థానిక హిందూ యువకులు చేస్తున్నారు. ఇది అటు మతతత్వ శక్తులకు, సెక్యులర్‌ వాదులకు నచ్చటం లేదు. పెడనలో రెండు మూడు వార్డులలోనే ముస్లింలు ఉన్నారు. వారి సంఖ్యా బలానికి మించి వారు తమ పలుకుబడిని పెంచుకున్నారు. కులాల వారీగా విడిపోయిన హిందువులపై పెత్తనం చేస్తున్నారు. కులాతీతంగా హిందువుల చైతన్యవంతమైతే అటు ఇస్లామిక్‌ శక్తులకు, స్వార్థపరులైన సెక్యులర్‌ వాదులకు మింగుడు పడటం లేదు.

తమ కళ్ల ఎదుట ముస్లిం అల్లరి మూకలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు తటపటాయిస్తున్నారు. ఒకవేళ హిందువులు అదే దౌర్జన్యానికి పాల్పడితే, పోలీసులు రెచ్చిపోయి, కొన్ని క్షణాలలోనే పరిస్థితిని తమ అదుపులోనికి తెచ్చుకునేవారు.

పెరుగుతున్న ముస్లిం మతోన్మాదం

పెడనలో అర్ధరాత్రి బయట ఊర్ల నుంచి వచ్చిన అల్లరి మూకలు దౌర్జన్యానికి పాల్పడుతుంటే, పోలీసులు కాలయాపన చేశారు. రెండు గంటల పాటు రాళ్లు విసిరినా, ఆ రాళ్ల దెబ్బలు తమకు కూడా తగిలినా ఎందుకు పోలీసులు సహనంగా వ్యవహరించారో ఊహించటం కష్టం కాదు. ముస్లిం మతోన్మాద శక్తుల జోలికి వెళితే రాజకీయ నాయకులు నానా యాగి చేస్తారు. ఇది సమాజానికి మంచిది కాదు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహ రించాలి. దౌర్జన్యకారులు ఏ మతానికి చెందినా, ఏ వర్గానికి చెందినా అదుపు చేయగలగాలి. హిందువుల కైతే ఒక నిబంధన, ముస్లిం మతోన్మాద శక్తులకైతే మరొక నిబంధన అనుసరిస్తే, మతోన్మాద శక్తులు విజృంభిస్తాయి.

ముస్లిం మతోన్మాదం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. జగన్‌ ఐదేళ్ల పాలనలో మతోన్మాదం అల్పసంఖ్యాక వర్గంలో పెంచారు. జమాతే ఇస్లామీ ప్రభావం మచిలీపట్నం, పెడన మరిసర ప్రాంతాలలో చూడవచ్చు. వేష భాషలలో అరబ్బులను అనుసరించడం పెరిగింది. మసీదులలో మైకుల సౌండ్‌ గరిష్ట స్థాయిలో పెడుతున్నారు. సుప్రీంకోర్టు  ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి పోలీసు అధికారులు భయపడుతున్నారు. ఎవరికి వారు ముస్లిం మతోన్మాద శక్తులు బలపడటానికి తమకు తెలియకుండానే తమవంతు సహకారం అందించటం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది.

ఇంతవరకు దౌర్జన్యకారులను పట్టుకోలేదు. దౌర్జన్యకారుల వెనుక ఉన్న కుట్ర దారులను గుర్తించలేదు. హిందువులపై ఏకపక్షంగా జరిగిన దాడి ఇది. పెడనలో ఉన్న మదర్సాకు అనుమతులు ఉన్నాయో లేవో తెలియదు. బాల్యం నుండే మత విద్వేషాన్ని పిల్లలలో ప్రేరేపించడానికి మదర్సాలు కేంద్ర బిందువు అవుతున్నాయి. పాకిస్తాన్‌, బాంగ్లాదేశ్‌లలో హిందువులను, బౌద్ధులను తమ తమ దేశాల నుండి వెళ్లగొట్టి తమ దేశాల మైనారిటీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసుకుంటున్నాయి. భారత్‌ అందుకు భిన్నంగా అందరినీ ఆదరిస్తున్నది.  సామాన్య ముస్లింలను ముస్లిం తీవ్రవాద శక్తుల ప్రభావం నుండి బయటకు తీసుకొని రావాలి. ‘ఇస్లామ్‌ ప్రమాదకరంలో పడిరది’ అన్న తీవ్రవాదుల మోసపూరిత ప్రచారాన్ని నమ్మబట్టే, తీవ్రవాదం పెరుగుతున్నది. మతవిద్వేషం పెరుగుతున్నది. ఇప్పుడు అనేక పట్టణాలలో జరుగుతున్నది అదే. పెడన, మచిలీపట్నంలలో పెరుగుతున్న తీవ్రవాద శక్తుల ప్రభావం నుండి సామాన్య ముస్లింలను బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నం జరగాలి. ముస్లింలలో మతోన్మాద శక్తుల కంటే, వారికి అడగకుండానే మద్దతునిచ్చే సెక్యులర్‌ రాజకీయ నాయకులు మరింత ప్రమాదకరం.

నిష్పాక్షిక దర్యాప్తు ఆవసరం

పెడనలో జరిగిన సంఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలి. ముస్లిం వ్యాపారాలను బహిష్కరించాలని హిందూ యువకులు ఆలోచిస్తున్నారు. తమను ద్వేషించే వారిని, తమ పట్ల దౌర్జన్యానికి పాల్పడిన వారిని సహించేది లేదని వారు అంటున్నారు. పోలీసుల ప్రవర్తనను తప్పుపడు తున్నారు. తమపై దాడికి దిగినవారితో పాటుగా బాధితులైన హిందువులపై పోలీసులు కేసులు కట్టడం శోచనీయం. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించా లని కోరుకుంటున్నారు. సమస్య మూలాలలోనికి వెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నించకపోతే మొన్న జరిగిన సంఘటనలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉంటాయి.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE