ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన, అనేక శతాబ్దాలు అత్యంత శక్తిమంతంగా మనుగడ సాగించిన భారతదేశం హఠాత్తుగా అనేక ఆక్రమణలను, దాడులను ఎందుకు ఎదుర్కోవలసి వచ్చింది? మొదట ఇస్లామిస్టులు, తర్వాత వచ్చిన బ్రిటిషర్లు ఎవరైనా కానీ ఎంతో ప్రాచీన విజ్ఞానం కలిగిన మనను ఎలా ఓడించగలిగారు? అన్న సందేహం ఈ కాలపు యువతకు కలగడం సహజమే. ఈ పరిణామాల వెనుక అరుచికరమైన వాస్తవాలు కొన్ని ఉన్నాయి. అనేకమంది చరిత్రకారులు రకరకాల కోణాలలో ఇందుకు కారణాలను వెతికారు. ఇందులో విలువల పతనం నుంచి యుద్ధ వ్యూహాల వైఫల్యం, అనైక్యత వరకూ అనేకం ఉన్నాయి. సనాతన ధర్మపాలన చేయకపోవడం ప్రధానమైన కారణంలా కనిపిస్తోంది.
‘‘హిందువులు ధర్మానికీ ,దేశానికీ ముంచు కొస్తున్న మహోపద్రవాన్ని సరిగా గుర్తించరు. ఉమ్మడి గత్తరను ఉమ్మడిగా ఎదుర్కోవడం అందరికీ క్షేమం అన్న ఆలోచన వారికి కలగదు. స్పర్ధలు, వైరాలు, అహంకారాలు పక్కనబెట్టి విశాల దృష్టితో సహకరించుకోవడం తమకే మంచిది అన్న వివేకం లోపించడం ఎంత వినాశకరమో శతాబ్దాల చరిత్ర పదేపదే నిరూపించినా వారు మారరు. ప్రాప్తకాలజ్ఞత చూపరు. శతాబ్దం వేరు… రాజ్యాలు వేరు.. రాజుల పేర్లు వేరు కానీ శత్రువు ఒక్కడే, యుద్ధ పర్యవసానం ఒక్కటే.’’
పై వాక్యాలు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, రచయిత ఎంవిఆర్ శాస్త్రి తాజా రచన ‘‘వెయ్యేళ్ల ధర్మయుద్ధం’’ పుస్తకంలోనివి. హిందూ రాజులు శతాబ్దాలుగా చేసిన వీరోచిత పోరాటాల నేపథ్యంలో అప్పటి పరిస్థితులపై తన విశ్లేషణగా ఆయనపై వాక్యాలు ఉటంకించారు. హిందువులను జాగృతం చేసేందుకు ఆయన వెలువరించిన చారిత్రక రచనల్లో భాగంగా దీనిని ప్రస్తుతం పాఠకుల ముందుకు తెచ్చారు. ఈ పుస్తకం చదవాల్సిన ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా సమీక్షించాల్సి ఉంది. అయితే ఆయన పేర్కొన్న పై వాక్యాలు చూస్తుంటే నాకు ఇప్పటి మనదేశ పరిస్థితికి అవి అద్దంపట్టేలా వున్నాయని అనిపించి చిన్న మార్పులతో వాటిని ఇక్కడ ప్రస్తావించాను.
అనైక్యత వల్ల దేశం అన్యమతస్తుల చేతుల్లోకి?
అప్పట్లో మనదేశం ఎక్కడికక్కడ స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయి ఐక్యత లేకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని చరిత్ర చెబుతోంది. అయితే ఇప్పటి ఈ ఆధునిక కాలంలో మనది విశాల భారతదేశంగా ఒకటిగా కనబడుతున్నా నిజానికి హిందువుల్లో ఐక్యత లేకపోవడంతో మళ్లీ మనదేశం క్రమంగా అన్యమతస్తుల చేతుల్లోకి వెళుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. రాబోయే రెండు మూడు దశాబ్దాలలో మనది ముస్లిం రాజ్యంగా మారుతుందనే ప్రమాదకర సంకేతాలు వెలువడుతున్నాయి. అదెలాగంటే ఇంటా, బయటా మోహరించి ఉన్న దేశ వ్యతిరేక శక్తులన్నీ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని మన దేశాన్ని ముస్లిం దేశంగా మార్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. మన దురదృష్టం కొద్దీ అందుకు ఆస్కారం ఇస్తోంది అనేక శాఖలుగా విడిపోయి ఉన్న మన హిందువులే కారణం కావడం విచారకరం.
అదేలాగంటే వివిధ కుల సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా, కమ్యూ నిస్టులుగా, హేతు వాదులుగా, నాస్తిక వాదులుగా, అనేక ఇజాలుగా హిందువులు చీలిపోయి ఉన్నారు. ఇతర మతాలలో కూడా ఆ విభేదాలు వుండవా అంటే ఒకరకంగా ఉన్నా మత సంబంధమైన అంశం తెరపైకి వచ్చే టప్పటికి వారంతా ఒక్క తాటిపైకి వచ్చేస్తారు. అదే వారి బలం. ఎన్నికలప్పుడు ఓటర్లుగా ఆ ప్రభావం శక్తిమంతంగా చూపుతారు. అందుకే మన రాజకీయపార్టీలు వారిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి మైనారిటీ బుజ్జగింపుల అస్త్రాన్ని బయటికి తీస్తారు.
సెక్యులరిజం ముసుగులో హిందువుల పట్ల వివక్ష
సెక్యులర్ నినాదంతో ఏకపక్షంగా పక్షపాత రాజకీయాలకు పాల్పడతారు. ఏడు దశాబ్దాలకు పైగా స్వతంత్ర భారతంలో జరుగుతున్నది ఇదే. మన భారత దేశం అనే మహా హిందూ వృక్షాన్ని ఎడారి మతాలైన ముస్లిం, క్రైస్తవ మతాల చెరో పక్కనుంచి తొలిచేస్తున్నాయి. ముస్లిం సంస్థలు, ఎవ్వరూ ఏమనుకున్నా పర్వాలేదని, దేనికీ భయపడేది లేదని వివిధ రకాల జీహాదులు, హలాల్‌లు, వక్ఫ్ బోర్డు పేరుతో విజృంభిస్తూ హిందూమహా వృక్షాన్ని పైకి కనబడేలా నరుక్కొస్తున్నారు. ఇక మతమార్పిడుల పేరుతో క్రైస్తవులు చాపకింద నీరులా హిందూ మతాన్ని వేళ్లనుంచి కొరికేస్తూ వస్తున్నారు. ఇదో దొంగదాడి. ప్రపంచ వ్యాప్తంగా తమ మత రాజ్యాలుగా వాళ్లకి వందల సంఖ్యలో దేశాలు ఉన్నా ఓకే ఒక అతి పెద్ద హిందూ దేశమైన భారత్‌ను కూడా వాళ్ల మత రాజ్యంగా మార్చేయాలని తహతహ లాడిపోతున్నారు. సెక్యులర్ అనే ఒక్క పదాన్ని అడ్డంపెట్టుకుని, అసలు ఆ భావన ఏ మాత్రం లేని ఆ అబ్రహం మతాలతో మన హిందువుల్లోని దుష్టులు కొందరు చేతులుకలిపి మన దేశానికి తీరని ద్రోహం చేస్తున్నారు. ఆ రెండు మతాల్లో సవాలక్ష అనాచారా లున్నా అవేమీ వీళ్లకి పట్టవు. ఇంతకు ముందు చెప్పినట్లు మన హిందూ దేశమనే మహా వృక్షాన్ని పై కొమ్మలనుంచి ఒకళ్లు, కింది వేళ్ల నుంచి ఇంకొకరు నాశనం చేస్తుంటే తాము కూర్చున్న కొమ్మని తామే నరుక్కున్నట్లు కొందరు హిందూ అంధులు స్వీయ వినాశనానికి పాల్పడుతున్నారు. ఆ విషయంపై హెచ్చరిస్తే హిందూ మతోన్మాదం అంటూ మొదటికే తెగనాడుతున్నారు.
ముస్లింలు తాము ముసల్మానులుగా చెప్పుకోవడానికి, తమ ఆహార్యాన్ని ప్రదర్శించడానికి ఏమాత్రం సంకోచించరు. అలాగే క్రైస్తవులు తాము ఆ మతం వారిగా వ్యక్తం చేసుకోవడానికి వెనుకాడరు. పైగా అది తాము తమ మతానికి ఇచ్చే ప్రాధాన్యంగా, గౌరవంగా చెప్పుకుంటారు. వారి మత చిహ్నాలను, వస్త్రాలను ధరించడానికి ప్రదర్శించడానికి ఉత్సాహంగా ముందుకు వస్తారు. బెంగుళూరులో జరిగిన హిజాబ్ ఉదంతమే అందుకు ఓ చిన్న ఉదాహరణ. అప్పుడు కుహనా సెక్యులరిస్టులు ఎవరికీ అక్కడ మతం కనబడదు. హిందువుల విషయంలో తిలకధారణ దగ్గరనుంచి, కాషాయ వస్త్రధారణ వరకు వాళ్లకు మన మతోన్మాదమే కనబడుతుంది. అందుకే మతం మారిన వాళ్లతో ముందుగా బొట్లు తుడిపించేస్తారు. తాము ఏ సంస్కృతిలో పుట్టారో ఆ సంస్కృతినే చిన్నచూపు చూసే జాతి మనదేశంలోనే కనబడుతుంది. స్వదేశాన్నే కించపరిచే జాతి వ్యతిరేక శక్తులు అధికంగా ఉన్న దేశం ఏదయినా ఉందంటే అది భారతదేశమే అని చెప్పాల్సి రావడం మన దౌర్భాగ్యం.
ఎంత దార్శనికత..! ఎంత స్పష్టత..!!
ఇక్కడ ఇస్లామిస్టుల మతోన్మాదాన్ని, దార్శనికతను మనం గమనించాలి. వారు ఎంతో వ్యూహాత్మకంగా ఆచితూచి ప్రణాళికలను రూపొందించుకుంటూ అమలు చేస్తూ వస్తున్నారు. ఎస్‌డీఏఈ అన్న ఇస్లామిక్ సంస్థ ఏరకమైన క్ష్యాలను, వాటికి కాలపరిమితులను పెట్టుకుందో గమనించినవారికి ఆశ్చర్యం కలుగక మానదు.
ఎస్‌డిపిఐ లక్ష్యాలు
- 2031లో కేరళ పాలనా పగ్గాలు చేపడతాం
- 2040 కల్లా ఆరెస్సెస్‌ని నిర్మూలిస్తాం
- 2047 లో యావత్ భారతదేశ పాలన మా చేతుల్లోకి
- 2050, జనవరి 1 ఉదయాన్నే.. భారత దేశాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ప్రకటిస్తాం.
ఇదో ప్రమాద హెచ్చరిక. ఈ ఉగ్రవాద సంస్థ కుట్ర, లక్ష్యం దిశగానే వారు అడుగులు వేస్తున్న వైనం మనకు స్పష్టంగా ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తుంది. ముస్లిం సంస్థ అసలు లక్ష్యం ఇదే భారత్‌ని ముస్లిం దేశంగా మార్చాలన్నదే. ఈ నేపథ్యంలో హిందువులు మేల్కొని వాస్తవాలు తెలుసుకోవాలి.
సర్వే జనాః సుఖినోభవంతు అనే హితోక్తిని అనుసరించడం మన సంస్కారం, ధర్మంలో భాగం. అయినా ఈదేశంలో మత సహనం, భావప్రకటనా స్వేచ్ఛ లేవంటూ మనమీదే దుష్ప్రచారం చేస్తుంటారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత స్వేచ్ఛను, సౌకర్యవంతమైన జీవితాలను ఇక్కడ అనుభవిస్తున్న అన్యమతాలవారు ఈ దేశంలో ఏదో అన్యాయానికి గురయిపోతున్నట్లు గగ్గోలు పెడుతున్నారు. పుట్టుకతో హిందువులే అయినా కుహనా మేధావుల రూపంలో దేశమంతా వ్యాపించి ఉన్న దేశ వినాశకారులు కొందరు కూడా వారితో గొంతుకలుపుతున్నారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదే.
హిందువులలో కదలిక
దశాబ్దాలుగా ఇలాంటివి చూసి, చూసి ఇప్పుడి ప్పుడే హిందువుల్లో చైతన్యం పెరుగుతోంది. అందుకే ఇప్పుడిప్పుడే హిందూ గొంతుకలు బలంగా విచ్చుకుంటు న్నాయి. అనాదిగా వస్తున్న సాంప్రదాయకమైన ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్‌లే గాకుండా ఇప్పుడు మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా క్రమంగా వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇండియా టుడే, నేషనల్ లిస్ట్ హబ్, రిఫ్లెక్షన్స్, భక్తి వన్ తదితర అనేక యుట్యూబ్ చానల్స్‌తో బాటుగా జర్నలిస్టు సాయి, లలిత్ కుమార్, హమార ప్రసాద్, శివశక్తి పేరుతో సగ్గున కరుణాకర్, గోవింద సేవ పేరుతో సత్యభామ, ఇక తన ప్రత్యేక హాస్యస్పోరక శైలిలో రాధ మనోహర్ దాస్ ఇలా ఎంతోమంది ఎక్కడికక్కడ హిందూ భావజాల వ్యాప్తికి, ధర్మ పరిరక్షణకు అలుపెరుగని పోరాటలు చేస్తున్నారు. తాజాగా తిరుమల లడ్డూ విషయంగా చెలరేగిన వివాదంలో ఒక పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మపరిరక్షణకు ప్రతినిధిగా తన గళాన్ని స్పష్టంగా వినిపించారు. వివిధ పార్టీలలో హిందూ రాజకీయ నేతల్లో కూడా కొంచెం కదలిక తెచ్చేందుకు ఇది తొలి అడుగు అవుతుందనే ఆశ పొడచూపుతోంది. ఎందుకంటే గత అనుభవాలరీత్యా శత్రువు వచ్చి మనల్ని కబళించేవరకూ చూస్తూ ఊరుకోకుండా ముందస్తు జాగ్రత్తగా మనం అప్రమత్తం అవడం మంచిది.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు… అది చక్రంలా తిరుగుతుంటుంది. ప్రస్తుతం హిందువులను మేల్కొలిపే సమయం కలిసి వచ్చినట్లుంది. అందుకే, మేధావులు, జర్నలిస్టులు, రాజకీయనాయకులు కూడా ఒక స్పష్టతతో హిందువులను కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన ‘బటేంగేతో కటేంగే’ (అనైక్యతతో ఉంటే ఓటమిపాలవుతాం) నినాదం ఇవాళ్టికే కాదు రేపు కూడా గుర్తు పెట్టుకోవలసిన నినాదం. కనుక, ఈ స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు కదలడం హిందువుల కర్తవ్యం. జాగో హిందూ… జయహో భారత్.
– డి.స్వాతి,
విజయవాడ