– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆత్మీయుల అభిమానం పొందుతారు. ఆలో చనలు కార్యరూపంలో పెడతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. దైవారాధనలో పాల్గొంటారు. గృహం,వాహనాలు కొనుగోలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు సంతోషకర సమాచారం. విద్యార్థులు, క్రీడాకారులకు అవకాశాలు పెరుగుతాయి. 19,20 తేదీలలో అనారోగ్యం. హనుమాన్ చాలీసా పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. శుభ కార్యాలకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. బంధువులు, స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు కొత్త భాగస్వాములు జతచేరతారు. ఉద్యోగులు మార్పులకు సిద్ధంగా ఉండాలి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడాకారులకు సంతోషకర సమాచారం. 16,17తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని సమస్యలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. అదనపు ఆదాయం సమకూరి ఊరట చెందుతారు. ఆరోగ్య పరంగా చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులు లాభాలలో పయనిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తల యత్నాలు సఫలం. 14.15తేదీల్లో మానసిక ఆందోళన. విష్ణుధ్యానం చేయండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం కొంత నిరాశ పర్చినా అవసరాలకు లోటు ఉండదు. కొన్ని కాంట్రాక్టులు దక్కించు కుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారు లకు భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఉద్యోగులు విశేష గుర్తింపు. కళాకారులకు అవకాశాలు దక్కుతాయి. క్రీడాకారులు, వైద్యుల యత్నాలు సఫలం. 16,17 తేదీలలో బంధువులతో తగాదాలు. నృసింహస్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. శుభకార్యాలపై దృష్టి సారిస్తారు. స్థిరాస్తి వివాదాలనుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారు లకు గతం కంటే కొంత మెరుగైన లాభాలు. రాజకీయవేత్తలకు మనశ్శాంతి. పదవులు దక్కవచ్చు. 17,18తేదీలలో వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుం టాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఉద్యోగు లకు అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. కళా కారులకు సమస్యలు నుంచి ఉపశమనం. పరి శోధకులు, రచయితలకు ముఖ్య సమాచారం అందు తుంది. 18,19 తేదీల్లో శారీరక రుగ్మతలు. సోదరు లతో కలహాలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల హడావిడి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొనుగోలు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. వ్యాపారులకు లాభాలు. 15,16తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో కలహాలు. విష్ణు ధ్యానం చేయండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. కొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వ్యాపారులు క్రమేపీ పుంజు కుంటాయి. ఉద్యోగులు ఉన్నత పోస్టులు పొందు తారు. వైద్యులు, రచయితల యత్నాలలో పురోగతి ఉంటుంది.14,15 తేదీల్లో బంధువిరోధాలు. మానసిక ఆందోళన. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. దేవాలయాల సందర్శన. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు ఒత్తిడుల నుంచి బయటపడతారు. రచయితలు, కళాకారులకు నూతనోత్సాహం.17,18 తేదీలలో ఆరోగ్య, కుటుంబ సమస్యలు. దూరప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం తగ్గి ఇబ్బంది పడతారు. చేపట్టిన కార్యక్రమాలలో ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో వివాదాలు నెలకొంటాయి. అనారోగ్య సూచనలు. వ్యాపారులకు కొత్త సమస్యలు నెలకొనే సూచనలు. ఉద్యోగులకు ఒత్తిడులు. కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారతాయి. 16,17 తేదీల్లో శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. వాహనయోగం. దేవీస్తుతి మంచిది.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అనూహ్యంగా విజయం సాధిస్తారు. అత్యంత చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వాహన, గృహయోగాలు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపా రులు మునుపటి కంటే ఎక్కువ లాభాలు అందు కుంటారు. 19,20లలో మానసిక అశాంతి. కుటుం బంలో ఒత్తిడులు. ఆదిత్యహృదయం పఠించండి
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
సమాజంలో పరపతి పెరుగుతుంది. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు. కళాకారులు పడిన శ్రమ ఫలిస్తుంది. క్రీడాకారులు, పరిశోధకులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 15,16లల్లో మానసిక అశాంతి. కుటుం బంలో చికాకులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.