– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొన్ని కార్యక్రమాలు జాప్యమైనా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న రాబడి దక్కి అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, రచయితలకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. 7,8తేదీలలో అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆదాయం ఆశించినంతగా పెరుగుతుంది. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.  ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు. ఒక ఆహ్వానం మరింత సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలు, పరిశోధకులు, రచయితలకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. 10,11 తేదీల్లో ప్రయాణాలు వాయిదా. వృథా ఖర్చులు. గణేశ్స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కొత్త వ్యక్తులతో పరిచయాలు. కుటుంబంలో కలతలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు ఊహించని అవకాశాలు పొందుతారు. వ్యాపారస్తులకు మరింత లాభాలు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు అవార్డులు దక్కే అవకాశం.  12,13 తేదీల్లో అనుకోని ఖర్చులు. స్నేహితులతో విభేదాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఏ కార్యక్రమం చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయానికి ఇబ్బంది లేకుండా గడుపుతారు. చిరకాల ప్రత్యర్థులను ఆకట్టుకుని ముందుకు సాగుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ఆశించిన ఉద్యోగాలు సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, రచయితల కృషి ఫలిస్తుంది. 7,8 తేదీలలో లేనిపోని ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ముఖ్య కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బ్యంధువులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఒక కోర్టు వ్యవహారంలో కొంత పురోగతి కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం కొంత మందగించవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. 8,9 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక వేదన. దూరప్రయాణాలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆశించినంత ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. వాహన, కుటుంబసౌఖ్యం. తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. వ్యాపారులు మరింతగా లాభపడతారు. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులు విదేశీ పర్యటనలు జరుపుతారు. 10,11 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయానికి మించిన ఖర్చులు అధికం. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు ఏర్పడవవచ్చు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. కాంట్రాక్టులు చివరిలో చేజారవచ్చు. కష్టం మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఆర్థికపరమైన హామీలపై తొందరపాటు వద్దు. వ్యాపారులు స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు కొద్దిపాటి చికాకులు. 9,10 తేదీలలో శుభవార్తలు. వాహనసౌఖ్యం. ఆంజనేయ దండకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఏ పని చేపట్టినా పూర్తి చేసేవరకూ విశ్రమించరు. అనుకున్న ఆదాయం సమకూరే సమయం. ఆప్తులు మీపై మరింత ఆదరణ చూపుతారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగి లబ్ధి పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారస్తులు కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, ర చయితలకు విజయాలు వరిస్తాయి. 12,13 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు. శివస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

రాబడికి లోటు ఉండదు. అయితే ఖర్చులు కూడా తప్పకపోవచ్చు. ఆలోచనలు అమలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సోదరులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు మరింత ఊరిస్తాయి. ఉద్యోగులు కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు. 9,10తేదీలలో దూరప్రయాణాలు. బంధువర్గంతో విభేదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

మొదట్లో ప్రతిబంధకాలు, సమస్యల మధ్య గడుపుతారు. అయితే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. క్రమేపీ అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అవసరాలకు సరిపడ ఆదాయం సమకూరుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలలో అవాంతరాలు తొలగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు భాగస్వాములతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కీలక సమాచారం ఊరటనిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు అవార్డులు దక్కవచ్చు. 12,13 తేదీలలో వృథా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిళ్లు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందడుగు వేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమాచారం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరిగి ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలు, రచయితలు, క్రీడాకారులకు పురస్కారాలు అందుకుంటారు.10,11 తేదీల్లో దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. శివస్తుతి మంచిది.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలను శ్రమకోర్చి పూర్తి చేస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు అందే సూచనలు. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులు సమస్యల నుంచి ఒడ్డునపడతారు. 7,8 తేదీల్లో ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE