భారత్‌లో వక్ఫ్ ‌బోర్డు వద్ద ఎంత భూమి ఉందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. వారివద్ద మొత్తం పాకిస్తాన్‌ ‌వైశాల్యానికన్నా ఎక్కువ భూమి ఉందన్న వదంతులు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్‌ 8.8‌లక్షల చదరపు కిమీ భూమిని కలిగి ఉంది. భారత్‌లో వక్ఫ్ ‌వద్ద 9.4 లక్షల ఎకరాలు లేదా 3805 చదరపు కిమీల భూమి ఉంది. దీనికి తోడుగా 8.7 లక్షల ఆస్తులను కలిగి ఉంది. అంటే వక్ఫ్ ఆస్తులు పాకిస్తాన్‌ ‌కన్నా పెద్దవి కావన్న మాట. అయితే, డబ్బు, పరపతి, అపరిమితమైన అధికారంతో భారతీయ వక్ఫ్ ‌బోర్డు దేశంలోనే అతిపెద్ద పట్టణ భూస్వాములలో ఒకరిగా మారింది.

భారతీయ భూమిపై దానికి అడ్డూఆపూ లేని నియంత్రణ ఉండటం అన్నది గభీరమైన ప్రశ్నలకు తావిస్తున్నది. చిత్రమైన విషయం ఏమిటంటే, ముస్లింల ప్రయోజనం కోసం పాకిస్తాన్‌ను సృష్టించగా, భారత్‌లో వక్ఫ్ ఆస్తులు ఢిల్లీ వైశాల్యం కన్నా మూడురెట్లు ఉం డటం విచిత్రం. దాదాపు గోవా అంత పెద్దది. ఇది భారత్‌లో మినీ పాకిస్తానా అనే సందేహం కలగడంలో ఆశ్చర్యం లేదు.

గణాంకాలు అబద్ధాలు చెప్పవు. భారత్‌ ‌వక్ఫ్ ‌బోర్డు 9.4 లక్షల చదరపు ఎకరాల భూమిపై ఆధిపత్యాన్ని కలిగి ఉంది. భారత్‌ ‌పూర్తి భూభాగం 3.287 మిలియన్‌ ‌చదరపు కిలో మీటర్లు. ముస్లింలను సంతృప్తి పరిచేందుకు బ్రిటిష్‌వారు సృష్టించిన పాకిస్తాన్‌ అం‌దులో 881,913 చదరపు కిమీల భూమిని కలిగి ఉంది. ఈ విధంగా, తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లు రెండూ కలిసి 1947 నాటి అవిభజిత భారతదేశంలో 23శాతం భూమిని ఆక్రమించుకున్నాయి.

2024లో తమ వద్ద 9.4 లక్షల చదరపు ఎకరాలు లేక 3805 చదరపు కిమీల భూమి ఉందని వక్ఫ్ ‌బోర్డు ప్రకటించింది. 1947లో ఉన్న లక్ష చదరపు ఎకరాల మూల విలువ కన్నా తొమ్మిదిరెట్లు దాని ఆస్తుల విలువ పెరిగిందన్నమాట. ఢిల్లీ వైశాల్యం 1,483 చదరపు కిమీలు కాగా, గోవా మొత్తం భూభాగం 3,702 చదరపు కిమీలు. ఈ రకంగా చూస్తే భారత్‌లో గోవాతో సమానమైన భూభాగానికి వక్ఫ్ ‌బోర్డు స్వంతదారు అన్నమాట.

చిత్రం ఏమిటంటే, 1945లో 87.5శాతం ముస్లింలు వేరొక దేశం ఏర్పర్చేందుకు ముస్లిం లీగ్‌ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అయితే, వారిలో అందరూ పాకిస్తాన్‌కు వెళ్లలేదు. ఏడుదశాబ్దాల తర్వాత, అంటే 2024 నాటికి భారత్‌లో ముస్లిం జనాభా పాకిస్తాన్‌ ‌జనాభాతో సమానంగా ఉంది. అదనంగా, వక్ప్ ‌బోర్డు పాలన కింద భారతదేశ వ్యాప్తంగా భారతీయ ముస్లింలు భారీ భూభాగాలను నియంత్రిస్తున్నారు. చాలామంది ముస్లింలు 1947 పాకిస్తాన్‌ను ఏర్పరచేందుకు వెళ్లగా, భారత్‌లో ఉండిపోయిన ముస్లింల వద్ద దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాల భూభాగాలకన్నా ఎక్కువ భూమి ఉంది.

ఆక్రమించుకున్న చారిత్రిక ప్రదేశాలు

శ్మశానాలకు, మజార్లకు భూమితో వక్ఫ్‌బోర్డు సరిపెట్టుకోదు. దాని కళ్లు చరిత్రపై కూడా ఉన్నాయి. భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్న 120 కట్టడాలను వివిధ రాష్ట్రాల వక్ఫ్ ‌బోర్డులు తమవంటూ ప్రకటించుకున్నాయి. ఈ వివాదాస్పద ఆస్తులలో ఢిల్లీలోని ఎర్రకోటలోని జామా మసీదు, ఆగ్రాలోని మోతీ మసీదు కూడా ఉన్నాయి. ఈ ఆస్తులను 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చే ముందే నాటి యుపిఎ వక్ఫ్‌బోర్డుకు కానుకగా ఇచ్చింది. కాగా, మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రభుత్వం కానుకగా ఇచ్చిన ఆస్తులపై వక్ఫ్ అధికారాన్ని సెప్టెంబర్‌ 2023‌న రద్దు చేయడం జరిగింది. కాగా, ఈ రద్దుకు వ్యతిరేకంగా ప్రతి క్లెయిమ్‌ ఉం‌ది.

పురావస్తు శాఖ వక్ఫ్ ఆస్తులను చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందంటూ నేటికి కూడా ఎఐఎంఐఎం నాయకుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొంటు న్నారు. మిగిలిన భారతదేశమంతా చట్టాలను అనుసరిస్తుండగా, వక్ఫ్ ‌బోర్డు ధ్రువీకృతం కాని పత్రాలతో భూమిని సేకరిస్తోంది. వారు 1500 ఏళ్ల కిందటి ఆలయాన్ని, 95శాతం హిందూ గ్రామాలపై కూడా హక్కును ప్రకటించుకుంటున్నారు. ఇప్పటికే చారిత్రిక స్థలాలను, ఇతర విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారు. దాన్ని ఆజమాయిషీ లేకుండా వదిలేస్తే, ఏదో ఒకరోజున ఏర్పడబోయే వక్ఫ్ ‌దేశంలో భారతీయ చట్టాలు అర్థరహితంగా మిగులుతాయి.

బిలియన్లు కలిగిన భూమిస్వామి వక్ఫ్ ‌బోర్డు

డబ్బు మాట్లాడుతుంది – వక్ఫ్‌బోర్డు వద్ద అది చాలా ఉంది. విశ్లేషకుల అంచనా ప్రకారం వక్ఫ్ ‌బోర్డు నెలవారీ ఆదాయం రూ. 20,000 కోట్లు చేరవచ్చునని. ఒక్క అస్సాంలోనే రాష్ట్ర వక్ఫ్‌బోర్డు బ్యాంకులో దాదాపు రెండు కోట్లకు పైగా క్యాష్‌ ఉం‌దిట. కేరళ రాష్ట్ర బోర్డు ఆర్టీఐ ప్రశ్నకు స్పందించి ఇచ్చిన వివరణ ప్రకారం, 2022-2023 నాటికి దాని వార్షిక ఆదాయం రూ. 14 కోట్లకు పైనే.

దేశవ్యాప్తంగా 32 వక్ఫ్ ‌సంస్థలు ఉన్నాయి. ప్రతి ఒక్కటీ భారీ ఎత్తున సంపదను కూడబెడుతోంది. ఒకవేళ వీరి దగ్గర ఉన్న సంపద విలువ నిజమైనదే అయితే, వక్ఫ్ ‌కౌన్సిల్‌ అన్నది భారతదేశంలోనే అనియంత్రిత సంపన్న భూస్వామి అవుతుంది. భారతదేశంలో ఉన్న ఒక మతపరమైన సంస్థ దేశ చట్టాలను అనుసరించకపోవడం ఊహించుకోండి.

బుజ్జగింపులను నిలిపివేయండి

యుపిఎ ప్రభుత్వం చేసిన 2013 వక్ఫ్ ‌చట్టం రాత్రికి రాత్రే దాని ఆస్తులను పెంచేసింది. స్వతంత్రం వచ్చేనాటికి వక్ఫ్ ‌వద్ద ఒక లక్ష రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. నేడు వారు మూడవ అతిపెద్ద భూస్వాములు. యుపిఎ యుగంలో చేసిన వక్ఫ్ ‌చట్టమే దాని అధికారాలను పెంచింది. ఈ చట్టం ప్రకారం ఎటువంటి న్యాయపరమైన పోరాటం లేకుండానే వక్ఫ్ ‌భూమిని స్వంతం చేసుకోవచ్చు. ఏ మాత్రం జవాబుదారీతనం లేకుండా వారు గ్రామాలకు గ్రామాలనే కబ్జా చేసుకున్నారు. తాజాగా చేసిన వక్ఫ్‌బోర్డు సవరణ చట్టం 2024 ఈ అనియంత్రిత అధికారమనే కోరలను పీకేందుకు ఉద్దేశించిందే. ఆ పని చేయకపోతే, భారతీయ చట్టాలు పూర్తిగా వర్తించని, విపరీతమైన డబ్బు అందు బాటులో ఉన్న, స్వయంప్రతిపత్తి కలిగిన కయ్యానికి కాలుదువ్వే భూస్వామి తయారవుతాడు.

సెక్యులరిజం మాట పక్కన పెడితే, వక్ఫిస్తాన్‌ అనేది తలెత్తడం అనేది భారతీయ సార్వభౌమాధికారా నికి, ఆత్మకు ప్రత్యక్ష సవాలే.

ఇప్పుడు భారతీయ వక్ఫ్ ‌బోర్డు కేవలం మతపరమైన సంస్థకాదు. అది డబ్బు, భూమిపై అధికారం కలిగిన ఒక సమాంతర అధికార వ్యవస్థ. వక్ఫ్‌పై హక్కులకు సంబంధించిన వివాదాలను విచారించేందుకు స్వతంత్ర ట్రిబ్యూనల్‌ ‌దానికి ఉంది. ఇది అనేక ప్రాంతాలలో, దేశవ్యతిరేక సెంటిమెంట్లను పరిరక్షిస్తోందనే అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. దాని మార్గంలో కొనసాగేందుకు దానిని అనుమతిస్తే, భారత దేశ నడిబొడ్డున అది తన స్వంత దేశాన్ని నడుపుకునే అవకాశం ఉంది.

ఇస్లాం మతం పుట్టకముందు నుంచే గల ఆలయాలను, గ్రామాలను కూడా వక్ఫ్ ‌గుటకాయ స్వాహా చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2013లో యుపిఎ చేసిన చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ చట్టాన్ని చేసి, దాన్ని జెపీసీకి అప్పగిం చింది. ఈ క్రమంలోనే దీనిపై ప్రజల మనోభావాలను, సూచనలను చేయవలసిందిగా కోరింది. ఈ వ్యవహారంలో ముస్లింలు అత్యంత స్పష్టతతో ఈ బిల్లును రద్దు చేయమని కోరుతుంటే, హిందువులు మాత్రం తమ బద్ధకాన్ని వీడి సూచనలు చేసేందుకు ముందుకు రానట్టే కనిపిస్తోంది. దీనికి తోడుగా, తీవ్రవాద ఇస్లామిస్టు మత గురువులు ముస్లింలను మరింతగా రెచ్చగొడుతుండడం గమనార్హం. అజ్మీర్‌కు చెందిన సర్వర్‌ ‌చిస్తీ వీడియోలే ఇందుకు సాక్ష్యం.

వక్ఫ్‌బిల్లును వ్యతిరేకించమంటూ రెచ్చగొడుతూ వీడియోలు

వక్ఫ్ ‌సవరణల చట్టం ముసుగులో అల్లర్లు సృష్టించాలని ఇస్లామిస్టులు పలు పథకాలు వేయడమే కాదు, ప్రత్యక్షంగా బెదిరిస్తున్నారు కూడా. ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించిన నేపథ్యంలో తమ అభిమతాన్ని ముందుంచడంలో ముస్లింలు ముందుడడం మనకు కనిపిస్తూనే ఉంది. బిల్లు రద్దు చేయాలని కోరుతూ మసీదులలో గుమిగూడి సందేశాలను పంపుతున్నారు. హిందువుల సంగతి ఏమైనా, ముస్లింలు మాత్రం ఈ విషయంలో ఎంతో చైతన్యంతో ఉన్నారు. తాజాగా, సర్వర్‌ ‌చిస్తీ, వక్ఫ్ ‌సవరణ బిల్లు విషయంలో ముస్లింలు రోడ్లకెక్కా లంటూ పిలుపునిస్తున్నాడు. గతంలో హిందువులను ఆర్ధికంగా బాయ్‌కాట్‌ ‌చేయాలన్న కారణానికి మద్దతునిచ్చింది ఇతడే. అజ్మీర్‌ ‌దర్గాకు చెందిన అంజుమన్‌ ‌కమిటీ సభ్యుడిగా ఉన్న సర్వర్‌ ‌చిస్తీ వీడియో ఒకటి ఇటీవలే వైరల్‌గా మారింది. వక్ఫ్ ‌సవరణ చట్టం 2024ను వ్యతిరేకిస్తున్న మిషతో రోడ్ల మీదకెక్కి అరాచకాన్ని సృష్టించమని ఆ వీడియో ద్వారా ముస్లింలను రెచ్చగొట్టాడు.

మన ప్రతిష్ఠ గౌరవానికి ముప్పు వాటిల్లడం సిగ్గుచేటు. మన ఇళ్లను బుల్‌డోజర్లతో కూలగొడు తున్నారు, జనాలు మనల్ని బాదేస్తున్నారు, మసీదులు, దర్గాలు, మజార్‌లను ధ్వంసం చేస్తున్నారంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ ‌సవరణ చట్టాన్ని తిరస్కరించేం దుకు ముస్లింలను క్యూఆర్‌కోడ్‌ ‌స్కాన్‌ ‌చేయాల్సిందిగా అతడు కోరాడు. సెప్టెంబర్‌ 10 ‌నాటికి దాదాపు 40లక్షల మంది ముస్లింలు క్యూఆర్‌ ‌కోడ్‌ను స్కాన్‌ ‌చేశారు. ముస్లింలకు సంబంధించిన సమస్యలను ధైర్యంగా లేవనెత్తే వ్యక్తి అసదుద్దీన్‌ ఒవైసీ ఒకడేనని, ఇంకా అనేకమంది అటువంటి నాయకుల అవసర ముందంటూ అతడు పేర్కొనడమే కాదు మౌలానా తౌకీర్‌ ‌రజా, సజ్జాద్‌ ‌నొమానీ వంటి తీవ్రవాద ఇస్లామిక్‌ ‌బోధకులను సమర్ధించాడు.

– నీల

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE