సెప్టెంబర్‌ 17 ‌ప్రధాని మోదీ 74వ జన్మదినం

అమెరికా, రష్యాలాంటి అగ్రదేశాల నుంచి బ్రూనైలాంటి అత్యంత చిన్నదేశాలను సయితం సందర్శించడం నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశీ విధానం. ఎంత చిన్న దేశమైనా స్నేహహస్తం అందించడం, ఆయా దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపు చేసుకోవడం ఆయన ప్రత్యేకత. గతంలో ఏ భారత ప్రధాని పర్య టించనన్ని దేశాలు, ఎవరూ సందర్శించని దేశాలలో నరేంద్ర మోదీ కాలు మోపారు. తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలలో అత్యంత చిన్న దేశమైన బ్రూనైలో జరిపిన తాజా పర్యటనే అందుకు ఉదాహరణ. ఒక భారతీయ ప్రధాని ఆ దేశంలో ద్వైపాక్షిక పర్యటనను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇలా ప్రధానమంత్రిగా గత పదేళ్లుగా మోదీ నమోదు చేసిన ఘనతలను స్మరించడమే చర్విత చర్వణమే అయినా….

ఒకనాటి ఆకాశవాణి కార్యక్రమాలకు పునర్‌ ‌వైభవం తేవడంలో నరేంద్రమోదీ సుమారు దశాబ్దకాలంగా నిర్వహిస్తున్న మన్‌ ‌కీ బాత్‌ (‌మనసు లోని మాట) కార్యక్రమం దోహదపడిందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దేశం వివిధ రంగాలలో సాధించిన, సాధిస్తున్న విజయాలపై దేశవిదేశీ ప్రజలతో తమ మనోభావాలను పంచుకునే ఈ కార్యక్రమానికి అక్టోబర్‌ 3, 2014‌న శ్రీకారం చుట్టారు. నాటి నుంచి తరువాతి రెండు సార్వత్రిక ఎన్నికల (2019, 2024) నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న కొద్ది నెలల మినహా ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్‌ ‌ద్వారా ప్రసార మవుతోంది. ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తమ మనసులోని భావాలను వ్యక్తీక•రించేందుకు ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమంలో ఆ నెలలో చోటు చేసుకున్న ముఖ్యాంశాలు, సంఘటనలను, సమీప భవిష్యత్‌లో విశేష దినాలు, పండుగలు, దేశం, ప్రజలు వివిధ రంగాల్లో సాధించిన విజయాలపై తన మనోభావా లను విశ్లేషణాత్మకంగా పంచుకుంటారు. స్వయం సమృద్ధి, మహిళాభ్యున్నతి, క్రీడాంశాలు, దేశంలోని వివిధ ప్రాంతాలలో పంటల సాగు, వారసత్వ సంపద తదితర లెక్కకు మిక్కిలి అంశాలపై ప్రధాని ఈ కార్యక్రమంలో ప్రస్తావిస్తూంటారు. ఆయన హిందీ ప్రసంగం 23 జాతీయ భాషలు, 31 మాండలికా ల్లోకి, ఆంగ్లం సహా 11 అంతర్జాతీయ భాషల్లో అనువదితమై ప్రసారమవుతోంది. ఈ కార్యక్రమం పట్ల 96 శాతం మందికి అవగాహన ఉందని ఐఐఎం రోహ్‌ ‌తక్‌ ‌నిర్వహించిన అధ్యయనం తెలిపింది. గత ఏడాది ఏప్రిల్‌లో వందవ సంచిక కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేట్‌, ఎఫ్‌ఎం ‌చానళ్లు, కమ్యూ నిటీ రేడియో సహా వెయ్యికి పైగా రేడియో కేంద్రాల ద్వారా ప్రసారం కావడం అపూర్వ సందర్భం.

‘దేశంలోని వివిధ ప్రాంతాలలోని విజ్ఞాన వంతులు, సామాన్య సేవలు అందించిన వారి గురించి, వారి ఉన్నతి, విశిష్టతలను జాతికి వివరించే అదృష్టం, సామాన్యుడి విజయాలు మొదలు సంక్షేమ కార్యక్రమాల వరకు ముచ్చటించే అవకాశం మన్‌ ‌కీ బాత్‌ ‌కార్యక్రమం ద్వారా లభించింది. ఇది నన్ను ప్రజలకు మరింత చేరువ చేసింది. ప్రతినెలా ఈ కార్యక్రమం ద్వారా వేలాది సందేశాలు చదివాను. ప్రజల నుంచి అందిన సందేశాలు…పేదలకు వైద్యం అందించడం, మొక్కలు నాటడం, ప్రకృతి, పర్యా వరణ పరిరక్షణకు కృషి, హస్తకళల అభివృద్ధి లాంటి కార్యక్రమాలు నాలో స్ఫూర్తిని నింపాయి’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ఎన్నికలు, గెలుపోటములు, సీట్ల సాధనలో హెచ్చుతగ్గులు రాజకీయాలలో ఒక భాగం. సాధిం చిన స్థానాలు పెరిగినా, తరిగిన ఒకేలా వ్యవహ రించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి దాదాపు అయిదు పదుల సీట్ల తగ్గినా, ఎన్నికల వ్యవస్థ, ప్రజాతీర్పు పట్ల అపార విశ్వాసం, గౌరవం ప్రకటించారు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశ ఈ ఎన్నికలు ప్రపంచ దేశాలకు ఓ పెద్ద పాఠం అని అన్నారు. దేశ ప్రజలు మరోమారు ఎన్డీఏ పట్ల విశ్వాసం ప్రకటించారని, ఇది స్మరణీయ చారిత్రక సందర్భమని, మూడవ దఫా కూడా సంస్కరణో ద్యమం రెట్టించిన ఉత్సాహంతో కొనసాగుతుందని విజయోత్సవ సభలో ఘంటా పథకంగా ప్రకటిం చారు. ‘పాలన అంటే కేవలం గెలిచిన సీట్లే కాదు.. 130 కోట్ల మందికి పైగా భారతీయుల సంక్షేమం’ అని జాతి సంక్షేమం పట్ల తమ అంకిత భావాన్ని ప్రకటించారు. కేంద్రంలో వరుసగా మూడవసారి అధికారపగ్గాలు చేపట్టడం ప్రథమ ప్రధాని జవాహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూకే పరిమితమనుకున్న ఘనతను నరేంద్రమోదీ సమం చేశారు. ఒకే రాజకీయ పక్షం, ఒకే నేత సారథ్యంలో ముచ్చటగా మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు కావడం అరవై రెండేళ్ల తరువాత ఆవిష్కృతమైన అపురూప సన్నివేశం.

‘మోదీజీ నాయకత్వంలో ఎన్డీఏ ఐక్యంగా పోరాడి మూడవసారి విజేతగా నిలవడం పట్ల గర్విస్తున్నాం. ఆయనను మా నాయకుడిగా అంగీకరిస్తున్నాం’ అని కూటమి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడం ఆయన పట్ల విశ్వసనీయతను చాటి చెబుతోంది. అలా అని మూడవసారి అధికారం చేపట్టినప్పటికీ ఆయన దృష్టి, పథం మారలేదు. సిద్ధాంతాలకు దూరం జరగలేదు. 2014 ప్రమాణస్వీకారంలో విజయోత్సాహం, 2019లో నిశ్చయం తొణికిస లాడగా, ఈ ఏడాది ప్రమాణ స్వీకారోత్సవంలో సమరోత్సాహం తొంగి చూసిందన్న రాజకీయ విశ్లేషకులు భావనను అక్షర సత్యంగా పరిగణించాలి.

మోదీ కేవలం రాజకీయవాదే కాదు. అంతకు మించి ఆధ్యాత్మికపరుడు, మన సంస్కృతి పరిరక్షకుడు అనేందుకు ఆయన ధ్యాన నియమాన్ని నిదర్శనంగా చెబుతారు. గత మూడు సార్వత్రిక ఎన్నిల పోలింగ్‌ ‌పక్రియ ముగిసిన వెంటనే కొన్నాళ్లు ధ్యానముద్రలోకి వెళ్లారు. అందుకు ఆయన ఎంచుకున్న ప్రదేశాలు (2014-మధ్య భారత్‌లోని ప్రతాప్‌ ‌గఢ్‌, 2019- ‌కేదార్‌నాథ్‌, 2024- ‌కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌) ‌చారిత్రక, ఆధ్మాత్మిక స్ఫూర్తిదాయకాలు కావడమే కారణం. ప్రతాప్‌గడ్‌ ‌వద్ద 1659లో జరిగిన యుద్ధంలో హిందూ రాష్ట్ర భావనకు బీజం పడగా, ఆదిశంకరాచార్యులు, హిందూ పున రుద్ధరణకు చారిత్రాత్మక పోరాటాన్ని కేదార్‌నాథ్‌లో ప్రారంభించారు. భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పునరుజ్జీవానికి చేపట్టవలసిన కార్యాచరణపై నరేంద్ర దత్‌… అనంతరం కాలంలో స్వామి వివేకానంద ధ్యానం చేసి, మార్గాన్ని తెలుసుకున్నారన్నది చారిత్రక సత్యం. ఆ స్ఫూర్తితోనే నరంద్రమోదీ ‘వికసిత్‌ ‌భారత్‌’ ‌సాధన మార్గాన్వేషణకు ధ్యానం చేశారు. ‘మౌనం సర్వార్థ సాధనమ్‌’ అనే పంచతంత్ర సూక్తిని సాకారం చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా దేశాన్ని అంతర్జాతీయంగా విశిష్ట స్థాయిలో నిలుపుతున్న ‘పాలనా సారథి’ నరేంద్రమోదీకి ‘జాగృతి’ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.

-జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE