ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాంకు దాదాపు ఒక బిలియన్ (వందకోట్లు)కు పైగా యూజర్లు ఉన్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం, టిక్‌టాక్, వియ్‌చాట్ తర్వాత ఏడవ అతిపెద్ద సోషల్ మీడియా వేదిక టెలిగ్రాం. వాక్‌స్వేచ్ఛకు అనియం త్రిత పరికరమైన దీనిపై ఇప్పుడు తమ అజెండాను ప్రచారం చేసేందుకు యూఎస్‌లోనే ఈ వేదికను తయారు చేశాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిని యుఎస్ డీప్‌స్టేట్ ఉపయుక్త పరికరంగా చూసినప్పుడు, వారి అంతర్జాతీయ కథనాలపై పట్టుకు టెలిగ్రాం ముప్పుగా పరిణ మించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, ఇటీవలి కాలంలో డిజిటల్ స్వేచ్ఛ విషయంలో యూరోపియన్ యూనియన్ మండిపడుతోంది. అందుకే, పావెల్ అరెస్టును ఒక వేరు ఘటనగా చూడలేం. ఇది వాక్‌స్వాతంత్య్రంపై యుద్ధం తీవ్రతరం కావడానికి సంకేతంగానే చూడాలి. తాము ఎంపిక చేసిన సత్యాలను సవాలుచేసే వేదికలు ఏవైనా అణచివేయాలనే పట్టుదలతో డీప్‌స్టేట్ ఉన్నట్టు కనిపి స్తోందని విశ్లేషకులు అంటున్నారు.
సిఐఎ ప్రణాళికా?
టెలిగ్రాం వంటి వేదికకు తొలుత యుఎస్ స్టేట్ రూపురేఖలు ఇవ్వగా, సిఐఎ దీని ప్రణాళికను రచించిందిట. ఇం•ర్నెట్ వినియోగం పరిమితంగా, ఖరీదైన వ్యవహారంగా ఉండి, కొద్దిమంది పెద్దలకు పరిమితమైనదనే స్వభావం కలిగి ఉన్నంతవరకూ ఇటువంటి పోగ్రామ్‌లను సిఐఎ ఉపయోగించింది. ఈ ఛానెళ్లు విదేశాలలో రహస్య కార్యకలాపాలకు ఆదర్శ వేదికలుగా ఉండేవి. దాని ఎన్‌క్రిప్ట్ చేసిన మెసేజింగ్ వ్యవస్థ, దానిని విస్తృతంగా ఉపయోగించే వ్యక్తులు ఉండటంతో, అది ఇరాన్, రష్యా, బెలారూస్ వంటి దేశాలలో ప్రభుత్వాలను కూలదోసే కుట్రలకు చక్కటి పరికరంగా మారింది. తమ భౌగోళిక రాజకీయ లక్ష్యాలతో సమలేఖనం అయ్యే కథనాలను విపులీకరించేందుకు, అసమ్మతిని ప్రోత్సహించేందుకు తొలుత టెలిగ్రాంను ఒక మంచి పరికరంగా యుఎస్ నిఘా వర్గం పరిగణించిందనే వాదనా వినిపిస్తున్నది. కానీ, ఇప్పుడు టెలిగ్రాంలోని అనియంత్రిత వాతావరణం కేవలం ఇతర దేశ ప్రయోజనాలను వ్యతిరేకించే కథనాలే కాక యుఎస్ ప్రయోజనాలను వ్యతిరేకించేవాటితో సహా అన్ని గొంతుకలు ప్రోత్సాహం పొందేందుకు అవకాశం కల్పించింది.
ఒక నియంత్రిత ప్రయోగంగా ప్రారంభమైన ఈ డిజిటల్ విప్లవం ఇంతై ఇంతింతై అన్నట్టుగా పెరిగి అందరిదీ అయింది. టెలిగ్రాం యూజర్లు సంప్రదాయ మీడియాను, ప్రభుత్వ సెన్సార్‌షిప్‌ను అధిగమించి సెన్సార్‌చేయని విషయాలను వ్యాప్తి చేస్తు న్నారు. ప్రజలకు కొత్తగా లభ్యమైన ఈ వాక్ స్వాతంత్య్రం అనేది డీప్ స్టేట్‌కు పీడకలగా మారింది. అంతర్జాతీయ చర్చను నియంత్రించగలిగే వారి సామర్ధ్యాన్ని ఇది బలహీనపరిచింది. వారు తమ నియంత్రణపై పట్టుకోల్పోయారనడానికి దురోవ్ అరెస్టే సంకేతం. తమ ఇష్టానికి వ్యతిరేకంగా కాక స్వతంత్రంగా మారిన వేదికలను అణచివేసేందుకు వేసిన తొలి అడుగుగా దీనిని పరిగణించవచ్చు.
దురోవ్ అరెస్టుపై అనుమానాలు..
దురోవ్‌ను అరెస్టు చేసేందుకు టెలిగ్రాం చాట్ రూమ్‌లను మనీ లాండరింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు, బాలలపై లైంగిక అత్యాచారాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు చేశారు. అయితే, ఈ చాట్‌లన్నీ ఎన్‌క్రిప్ట్ అయినవి. పైగా ఈ విధంగా ఉపయోగించుకోమని ఆ సోషల్ మీడియా వేదిక ప్రచారం కూడా చేయడం లేదు.
కాగా, తమ నియమనిబంధనలకు లోబడి విషయాలను నియంత్రించడం లేదన్నది టెలిగ్రాంపై అధికారిక ఆరోపణ. అదే నిజమైతే, తమ నిబంధనలకు కట్టుబడనందుకు దానిని నిషేధించ వచ్చు, కానీ సిఇఒను ఎందుకు అరెస్టు చేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్ భయమల్లా టెలిగ్రామ్ యాప్ ఎక్కడ రైటిస్టుల వైపు వాదనలను బయటపెడుతుందోననే. అందుకే, నేరపూరిత కార్యకలాపాలకు దోహదం చేశాడనే ఆరోపణలతో దురోవ్‌ను అరెస్టు చేశారన్న వాదన వాస్తవంలా కనిపించక మానదు.
రష్యా ఆరోపణలు
టెలిగ్రాం సిఇఒ పావెల్ దురోవ్ రష్యాలో జన్మించి, ఫ్రెంచి పౌరసత్వం స్వీకరించినవాడు. పుతిన్ వ్యతిరేకులు అతడి వేదికను ఉపయోగించి అసమ్మతిని వ్యాప్తి చేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో అతడు రష్యా నుంచి పారిపోయాడు. టెలిగ్రాం రష్యాకు వ్యతిరేకంగా ఉన్నంతకాలం ఎటువంటి సమస్య లేకుండా అది పని చేసేందుకు డీప్ స్టేట్ అనుమతించిందన్నమాట!
టెలిగ్రాం సిఇఒను అరెస్టు చేసినా అభియోగా లను లిఖితపూర్వకంగా మోపలేదు. అయితే, అతడిపై ఎప్పటికీ అభియోగాలు మోపరన్నది రష్యా అభిప్రాయం. ఈ అరెస్టు లేదా నిర్బంధం అన్నది డీప్ స్టేట్ ఒత్తిడి తంత్రంలో భాగమని రష్యా అనుమా నించి, విమర్శిస్తోంది. మరొకరకంగా, చెప్పాలంటే ఉక్రెయిన్ యూజర్ చాట్ రూంలలోకి అనుమతి పొందడమే డీప్ స్టేట్ లక్ష్యమని రష్యా ఆరోపిస్తోంది. తమకిష్టుడైన జెలెన్‌స్కీకి వ్యతిరేకంగా సమాచారాన్ని నియంత్రించడం వారి లక్ష్యం కావచ్చు లేదా రష్యా అనుకూల సమాచార మార్పిడిని నిలిపివేయడం కోసం కావచ్చు, వారికి ఆ చాట్‌రూంలు కావాలి. గుర్తుతెలియని వ్యక్తిగా సిఇఒను నిర్బంధం/ అరెస్టు లోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందుకే, జాతీయ భద్రత, ఇతర కారణాల ముసుగులో అసలు వాస్తవాన్ని దాచేశారు.
వాక్‌స్వాతంత్య్రం – డీప్ స్టేట్ ఆయుధమా?
యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆయుధీకరించి ఉపయోగించినంత సమర్ధవంతంగా ఆన్‌లైన్ వాక్ స్వాతంత్య్రాన్ని ఎవరూ ఉపయోగించలేరేమో. వారు తమ విదేశాంగ విధాన ఆయుధాగారంలో భావ ప్రకటనా స్వేచ్ఛను ఒక పదునైన ఆయుధంగా చేసుకున్నారు. ఒకనాడు అమెరికన్ ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా ఉన్న ఈ హక్కు ఇప్పుడు విదేశీ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే పరికరంగా మారింది. తమకు వ్యతిరేకంగా ఇతర దేశాలలో ఇటువంటి వేదికల ద్వారా ప్రచారం జరుగుతున్నప్పుడు, ఆ దేశాలు సెన్సార్‌షిప్ చట్టాలను అనుసరించాలని డిమాండ్ చేయవలసిందిగా డీప్ స్టేట్ అమెరికాకు చెప్తుంది. తప్పుడు సమాచారాన్ని నిర్మూలించడం, నైతిక ప్రమాణాలను ప్రోత్సహించడమన్న ముసుగులో వారు డీప్ స్టేట్ భావనలను ప్రతిధ్వనించని గొంతు కను అణచి వేయాలని ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తాయి.
అంటే, వారు ఎంతో గర్వించే స్వేచ్ఛలని చెప్పుకునే వాటి నోరుమూయించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ప్రభుత్వానికి పన్నులు కట్టే అమెరికన్లు తమకు తెలియకుండానే మద్దతు ఇస్తున్నారన్న మాట. అందుకే, ‘సెన్సార్‌షిప్’పై ఇంత చర్చ జరుగుతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల యుఎస్ ప్రభుత్వ పరస్పర విరుద్ధ విధానాలు, అభిప్రాయాలు ఎవరికైనా అయో మయాన్ని కలిగిస్తాయి. వారు నోటితో స్వేచ్ఛలను ప్రోత్సహించినా, విదేశాలలో ఉండేవారి స్వేచ్ఛలను చురుకుగా అణచివేస్తున్నారు. ఇదంతా కూడా భౌగోళిక రాజకీయాల నియంత్రణ కోసమే అన్నది నిర్వివాదం. తమ అంతర్జాతీయ హోదాను సవాలు చేయగల రైట్ వింగ్ లేదా జాతీయభావాలు కలిగిన నాయకులను నిలువరించడం కోసం ఈ వాక్ స్వాతంత్య్రపు సంకెళ్లను డీప్‌స్టేట్ సమర్ధిస్తోంది. సమాచార ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా తమకు ఇష్టమైన కథనాలు, తమ ప్రయోజనాలు నెరవేర్చ గల విషయాపై చర్చలే ఊపందుకునేలా డీప్ స్టేట్ నిర్ధారిస్తుంది.
డీప్ స్టేట్ తంత్రానికి భారత్ లక్ష్యంగా మారిందా?
ప్రస్తుతం భావ ప్రకటనా స్వేచ్ఛపై డీప్ స్టేట్ చేస్తున్న యుద్ధంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ కీలక యుద్ధ క్షేత్రంగా మారింది. ఫేస్‌బుక్ యమాని మార్క్‌జుకెర్‌బర్గ్ సహా సహా భారీ టెక్ కంపెనీలు• ఇటీవలే అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రమాణం చేసి మరీ యుఎస్ ఎన్నికలను ప్రభా వితం చేసేందుకు అసమంజసమైన సెన్సారింగ్ డిమాండ్లు యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ చేసినప్పుడు, వారికి అనుగుణమైన విషయాలను వ్యాప్తి చేసి, వ్యతిరేక విషయాలను అణచివేయడం ద్వారా తాము వారికి సహకరించి, ఎన్నికలలో జోక్యం చేసుకున్నా మని అంగీకరించాయి. ఇదే భారత్‌లో కూడా జరిగింది.
భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో కూడా యుఎస్‌లో తరహా వ్యూహాలనే ఉపయోగిం చారు. మోడీకి అనుకూల, జాతీయవాద విషయాం శాలను సోషల్ మీడియా ఆల్గోరిథమ్‌లు అణచి వేశాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన కథనాలను ప్రోత్సహించాయి. సమాచార వ్యాప్తి పేరుతో ఎక్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి యాప్‌లన్నీ కూడా ఈసారి భారత్‌లో జరిగిన ఎన్నికలలో జోక్యం చేసుకున్నాయన్నది సుస్పష్టం. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి అబద్ధపు ట్వీట్లను, యూట్యూబ్ వీడియోలను ఎక్కువగా కనిపించేలా చేయడమే కాదు, బీజేపీ అనుకూల వీడియోలను, ట్వీట్‌లను షాడో బ్యాన్ (ఎక్కువమందికి చేరకుండా పరిమితం చేయడం) చేయడంతో ప్రజలు ప్రభావితమయ్యారు. ఎందుకంటే, భారతదేశంలో పాశ్చాత్య ప్రయోజనా లను సాధించుకోవడానికి రాహుల్ గాంధీని వారు మరింత ఉపయుక్తమైన పనిముట్టు. అంతర్జాతీయ యవనిక పై తన స్వాతంత్య్రాన్ని స్థిరీకరించుకోకుండా నివారంచి ఎప్పుడూ ఆత్మరక్షణలో భారత్‌ను ఉంచాలన్న విస్త్రతమైన వ్యూహంలో భాగంగా ఈ ఎన్నికలలో సమాచార మానిపులేషన్ జరిగింది.
సార్వత్రిక ఎన్నికలలో విఫలమైనప్పటికీ, భారత్‌లో పాలనా మార్పు చేయడం లేదా ప్రస్తుత ప్రభుత్వాన్ని స్థిరంగా ఉండకుండా చూడటం డీప్ స్టేట్ అంతిమ లక్ష్యం. నిరంతరం భారతీయ సార్వభౌ మత్వాన్ని తక్కువ చేయడం, అణచివేయడం ద్వారా తన అంతర్జాతీయ ఆధిపత్యాన్ని సవాలు చేయగల శక్తిమంతమైన, స్వతంత్య్ర దేశంగా ఎదగకుండా నిలువరించాలని డీప్ స్టేట్ ఆశిస్తోంది. ఇందులో భాగంగా, భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాల యాలకు చెందిన అధికారులు ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులను కలుసుకుని చర్చలు జరుపుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ విధంగా భావప్రకటనా స్వేచ్ఛపై నియంత్రణ కోసం ప్రపంచస్థాయిలో జరుగుతున్న పోరాటంలో పావెల్ దురోవ్ అరెస్టు ఒక జ్వలన బిందువుగా చెప్పు కోవచ్చు. చట్టాలను వక్రీకరించడం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛలను ఉల్లంఘిం చేందుకు డీప్ స్టేట్ తన తొత్తులను వాడుకుంటుంది. దురోవ్ అరెస్టును దేశీయంగా, విదేశాలలో తమ పట్ల అసమ్మతిని అణచివేసే ప్రయత్నంగా చూడవచ్చు. అంటే, ప్రజా స్వామ్యాన్ని సంరక్షిస్తున్నామని చెప్పుకునే వ్యవస్థలే దానిని అణచివేసేందుకు చురుకుగా పని చేస్తున్నాయ న్నమాట. వనరులపై నియంత్రణ కోసం నిర్భయంగా మధ్య ప్రాచ్యంలో, దక్షిణాసియాలో ప్రభుత్వ మార్పిడిని వారు చేయించడం తెలిసిందే. కనుక డీప్ స్టేట్ కింద భావ ప్రకటనా స్వేచ్ఛ అన్నది వందల కోట్ల మానవులను మోసపుచ్చేందుకు కొన్ని వేలమంది నియంత్రించే ఒక వస్తువన్నమాట.
వాక్‌స్వాతంత్య్రంపై నిఘా నుంచి ఆలోచనలపై నిఘా దాకా వెళ్లాలన్నది డీప్ స్టేట్ అంతిమ లక్ష్యం. దీనితో సత్యం, స్వేచ్ఛకోసం పోరాటం అన్నవి గతంలో కన్నా మరింత కీలకం అవుతాయి. వాక్ స్వాతంత్య్రం ప్రస్తుతం మ్టుడిలో ఉంది, దాని ఎదురుగా ఉన్న శక్తులు అత్యంత శక్తిమంతమైనవి, అవిశ్రాంతమైనవి. టెలిగ్రాం పోరాటం ప్రారంభం మాత్రమే. ఇటువంటి ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచం అప్రమత్తంగా ఉండాలి. ఈ పోరాటం అసలు స్వభావాన్ని ప్రపంచం గుర్తించి, సమాచార ప్రవాహాన్ని నియంత్రించాలన్న డీప్ స్టేట్ యత్నాలను నిలువరించాలి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అన్న సూత్రా లకు అండగా నిలవడం ద్వారా మాత్రమే మనం టెలిగ్రాంవంటి వేదికలు గొంతుకలేనివారికి గొంతుక నిచ్చేందుకు కొనసాగడాన్ని నిర్ధారించగలం.
– డి. అరుణ