శత్రు సేనలను అడ్డుకునేందుకు సరిహద్దుల వద్ద, మారుమూల ప్రదేశాలలో పోరాడే సేనలకు అవసరమైన సామాగ్రిని మోసుకువెళ్లగలిగే డ్రోన్లు సహజంగానే హెలికాప్టర్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. వంతెనల అవసరం లేకుండానే అవి ఈ సామాగ్రిని మోసుకువెళ్లగలవు. వీటితో పాటుగా, జంతువుల అవసరం లేకుండా క్లిష్టమైన ప్రాంతాలలో రవాణాకు రోబోటిక్‌ ‌మ్యూళ్లు (కంచరగాడిదలు)  ఉపయోగపడనున్నాయి. భూమిపై మంటలను కూడా తట్టుకోగలిగే శక్తిని కలిగి ఉండే ఆ డ్రోన్లను, రోబోటిక్‌ ‌మ్యూళ్లను భారతీయ సైన్యం త్వరలోనే ఉపయోగంలో పెట్టనుంది.

సరిహద్దు వెంట ఉండే ఫార్వార్డ్ ‌పోస్టులలో ఉండే సైనికులకు సరుకు రవాణా చేసేందుకు జంతువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారతీయ సైన్యం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ డ్రోన్లను, రోబోటిక్‌ ‌మ్యూళ్లను అభివృద్ధి చేశారు. పర్వత ప్రాంతాలలో చివరి మైలువరకు బట్వాడా చేసేందుకు  సైన్యం జంతువులపై నుంచి భారాన్ని  క్రమంగా ట్రక్కులు, ఏ భూఉపరితలంపైన అయినా ప్రయాణం చేయగల వాహనాలు, మొండి వాహనాలను తరలి స్తోంది. సవాళ్లతో కూడిన భూభాగంపై జంతువుల అవసరం కీలకం అయినప్పటికీ, పెరుగుతున్న మౌలికసదుపాయాలు జంతువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయంటున్నారు.

ఇక, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సైన్స్ (ఐఐఎస్‌సి) సహకారంతో రోబోటిక్‌ ‌మ్యూల్‌ను అభివృద్ధి చేసి, ఈ వేసవిలో పరీక్షించినట్టు రక్షణ వర్గాలు వెల్లడించాయి. వీటిని రకరకాల భూభాగా లపై పరీక్షించాలనే ప్రణాళికలు ఉన్నాయి. తమకు వంద రోబోట్లు అవసరమని సైన్యం భావిస్తోంది.

సంప్రదాయ జంతు రవాణా నుంచి ఈ పరివర్తన కీలకమని, ముఖ్యంగా కంచరగాడిదలపై రవాణా చేసే సందర్భంలో, వాటికి నిత్యం ఆహారం, మంచి నీరు, ఆశ్రయం, వాతావరణం నుంచి రక్షణ, వైద్యపరమైన శ్రద్ధ అవసరం అవుతాయని, మనుషులపై పెట్టే ఖర్చుకన్నా అనేక సందర్భాలలో ఇది ఎక్కువగా ఉంటుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతీయ సైన్యం రెండు జాతుల కంచరగాడిదలను ఉపయోగిస్తోంది – రోడ్లు లేని ప్రాంతాలకు మందు గుండు సామాగ్రి వంటి భారీ సరుకును రవాణా చేసేందుకు బలిష్టమైన రకాన్ని, రేషన్ల రవాణా వంటి తేలికపాటి పనులు చేసేందుకు సాధారణ జాతిని.

ఈ జంతువుల సంరక్షణ అనేది కష్టంతో కూడిన పని అయిన క్రమంలో ఈ రోబోటిక్‌ ‌మ్యూల్స్ ‌సమర్ధవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అవి, ఎక్కువ నిర్వహణ అవసరం లేనివి కావడమే కాదు, ఆర్టిఫిషియెల్‌ ఇం‌టెలిజెన్స్‌తో స్వతంత్రంగా ఉండి, శ్రమశక్తి, శిక్షణా కేంద్రాల అవసరాన్ని తగ్గిస్తాయని వారంటున్నారు. వీటి యంత్ర నిర్వహణ, ప్రత్యేక విడిభాగాలు అవసరం అయినప్పటికీ, ఈ రోబోటిక్‌ ‌మ్యూల్స్ అనేవి ఎక్కువ కాలం మన్నుతాయని, ప్రతికూల వాతావరణాలలో కూడా సురక్షితంగా ఉండి, శత్రుదాడులకు గురయ్యే అవకాశాలను తగ్గిస్తాయని నిపుణులంటున్నారు.

సైన్యం జంతువుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. వేలాది  కంచరగాడిదల స్థానంలో ఈ దశాబ్దం చివరినాటికి యంత్రాలను ఉపయోగించాలని భావిస్తోంది. వాహనాలు ప్రయా ణించలేని, చేరలేని అత్యంత క్లిష్టమైన భూభాగాలలో, ఆ వాతావరణాలకు తగినట్టుగా రూపొందించిన ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌సాయంతో ప్రయాణించ గలగడం వీటి ప్రత్యేకత. ప్రస్తుత నమూనాలను 10వేల అడుగుల ఎత్తులో పరీక్షించగా, అవి 15 నుంచి 19వేల అడుగులలో సమర్ధవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకమైన ప్యాకేజింగ్‌ అవసరం లేకుండా అత్యవసర వస్తువులైన ఇంధన క్యాన్లను లేదా గోధుమ, బియ్యం బస్తాలను మోసుకువెళ్లగలిగే శక్తి అవసరం.

మారుమూల ఉన్న పోస్టులకు రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్న డ్రోన్లు స్థిరంగా ముందుకు ప్రయాణించేలా నిర్వహించేందుకు  ప్రస్తుతం చీతా, చేతక్‌ ‌వంటి హెలికాప్టర్లు మద్దతు నిస్తున్నాయి. క్లిష్టమైన భూభాగాల ద్వారా నిర్మాణ సామాగ్రిని తరలించేందుకు ప్రైవేటు రంగం ప్రస్తుతం చైనాలో డ్రోన్లను ఉపయోగిస్తోంది. దీనితో అవి లాజిస్టిక్స్ ‌రవాణాలో సమర్ధవంతంగా పని చేయగల వని తేలింది.

కాగా, డ్రోన్లు, రోబోటిక్‌ ‌మ్యూళ్లను మోహ రించడం ప్రదేశం ద్వారా నూతన సాంకేతికత ఏకీకరణ ఉంటుంది. అంటే ఎటువంటి ప్రదేశంపై మోహరించారన్న దానిపై ఆధారపడి ఉంటుందన్న మాట. హెలికాప్టర్లపై తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడం, జంతువుల స్థానంలో పని చేసేందుకు – డ్రోన్లు, రోబోటిక్‌ ‌మ్యూళ్లు పరస్పర పరిపూరకంగా ఉంటాయని రక్షణవర్గ నిపుణులు ఆశిస్తున్నారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE