గిరిజన మహిళలపై ముస్లింమూకల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని అమాయక గిరిజనులను లక్ష్యంగా చేసుకొని లైంగిక వేధింపులకు దిగడం… లొంగకపోతే బలవంతంగా దారికి తెచ్చుకోవడం.. లేదంటే బండరాళ్లతో మోది హత్యలు చేయడం పరిపాటిగా మారింది. ఎదురు తిరిగితే మూకుమ్మడిగా ముస్లింలు అంతా గిరిజన యువకులపై.. వారి ఇళ్లపై దాడి చేసి తగలబెట్టడం సహజమైపోయింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే నిందితులకు కాపుకాస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన  వారే వివక్ష చూపుతుంటే హిందువులకు భరోసా కరవైంది. బాధితులపైనే కేసులు నమోదు చేయడం, నిందితులను రక్షించే పనిలో పోలీసులు నిమగ్నం కావడం చట్ట వ్యతిరేకం అన్నది నిర్వివాదం.

ఆసిఫాబాద్‌ ‌జిల్లా జైనూరులో ఇటీవల చోటు చేసుకున్న ఘటన గిరిజనులను ఆగ్రహంలో ముంచెత్తింది. తమ పిల్లలను హాస్టల్లో వదిలి వెళ్లేందుకు ఆసిఫాబాద్‌ ‌వెళ్లి జైనూరుకు తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో ఆటో వ్యక్తి తనూ జైనుర్‌కి వెళ్తున్నాను వస్తే దించుతానంటూ మహిళను ఎక్కించుకున్నాడు. దానితో ఆ గిరిజన మహిళ ఆటో ఎక్కింది. కొంత దూరం వెళ్లగానే మరో ఇద్దరు ముస్లిం యువకులు తోడయ్యి, మూకుమ్మడిగా ఆ మహిళపై దాడి చేసి, లైంగిక అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు. ప్రతిఘటించిన మహిళను తీవ్రంగా చితకబాదారు. ఆమె ముఖంపై బండరాయితో మోది చంపేసినంత పని చేశారు. స్పృహ కోల్పోయిన ఆ మహిళ చనిపోయింది అనుకొని, ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకొని నిందితులు పారిపోయారు. కొనప్రాణంతో ఉన్న మహిళను మరురోజు ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆగస్టు 31 రాత్రి మహిళపై దాడి జరగ్గా, సెప్టెంబర్‌ ఒకటో తేదీన విషయం వెలుగులోకి వచ్చింది. గుర్తుపట్టలేని రీతిలో ముఖం ఛిద్రం అవడాన్ని చూసి భర్త, పిల్లలు ఆవేదనకు గురయ్యారు. సంఘటన గురించి వివరించడంతో ఆగ్రహంతో ప్రశ్నించేందుకు వెళ్లిన బాధిత మహిళా బంధువులు, కుటుంబసభ్యులపై ముస్లింలు దాడికి దిగారు. దీంతో గిరిజన సమాజమంతా ఏకమైంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగింది. ఆసిఫాబాద్‌, ‌జైనూర్‌ ‌పరిసర ప్రాంతాలలో గిరిజనులు ఆందోళన బాట పట్టారు.

ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని పోలీసులను కలిశారు. అయితే పోలీసులు నిందితులకు వంత పాడి, బాధితులపైనే కేసు నమోదు చేయడం ఒక విషాదం. ఘర్షణ మరింత ముదురుతుండటంతో జిల్లా ఎస్పీ స్థానిక డీఎస్పీ సైదులు అనే వ్యక్తిని అక్కడ ప్రత్యేక అధికారిగా నియమించారు. కాగా, అతడు ముస్లింలకు బాసటగా నిలవడంతో, ఆ అండ చూసుకొని ముస్లింలంతా బాధిత గిరిజన మహిళలపై, వారి బంధువులపై, బజరంగ్‌దళ్‌ ‌కార్యకర్తలపై దాడి చేశారు. విచక్షణ రహితంగా ఇళ్లను తగలబెట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించలేదు. ఈ క్రమంలోనే బాధిత మహిళ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత, మెరుగైన వైద్యం కోసం భాగ్యనగర్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేర్చి, చికిత్స చేస్తున్నారు. ముక్కుకు సర్జరీ నిర్వహించారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఆమె కోలుకుంటోంది. గిరిజన మహిళ కనుక, శారీరకంగా దృఢంగా ఉండటంతో ఆమె బతికి బయటపడింది. అదే వేరే మహిళ అయి ఉంటే ఆమె అప్పుడే మరణించి ఉండేది. కాగా ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయనే ఆరోపణల విషయంలో ప్రభుత్వం, వైద్యాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

 కాగా, విశ్వహిందూపరిషత్‌, ‌బజరంగ్‌దళ్‌ ‌కార్యకర్తలు బాధితులకు బాసటగా నిలిచి, ఆసిఫాబాద్‌, ‌జైనూరు ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేశారు. స్పందించవలసిన పోలీస్‌ ‌యంత్రాంగం నిందితులను శిక్షించడం మాని, పట్టణంలో 144 సెక్షన్‌ను విధించింది. ఇంటర్నెట్‌ ‌కట్‌ ‌చేసింది. బయట వ్యక్తులను ఆ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా ఆంక్షలు విధించింది.

 బాధితుల పక్షాన వీహెచ్‌పీ

సభ్య సమాజం విస్తుపోయేలా చోటుచేసుకున్న జైనూరు సంఘటనను విశ్వహిందూ పరిషత్‌ ‌తీవ్రంగా ఖండించింది. జైనూరులో గిరిజన మహిళను చంపేందుకు తీవ్రంగా ప్రయత్నించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేసింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన మహిళను వైద్యం అందించేందుకు కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌లో మెరుగైన చికిత్స చేయించాలని డిమాండ్‌ ‌చేసింది. విశ్వహిందూ పరిషత్‌ ‌రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌, ‌రాష్ట్ర ప్రచారప్రముఖ్‌ ‌పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రామ్మోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గిరిజనులపై దాడులు జరుగుతుంటే రాష్టప్రభుత్వం మైనారిటీ ఓట్ల కోసం పాకులాడటం సిగ్గుచేటని విమర్శించారు. 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతంలో గిరిజనుల ఆస్తులను ముస్లింలు ఎలా కొంటున్నారని. చట్టం దానిని ఏ విధంగా ఆమోదిస్తుందని విశ్వహిందూపరిషత్‌ ‌నేతలు ప్రశ్నించారు. గిరిజన సంప్రదాయాలను ధ్వంసం చేస్తూ గిరిజన మహిళలపై అత్యాచారాలు చేస్తున్న దుర్మార్గులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చొరవతీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. నిందితులను సమర్ధిస్తున్న స్థానిక డీఎస్పీని వెంటనే సస్పెండ్‌ ‌చేయాలని విశ్వహిందూ పరిషత్‌ ‌నేతలు డిమాండ్‌ ‌చేశారు. ఆదిలాబాద్‌ అడవుల్లో నిరంతరం హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు ఏమాత్రం స్పందించకపోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణం గిరిజన ప్రాంతం నుంచి ముస్లింలను ఖాళీ చేయించి, గిరిజన హక్కులను కాపాడాలన్నారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్‌ ‌రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జగదీశ్వర్‌, ‌రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్‌ ‌రేగు అనిల్‌ ‌పాల్గొన్నారు.

గాంధీ ఆసుపత్రి దగ్గర మహిళా మోర్చా,  గిరిజన మోర్చా  ధర్ణా

 బాధిత మహిళను గాంధీ ఆసుపత్రిలో విశ్వహిందూ పరిషత్‌, ‌బజరంగ్‌దళ్‌ ‌బృందం పరామర్శించింది. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులను కోరింది. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకి, ముఖ్య మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. ఇదే విషయమై భారతీయ జనతా మహిళామోర్చా, భారతీయ జనతా గిరిజన మోర్చా నాయకులు గాంధీ ఆసుపత్రి దగ్గర భారీగా ధర్ణా చేపట్టారు. మహిళలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్కను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వంకూడా పరిస్థితిని గమనించి జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, బాధిత మహిళకు అండగా ఉంటామని మంత్రులతో సహా ఆదిలాబాద్‌ ‌జిల్లా కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు కూడా ప్రకటించడం విశ్వహిందూ పరిషత్‌, ‌భారతీయ జనతా పార్టీ ఒత్తిడితోనే సాధ్యమైంది. ముఖ్యంగా బాధిత మహిళను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌, ‌నాయకులు రామచంద్రరావు తదితరులు పరామర్శించారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE