‘‘ఆత్మానో మోక్షార్థం జగత్‌ ‌హితాయచ’’ అంటే మోక్ష సాధనకు మార్గంగా మానవ సేవ అన్న రుగ్వేద సూక్తిని, ఈశావాస్య ఉపనిషద్‌ ‌తాత్వికత అయిన ‘‘ఈశావాస్యమిదం సర్వం’’ – ‘‘అత్యంత అల్పమైన అణువు నుంచి సర్వజీవుల్లో వ్యాపితమై ఉన్న భగవంతుడు’’, మహాత్మా గాంధీ సూక్తులను పొందుపరిచి ‘‘కలిసి, జీవిద్దాం’’ అన్న సూత్రాల ఆధారంగా నెట్‌వర్క్ ‌చేసిన హిందూ ఆధ్యాత్మిక సంస్థల సేవా కార్యకలాపాలను వివరించేందుకు ఒక నవీన మేళానే ‘హిందూ ఆధ్యాత్మిక, సేవా మేళా.’ దేశంలో వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఈ మేళాను తొలిసారి హైదరాబాద్‌లో 8 నవంబర్‌ 2024 ‌నుంచి 10 నవంబర్‌ 2024 ‌వరకు నిర్వహిస్తున్నారు.

హిందూ ఆధ్యాత్మిక, సేవా మేళాల పరిణామక్రమం

హిందూ ఆధ్యాత్మిక, సామాజిక సంస్థలు చేస్తున్న సేవా కార్యకలాపాలను ప్రదర్శించేందుకు గ్లోబల్‌ ‌ఫౌండేషన్‌ ‌ఫర్‌ ‌సివిలైజేషనల్‌ ‌హార్మొనీ – ఇండియా (జిఎఫ్‌సిహెచ్‌-ఇం‌డియా), హిందూ స్పిరిచ్యువల్‌ అం‌డ్‌ ‌సర్వీస్‌ ‌ఫెయిర్‌ (‌హెచ్‌ ఎస్‌ఎస్‌/‌ఫెయిర్‌) అన్న భావనకు రూపకల్పన చేసి, ప్రదర్శన మేళాను నిర్వహించింది. హిందూ నాగరికత, ఒక జాతిగా భారత్‌ ‌పట్ల ఉన్న దురభి  ప్రాయాలను తొలగించడమే లక్ష్యంగా ఈ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

పూజనీయ దలైలామా, మాజీ రాష్ట్రపతి డా।। అబ్దుల్‌ ‌కలామ్‌, ‌పూజ్య స్వామి దయానంద సరస్వతి (ఆర్ష విద్యా రీసెర్చ్ ‌సెంటర్‌), ‌స్వామీ బాబా రామ్‌దేవ్‌ (‌దివ్య యోగమందిర్‌ ‌ట్రస్ట్ ‌వ్యవస్థాపకులు), శ్రీశ్రీ రవిశంకర్‌ ‌గురూజీ (ఆర్ట్ ఆఫ్‌ ‌లివింగ్‌ ‌వ్యవస్థాపకులు), జతేదార్‌ ‌జోగీందర్‌ ‌సింగ్‌ ‌వేదాంతి (అకాల్‌ ‌తఖ్త్ ‌మాజీ అధిపతి), కార్డినల్‌ ఆస్వాల్డ్ ‌గ్రేషియస్‌ (‌భారత్‌లో రోమన్‌ ‌కేథలిక్‌ ‌చర్చి అధిపతి, ముంబై ఆర్చ్‌బిషప్‌), ‌డా।। మౌలానా మహ్మూద్‌ అలీ మదనీ (దారుల్‌ ఉలూం దేవబంద్‌ అధిపతి, జమైత్‌ ‌నాయకుడు, ఇస్లామిక్‌ ‌పండితుడు), ఆచార్య మహా ప్రజ్ఞ (ప్రముఖ జైన్‌ ‌గురువు,సైన్స్ ఆఫ్‌ ‌లివింగ్‌ ‌వ్యవస్థాపకులు), రబ్బీ ఇజెకీల్‌ ఐసాక్‌ ‌మాలేకర్‌ (‌భారత్‌లోనే అత్యంత ప్రముఖుడైన యూదు నాయకుడు) సహా ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, మేధావులు, ప్రముఖ వ్యక్తులు 2008 జనవరిలో జిఎఫ్‌సిహెచ్‌ ఇం‌డియాను అధికారికంగా ప్రారంభించారు.

 ఢిల్లీలో అత్యంత గౌరవాన్ని అందుకునే వ్యక్తులు ప్రేక్షకులుగా అన్ని మతాలకు చెందిన ప్రాతినిధ్యం ఈ కార్యక్రమంలో ప్రతిబింబించింది. మతాంతరీకరణలకు ఒక సాధనంగా కాక, ఆదర్శవంతమైన కార్యాలు జీవితాన్ని అధిగమిస్తాయని, మంచితనానికి సహకరిస్తాయనే విశ్వాసం ఆధారంగా ప్రజా సేవలో నిమగ్నం కావలసిందిగా సంస్థలను హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ ‌కార్యక్రమాలు, మేళాలు ప్రోత్సహిస్తాయి.

2011లో హిందూ స్పిరిచ్యువల్‌ అం‌డ్‌ ‌సర్వీస్‌ ‌ఫౌండేషన్‌ ఆవిర్భావం

ఆధ్యాత్మిక సంస్థలు, మీడియా, ప్రజల నుంచి హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ ‌కార్యక్రమాలు, మేళాలు విస్తృతమైన ఆమోదాన్ని పొందిన తర్వాత ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఒక ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలని జిఎఫ్‌సిహెచ్‌ ఇం‌డియా నిర్ణయించింది. తత్ఫలితంగా, చెన్నైలో కార్యక్రమాలు నిర్వహించేందుకు సిఎఫ్‌ ‌సిహెచ్‌ ఇం‌డియా చెన్నై చాప్టర్‌ ‌కింద ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సేవలను అందిస్తూ అంకిత భావాన్ని ప్రదర్శించిన వారిని హిందూ స్పిరిచ్యువల్‌ అం‌డ్‌ ‌సర్వీస్‌ ‌ఫౌండేషన్‌ (‌హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌) ‌ధర్మకర్తలుగా నియమించడం జరిగింది. హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ను 2011లో ధర్మసంస్థగా (పబ్లిక్‌ ‌చారిటబుల్‌ ‌ట్రస్టుగా) ఏర్పాటు చేసి, ఆదాయపు పన్ను చట్టం

లోని సెక్షన్‌ 12ఎఎ ‌కింద 2013లో నమోదు చేశారు. బహుళంగా ఉన్న హిందూ ఆధ్యాత్మిక సంస్థలలో ఉన్నతమైన స్ఫూర్తితో ప్రజాసేవ చేసేందుకు ప్రేరణ కలిగించి, ప్రోత్సహించి, కొనసాగించేందుకు, భారతదేశ వ్యాప్తంగా హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ ‌మేళాలను, కార్యక్రమాలను నిర్వహించడం సంస్థ ప్రాథమిక లక్ష్యం. అదనంగా, హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ ‌విలువలను, నాగరికతా ధర్మాలను ప్రోత్సహించేందుకు భారత దేశవ్యాప్తంగా సెమినార్లు, సదస్సులు, సమావేశాలు, వర్క్‌షాప్‌•‌లు నిర్వహిస్తుంది. గౌరవనీయ సుప్రీంకోర్టు డా।। రమేష్‌ ‌ప్రభు వర్సెస్‌ ‌ప్రభాకర్‌ ‌కాశీనాథ్‌ ‌కుంతే (1995) కేసులో ‘హిందుత్వం’ అన్న పదానికి ఆపాదించిన అర్థానికి అనుగుణంగా, 1996లో ఎఐఆర్‌ 113 ‌వివరించినట్టుగా ‘హిందూ’ అన్న పదాన్ని నిర్వచించాలని హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ ‌ట్రస్ట్ ‌డీడ్‌ ‌స్పష్టంగా పేర్కొంటుంది. ‘హిందుత్వ’ను సంకుచిత మతపరమైన భావనగా కాక భారత ప్రజల సంస్కృతీ, ఆచార వ్యవహారాలను ఆవరిస్తూ, వారి జీవన విధానాన్ని వర్ణించేలా ఉండాలని హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ ‌ట్రస్ట్ ‌డీడ్‌ ‌స్పష్టంగా పేర్కొంటుంది. నాలుగవ ఫెయిర్‌/ ‌మేళా నుంచి, ఫెయిర్స్/ ‌మేళాలు అన్నింటినీ హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ ‌నిర్వహిస్తోంది.

పాలుపంచుకోవడం/ భాగస్వాములు

ఫెయిర్‌/ ‌మేళా జరిగే ప్రాంగణంలో నిర్వహించే ఇతివృత్త ప్రధానమైన పోటీలు, సంప్రదాయ క్రీడలు, ఆటలలో వందలాది స్కూళ్లు పాలుపంచు కుంటాయి. ఆ ప్రదేశంలో నిర్వహించే వివిధ పోటీలలో పలు పాఠశాలల చురుకైన ప్రమేయం ఉండడమే ఈ మేళాల కీలక అంశం. ఆరవ మేళా/ ఫెయిర్‌లో, ఆరు ప్రధాన ఇతివృత్తాలకు అనుగుణంగా ఉండేలా ఈ పోటీలను పునఃరూపకల్పన చేయడమే కాక, దేశీయ క్రీడలను పునరుద్ధరించారు. ఏడవ మేళాలో పురాణాలు, సాహితీ గ్రంథాలు, కళ, సంస్కృతి నుంచి తీసుకున్న ఆరు ఐఎంసిటిఎఫ్‌ ఇతివృత్తాల ఆధారంగా 376 పోటీలు నిర్వహించారు. మొత్తం 13 కార్పొరేషన్‌, ‌ప్రభుత్వ పాఠశాలలు సహా 267 పాఠశాలలకు చెందిన 7,350 మంది విద్యార్ధులు ఫైనల్స్‌లో పాల్గొన్నారు. క్రమం తప్పకుండా ఆ కార్యక్రమానికి ప్రాయోజకునిగా ఉన్న ‘శాస్త్ర యూనివర్సిటీ’ మొత్తం 1,355మంది విజేతలకు రూ. 13 లక్షల విలువైన ప్రైజ్‌ ‌కూపన్లను ప్రదానం చేశారు.

కార్యక్రమాలు

 అక్కడ ప్రాంగణంలో ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 వరకూ జరిగే సాంస్కృత కార్యక్రమాలు ఈ మేళాల్లో/ ఫెయిర్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం. అందులో పాలుపంచుకుంటున్న ఆధ్యాత్మిక సంస్థలు, ఐఎంసిటిఎఫ్‌ అనుబంధ పాఠశాలలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఇందులో వైవిధ్యభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు భారీ సంఖ్యలు ప్రజలు ఆకర్షిస్తాయి.

దేశం, దైవం, ధర్మం

దేశం, దైవం, ధర్మం (హిందూ విలువల వ్యవస్థ) నడుమ ఉన్న విడదీయలేని అనుబంధంలో ‘హిందూ స్పిరిచ్యువల్‌ అం‌డ్‌ ‌సర్వీస్‌ ‌ఫెయిర్‌’ (‌హిందూ ఆధ్యాత్మిక, సేవా మేళా) పాతుకుపోయిందనేదే దాని కీలక సందేశం. మన దైవం లేకుండా మన దేశం వృద్ధి చెందలేదు. మన దేశం లేకుండా దైవం అసంపూర్ణం. ఈ రెండిటినీ కూడా హిందూ విలువల వ్యవస్థ – ధర్మం నిలుపుతుంది. ఈ మేళాకు సంబంధించిన ఆరు ఇతివృత్తాలనూ విలువల వ్యవస్థ (ధర్మం)లో అల్లి, ఈ ప్రాచీన భూమైన మన దేశంలో ఆచరిస్తుండగా, వాటికి దైవం దారి చూపింది.

హైదరాబాదులో తొలిసారి

తొలిసారి హైదరాబాద్‌లో 8 నవంబర్‌ 2024 ‌నుంచి 10 నవంబర్‌ 2024 ‌వరకు ఈ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజులూ కార్యక్రమాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగుస్తాయి.

ఈ ఉదాత్తమైన కార్యక్రమానికి సమయం, ఆర్ధిక సాయం లేదా మరే ఇతర మార్గాలలోనైనా దోహదం చేస్తూ ప్రతి సేవలోనూ పాల్గొనవలసిందిగా ప్రోత్సహి స్తున్నామంటూ నిర్వాహకులు తెలిపారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE