‘కిసాన్‌రాణి’ ఈ పేరు విన్నారా? ‘అమ్మా! నొప్పులే’ పాడిరదెవరో తెలుసా?

ఈ రెండిరటికీ సమాధానాలు 1942 నుంచి 1952 దశాబ్ద మధ్యకాలంలో లభిస్తాయి. తానొక నేపథ్య గాయనీమణి. ఒక్క తెలుగులోనే కాదుÑ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లోనూ పాడారు. విదేశీ జాతీయగీతం (శ్రీలంక) ఆలాపించింది కూడా ఆమె!

మొత్తంమీద పుష్కరకాలంపాటు పాటలే పాటలు. ఎన్ని వందల సంఖ్యల్లో గానం చేశారో ఇప్పటికీ లెక్కకి అందదు. అవిశ్రాంతంగా సంగీత సేవ. గాయనిగా, స్వరకర్తగా, శిక్షకురాలిగా, విశ్లేషకురాలిగా ఎంతగానో అనుభవం గడిరచిన జీవితం తనది. దాదాపు 75 సంవత్సరాల జీవనకాలం. ఆమె పుట్టింది సెప్టెంబరు నాలుగున. అది 1942.

ఒక చిన్నారికి పరీక్షల భయం పట్టుకుంది. పాఠాలు రాలేదుకానీ పరీక్షలు వచ్చేశాయ్‌! ఏం చేయాలి మరి? ఎలాగైనా పరీక్షలు ఎగ్గొట్టాలని… కడుపునొప్పి వచ్చిందని నాటకమాడటమే నటన! గీత అంశం. ‘ఫస్టుక్లాసులో ప్యాసవుదామని పట్టుబట్టి నే పాఠాల్‌ చదివితే` పరీక్ష నాడే పెట్టుకున్నదే, బడికెట్లా నే వెళ్లేదే’ అనడంతో… ‘బాబూ లేవరా! ఈ మందూ తాగరా! నువ్‌ బాగుంటే మాకు చాలురా! నిక్షేపంగా ఇంటనుండరా’ అంటారు పెద్దవాళ్లు. ఆ పాటను పాడిన ముగ్గురిలో కె.రాణి ఉన్నారు, కిసాన్‌ రాణి అన్నమాట. అది 1952వ సంవత్సరం (1942 ప్లస్‌ 10). అంటే `ఆ పాట పాడేటప్పటికి రాణికి పదేళ్లు! ఇదే సెప్టెంబర్‌ ఐదున సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టినరోజు. సాక్షాత్తు ఆయన ముందే ప్రదర్శన ఇచ్చిన ఘనత ఆమెది. ఇలా రికార్డు స్థాయి విజయాలనేకం ఆమెనే ఏరికోరి వరించాయి. ఎన్ని ప్రత్యేకతలున్నా ‘నేను సాధించాల్సింది ఇంకెంతో ఉంది’ అనడమే ఆమె వినమ్ర తత్వానికి ఉదాహరణ.

శరత్‌ సాహిత్యంలో విశిష్టం, విలక్షణం ‘దేవదాసు’. ఆ చిత్రంలో తెలుగు, తమిళం, రెండిరటా పాటతో రాణి ఖ్యాతి జాతీయస్థాయికి చేరుకుంది. ‘అంతా భ్రాంతియేనా, జీవితానా వెలుగింతేనా’ అని విషాద గీతం. ఇందులో ‘మనసీయగ లేని నీపై మమతలతో / వంతల పాలై చించించే నా వంతా దేవదా? అనేటపుడు ఆమె గొంతులో పలికిన భావం, నాదం ఎందరికో గుర్తుంటుంది ఇప్పటికీ! వెంటాడుతుంది ఆ స్వరం!

అదే చిత్రంలోని మరో గీతికా శ్రోతల మదిని కదిలిస్తుంది. ‘చెలియ లేదూ, చెలిమి లేదూ, వెలుతురే లేదూ’ అనేది ఈ పాటలో `

చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే

చేరదీసీ సేవచేసే తీరూ కరువాయే! నీ దారే వేరాయె

అంటున్నపుడు భగ్గుమన్న భగ్నప్రేమ మన గుండెల్నీ మండిస్తుంది.

సంగీత సాహిత్యాల మేళవింపు ఇంత సహజంగా ఉందంటే, అదంతా ఆమె నేపథ్యం. తండ్రిది ఎక్కువగా బదిలీలయ్యే ఉద్యోగం కావడంతో, పలు ప్రాంతాల్లో కొనసాగింది రాణి నివాసం. అందుకే ఆయా చోట్ల మమేకత్వం చోటు చేసుకుంది. ఎన్నెన్నో భాషలు తెలిసే వీలు కలిగించింది.

బాల్యం నుంచీ కళా హృదయమే. స్పందించే మనస్తత్వమే. ఇంట్లో, బయటా కూడా ఎంతగానో పాడుతుండేవారు. వేదికమీద ప్రతిభను చాటే అవకాశాల్ని మరెన్నోమార్లు దొరకపుచ్చుకున్నారు.

స్పష్టమైన ఉచ్చారణ, ప్రస్ఫుటమైన భావ వ్యక్తీకరణ. వీటితో ఎంతోమంది ఆమె స్వరమాధురిని మెచ్చుకునేవారు. మరింతగా పాడి కీర్తిశిఖరం అధిరోహించాలని ఆశీర్వదించేవారు.

వాటి ప్రధాన ఫలితమా అన్నట్లు ` బోలెడన్ని అవకాశాలు రాణిని చేర వచ్చాయి. ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవడం తన అనురక్తి ఫలితం. ఆ పాటలన్నింటినీ వేగవంతంగా పూర్తి కానివ్వడం మరో ప్రత్యేక విశేషాంశం. ప్రధాన పాత్రలెన్నింటికో గళ సహకారం.

సహ గాయనులతో ఎంతో హృదయానుబంధం. పట్టుమని ఎనిమిదేళ్లయినా నిండకుండానే, తెలుగు చలనచిత్రానికి తొలిగా పాడారు రాణి. ఆ మాటకొస్తే, అన్నీ కలిపి నాలుగింటితో శ్రవణానందం కల్పిస్తు న్నారు ఇవాళ్టికి కూడా. అందునా గళ వైవిధ్యంతో!

ఎందరు ఎంతగా ప్రయత్నించినా…. అనుకరించలేనంత. భాషలో స్వచ్ఛత, భావంలో స్పష్టత, శైలిలో ప్రత్యేకత, వ్యక్తీకరణలో సహజ సిద్ధత. వీటన్నింటి కారణంగానే, రాణి గానవాహిని ఈనాటికీ ఎందరెందరినో రంజింప చేస్తోంది.

బాల్య ప్రాయంలోనే ఒకే చిత్రంలో నాలుగు పాటలు పాడారు. అప్పట్లో నేపథ్యాన సహ గాయనీమణులు పి.లీల, సరస్వతి. అది చారిత్రక దృశ్యకావ్యం. యౌవన దశలోనూ ‘సంతోషం’ అనే చిత్రానికి పలు రీతుల్లో స్వరమధురిమ అందించారు. సహగాయకురాలు పి.సుశీల.

అలాగే`జిక్కీ, జమునా రాణి, ఆర్‌.బాలసరస్వతీ దేవి, ఏపీ కోమల, మరీ ముఖ్యంగా ఎస్‌.జానకి, ప్రసిద్ధులు మరెందరితోనో కలసి ఆలాపించారు రాణి. స్వప్నసుందరి, రూపవతి, ధర్మదేవత, కన్నతల్లి, మంజరి, జ్యోతి, చరణదాసి, ప్రజారాజ్యం, మేలు కొలుపు, ధాన్యమే ధనలక్ష్మి, విశాల హృదయాలు… ఇవన్నీ తాను స్వరయాత్ర సాగించిన తెలుగు చిత్రాల్లో కొన్నింటి పేర్లు.

ఘంటసాల, ఎ.ఎం రాజా, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఇంకా పలువురు విఖ్యాత గాయకులతో గీతాలాపన సాగించిన ఘనత ఆమెది.

తనకు ఇరవై ఏళ్ల ప్రాయాన ఒక మలయాళ చిత్రపరంగా ఎల్‌ఆర్‌ ఈశ్వరి సహగాయని. సంగీత శ్రోతలను మైమరపింప చేసిన సందేశాత్మక కథా చిత్రమది. ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

ఆకాశరాజు, మాయలమారి, అత్తింటి కాపురం, చిన్నకోడలు, సింగారి, చండీరాణి, పుట్టిల్లు, అంతా మనవల్లే, మా గోపి, నిరుపేదల, ఆడబిడ్డ, వదినగారి గాజులు, మేలుకొలుపు… ఇటువంటి మేటి చిత్రాలు ఉన్నాయని ఈనాటివారికి అంతగా తెలియక పోవచ్చు. కానీ వాటన్నిటికి గాత్ర సందప అందించి విజయవంతం చేసిన ప్రాముఖ్యత మాత్రం గాయని రాణిదే!

ఈ సెప్టెంబరులోనే కదా వినాయక చవితి మహోత్సవం. ఇదే పేరుతో ఆనాడు వచ్చిన చిత్రంలో మధుర గీతిక వినిపించారు రాణి. ఈ చిత్రమే అటు తర్వాత హిందీ, తమిళంలో కూడా వచ్చింది. ‘చిన్ని కృష్ణమ్మ చేసిన’ అంటూ మొదలయ్యే తెలుగు పాటను విని తీరాల్సిందే.

 యలు గొలుపు వలపు

ఆ  యల లయల పిలుపు… (పద మధురి మల పాట)

ఆడుకుందాము రావే జంటగా (స్వర విన్యాసాల గీతిక)

ఈ రెండు గీతాలకీ రచయితలు సముద్రాల సీనియర్‌, జూనియర్‌. పాటలు రెండిరటినీ తనదైన తీరున పాడి ఆబాలగోపాలాన్నీ మెప్పించడం రాణి గొప్ప తనం, స్వర సామర్థ్యం. ఆమెకే ప్రత్యేకం.

చిత్రం విడుదలైనపుడు ఆమెకి పదహారేళ్ల వయసు. లేత గొంతుతో తను పాడిన విధానం ఎంతోమందిని మురిపించింది.

వందలాది గీతాలతో జైత్రయాత్ర కొనసాగించిన ఆ సుస్వరాన్ని ప్రశంసలెన్నో వరించి వచ్చాయి. నాటి రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ ఆమెను తమ అధికార నివాసానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. గీతాలాపనను మరోమారు విని ‘మీ పాట నవీనతను ఆవ్కిరించింది’ అని కొనియాడారు. కానుకలు బహూకరించారు.

స్వాతంత్య్రం, సంస్కృతిÑ భారతీయ హృదయం అని ఆయన రాసిన పుస్తకాల్లో ఆ గాయకురాలి ప్రస్తావనలున్నాయి. ఆంధ్రుల చరిత్ర`సంస్కృతిÑ భారతీయ తత్వశాస్త్రం అంటూ వెలువరించిన వాటిల్లో సంగీత ప్రాధాన్యత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది / వినిపిస్తుంది. గీత ఆరాధనకు సంబంధించి – అందులో సత్య స్వరూప దర్శనం లభిస్తుందన్నారు. అంతటి సందర్శనకు మూలం గాత్ర సౌలభ్యమేనన్నది నిర్వివాదం.

పండిత ప్రసిద్ధులైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సందర్భాల్లో సంగీత ప్రశస్తిని చాటి చెప్పారు. ఆ విశదీకరణలో రాణి గాత్రతత్వాన్ని విశ్లేషించడం ఎంతైనా కీలకం. అటువంటి మోక్షగుండం శతాబ్ది ఉత్సవాలకు ఆమెను ఆహ్వానించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. అనంత గౌరవ మర్యాదలతో విమానం పంపించి సభావేదిక దగ్గరకు చేర్చింది. రాణి గాన సౌరభాన్ని ఆఘ్రాణించి పులకితులైన సంగీత శాస్త్రవేత్తలు ఎందరెందరో.

ఒక కార్యక్రమంలో మాట్లాడినప్పుడు ` లలిత కళల గురించిన వ్యక్తీకరణ ఆ గాయకురాలి అంతరంగాన్ని ప్రస్ఫుటీకరిస్తుంది. కళలు అనేకం. మూలం, మూలకం సంగీతమే. సంస్కృతి మొత్తానికీ ఆధారం ఇదే. ఆనంద అనుభూతి సాధకం. సంగీతమనేది కళాత్మక కొలువు. ఇందులో లలిత గీతాలకు ప్రథమ స్థానం. అంటే ` భావగీతాలకు లలిత రీతిన బాణీలు సమకూర్చడం. లాలిత్యం, గానయోగ్యం వీటిలో సిద్ధిస్తాయి.

ఓహో బ్యూటీ వంటి పదాలతో విన్యాసాలు సాగించారామె.

ఆంగికం భువనం జయజయ అంటూ సంప్రదాయాన్ని పలికించారు.

ఓలే ఓలే ఇన్నావా అని జానపద స్ఫూర్తినీ నిలబెట్టారు.

యువతీ యువకులు మనమంతానని సందేశం అందించారు.

కాదంటారా, మీరు కాదంటారా అంటూ ప్రశ్నల అస్త్రాలు సంధించారు.

విమల ప్రేమయే జీవనలీల అని సారాంశం బోధించారు.

ఒకటి రెండూ మూడూ అంటూ గణిత సంగీతం సృజించారు.

‘రూపాయి కాసులోనే ఉంది’ అంటే జీవన వేదాంతం.

‘ఎందుకున్నావో మాధవా’ అని పలికినపుడు ప్రశ్నార్థకం.

‘ఎంచక్కా ఎంచక్కా’ పేరిట మాటలతో కదనోత్సాహం.

‘డేగలాగ వస్తా, తూనీగలాగ వస్తా’ నంటూ మహోత్సాహం.

‘కొండమీద కొక్కిరాయి కాలుజారి కూలిపోయె’ వాస్తవ చిత్రణం.

ఈ విధంగా ఎన్నెన్నో భావోద్వేగాలను గొంతులో పలికించి శ్రోతల సమాదరణను పుష్కలంగా అందుకున్నారామె.

జాతీయత, భాషా ప్రశస్తి చాటిచెప్పే గీతమాలికల్లో…

అల నలగ్జాండరు నద్భుతపరచిన పురుషోత్తముడు

ఆంధ్రదేశమా వర్థిల్లు వర్థిల్లు

ఎంతో ఆనందం… మరెంతో సంతోషం.

నా జీవితపు మాధురివి ఇల నీవే కదా!

ఇలా ఎన్నెన్నో రీతులను అందించిన రాణి జీవన యానం వైభవోపేతంగా సాగింది. నేపథ్య సంగీత స్రవంతికి పర్యాయపదంగా మారింది.

భాగ్యనగరంలోనే కుమార్తె ఇంట జీవన సంధ్యా సమయం గడచింది. ‘మీరు సింహళ భాషలో ఆలాపించారు. ఉజ్బేన్‌ భాషలోనూ ప్రావీణ్యం కనబరిచారు. అరుదైన గౌరవాలను అందుకున్నారు. ఇదంతా అవలోకిస్తే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది’ అని పత్రికలవారు అడిగితేÑ ఆమె ఇచ్చిన ఏకవాక్య సమాధానమే పరమోన్నతం.

‘సంగీతం అంతర్జాతీయ భాష అని నిరూపణ అయింది.’

ఇదీ గీతారాణి మనోగతం, అంతరంగ తరంగం!

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE