భారతదేశం సముద్ర రవాణా రంగ అభివృద్ధితో పాటు తీరప్రాంత భద్రత విషయంలో ప్రపంచ మన్ననలు అందుకుంటోంది. భారతీయ గస్తీ నౌకలు హిందూ మహాసముద్రంలో ప్రమాదంలో ఉన్న ఎవరినైనా తరతమ బేధాలు చూడకుండా కాపాడి తమ ప్రత్యేకతను నిలుపుకోవడం మనకు తెలిసిందే. అయితే, పొరపాటున యుద్ధమనేది వస్తే దాని సంసిద్ధత కోసం కూడా భారత్‌ ‌తన నావికాదళాన్ని తాజా పరచుకుంటోంది. యుద్ధనౌకలతో పాటు సమర్ధవంతమైన జలాంతర్గా ములను దేశీయంగా నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, దూరగామి క్షిపణి ప్రయోగానికి అనువైన జలాంతర్గామి త్వరలోనే భారతీయ నావికాదళంలో చేరనుందన్నది శుభవార్తే!

భారత నావికాదళం జలాంతర్గాముల కొరతతో చేస్తున్న పోరాటానికి ముగింపు పలికేందుకు జరుగుతున్న యత్నాలు సరైన మార్గంలోనే వెడుతున్నాయి. సముద్ర, తీర ప్రాంత రక్షణ కోసం ఉద్దేశించిన అణు జలాంతర్గామి ప్రాజెక్టు ఒక దాని తర్వాత ఒక మైలురాయిని దాటుకుంటూ పోతోంది. అత్యంత గోప్యంగా నిర్వహి స్తున్న ఈ ప్రాజెక్టు అణుశక్తితో నడిచే రెండవ బాలిస్టిక్‌ ‌క్షిపణి జలాంత ర్గామి (ఎస్‌ఎస్‌ఎస్‌బిఎన్‌) ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ను ఈ ఏడాది చివరకు కమిషన్‌ ‌చేయ నున్నారు. ఈ నౌకను ప్రారంభించిన దాదాపు ఏడేళ్ల అనంతరం దీనిని అధికారి కంగా ఈ ఏడాది చివరిలో నావికా దళంలో ప్రవేశపెట్టి, వినియోగించనున్నారు. దాదాపు 6,000ల టన్నుల బరువు, 111 మీటర్ల పొడవు, 9.5 మీటర్ల డ్రాట్‌ (‌నీటి కిందకు వెళ్లడం), 11 మీటర్ల దూలం, 24 నాట్ల గరిష్ట వేగం, ఉపరి తలంలో 10 నాట్ల వేగంతో ప్రయాణించడాన్ని దీని ప్రధాన లక్షణాలుగా చెప్పు కోవచ్చు.

చారిత్రికంగా జర్మనీ, ఫ్రాన్స్, ‌రష్యాల నుంచి భారత్‌ ‌జలాంతర్గాములను దిగుమతి చేసుకుం టోంది. గత దశాబ్దకాలంలో దేశీయంగా వాటిని ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే నాలుగు స్కార్పీన్‌ ‌క్లాస్‌ ‌జలాంతర్గా ములను దేశీయంగా నిర్మించాలని, రెండింటిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. దేశంలో ఎస్‌ఎస్‌బిఎన్‌ ‌జలాంతర్గాములను దేశీయంగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టిన తరుణంలో, మిత్రదేశమైన రష్యా తోడ్పాటునిచ్చేందకు సిద్ధమైంది. దాదాపు 1980లో నాటి సోవియట్‌ ‌యూనియన్‌, ‌నేటి రష్యా ప్రాజెక్ట్ 670 ‌స్కాట్‌ ‌జలాంతర్గామిని భారత్‌కు లీజుకు ఇచ్చింది. అప్పటి నుంచే రష్యన్లు అణుశక్తితో నడిచే జలాంతర్గాముల కార్యక్రమానికి సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇప్పుడు భారత నావికాదళం వద్ద ఆరు రష్యన్‌ ‌జలంతర్గా ములు, నాలుగు ఇతర జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ అణుశక్తితో నడుస్తుంది. అరిహంత్‌ ఎస్‌ఎస్‌ఎన్‌ ‌జలాంతర్గామి రకం కాగా, అరిఘాత్‌ ఎస్‌ఎస్‌బిఎన్‌ ‌రకానికి చెందింది. ఎస్‌ఎస్‌బిఎన్‌కు, ఎస్‌ఎస్‌ఎన్‌ ‌జలాంతర్గా ములకు మధ్య గల పోలిక అణు రియాక్టర్లు జలాంతర్గామికి శక్తిని అందించడమే. ప్రధాన తేడా అల్లా అది కలిగి ఉండే ఆయుధాల రకాలు, నమూనాలో ఉంది. ఎస్‌ఎస్‌బిఎన్‌ ‌నౌక దూరగామి క్షిపణులను కలిగి ఉండగా, ఎస్‌ఎస్‌ఎన్‌ ‌తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలవు. అయితే దీనిని నిఘా, పర్యవేక్షణ మిషన్లు నిర్వహించే విధంగా రూపకల్పన చేశారు.

ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ ‌కార్యకలాపాలను, నిర్వహణను 2016 ఆగస్టు మాసంలో ప్రారంభిం చేందుకు దానిని కమిషన్‌ ‌చేశారు. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ ‌జలాంతర్గామి అణు సామర్ధ్యం కలిగిన నిర్భయ్‌ ‌క్రూయిజ్‌ ‌క్షిపణుల రకమైన 12 సాగరికా (కె-15) బాలిస్టిక్‌ ‌క్షిపణులను ప్రయోగానికి సిద్ధంగా కలిగి ఉంది. దాదాపు 700 కిమీల దూరంలో గల లక్ష్యాన్ని ఈ క్షిపణులను ఛేదించగలుగుతాయి. అయితే ఈ వివరాలను భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు కానీ నావికాదళ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు పత్రికలు వీటిని ప్రచురించాయి.

ప్రవేశపెట్టిన కొద్ది కాలానికే సిబ్బంది పొరపాటువల్ల దాని ప్రొపల్షన్‌ (‌చోదక) వ్యవస్థలో ఏర్పడిన సమస్యల కారణంగా దాదాపు పది నెలల పాటు కార్యకలాపాలను సాగించలేక పోయింది. కాగా, 2018 నవంబర్‌లో ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ ‌తన తొలి నిరోధక గస్తీ చేపట్టినట్టు వార్తలు వచ్చాయి. అణు అస్త్రముఖం కలిగిన ఆయుధాలను వాస్తవ క్షిపణుల నుంచి వేరు చేసి ఉంచడం భారత అధికారిక విధానం. ఇదే కోవలోని రెండవ జలాంతర్గామి అరిఘాత్‌ ‌సముద్ర పరీక్షలను పూర్తి చేసుకుంది. దీనిని కూడా అరిహంత్‌లానే వేరుగా ఉం చారు.

భారత జలాంతర్గాముల దళం తూర్పు తీరమైన విశాఖపట్నంలోనూ, పశ్చిమ తీరమైన ముంబై నుంచి పని చేస్తాయి. అయితే అణు జలాంతర్గాములను ఇంకా ఫోటోలతో డాక్యుమెంట్‌ ‌చేయలేదు. కనుక, అవి ఎలా ఉంటాయన్నది ఊహా జనితం. నిర్మితిలో పోలికలపై నిపుణుల విశ్లేషణల ద్వారా, సాంకేతిక నైపుణ్యాల ఆధారంగా తెలుసుకోగలము. ప్రధానంగా భారతీయ అణు శక్తితో నడిచే జలాం తర్గాముల కార్యక్రమాన్ని డిఫెన్స్ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (‌డిఆర్‌డిఒ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ (డిఎఇ), విశాఖపట్నంలోని భారత నావికా దళం వీటిని నిర్మాణ కార్యకలాపాలను నిర్వహి స్తున్నాయి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE