వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– ఓట్ర ప్రకాష్‌రావు

చంద్రయాన్‌ 3 ‌విజయం చూసి ప్రపంచ దేశాలు మెచ్చుకొన్నాయి. ఆ తరువాత అనుకోకుండా మూడవసారి కరోనా వచ్చినపుడు ప్రభుత్వం తీసుకొన్న జాగ్రత్తలను చూసి ప్రజలు మెచ్చుకునేలా చేసింది.

కరోనా రెండుసార్లు వచ్చి దేశ ప్రజలలో ఎన్నో భయాలను చూపించింది. ఎదురు చూడని విధంగా కరోనా మూడవసారి విజృంభించడంతో, ఈ సారి ప్రభుత్వం తీసుకొన్న చర్యల వలన మరణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కార్పొరేట్‌ ఆసుపత్రులవైపు వెళ్లడం మానుకొని ప్రభుత్వ ఆసుపత్రులవైపు వెళ్లడం, క్వారంటె•న్‌లో ఇంటిలోనే గడపడం అలవాటు చేసుకోన్నారు. రైలు, బస్సు నిలిచిపోవడం, లాక్‌ ‌డౌన్‌ ‌వలన కూలీలకు ఉద్యోగాలు లేకపోవడంతో మునుపటి లాగానే పట్టణం విడిచి సొంతగ్రామాలకు నడచి వెళ్లడం జరుగసాగింది.

ముంబై పట్టణం దాటగానే ఆ రోడ్డుపైకి మూడు వైపులనుండి వచ్చిన ఆ మూడు కుటుంబాల వారు విశ్రాంతిగా అక్కడ కూర్చొన్నారు. ఒకరినొకరు పరిచయం చేసుకొన్నారు. మూడు కుటుంబాల వారికి కరోనా లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా కూలిపని లేదన్నారు. కూలీపని దొరకక పోవడంతో ముంబైనుండి తెలుగు రాష్ట్రంలోనున్న సొంత ఊరికి వెళ్లడానికి కాలినడకతో బయలుదేరారు. మూడు కుటుంబాల వారు వేరువేరు గ్రామవాసులైనా ఒకే జిల్లా కావడం వల్ల ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకటిగా కలసి వెళ్లవచ్చునన్న తృప్తి కలిగింది. ఆ మూడు కుటుంబాలవారి పిల్లలు ఒకటిగా కలుసుకొన్నారు.

‘‘నా పేరు వేదమ్మ. నేను నాలుగవ తరగతి చదువుతున్నాను. మా అమ్మానాన్నలు నన్ను మా గ్రామంలో వదలి ముంబైకి వచ్చారు. మా నానమ్మ ఇక్కడకు వచ్చి పది రోజులు వుండి తిరిగివస్తాను అని వెళ్తుంటే, నేనూ బయలుదేరాను. నేను వచ్చిన కొన్ని రోజులకే బస్సులు, రైళ్లు నిలిచిపోయాయి. మా నాన్నమ్మకు కరోనా వచ్చి ముంబై లోనే చనిపోయింది.’’

‘‘నా పేరు కమల. నాలుగవ తరగతి చదువు తున్నాను. ముంబై పట్టణం నుండి మా అమ్మా నాన్నలు మా ఊరికి వచ్చారు. వెళ్లేటప్పుడు నేనూ వస్తానని మొండితనం చేసాను. పదిరోజుల తరువాత మన జిల్లా వారు ఎవరైనా వస్తే తిరిగి వెళ్లాలని చెప్పి తీసుకొనివచ్చారు. ఇక్కడకు వచ్చిన కొన్ని రోజులకే లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల రైళ్లు పోవడంలేదని ఇప్పుడు నడచుకొంటూ వెళ్తున్నాము.’’

‘‘నా పేరు నాగాలమ్మ. నేనూ మా ఊరిలో ఐదవ తరగతి చదువుతున్నాను. మా అమ్మకు కడుపులో ఆపరేషన్‌ ‌చేయవలసి వచ్చిందని చెబితే ఇక్కడకు వస్తున్న మా ఊరి వారితో కలసి వచ్చాను.’’

ముగ్గురూ స్నేహితుల్లా కలసిపోయారు.

పదిరోజులు గడిచింది.

రోడ్డుకు అడ్డంగా పోలీసులు వుండటం చూసారు.

‘‘ఇక్కడ కరోనా తీవ్రంగా వుండటంవల్ల ఆ దారిగుండా వెళ్లడానికి అనుమతించకూడదని పై అధికారులు చెప్పారు. అక్కడున్న భవనంలో వి•లాంటి వారికి సేవా సంఘం వారు ఆశ్రయం కల్పిస్తున్నారు వెళ్లండి.’’ అంటూ ఒక పోలీసు చెప్పగానే పోయిన ప్రాణాలు తిరిగివచ్చినట్లని పించింది. మూడు కుటుంబాల వారు ఆ భవనంవైపు వెళ్లారు.

మరికొంత సేపటికి ఒక వాన్‌ ‌రావడం చూసి పోలీసులు అడ్డుకొని ఆ భవనం వైపు వెళ్లమన్నారు.

వీడియో గేమ్స్‌లో మునిగిపోయిన మౌనిక, లక్షణ్య, తన్మయిలు భవనం దగ్గర వాన్‌ ‌నిలబడగానే ఆయిష్టంగా సెల్‌ ‌ఫోన్‌ ఆఫ్‌ ‌చేస్తూ ‘‘అప్పుడే మానవూరు వచ్చేసిందా’’ అంటూ దిగారు.

‘‘మనవరాళ్లకు సెల్‌ ‌ఫోన్‌ ‌తప్ప వేరే ప్రపంచమే తెలీదు!’’ బాధగా భార్యతో అన్నాడు జయరాం. హాలులో ఒక మూల తమ సంచులను వుంచారు. జయరాం దంపతులు గాలి కోసం హాలు బయట కూర్చొన్నారు.

అవ్వా,తాతల ప్రక్కన కూర్చొని ముగ్గురూ వీడియొ గేమ్స్ ‌చూస్తుంటే, ‘‘ఇక్కడా సెల్‌ఫోన్‌ ఆటలేనా… అక్కడ చూడండి ఆ ముగ్గురమ్మాయిలు బాగా ఆడుకొంటున్నారు.’’ అంది జయరాం భార్య నాగభూషణమ్మ.

తన్మయి వారి వైపు ఆసక్తికరంగా చూడటం గమనించి ‘‘నీవూ ఆడేటట్లుంటే రా.’’అంది నాగాలమ్మ .

తన్మయి వారి దగ్గరకు వెళ్లింది. నాగాలమ్మ తన గురించి అక్కడున్న ఇద్దరి గురించి చెప్పింది.

‘‘నా పేరు తన్మయి, మూడవ తరగతి చదువుతున్నాను. అక్కడున్న మా అక్క మౌనిక, మా బాబాయ్‌ ‌కూతురు లక్షణ్య అక్క… ఇద్దరూ ఐదవ తరగతి చదువుతున్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల మా నాన్న, బాబాయ్‌ ‌పనిచేసే కంపెనీ మూసివేయడంతో మేముంటున్న ఇల్లు ఖాళీ చేసి మా అవ్వా తాతలతో మా సొంత ఊరికి బయలుదేరాము. మా అమ్మ నాన్నలు, పిన్నీ బాబాయ్‌లు పది రోజుల తరువాత వస్తారంట.’’

‘‘వి•రు ముగ్గురూ ఎల్‌కేజీ నుండి ముంబయ్‌లో చదువుకొన్నారా! తెలుగు చదవడం వచ్చా?’’

‘‘అవును. తెలుగు మాట్లాడటమే వచ్చు.’’అంది తన్మయి

‘‘వాళ్లిద్దరినీ రమ్మను, అందరూ ఆడుకొందాము.’’

‘‘వి• ఇద్దరూ రండి కలసి ఆడుకొందాము!’’ అని తన్మయి చెప్పగానే, వారిద్దరూ వచ్చారు. వాళ్లు ఆడుతున్న ఆట ఎలా ఆడాలో చెప్పింది వేదమ్మ. అందరూ ముఖానికున్న మాస్క్ ‌తీయకుండా ఆడుకొనసాగారు.

కొంతసేపటి తరువాత ‘‘వేరే ఆటలేమైనా ఆడుకొందాము …. ఇది బోర్‌ ‌కొడుతోంది’’ అంది తన్మయి.

‘‘కుంటాట ఆడుకొందాము.’’

‘‘ఇదేకదా కుంటాట ‘‘

‘‘దానిపేరు తొక్కుడు బిళ్ల’’ అంటూ నాగలమ్మ కాలుతో ఒక ఆ మట్టినేల మీద పెద్ద వృత్తం గీసి ‘‘దొంగ కుంటుకుంటూ వచ్చి పట్టుకోవాలి. మిగిలినవారు గీత దాటి బయటకు వెళ్లకుండా తప్పించుకోవాలి ఈ ఆటపేరు కుంటాట.’’

‘‘ఎవరు దొంగ?’’

‘‘ పంటలేస్తే తెలుస్తుంది!’’

‘‘పంటలా…ఎలాగా ‘‘ఒక్కసారిగా ముగ్గురూ అడిగారు .

‘‘ఎలాగంటే మనమంతా గుండ్రంగా నిలబడి ‘అవ్వ అప్పచ్చి కోతి కొమ్మచ్చి’ అంటూ చేతులు ఒక్కటిగా వేయాలి. అలా వేస్తే దొంగ ఎవరో తెలిసి పోతుంది. ఇవన్నీ చెప్పినా అర్థంకాదు. ఒకసారి చూస్తే అర్థమౌతుంది’’ అంది నాగాలమ్మ .

పంటలేసినప్పుడు వేదమ్మ దొంగ అయింది. ఒక్కసారి చూడగానే పంటలెయ్యడం ఎలాగో వారి ముగ్గురికీ అర్థమయింది. వేదమ్మ కుంటుకుంటూ వెళ్తుంటే మిగిలిన ఐదుమంది తప్పించుకొనడానికి ప్రయత్నించసాగారు.

ఈ సారి నాగాలమ్మ దొంగగా కుంటుతున్న సమయాన ‘‘నాగాలమ్మా!’’ అన్న తల్లి పిలుపు వినగానే ఒక్క సారిగా కాలు కింద పెట్టి ‘‘అంబాలీస్‌ ….‌మా అమ్మ పిలుస్తోంది!’’ అంది.

‘‘ఎవరినైనా దొంగను పట్టుకొని వెళ్లు.’’అంది వేదమ్మ.

‘‘అవసరమైతేనే అంబాలీస్‌ ‌చెప్పి ఆట మధ్యలోంచి వెళ్తారు. మా అమ్మ పిలిచింది నీకు వినపడలేదా.. పిలుస్తూనే పోకుంటే తోలు తీస్తుంది.. నా బదులు నీవు దెబ్బలు తింటావా.. అంబాలీస్‌’’ అం‌టూ వేగంగా వెళ్లింది.

‘‘ఇప్పుడు దొంగ ఎవరో తెలుసుకొనడానికి మనం పంటలేసుకొందాం!’’ ఉత్సాహంతో అంది లక్షణ్య

తల్లి చెప్పిన పని పూర్తి చేసాక బయటకు వచ్చింది నాగాలమ్మ

‘‘కుంటడానికి భయపడి ఆట అయిపోయాక వచ్చావా?’’ అంది మౌనిక.

‘‘నాకు భయమా… ఇప్పుడు మళ్లా నేను దొంగగా కుంటుతాను’’ అంది నాగాలమ్మ.

‘‘వద్దు వద్దు. కొత్తాట ఆడుదాము!’’ అంది తన్మయి.

‘‘కోతి కొమ్మచ్చి ఆడుకొందామా!?’’

‘‘ మాకు తెలీదు!’’ అంది లక్షణ్య. ఆ ఆట ఎలా ఆడాలో కమల చెప్పింది.

‘‘చెట్లు ఎక్కాలా… నేను ఎక్కలేను!’’ అంది తన్మయి.

‘‘మేము ఎక్కిస్తాము’’ అంది నాగులమ్మ. పంట లేస్తే లక్షణ్య దొంగ అయింది.

‘‘చెట్లు ఎక్కడానికి తన్మయికి రాదు. తన్మయి ఆటలోఅరటిపండు’’ అంటూ మెల్లగా చెప్పింది నాగాలమ్మ.

‘‘అంటే ఏమిటి?’’ మెల్లగా నాగాలమ్మ చెవిలో లక్షణ్య అడిగింది.

‘‘సరిగ్గా ఆడలేకపోయిన వారిని అలా అంటారు, నీవు తన్మయిని పట్టకూడదు.’’ అంది.

‘‘తన్మయీ నిన్ను మౌనిక భుజం పైకి ఎక్కించాక అలాగే నిలబడి కొమ్మను పట్టుకొని ఎక్కాలి.’’

‘‘ఏమిటీ! నా భుజంపైనా… కొత్త గౌను, నల్లగా అవుతుంది.’’ అంది మౌనిక.

‘‘నల్లగా మారకుండా బంగారంలాగా అవుతుందా! ఎక్కించుకోకుంటే నువ్వు ఆటలో వద్దు’’ అంది కమల.

‘‘తన్మయిని నేను భుజంపైన ఎక్కించు కొంటాను?’’ బుంగమూతితో అంది మౌనిక.

తన్మయి భయపడుతూ వారందరి సహాయంతో చెట్టెక్కింది. మౌనిక కూడా చెట్టెక్కటానికి భయపడితే నాగులమ్మ భుజంపై ఎక్కించుకొని చెట్టు ఎక్కడానికి సహాయపడింది. చీకటి పడేవరకు ఆడుకొని వచ్చారు. సెల్‌ ‌ఫోన్‌ ‌తీసుకోకుండా ఆడిన ఆటలు గురించి ఉత్సాహంతో చెబుతుంటే ఆశ్చర్యపోయింది నాగభూషణమ్మ.

సేవా సంఘం వారు పంచిన భోజన పొట్లాలు తీసుకొని తిన్న తరువాత మరలా ఆ పిల్లలందరూ ముఖానికి మాస్క్ ‌వేసుకొని ఒక చోట గుమికూడి ఆడుకొనసాగారు. మరుసటి రోజు టిఫన్‌ ‌పూర్తయ్యాక పిల్లలందరూ బయట ఆడుకొనసాగారు.

మూడవ రోజు మధ్యాహ్నం భోజనాల సమ యంలో ‘‘సెల్‌ఫోన్‌లో చెప్పలేన్నన్ని వీడియో గేమ్స్ ఉన్నట్లు… వారికి చాలా చాలా ఆటలు తెలుసు.’’ ఆశ్చర్యంతో అంది మౌనిక.

‘‘ఇన్ని ఆటలున్నాయని మాకు తెలీదు.’’ అంది తన్మయి

‘‘గోళీలు ఉంటే చాలా ఆటలు ఆడవచ్చన్నారు. పెద్ద ముగ్గులు వేస్తారంట .మాకు నేర్పిస్తామన్నారు.’’ అంది లక్షణ్య.

భోజనం పూర్తికాగానే చెట్టుకింద ఆడుకొన సాగారు.

అక్కడ పిల్లలు కలసినట్లే ఇక్కడ పెద్దవారు కలసి కలుపుగోరుతనంతో స్నేహంగా మాట్లాడుకొన సాగారు.

అప్పుడే వచ్చిన ఎస్‌ఏంఎస్‌ ‌చూస్తూ ‘‘మనం వెళ్లడానికి సాయంత్రం నుండి ఆనుమతిస్తారట. ఈ రోజు రాత్రి బయలు దేరాలి’’ అన్నాడు జయరాం.

‘‘మేమూ పొద్దున్నే నాలుగు గంటలకు లేచి నడక ప్రారంభిస్తాము’’ అన్నారు.

‘‘మా వాన్‌ ‌వెనుక సీట్లలో లగేజీ ఉంది. దాన్ని వాన్‌ ‌పైన వేసి కట్టేశామంటే వి•రందరూ కూర్చొని రావచ్చు. మాసొంత ఊరు వి• పక్క జిల్లా, మిమ్మల్ని వి• ఊర్లలో దిగబెట్టుతాను.’’

‘‘ బాబూ! మాకు జన్మజన్మలకు మరచిపోలేనంత గొప్ప సాయం …’’ అంటూ చేతులు జోడించారు.

‘‘వి• పిల్లలు మాకు మరచిపోలేనంత గొప్ప పాఠం నేర్పారు. దానిముందు ఇదేమంత పెద్దది కాదు’’

‘‘మా పిల్లలా… ఏం చేశారు..!’’ అయోమ యంగా చూస్తూ అడిగారు.

‘‘ముంబైలో ఉద్యోగం పోయాక సొంత ఊరైన పల్లెటూరికి వెళ్లకుండా పిల్లల చదువుల కోసం పట్టణంలో స్థిరపడాలనుకొన్నాను. మూడు రోజులలో వి• పిల్లలను చూసాక మా నిర్ణయాన్ని మార్చు కొన్నాము, మా సొంత గ్రామానికే వెళ్లాలనుకొన్నాం!’’

‘‘ఆళ్లేమి చేశారు సారూ’’అడిగాడు కన్నప్ప తండ్రి

‘‘నేటితరం పిల్లలు శారీరక వ్యాయామం లేని వీడియో ఆటలకు బానిసలు కావడం వల్ల మానసిక ఒత్తిడికీ, అనారోగ్యానికీ దగ్గరవుతున్నారు. ఆరోగ్య కరమైన ఆటలేమిటో మరచిపోయారు. మూడు రోజుల్లో నా మనవరాళ్లలో మార్పు గమనించి ఆశ్చర్యపోయాను. సెల్‌ఫోన్‌ ‌ప్రపంచంగా జీవిస్తున్న మా మనవరాళ్లు ఈ మూడు రోజులు సెల్‌ఫోన్‌ ‌తాకలేదు. ఇతర పిల్లలతో కలిసి ఆటలాడుకోవడం ద్వారా వారి మధ్య ఐక్యత, స్నేహం, మానసిక ఎదుగుదలను గుర్తించాను. మొదటి రోజు చెట్టు ఎక్కడమంటేనే భయపడే తన్మయి ఇప్పుడు చెట్టు ఎక్కుతోంది.’’

‘‘ఆటలు ఆడుతుంటే అన్నీ తెలుసుకొంటారు సారూ అన్నాడు నాగాలమ్మ తండ్రి.’’

‘‘పల్లెటూరి పిల్లల్లో ఆటల పరిజ్ఞానం ఎక్కువ, నగరాల్లో చదువుల పోటీ ఎక్కువగా ఉండటం వలన పిల్లలు ఆటలపై ఆసక్తి లేదని తెలుసుకున్నాను.మా అబ్బాయిలిద్దరికీ ఉద్యోగం ఎక్కడ దొరికినా నా మనవరాళ్లు ముగ్గురూ మా గ్రామంలో నాదగ్గరే పెరుగుతారు.’’

‘‘ఆళ్ల చదువులు!’’ అడిగాడు నాగాలమ్మ తండ్రి.

‘‘మా గ్రామంలో గవర్నమెంట్‌ ‌బడిలో పదవ తరగతివరకు వుంది. పది వరకు అక్కడే చదివిస్తాము. మా అబ్బాయిలిద్దరూ ఆ బడిలో చదివే ఇప్పుడు ఇంజి నీర్లయ్యారన్న సంగతిని ఇంతకాలం విస్మరించాము. మా అబ్బాయిలిద్దరికీ వీళ్లు ఆడిన ఆటలను వీడియో తీసి వాట్సాప్‌లో పంపాను. వాళ్లు ఆశ్చర్య పోయారు. నా నిర్ణయానికి మా అబ్బాయిలిద్దరూ సంతోషంతో అంగీకరించారు. నా మనవరాళ్లు ఆటలో అరటి పండులా కాకుండా ఆటల్లో మెరుగైన ఆడపిల్లలా ఉండాలంటే పల్లెటూరు అనువైన స్థలం.’’ అన్నాడు

‘‘ఈమధ్య పట్టణాలలో అత్యాచారాలు ఎక్కు వయ్యాయంటే అందుకు కారణం చదువుకున్న ఆ ఆడపిల్లల్లో ధైర్యం లేకపోవడం, ఎలా తప్పించు కోవాలన్న ఆలోచన లేకపోవడం… ఎటువంటి వెధవయినా వేషాలు వేసాడంటే ఎదుర్కొనగల ధైర్యం, ఆపదల సమయంలో తప్పించుకొనే తెలివితేటలూ ఆటల వల్లనే వస్తాయి.’’ అంది నాగభూషణమ్మ.

పిల్లలందరూ ఒక్క సారిగా అక్కడికి వచ్చారు

‘‘కమల దొంగ అయినప్పుడే తన్మయీకి కుంటడం సరిగ్గా రాదు. ఆటలో అరటిపండు లాగా ఉంటుంది దొంగను చెయ్యద్దు అని చెప్పాను. ఎవరినీ దొంగను చెయ్యలేక తన్మయిని దొంగను చేసింది నాన్నా. అది చెల్లదంటే ఒప్పుకోవడంలేదు.’’ అంది నాగాలమ్మ

‘‘తాతా, ఇంకా నన్ను ఆటలో అరటిపండు అని అనుకొంటున్నారు. నేనిప్పుడు బాగా ఆడతాను అంటే వీళ్లే ఒప్పుకోవడంలేదు.’’ ధీమాగా అంది తన్మయి

‘‘తన్మయి ఆడటానికి ఒప్పుకొంటే వి•రందరూ ఎందుకు అడ్డుపడుతున్నారు.’’ కోపంగా అంది కమల

ఆతరువాత పెద్దవాళ్ల సమాధానం చూడకుండానే తిరిగి ఆటలాడటానికి వెళ్లారు. మనవరాలు తన్మయి కుంటుతూ ఆడుతున్న దృశ్యాన్ని చూస్తూ ఊహల కందని పరవశమేదో మనస్సుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుగా ఆనందంలో మునిగిపోయారు జయరాం నాగభూషణమ్మ దంపతులు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE