హిందూ ఆడపిల్లలను వలలో వేసుకోవడం, అత్యాచారం జరపడం, వారి స్నేహితులను తీసుకురమ్మని లేదంటే వారి పరువు తీస్తామని బ్లాక్‌మెయిల్ చేయడం, ఇలా ఒక గొలుసులా అనధికారిక లెక్కల ప్రకారం 250మంది ఆడపిల్లలను అజ్మీర్ పట్టణంలో లైంగిక దోపిడీ చేసినదెవరో తెలిస్తే ఈతరం వారు చాలామంది నిశ్చేష్టులు అవుతారు. మన సినిమా తారలు, ప్రముఖులు నెత్తిన శాలువాలు పెట్టుకొని వెళ్లే అజ్మీర్ దర్గా సంరక్షకుల కుటుంబ సభ్యులే ఇందులో ప్రధాన పాత్ర పోషించారంటే, వారి మానసికత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముస్లింలు ఈ దేశంపై దండయాత్రలకు వచ్చినప్పటి నుంచీ నేటివరకూ ఈ సంస్కృతి కొనసాగుతూ ఉండడం, మనం దానికి అడ్డుకట్ట వేయలేకపోవడం మన తప్పిదం.
ముప్పై రెండేళ్ల కిందట దేశ ఆత్మను పట్టి కుదిపివేసిన అజ్మీర్‌లో ప్రతిష్ఠాత్మక మేయో కళాశాలకు చెందిన 100మంది (అధికారిక లెక్కల ప్రకారం) ఆడపిల్లలపై సామూహిక అత్యాచారం కేసులో ఎట్టకేలకు న్యాయస్థానాలు కళ్లు తెరిచి మిగిలిన ఆరుగురు దోషులకు శిక్షవేశాయి. బాధితు లను బ్లాక్‌మెయిల్ చేసి మరీ ఈ అత్యాచారాలకు పాల్పడిన దోషులకు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష, ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది. నఫీస్ చిస్తీ, నసీమ్ అలియాస్ టార్జాన్, సలీమ్ చిస్తీ, ఇక్బాల్ భాటి, సోహిల్ గానీ, సయ్యద్ జమీర్ హుస్సేన్‌లకు జిల్లా కోర్టు 32 ఏళ్ల తర్వాత శిక్ష విధించింది. 1992లోని అజ్మీర్ అత్యాచారం కేసులో మొత్తం 18మందిని నిందితులుగా బహుళ ఛార్జిషీట్లు పేర్కొన్నాయి. ఈ అత్యాచార ఘట్టంలో దోషులు ముస్లింలు కాగా, మెజారిటీ బాధితులు హిందువులు కావడం విచారకరం.
మరొక నలుగురికి ఇప్పటికే శిక్షపడిరది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫరూక్ చిస్తీ నాటి అజ్మీర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాగా, దోషులు అనేక మందికి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలింది. వీరిలో నఫీస్ చిస్తీ అజ్మీర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కాగా, అన్వర్ చిస్తీ సంయుక్త కార్యదర్శిగా పని చేశాడు. డబ్బు, పలుకుబడితో పాటు మతం రక్షణ కూడా ఉన్న దోషులు చట్టానికి చిక్కకుండా ఉండేందుకు చేయ వలసిన యత్నాలన్నీ చేశారు.
అత్యాచారాలు ఎలా ప్రారంభమయ్యాయి?
సీనియర్ సెకెండరీ పాఠశాలకు చెందిన విద్యార్ధిని సోఫియాను మాలిమి చేసుకొని, ఆమెపై ఫరూకీ చిస్తీ అత్యాచారం చేయడంతో ఈ వ్యవహారం ప్రారంభమైంది. మైనర్ బాలిక అశ్లీల చిత్రాలు తీసి, ఇతర ఆడపిల్లలను పరిచయం చేయమని, లేదంటే వాటిని బయటపెడతానని బెదిరించడం ప్రారంభిం చాడు. ఆ రకంగా ఒక గొలుసులాగా కొత్త కొత్త బాలికలు వారికి బలికావడం ప్రారంభమైంది. కార్యా చరణ పద్ధతి ఒక్కటే`కొత్త బాలికపై అత్యాచారం చేయడం, వారిని కూడా బ్లాక్‌మెయిల్ చేయడం. తనతో పాటుగా మరొక ఇద్దరు చిస్తీలను కూడా ఈ వ్యవహారంలో ఫరూక్ కలుపుకున్నాడు. వారంతా కూడా నాడు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక వర్గంలో ఉండటమే కాదు, అజ్మీర్ దర్గా సంరక్షకులైన చిస్తీ ఖదీమ్‌లుగా ఉన్నవారు.
నేరం ఎలా బయటపడిరది?
ఏప్రిల్ 1992లో స్థానిక పత్రిక దైనిక్ నవజ్యోతి జర్నలిస్టు సంతోష్ గుప్తా 17 నుంచి 20 ఏళ్ల మధ్య గల వందమంది యువతులపై లైంగిక అత్యాచారం కథనాన్ని ప్రచురించడంతో అజ్మీర్‌తో సహా దేశం యావత్తు విభ్రాంతికి, వేదనకు లోనైంది. తర్వాత వచ్చిన అనేక వార్తలు బాధితుల సంఖ్య 250 ఉండవచ్చని పేర్కొన్నాయి. దోషులు వందలాదిమంది విద్యార్థినులను లైంగికంగా దోపిడీ చేసినట్టు వార్తలు వెల్లడిరచాయి.
అజ్మీర్‌కు చెందిన పెద్ద పెద్ద నాయకుల కుమార్తెలు కూడా ఇందులో బాధితులు కావడం దిగ్భ్రాంతికి గురిచేసే విషయం. ఈ కథనాన్నే ‘డాటర్స్ ఆఫ్ బిగ్ లీడర్స్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ బ్లాక్‌మెయిల్’ (పెద్ద నాయకుల కుమార్తెలు బ్లాక్‌మెయిల్ బాధితులు) అన్న శీర్షికతో ప్రచురించారు. బాధితులంతా అజ్మీర్‌లోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్ధినులే. ఆర్ధికంగా, రాజకీయంగా బలమైన వారు వీరిపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ వ్యాసం పేర్కొంది. కాగా, అది ప్రచురితమైన వెంటనే ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం జరిగింది. ఇందులో భాగస్వాములైన అధికారులు కూడా తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బాధిత కుటుంబాలను బెదిరించి, అక్కడ నుంచి వెళ్లగొట్టి, బలవంతంగా మౌనం పాటించేలా చేశారు.
అజ్మీర్ దర్గా సంరక్షకులూ దోషులే
అజ్మీర్ ప్రజలను నిశ్చేష్టులను చేసిన విషయం అజ్మీర్ దర్గా లేదా ఖ్వాజా మొయీనుద్దీన్ చిస్తీ దర్గా సంరక్షకులు, ప్రముఖులైన ఖదీమ్‌ల కుటుంబ సభ్యుల ప్రమేయం ఇందులో ఉండడమే. వీరంతా కూడా తమను తాము సూఫీ సన్యాసి ఖ్వాజా మొయీనుద్దీన్ చిస్తీ అసలు శిష్యుల వారసులమని చెప్పుకుంటారు. ఈ అత్యాచారం కేసు బయటపడిన సమయంలో యువజన కాంగ్రెస్ నాయకులుగా ఉన్న ఫరూక్ చిస్తీ, నఫీస్ చిస్తీల జోక్యం ఉందని తెలిసి జనాలు బిత్తరపోయారు.యధావిధిగా రాజకీయ పలుకుబడి, పాలనా యంత్రాంగ అసమర్ధత ఈ కేసు దర్యాప్తు జాప్యంలో ప్రధానంగా ప్రతిఫలించాయి. నిందితుల పలుకుబడి, ప్రభావం ఎంతగా పని చేసిందంటే, ఇందులో సాక్షులు, బాధితులు కూడా అడ్డం తిరిగారు. దీనితో అనేక వివరాలు భూస్థాపితం అయ్యాయి. బాధితులను, సాక్షులను బ్లాక్‌మెయిల్ చేసి, బెదిరించి ముందుకు రాకుండా చేశారు. మరి కొందరు సమాజం వేసే ముద్రలకి భయపడి ముందుకు రాలేదు. ఈ స్కాండల్ బయటపడగానే నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి భైరవ్ సింగ్ షెఖావత్, దోషులను ఎవరినీ వదిలి పెట్టవద్దంటూ అధికారు లకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే, జిల్లా పోలీసు అధికారులు మాత్రం తమ శైలిలో తక్షణ చర్యలు తీసుకోలేదు. దీనితో ఈ కేసుకు సంబం ధించిన ఆధారాలన్నింటినీ ధ్వంసం చేసేందుకు దోషులకు తగిన సమయం దొరికింది.
పోలీసుల అలసత్వాన్ని ప్రశ్నించిన దైనిక్ నవజ్యోతి
వార్త వెలుగులోకి వచ్చి 15 రోజులైనా ఎటు వంటి పోలీసు చర్యలూ లేకపోవడంతో, అంతమంది పాఠశాల విద్యార్ధినులను బ్లాక్‌మెయిల్ చేసిన నిందితులు స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారని ప్రశ్నిస్తూ సంతోష్ గుప్తా మరొక వార్త రాశాడు. దీనిలో బ్లాక్ మెయిల్‌కు ఉపయోగించిన విద్యార్ధినుల ఫోటోలను వారి ముఖాలను గుర్తించకుండా బ్లర్ చేసి ప్రచురిం చాడు. అక్కడితో గుప్తా ఆగలేదు. తర్వాత ప్రచురిం చిన వార్తలో, గత ఐదు నెలలుగా సిఐడికి ఈ వ్యవహారం తెలుసని ఒక వార్త, నాటి రాజస్థాన్ హోం మంత్రి దిగ్విజయ్ సింగ్ ఈ ఘటనలు వెలుగులోకి వచ్చే మూడు నెలల ముందు ఈ అశ్లీల ఫోటోలను చూశారని ఆరోపిస్తూ తర్వాత వార్తను ప్రచురించాడు. ఈ వార్తలతో రాష్ట్ర ప్రజలలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది.
పోలీసుల నిష్క్రియవల్లే వ్యాస పరంపర
నిజానికి ఏడాది ముందు నుంచే స్థానిక పోలీసు లకు ఈ వ్యవహారం తెలుసని, స్థానిక రాజకీయ నాయకులు దర్యాప్తుకు అడ్డుపడేందుకు వారు అనుమతించారని నవజ్యోతి ఎడిటర్ స్వయంగా ఆరోపించారు. స్థానిక సమూహాలలో పలుకుబడి కలిగిన ఖదీమ్‌ల కుటుంబానికి చెందిన వారు దోషులు కావడంతో అతడు కూడా ముందు ఈ కథనాన్ని ప్రచురించడానికి తటపటాయించాడుట. దోషులపై చర్యలు తీసుకుంటే భారీ మతకల్లోలాలు జరుగుతాయంటూ స్థానిక రాజకీయ నాయకులు హెచ్చరించి, పోలీసుల దర్యాప్తు ముందుకు వెళ్లకుండా నిలువరించారు. పోలీసుల నుంచి చర్యలు లేకపోవడం వల్లనే తాము పరంపరగా కథనాలు ప్రచురించవలసి వచ్చిందని ఎడిటర్ పేర్కొనడం అక్కడి పరిస్థితికి అద్దంపడుతుంది. ఆ సమయంలో ఐజి పోలీస్ ఆ కథనం అంతపెద్దది కాదని, అందులో నలుగురు ఆడపిల్లల ప్రమేయమే ఉందని, వారి చరిత్ర కూడా ప్రశ్నార్థకమేనంటూ నిస్సిగ్గైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటనతో ప్రజలు ఆగ్రహోదగ్రు లయ్యారు.
సిబిసిఐడికి కేసు అప్పగింత
ఈ క్రమంలో, ప్రజాగ్రహాన్ని ఎదుర్కొనేందుకు నిందితులు జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకొని, కేసును సిబిసిఐడికి బదలాయించ వలసిందిగా జిల్లా బార్ అసోసియేషన్ ఈ వ్యవహా రంలో జోక్యం చేసుకొని సూచించింది. ఒక నెల ప్రజా నిరసనల అనంతరం ఈ వ్యవహారాన్ని ముఖ్య మంత్రి షెకావత్ సిఐడికి అప్పగించారు. కేసు వెలుగు లోకి వచ్చాక తొలుత దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ‘‘అజ్మీర్‌లో పాఠశాల విద్యార్థినులను ఎలాగో వలలోకి లాగి, వారి అశ్లీల చిత్రాలు తీశారు. తర్వాత, వారిని బ్లాక్‌మెయిల్ చేయడమే కాక, లైంగికంగా అత్యాచారాలు చేశారు.
దీనితో పాటుగా, నిందితుల గ్యాంగ్ కొత్త ఆడపిల్లలను వలలోకి లాగమని బాధితు లను వత్తిడి చేస్తున్నట్టు సమాచారం అందింది, ఈ స్కాండల్‌లో పలుకుబడి కలిగిన వ్యక్తుల ప్రమేయం ఉంది, ఫోటోల నుంచి కొందరు బాధితులను గుర్తించాం’’ అంటూ పేర్కొంది. మరొక పది రోజులలో సీనియర్ సిఐడి అధికారులు అజ్మీర్ చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇందులోనే యువజన కాంగ్రెస్ నాయకులు ఫరూక్ చిస్తీ, నఫీస్ చిస్తీ, అన్వర్ చిస్తీ, అల్మాస్ మహారాజ్ తదితరుల ప్రమేయం బయటపడిరది. బాధితుల ఫోటోలను ముద్రించిన ఫోటో స్టూడియో యజమానిని కూడా నిందితుడిగా పేర్కొన్నారు.
బాధితుల ఆత్మహత్యలు, భీతి
చిన్నవయసులో, దుర్బలమైన ఆడపిల్లలు కొందరు ఈ పరిణామాలను తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకోవడం అత్యంత విషాదకరం. ఈ ఘటనలో అనేకమంది బాధితులను గుర్తించి నప్పటికీ, ముందుకు వచ్చి పోరాడేందుకు వారు తిరస్కరించారు. కొద్దిమంది అమ్మాయిలు మాత్రమే ముందుకు వచ్చి తమ స్టేట్‌మెంట్లను నమోదు చేశారు. ఇలా ఇచ్చిన వారిలో కూడా కేసులో పోరాడటానికి కొందరే మిగిలారు. ఇక చిన్న పత్రికలు కూడా దోషుల బాటపట్టి బాధితుల కుటుంబాలను డబ్బులు ఇవ్వకపోతే, ఫోటోలు ప్రచురిస్తామని బ్లాక్‌మె యిల్ చేయడం మరొక పీడకల. అనేకమంది ఆడపిల్లలు ఇందుకు లొంగినా, పుష్పా ధన్‌వానీ అనే యువతి ముందుకు వచ్చి ఒక చిన్న పేపర్ ఎడిటర్‌కు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.
దోషులకు శిక్ష
దాదాపు 250మంది బాధితులున్న ఈ కేసులో 1998లో దోషులకు జీవిత ఖైదు విధించారు. కాగా, ఇందులో నలుగురిని 2001లో రాజస్థాన్ హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 2003లో మిగిలిన నలుగురు దోషుల శిక్షను 10 ఏళ్లకు తగ్గించారు. కేసును హైకోర్టు, సుప్రీం కోర్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ప్రస్తుతం పోక్సో కోర్టులో విచారించారు. బాధితులకు నేటికి కూడా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదంటే అతిశయోక్తి కాదు. మొత్తం 250మంది బాధితుల్లో కేవలం 12మంది మాత్రమే ఫిర్యాదు దాఖలు చేశారు. మన భారత న్యాయవ్య వస్థకు మిగిలిన ఆరుగురు దోషులను శిక్షించేందుకు 32 ఏళ్లు పట్టింది. ఇప్పుడు కూడా, వారు హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. గతంలో మానసికంగా అస్థిరమంటూ ప్రకటించిన ఫరూక్ చిస్తీకి 2007లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్ష వేసింది. 2013లో రాజస్థాన్ హైకోర్టు ఆ తీర్పును సమర్ధించినా, శిక్షా కాలాన్ని యావజ్జీవం నుంచి అతడు జైల్లో ఉన్నంత కాలం వరకూ అంటూ తగ్గించింది.
అజ్మీర్ 92 చిత్రం
జులై 2023లో ‘అజ్మీర్ 92’ చిత్రం విడుదల కావడంతో ఈ కేసు పట్ల తిరిగి ఆసక్తి నెలకొంది. అత్యాచారం, బ్లాక్‌మెయిల్, 250మంది ఆడపిల్లలను ఉచ్చులోకి లాగడం వంటి వాస్తవిక సంఘటనలను ప్రతిబింబిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్పేంద్ర సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరణ్ వర్మ, సుమీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రానికి ముస్లిం సంస్థలు, ముఖ్యంగా ఖదీం సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ చిత్రాన్ని నిర్మించా రంటూ ఆరోపణలు చేశారు.
– డి.అరుణ