పేరు ‘రక్షాపురం’. కానీ అక్కడి హిందువులకు ఏనాడూ రక్షణ లేదు. ఎప్పుడేమీ జరుగుతుందనే అభద్రతా భావంతో వారు బతుకుతున్నారు. యావత్‌ ‌దేశం రాత్రి సమయంలో ఆనందోత్సాహాల మధ్య  కృష్ణాష్టమి జరుపుకునే వేళ భాగ్యనగరం పాతబస్తీలోని రక్షాపురం ప్రజలు ఆందోళనతో గడిపారు. పాతబస్తీ శివారులలో ఉన్న డీఆర్‌డీఎల్‌, ‌డీఆర్‌డీఓ, బీడీఎల్‌ ‌వంటి రక్షణశాఖ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కార్యాలయాలకు సమీపంలో ఏర్పాటు చేసుకున్న కాలనీ రక్షాపురం. దేశ రక్షణ కోసం శ్రమించే వీరి రక్షణ ప్రశ్నార్థకం కావడం  విచారకరం.

ఆగస్టు 26 సోమవారం రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో రక్షాపురంలో ఒక అమ్మవారి దేవాలయంపై ముష్కరులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేయడం కలవరం రేపింది. భాగ్యనగరం, ముఖ్యంగా పాతబస్తీలో అర్ధరాత్రులలో కూడా జనసంచారం సర్వసాధారణం. అయినా ప్రధాన రహదారిపై ఉన్న ఈ ఆలయంపై పనిగట్టు కొని దాడి చేశారంటే వీరి వెనుక ఎవరున్నారో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. సహనంతో ఉండే హిందువుల దేవాలయాలపై దాడులు చేయడం, తర్వాత పోలీసులు వచ్చి మతిస్థిమితం లేనివారు ఈ పని చేశారని, చర్యలు తీసుకుంటామని చెప్పడం రివాజు. పది పదిహేను రోజుల తర్వాత అంతా మర్చిపోవడం ప్రజల వంతు. అయితే రక్షాపురంలో జరిగిన ఈ ఘటన మతిస్థిమితం లేని ఒక మానసిక రోగి చేసింది కాదు. మతోన్మాదంతో చేసింది. దీని వెనుక భారీ కుట్ర ఉంది.

రాజకీయ లక్ష్యంగా హిందువులపై కుట్రలు

పాతబస్తీలో ఎన్నికలు, రాజకీయ అంశాలు, ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ మతప్రాతిపదికనే జరుగుతాయనేది బహిరంగ రహస్యమే. మెజార్టీగా ఉన్న ముస్లింల అండతో ఓట్ల రాజకీయాల్లో పైచేయి సాధిస్తున్న మజ్లీస్‌ ‌పార్టీ తన పట్టును మరింత పెంచుకోవడానికి చేయవలసినదంతా చేస్తున్నది. అయితే తెర వెనుక ఉండి నడిపించే ఈ కుయుక్తులకు అధికార, అనధికార అండదండలు నిత్యం ఉంటాయి. అక్రమంగా వలస వచ్చి పాతబస్తీ శివారు లలో తిష్టవేసిన బంగ్లాదేశీయులు, రొహింగ్యాలకు అన్ని రకాల గుర్తింపు కార్డులు ఇప్పించి పబ్బం గడుపుకుంటున్న ఆ పార్టీ, మరోవైపు హిందువులు నివసించే ప్రాంతాలలో భయభ్రాంతులు సృష్టించి వారు అక్కడి నుండి పారిపోయే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అవకాశ రాజకీయాలతో, భయంతో ఆ పార్టీకి పాలకులు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ వ్యవహరిస్తుండడంతో వీరి ఆగడాలకు అంతు లేకుండా పోయింది. 2009లో నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తీరే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మజ్లిస్‌ ‌పార్టీ ఆధిపత్యం ఉండే పాతబస్తీ పరిధిలోకి వచ్చే హైదరాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గంతో సహా అన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో ఆ పార్టీకి ఇతర పార్టీలతో ప్రధానంగా బీజేపీతో గట్టి పోటీ ఉండేది. పునర్విభజనలో ఎవరు చక్రం తిప్పారో కానీ సంబంధిత స్థానాల్లో మైనార్టీలు అధికంగా ఉండేలా విభజన చేయడంతో పార్లమెంట్‌ ‌నియోజకవర్గంతో పాటు మిగతా ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో కూడా ఇప్పుడు ఆ పార్టీకి ఎదురే లేకుండా పోయింది. భాగ్యనగరం దక్షిణాన చార్మినార్‌కు కూతవేటు దూరంలో ఉండే గుల్జార్‌హౌజ్‌, ‌శాలిబండ, హరిబౌలి, లాల్‌దర్వాజ, గౌలిపుర, సుల్తాన్‌షాహీ, పార్థివాడ, అలియాబాద్‌, ‌జంగమ్మేట్‌, ‌ఛత్రినాక, నల్లవాగు, ఉప్పుగూడ, అరుంధతి కాలనీ, రక్షాపురం వంటి ప్రాంతాల్లో హిందువుదే మెజార్టీ. 1990, 1992 పాతబస్తీలో అల్లర్లు, ఆ తర్వాత కాలంలో కూడా ఆయా ప్రాంతాల్లో అడపాదడపా శాంతిభద్రతల సమస్యలు రావడంతో భవిష్యత్‌పై ఆందోళనతో చాలా ప్రాంతాల్లో మెజార్టీ హిందూ కుటుంబాలు పాతబస్తీని వీడి నగరంలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడడంతో సదరు ప్రాంతాల్లో హిందువులు సంఖ్యాపరంగా మైనార్టీలుగా మారారు. ఇప్పుడు పాతబస్తీలో హిందువులు అధికంగా నివసించే ప్రాంతాలు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. రక్షాపురం ఘటనకు, పాతబస్తీ రాజకీయాలకు, హిందువుల వలసలకు దగ్గర సంబంధం ఉండడంతోనే వీటి గురించి చర్చించాల్సి వచ్చింది. హిందువులను పాతబస్తీ నుండి వీలైనంతగా పారిపోయేలా చేసి రాజకీయంగా మరింత బలపడేందుకు చేయాల్సిన ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. రక్షాపురంలో దేవాలయంపై దాడికి ప్రధాన కారణం ఇదే అని పలు కారణాలు నిరూపిస్తున్నాయి.

రక్షణ శాఖ సంస్థల సిబ్బంది ఏర్పాటు చేసుకున్న రక్షాపురం కాలనీ గతంలో ప్రశాంతతకు మారు పేరుగా ఉండేది. విశాలమైన రోడ్లు, పార్కు, వసతు తో ఉండే ఆ కాలనీలో ఒకప్పుడు అక్కడ ఇళ్లు దొరకాలంటే గగనంగా ఉండేది. అయితే పాతబస్తీ శివారులలో ఉండడంతోనే ఆ కాలనీవాసులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ కాలనీకి ఒక పక్క హిందువులు అధికంగా ఉండే ఉప్పుగూడ, అరుంధతీ కాలనీలుండగా, మరోవైపు ముస్లింలు అధికంగా ఉండే రియాసత్‌ ‌నగర్‌తో పాటు పలు బస్తీలున్నాయి. దీంతో రక్షాపురం కాలనీలో పాగా వేయాలని చూస్తున్న కొన్ని దుష్టశక్తులు కాలనీలో అశాంతి కలిగేలా ఒక ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్నట్టు స్థానికులు వాపోతున్నారు.

రక్షాపురంలో అశాంతే ధ్యేయం

రక్షాపురం కాలనీని ఆనుకొని ఉన్న రియాసత్‌ ‌నగర్‌ ‌నుండి కొంతమంది పనిగట్టుకొని కాలనీ వాసులతో ఏదో అంశంపై తరచూ ఘర్షణలకు దిగుతున్నారు. దీంతో విద్యావంతులైన కొందరు కాలనీవాసులు తమ పిల్లల భవిష్యత్‌పై ఆలోచనలతో అక్కడి నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించారు. దీన్ని అవకాశంగా తీసుకొని ముస్లింలు ఈ ఇళ్లను కొనుక్కోవడం ప్రారంభిం చడంతో కాలనీలో మెజార్టీగా ఉన్న హిందువుల సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. గతంలో రక్షాపురం కాలనీలో 95 శాతంపైగా ఉండే హిందువులు ఇప్పుడు 40 శాతం లోపలే ఉండడం ఇందుకు నిదర్శనం. ఐదేళ్ల నుండి ఈ వలసలు మరింత ఎక్కువయ్యాయి. మిగిలిన హిందువులు కూడా వెళ్లిపోయేలా చేయాలని కొందరు పనిగట్టుకొని కొంత కాలంగా దుశ్చర్య ఘటనలు కాలనీలో తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

గతంలో రక్షాపురంలో జరిగిన కొన్ని ఘటనలను పరిశీలిస్తే… రక్షాపురం కాలనీలో ఉన్న పార్కులో స్థానికులు వినాయక మండపం ఏర్పాటు చేయడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆ సమీపంలో ముస్లింలు ఇళ్లను కొనుగోలు చేశాక, పార్కులో వినాయక విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరం చెప్పడం మొదలయింది. పోలీసులు విగ్రహాన్ని స్టేషన్‌కు తరలించారు. అప్పటి నుండి అక్కడ మండపం ఏర్పాటు చేయడం లేదని స్థానిక యువకులు చెబుతున్నారు. మరో ఘటనలో కాలనీలోనే మరొక• చోట ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కొందరు పశు మాంసం పడేసి అపవిత్రం చేశారు. ప్రస్తుతం దాడి జరిగిన అమ్మవారి దేవాలయం ద్వారాలను గతంలోనూ ఒకసారి ధ్వంసం చేశారు. రెండు ప్రాంతాల సరిహద్దులో ఉన్న ఈ దేవాల యంపై దాడి చేస్తే సంచలనం అవుతుందని, దీంతో రక్షాపురం కాలనీ వాసులు మరింత భయభ్రాంతులకు గురవుతారనే ఉద్ధేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారు.

మతిస్థిమితం ఒక సాకు మాత్రమే

శ్రావణమాసంలో కృష్ణాష్టమి రోజున జరిగిన ఈ ఘటన వెనుక భారీ కుట్ర ఉంది. దాడి చేసిన వారిని అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు ఒక మతిస్థిమితం లేనివాడని పోలీసులు చెబుతుండడం అనేక సందేహాలకు తావిస్తున్నది. స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం ద్విచక్రవాహనాలపై కొందరు యువకులు దేవాలయం వద్దకు వచ్చారు. వారిలో ఒకడు ద్వారాలు పగులగొట్టి లోపలున్న అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశాడు. ఈ అలికిడితో చుట్టుపక్కలుండే స్థానికులు ఘటనాస్థలా నికి చేరుకునే లోపలే దుండగులు పారిపోయారు. నిందితుడు మతిస్థిమితం లేనివాడే అయితే, అతని వెంట వచ్చిన వారు పిచ్చి వాడు చేస్తున్న పిచ్చి పనులను ఆపకుండా చూస్తూ కూర్చున్నారా? వారెందుకు ప్రోత్సాహించారు? లేకపోతే ఆ గుంపంతా కూడా మతిస్థిమితం లేనిదేనా? ఇది మతిస్థిమితం లేని వాడెవడో చేసిన పనే అయితే పోలీసులు ముగ్గురిని ఎందుకు అరెస్టు చేసినట్టు? వీరందరికీ మతిస్థిమితం లేదా? ఘటనా స్థంలో విగ్రహాలు ధ్వంసం అయిన తీరును చూస్తే దుండ గులు ఏదో పెద్ద బండరాయి లేదా మరో పెద్ద వస్తువుతో దాడి చేశారని అర్ధమవుతుంది. అమ్మవారి తల ముక్కలైనట్టు కనిపిస్తుంది. ఒక పిచ్చివాడు ఒక్కడే విగ్రహ ధ్వంసానికి బరువైన రాయిని లేదా బరువైన వస్తువును లోపలికి మోసుకెళ్లగలిగాడా? విగ్రహాన్నే ధ్వంసం చేసిన మతోన్మాది అమ్మవారి విగ్రహానే లక్ష్యంగా చేసుకున్నాడు. దేవాలయంలో ఉన్న ఇతర వస్తువుల వద్దకు, హుండీ జోలికెళ్లలేదు. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం గతంలో ఇదే ఆలయం ద్వారాన్ని ధ్వంసం చేసింది కూడా ఈ దుష్టుడే. ఇదే నిజమైతే ఒక దుండగుడు ఒక దేవాలయం ధ్వంసమే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడాన్ని మానసికస్థితి సరిగ్గా లేదని అంటారా? మరో విచిత్రం- దుండగులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి పట్టుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొద్ది సేపటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఎంఐఎం కార్పొరేటర్‌ ‌తానే దుండుగులను గుర్తించి పోలీసులకు అప్పగించినట్టు చెప్పుకున్నాడు. ఇదే నిజమైతే పోలీసుల కంటే ముందే కార్పొరేటర్‌ ‌నిందితుడిని ఎలా గుర్తించారో పోలీసులకు, ఆ కార్పొరేటర్‌కే తెలియాలి. ఘటనా స్థం దేవాలయానికి సమీపంలో కార్పొరేటర్‌ ఇల్లు ఉండడంతో కొందరు హిందువులు ఆవేశంగా ఘటనపై ఆయనను ప్రశ్నించడానికి వెళ్తే వారు తనపై దాడికి ప్రయత్నించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఆయన నిజాయితీ బట్టబయలైంది. ఘటనపై పోలీసుల వద్ద నుండి సరైన సమాధానమే రాకపోవడమూ సందేహాలకు తావిచ్చేదే.

హిందువుల మనోభావాలే లక్ష్యంగా దాడి

అమ్మవారి విగ్రహాల ధ్వంసం చేయడానికి ఎంచుకున్న సమయాన్ని పరిశీలిస్తే దురుద్దేశాలు బయటపడుతున్నాయి. శ్రావణం. పవిత్ర సోమ వారం, కష్ణాష్టమి. తెల్లారితే శ్రావణ మంగళవారం అమ్మవారిని మంగళగౌరిగా హిందూ మహిళలు పూజిస్తారు. శ్రావణంలో నిత్యం ఏదో ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొనే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కుట్ర చేశారు. అంతేకాక త్వరలో వినాయక ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. పాతబస్తీలో భాగ్యనగర్‌ ‌గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ ఉత్సవాల సమయంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించాలనేది వీరి మరో కుట్రగా కనిపిస్తున్నది. అంతేకాక రక్షాపురం పార్కులో ఇప్పటికే వినాయక మండపం ఏర్పాటును అడ్డుకున్న వీరికి, కాలనీలోని ఇతర ప్రాంతాలలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే వారిలో కూడా భయం సృష్టించడమే వీరి ధ్యేయం. తెంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా ఈ ధోరణికి ఒక కారణం కావచ్చనే వాదన కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ‘హైడ్రా’ కింద నగరంలోని పలు అక్రమ కట్టడాలను నేలకూల్చుతున్న పరంపరలో ఎంఐఎం నేత ఓవైసీ కుటుంబానికి చెందిన భవనాలు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓవైసీ సోదరులు మాటల యుద్దాన్ని మొదలుపెట్టి ప్రభుత్వాన్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ‘హైడ్రా’ అంశాన్ని మరుగు పరిచేందుకు పాతబస్తీలో అల్లర్లు రేపి పరోక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ కుట్రకు తెరలేపారనే వ్యాఖ్యలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి.

హిందూ వ్యతిరేక శక్తులు ఎన్ని కుట్రల• చేసినా పాతబస్తీలోని హిందువులు ఐక్యంగా, ధైర్యంగా అడ్డుకున్నారు. రక్షాపురంలో ఆలయంపై దాడి జరిగిన నిమిషాల్లోనే స్థానికులతో పాటు వీహెచ్‌పీ, బజరంగ్‌ ‌దళ, బీజేపీ, పలు హిందూ సంఘాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అన్నివైపుల నుండి ఒత్తిడి తీవ్రమవడంతోనే పోలీసులు వెంటనే నిందితులను పట్టుకున్నారు. ఇలాంటివి జరిగిన తర్వాత మేల్కొనే కంటే ముందస్తుగానే కలిసికట్టుగా జాగ్రత్తపడితే హిందువులపై కన్నెత్తడానికే దుష్టశక్తులు జంకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా, సనాతన ధర్మాని పరిరక్షించేలా ఆ పరాశక్తి హిందువులను జాగృతపరిచే విధంగా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుందాం.

-ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE