– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొన్ని వ్యవహారాలలో పొరపాట్లు దొర్లి నిరాశకు లోనవుతారు. శ్రేయోభిలాషుల సలహాల మేరకు ముందుకు సాగడం మంచిది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి.  ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. రాబడి విషయంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత గందరగోళంగా మారవచ్చు. ఉద్యోగస్తులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు కృషి ఫలించదు.  25,26తేదీల్లో శుభవార్తలు. ఆకస్మిక ధనప్రాప్తి.  కుజగ్రహ స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొన్ని ఆస్తి వివాదాలు పరిష్కారమై కొంత లబ్ది చేకూరుతుంది. ఆదాయం సమృద్ధిగా ఉండి అవసరాలు తీరతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను ఎవరి సహాయం లేకుండా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులు ఒక ప్రకటనతో  ఊరట చెందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు మరింత అందుతాయి. ఉద్యోగులకు  ఆశాజనకంగా ఉంటుంది. పారిశ్రామిక, కళాకారులు, పరిశోధకులకు  ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.28,29 తేదీల్లో శారీరక రుగ్మతలు. అనుకోని ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆదాయం ఆశించినరీతిలో ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. సోదరులు, సోదరీలతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఆప్తుల నుంచి వచ్చిన సందేశం ఉత్సాహాన్నిస్తుంది. ప్రఖ్యాతిగాంచిన వారు పరిచయమవుతారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు మరింత అంది ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు అనుకున్న విజయాలు సాధిస్తారు. 23,24 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. గణేశాష్టకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొన్ని కార్యక్రమాలను చక్కదిద్దుతారు. దూరపు బంధువుల ద్వారా శుభవార్తలు అందుతాయి. ఆదాయం గతం కంటే మరింత అనుకూలిస్తుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తుల యత్నాలు సఫలం. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు అంచనాలు నిజం కాగలవు. 27,28 తేదీల్లో ప్రయాణాలలో ఆటంకాలు. శారీరక రుగ్మతలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. బంధువులు, మిత్రుల సహాయసహకారాలు అందుతాయి. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. వివాహయత్నాలు సానుకూలం. ఇంటి నిర్మాణాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారస్తులకు తగినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగులు కొన్ని బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు కాస్త ఊరట లభిస్తుంది. క్రీడాకారులకు అవకాశాలు దక్కవచ్చు. 26,27 తేదీల్లో దుబారా వ్యయం. అనారోగ్యం. ఆదిత్య హృదయం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొత్త వ్యక్తులు పరిచయమై మీకు ఇతోధికంగా సహకరిస్తారు. అనుకున్న రాబడి దక్కి ఉత్సాహంతో  ముందడుగు వేస్తారు. ఆస్తులు సైతం కొనుగోలు చేస్తారు. బంధువర్గం మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు శ్రమిస్తారు.  చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా ముగిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగులు మరింత ఊపిరిపీల్చుకునే సమయం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఈతిబాధలు తొలగుతాయి. 23,24 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దుర్గాస్తుతి మంచిది.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

చెప్పుకోతగ్గ రీతిలో డబ్బు అందుతుంది. కొన్ని సమస్యలు తీరే సమయం. విచిత్రమైన సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఇతరులకు సైతం సహాయం చేయాలన్న తపన పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు నిర్వహించే వారికి మంచి అవకాశాలు, లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగస్తులకు ఒడిదుడుకుల నుంచి విముక్తి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు గతం నుంచి వేధిస్తున్న వివాదాలు తీరతాయి.24,25 తేదీల్లో శారీరక రుగ్మతలు, మానసిక అశాంతి. శివాలయ దర్శనం చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

సమస్యలు అధిగమించి ముందుకు సాగి విజయం  విజయం సాధిస్తారు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది. గతానుభవాలను గుర్తుకు తెచ్చుకుని నిర్ణయాలలో ఆత్మ పరిశీలన చేసుకుంటారు. చిరకాల ప్రత్యర్థులు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న ఆదాయానికి ఢోకా ఉండదు, రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలలో ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. కళాకారులకు ఈవారం కొంత అనుకూలత ఉంటుంది. క్రీడాకారులు, చిత్రకారులకు సంతోషకర సమాచారం అందుతుంది. 25,26 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

అనుకున్న మేరకు డబ్బు అందుతుంది. కొన్ని లక్ష్యాలను సాధించడంలో ముందడుగు వేస్తారు. చిరకాల కోరిక నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు. కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజ సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు అందుతాయి. రాజకీయవేత్తలు, కళాకారుల ప్రయత్నాలు క్రమేపీ ఫలిస్తాయి.  శుభకార్యాల రీత్యా ఖర్చులు రచయితలు, పరిశోధకులకు ఆదరణ పెరుగుతుంది. 28,29 తేదీల్లో బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు. శివాష్టకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరే సమయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొంత మేర పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలు ముమ్మరం చేస్తారు. సమాజంలో మరింత గౌరవమర్యాదలు పొందుతారు. వస్తులాభాలు. వ్యాపారస్తుల యత్నాలు సఫలం. ఉద్యోగస్తులకు విధుల్లో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు సంతోషకరంగా గడుస్తుంది.  23,24 తేదీల్లో దూరప్రయాణాలు. అనారోగ్యం. ధనవ్యయం. దేవీస్తుతి మంచిది.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆదాయం అవసరాలకు తగినంతగా అందుతుంది. మీ శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనావేసిన వారు పరివర్తన చెందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కాస్త వేగవంతం కాగలవు. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు ఎదురవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు కొంత మందగించినా క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు విధుల్లో మార్పులు. రాజకీయ నాయకులు, కళాకారులు గతం కంటే మెరుగైన పరిస్థితులను చూస్తారు. క్రీడాకారులు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 25,26 తేదీల్లో ధననష్టం. కుటుంబంలో చికాకులు. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఎంతటి సమస్య ఎదురైనా అధిగమిస్తారు. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులతో పరిచయాలు.  భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. మీపై బంధువులకు మరింత అభిమానం పెరుగుతుంది. వారసత్వ ఆస్తిలాభ సూచనలున్నాయి.  ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు.   కళాకారులు, వైద్యులకు మరింతగా కలసివచ్చే కాలం. రచయితలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 27,28  తేదీల్లో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. శివస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE