– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వ్యాపారులకు చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు సంభవం. రచయితలు, రాజకీయవేత్తల శ్రమ ఫలిస్తుంది. 21,22 తేదీల్లో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. సుబ్రహ్మణ్యస్తుతి మంచిది.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
అనుకున్న కార్యక్రమాలు కొంతవరకూ పుంజుకుంటాయి. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందు తాయి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు మరింత ఉత్సాహం. 16,17 తేదీల్లో కుటుంబంలో చికాకులు. శ్రమ పెరుగుతుంది. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబసభ్యులతో ఆనందదాయకంగా గడుపుతారు. శుభకార్యాల నిర్వహణపై ఒక అంచనాకు వస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులకు తగినంత లాభాలు. ఉద్యోగులు క్లిష్టసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వైద్యులు, సాంకేతిక నిపుణులకు సరైన గుర్తింపు లభిస్తుంది. 17,18 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ధన వ్యయం. మానసిక అశాంతి. అన్నపూర్ణాష్టకం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసు కుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకం. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు వివాదాల నుండి విముక్తి. వ్యవసాయదారులు, క్రీడాకారులకు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు.18,19తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో కలహాలు. శివాష్టకం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు సమయానికి పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉత్సాహం పెరుగుతుంది. రచయితలు, కళాకారులకు అవకాశాలు అప్రయ త్నంగా లభిస్తాయి. 20,21 తేదీల్లో కుటుంబ సమస్యలు. ఆరోగ్యభంగం. గణేశాష్టకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ఉత్సాహంతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. స్థిరాస్తిపై వివాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు లభిస్తాయి. వైద్యులు, పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు. 17,18 తేదీలలో ప్రయాణాలు, ధనవ్యయం. ఆరోగ్యభంగం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక విషయా లలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులు కోరుకున్న కోర్సులు దక్కించుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. క్రీడాకారులు, రాజకీయవేత్తలకు శుభవర్త మానాలు. 18,19 తేదీ లలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉత్సవాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారు లకు సాంకేతిక నిపుణులు, కళాకారులకు ఆశయాలు నెరవేరతాయి. 19,20 తేదీల్లో వ్యయప్రయాసలు. కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరపు బంధువులతో కీలక విషయాలపై చర్చలు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులు పని ఒత్తిడులతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. రచయితలు, రాజకీయవేత్తలకు ప్రయ త్నాలు ముందుకు సాగవు. 17,18 తేదీల్లో శుభ వార్తలు. కనకధారాస్తోత్రం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు విజయ వంతంగా కొనసాగుతాయి. ఆప్తులు మరింత దగ్గరవు తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు తెలివిగా లావాదేవీలు నిర్వ హిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. వ్యవసాయదారులు, పారిశ్రామిక వేత్తల కృషి ఫలిస్తుంది. 21,22 తేదీల్లో కుటుంబంలో సమస్యలు. మిత్రులతో కలహాలు. . శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, పరపతి పెరుగు తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. క్రీడాకారులు, వైద్యులకు ఆశయాలు నెరవేరతాయి. 16,17 తేదీల్లో బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. విచిత్ర మైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల మవుతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు తగ్గుతాయి. 18,19 తేదీల్లో్య అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు, ప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.