– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగక ఇబ్బందిపడతారు. రాబడి కొంత గందరగోళంగా ఉంటుంది. స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. మీమనస్సు లోని భావాలను కుటుంబసభ్యులతో పంచు కుంటారు. వ్యాపారస్తులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు తప్పవు. కళా కారులకు ఒడిదుడుకులు. 14,15 తేదీల్లో శుభ వార్తలు వింటారు. ధనలబ్ధి. అంగారక స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆస్తుల విషయంలో కొన్ని సమస్యలు నెలకొం టాయి. కొన్ని కార్యక్రమాలు మరింత నెమ్మదిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు కొంతమేర లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మీదపడతాయి. రాజకీయవేత్తలకు కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. కళాకారులు, రచయితలకు ఒత్తిడులు పెరుగుతాయి. 9,10 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. వస్తులాభాలు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆంజనేయ దండకం పఠించండి


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

సోదరులు, సన్నిహితుల నుంచి శుభ వార్తలు వింటారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూముల విషయంలో అగ్రిమెంట్లు కుదురుతాయి. సోదరులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగులకు చిక్కులు తొలగు తాయి. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. కళా కారులు, రచయితల యత్నాలు ఫలిస్తాయి. 12,13 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. శివాష్టకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూవివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు లాభాలు మరింత అందుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయ వేత్తలకు చిక్కులు తొలగుతాయి. క్రీడాకారులు, పరిశోధకుల ఆశలు ఫలిస్తాయి. 10,11 తేదీల్లో బంధు విరోధాలు. వృథా ఖర్చులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడి అవసరాలకు సరిపడక అప్పులు చేస్తారు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు కొంత ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారులకు స్వల్ప లాభాలు. కళాకారులకు ఒత్తిడులు పెరుగు తాయి. 14,15 తేదీల్లో ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. దుర్గాస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొన్ని ముఖ్య కార్యక్రమాలలో జాప్యం. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ పెరుగుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారులకు సాదా సీదాగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో అవాంత రాలు. కళాకారులు, రచయితలకు చికాకులు. 10,11తేదీల్లో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

అదనపు ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్క రించుకుంటారు. సోదరులతో ఉత్సాహంగా గడుపు తారు. దైవకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు సాధిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు కొన్ని మార్పులు సంభవం. 12,13తేదీల్లో శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు అధిగ మిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని స్తాయి. శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగార్థుల యత్నాలు. వ్యాపారులు పుంజుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. 13,14 తేదీల్లో ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. అనుకున్న ఆదాయం సమకూరి అప్పులు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారులు కొత్త భాగస్వాముల సహాయం అందు కుంటారు. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిశోధకులు, క్రీడాకారులకు అంచనాలు ఫలిస్తాయి. 12,13 తేదీల్లో వృథా ఖర్చులు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

బంధువులతో ఆస్తి వివాదాలు నెలకొంటాయి.  దేవాలయాలు సందర్శిస్తారు. శారీరకపరమైన రుగ్మతలు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు కొంత గందరగోళం. ఇంటి నిర్మాణా లలో జాప్యం. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు. కళాకారులకు ఒత్తిడులు తప్పవు. రచయితలు, పరిశోధకులకు పరీక్షాకాలంగా ఉంటుంది. 11,12తేదీల్లో ఊహించని శుభవార్తలు. వాహనసౌఖ్యం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆశించిన ఆదాయం సమకూరుతుంది. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. సమాజ సేవలో భాగస్వాములవు తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. రాజకీయవేత్తలకు మరింత ప్రోత్సాహం. క్రీడాకారులకు ఉత్సాహవంతమైన కాలం. 14,15తేదీల్లో దూర ప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ, వాహనయోగాలు కలుగుతాయి. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు  పెరుగుతాయి. వ్యాపారులకు మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మరింత అనుకూల సమయం. రచయితలు, పరిశోధకులకు అవకాశాలు మరిన్ని దక్కుతాయి. 9,10 తేదీల్లో కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE