– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కొత్త కార్యక్రమాలు చేపడతారు. సమా జంలో మరింత గౌరవమర్యాదలు. చిన్న నాటి స్నేహి తులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. రుణాలు చాలావరకూ తీరుస్తారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు పడవచ్చు. రాజకీయ, పారిశ్రామివర్గాలు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 2,3 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆర్థికంగా మరింత అనుకూలమైన సమయం. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు సంతృప్తి. వ్యాపారులు మరింత లాభాలు దక్కించు కుంటారు. విస్తరణ యత్నాలలో పురోగతి. ఉద్యోగు లకు సంతోషం కలిగించే సమాచారం. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలం. రచయితలు, క్రీడా కారు లకు నూతనోత్సాహం.5,6 తేదీల్లో ఆస్తి వివాదాలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టు బడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రచయితలు, క్రీడాకారులకు ఊరట లభిస్తుంది. 7,8 తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సమాజంలో గౌరవప్రతిష్టలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో కష్ట సుఖాలు విచారిస్తారు. దైవారాధనలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. నిరుద్యోగుల ఆశలుఫలిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కు తాయి. పారిశ్రామిక, కళారంగాల వారు ఊహలు నిజం చేసుకుంటారు. రచయితలకు విశేష గౌరవం. 10,11 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. విష్ణుధ్యానం చేయండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమాజంలో పేరుప్రతిష్ఠలు. పాతబాకీలు వసూలవు తాయి. సన్నిహితుల నుంచి సహాయం ఉద్యోగ ప్రయత్నాలు. వ్యాపారులకు విస్తరణ కార్య క్రమాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు. కళాకారులు, పరి శోధకులకు కాస్త ఊరట. 7,8 తేదీల్లో బంధువులతో వివాదాలు. ఆదిత్య హృదయం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబంలో మీదే పైచేయి. విద్యార్థులకు కాస్త అనుకూల పరి స్థితులు. వాహనాలు, భూముల కొనుగోలులో ఆటం కాలు తొలగుతాయి. వ్యాపారులకు ఆశించిన విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామిక, రచ యితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 2,3 తేదీల్లో మానసిక ఆందోళన. విష్ణుధ్యానం చేయండి
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని వివాదాల పరిష్కారంలో చొరవచూపుతారు. విద్యార్థులు కొంత ఊరట చెందుతారు. ధార్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు కొంత పెరిగినా సమర్థతను చాటుకుంటారు. 6,7 తేదీల్లో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
శ్రేయోభిలాషులు మీకు చేదోడుగా నిలుస్తారు. గృహం, వాహనాల కొనుగోలులో ఆటంకాలు తొలగు తాయి. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందు కుంటారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగు లకు నూతనోత్సాహంతో అడుగు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు కాస్త ఊరట. అనుకోని ఖర్చులు. దేవీఖడ్గమాల పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
అనుకోని విధంగా ఆదాయం మెరుగు పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగులకు పని భారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. రాజకీయ వేత్తలు, కళాకారులకు గందరగోళం కాస్త తొలగు తుంది. 3,4 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో తగాదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి..
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ఉత్సాహంగా చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీకు తోడుగా నిలిచి సహక రిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారులకు విస్తరణ కార్య క్రమాలు అనుకూ లిస్తాయి. ఉద్యోగులకు మరింత ప్రోత్సాహం. రాజకీయ, పారిశ్రామికవర్గాలు, రచయితలు అనుకున్న విజయాలు స్యాధిస్తారు. 4,5 తేదీల్లో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. ఆంజనేయ దండకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. కోర్టు కేసులు పరిష్కార మవుతాయి. వాహనాలు, ఆభరణాల కొనుగోలు యత్నాలు సఫలం. కొత్త పెట్టుబడులు సమకూర తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉండ వచ్చు. రచయితలు, పరిశోధకులకు కొత్త ఆశలు.7,8 తేదీలలో శారీరక రుగ్మతలు, బంధువులతో తగాదాలు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసి వస్తాయి. బంధువులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. 4,5 తేదీల్లో ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. గణేశాష్టకం పఠించండి