కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-2025 వార్షిక బడ్జెట్‌ను సమర్పించినప్పటి వాతావరణం వేరు. అయినా ప్రభుత్వ సుస్థిరతకో, యూపీలో ఉప ఎన్నికల కోసమో, లేదా ఈ ఏడాది జరగనున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో లబ్ధి కోసమో విన్యాసాలు చేయలేదు. పేదలు, రైతులు, యువత, మహిళల అభివృద్ధి, వికసిత భారత్ లక్ష్యంగా రూ. 48.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆర్థికవ్యవస్థలో సమీకృత సమ్మిళిత సమగ్రాభివృద్ధి దిశగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ భారత ఆర్థికవ్యవస్థను ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు పునాదిగా నిలుస్తుందని ఆశించవచ్చు. యువత, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనకరంగా వ్యవసాయ ‘పారిశ్రామిక’ సేవా రంగాలలో ఉత్పాదకత ఉపాధి ‘మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడం అభినందనీయం.
ఆర్థిక వ్యవస్థలో అపార అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా 9 ప్రాధాన్యతాంశాలను కేంద్రం ఎంపిక చేసింది.
- వ్యవసాయరంగంలో ఉత్పాదకత 2. ఉద్యోగ కల్పన, 3. నైపుణ్యాభివృద్ధి 4.సామాజిక న్యాయం 5. పట్టణాభివృద్ధి 6. ఇంధన భద్రత 7. మౌలిక రంగం 8. పరిశోధనలు` ఆవిష్కరణలు 9. తయారీసేవలు, సంస్కరణలు పారిశ్రామిక సేవా రంగాల్లో వృద్ధి, అభివృధి వ్యూహాలతో స్థూల ఆర్థిక వ్యవస్థ మెరుగుపరిచే దిశగా ఆర్థిక క్రమశిక్షణ పెంచడానికి ఉద్దేశించినదిగా ఈ బడ్జెట్‌ను పేర్కొనవచ్చు.
గ్రామీణాభివృద్ధి
గ్రామీణాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో 2.66 లక్షల కోట్లు కేటాయించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన పథకం కింద అదనంగా మూడు కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడిరచారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం కోసం పీఎం గ్రామ సడక్ యోజన నాలుగో దశ పథకం ద్వారా 25 వేల ఆవాసాలు లబ్ధి పొందుతాయి.
వరద నివారణ నీటిపారుదల
రాష్ట్రాల్లో వరద నివారణ నీటిపారుదల ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ. 11,500 కోట్లు ప్రకటించారు. నిర్మాణంలో ఉన్న మరో 20 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిచేయనున్నట్లు చెప్పారు. భారీ వర్షాలతో సతమత మవుతున్న హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల్లో పునర్నిర్మాణ పునరావాస కార్యక్రమాలకు సహాయం చేయనున్నట్టు వెల్లడిరచారు.
సోలార్ సౌర విద్యుత్తు
పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్స హించడం మీద కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయిం చింది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునేవారికి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. అణువిద్యుత్తులో తొలిసారి ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానం పలి కింది.
ఫార్మా రంగం నూతన ఆవిష్కరణలు
ఫార్మా రంగంలో నూతన ఆవిష్కరణల ప్రోత్సాహం, అధ్యాపకులకు శిక్షణ, డిజిటల్ విద్యా విధానం, జాతీయ లైబ్రరీ ఏర్పాటు, మానవ వనరుల అభివృద్ధికి దోహదపడే చర్యలుగా పేర్కోవచ్చు.
వ్యవసాయ రంగం, సహకార రంగానికి ప్రాధాన్యత
వ్యవసాయ ఆధారిత ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి ప్రవేశపెట్టిన వ్యవసాయాభివృద్ధి నిధి వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ఔత్సాహిక యువతను వ్యవసాయ స్టార్టప్‌ల ఏర్పాటుకు సహకార వ్యవసాయాభివృద్ధి నిధి గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.
గ్రామీణ భూములకు భూఆధార్ భూసంస్కరణ లలో భాగంగా గ్రామీణ భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య భూ ఆధార్ కేటాయించాలనీ, పట్టణ ప్రాంతాల్లో భూముల రికార్డులు డిజిటీలీకరణ చేయాలని పేర్కొన్నారు. మూడేళ్లలో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయడానికి రాష్ట్రాలకు ఆర్థ్దిక తోడ్పాటు ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో భూ పరిపాలన, ప్రణాళిక నిర్మాణం పట్టణ ప్రాంతాల అర్బన్ ప్లానింగ్ ఉపచట్టాల రూపకల్ప బాధ్యతరాష్ట్ర ప్రభుత్వాలదే. భూసంస్కరణలు వేగవంతం చేయడానికి రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాల్లో గణనీయమైన మొత్తాన్ని కేటాయించాలని ప్రతిపాదించారు.
సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం
సాంకేతిక నైపుణ్యంతో కూడిన సేంద్రియ వ్యవసాయం విధానానికి కూడా బడ్జెట్ ప్రోత్సాహం కల్పించింది. వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపన కిసాన్ డ్రోన్స్ ఏర్పాటు రైతులకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో డిజిటల్ హైటెక్ సేవలను అందించడం, సస్యరక్షణ, పిచికారి ‘సేవలు’ భూదస్త్రాల డిజటీలీకరణ గ్రామీణ వ్యవసాయ ఆర్థికవ్యవస్థ అభివృధికి దిక్సూచిగా ఆక్సిలరేటర్ ఇరిగేషన్ ప్రోగ్రాం ఇతర పథకాల కింద రూ.11500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తారు.
మహిళా సాధికారికతకు పెద్దపీట వేసింది బడ్జెట్. మహిళ పేరిట ఆస్తులకు స్టాంప్ డ్యూటీ తగ్గించారు. మహిళా సాధికారితను ప్రోత్సహించేందుకు వీలుగా వారి పేర్ల మీద రిజిస్టర్ అయ్యే ఆస్తుల మీద స్టాంప్ డ్యూటీ తగ్గించారు. ప్రధానమంత్రి గ్రామీణ యోజన నాలుగో దశ కింద 25వేల గ్రామీణ ఆవాస ప్రాంతాలకు రహదారి అనుసంధానం కల్పించాలని సంకల్పించారు.
‘యువత సాధికారిత’
వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమంది యువతకు నైపుణ్యాల శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పించే పథకాల అమలు. మహిళా సాధికారికతకు ప్రాధా న్యత నిస్తూ మహిళలు బాలికలను ప్రోత్సహిం చేందుకు 2024`25 బడ్జెట్లో వివిధ మంత్రిత్వశాఖల ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ. 26,092 కోట్లు కేటాయిం చారు.
మహిళా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వర్కింగ్ మెన్స్ కోసం ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. ‘బేటీ బచావో బేటి పడావో’ మహిళల భద్రతకు సంబంధించి ఈ బడ్జెట్‌లో రూ.3145 కోట్లు కేటాయించారు. శిశు మహిళాభి వృద్ధికి సంబంధించిన పరిశోధన శిక్షణ కార్యక్రమాలు చేపట్టే ఎన్. ఐ.పి.సి.డి.కి రూ. 88.87 కోట్లు కేటాయించారు. నిర్భయ నిధికి రూ.500 కోట్లు కేటాయించారు.
ఇది మహిళా సాధికారత యువత సాధికారిత సాంఘిక సంక్షేమం అన్ని రంగాలలో పౌరులకు అవకాశాల కల్పన, ఉద్యోగాల కల్పన, నైపుణ్యం మెరుగు పరిచే దిశగా అడుగులు వేసిన బడ్జెట్ అని చెప్పవచ్చు. యువతలో ఉన్న సామర్ధ్యాన్ని వెలికితీయ డానికి, ప్రపంచ స్థాయిలో ప్రతిభా పాటవాల వికాసానికి బడ్జెట్ చేయూతనిస్తుంది. మహిళలకు వృద్ధులకు మేలు చేసే పథకాలు ప్రకటించారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం కింద ప్రస్తుతం వున్న 15 లక్షల రూపాయల పరిమితిని 30 లక్షల వరకు పెంచారు.
ఆదాయపు పన్ను
కొత్త పన్నులో నూతన విధానానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. ప్రస్తుత నిబంధన ప్రకారం రూ.7 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను ఉండదు. ఉద్యోగులకు 50 వేల వరకు ప్రామాణిక తగ్గింపు వర్తిస్తుంది. ప్రస్తుతం వున్న 6ఆదాయపు పన్ను స్లాబులను 5 స్లాబులకు తగ్గించారు ఆదాయ, పన్ను పరిమితి 7లక్షల నుండి 10 లక్షల వరకు పెంచారు. గతంలో 10 శాతం పన్ను చెల్లించేది దాన్ని బడ్జెట్లో ఎత్తివేశారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి
ప్రభుత్వం 2024`25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.11, 11, 111 కోట్ల మూలధన వ్యయంగా నిర్ణయించారు. మౌలిక వసతుల్లో ప్రైవేట్ పెట్టుబడులను పెంచే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రాబోయే ఐదు సంవత్సరాలు కాలంలో మౌలిక వసతులకు బలమైన ఆర్థిక మద్దతు సాధించడానికి మార్కెట్ ఆధారిత సహాయ విధానాన్ని రూపొందించనున్నట్లు వెల్లడిరచారు. రైల్వేల అభివృద్ధికి, కొత్త రైల్వేల నిర్మాణానికి మౌలిక వసతుల అభివృధికి అధికంగా నిధుల కేటాయింపు, ఏర్ కనెక్టివిటీ, కొత్త ఏర్ పోర్టులు ఏర్పాటు, రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు పథకం 13 పీఎం ఆవాస యోజనకు పెద్ద ఎత్తున కేటాయించడం వల్ల ఆర్థికవ్యవస్థలో ఉత్పాదక ఆస్తుల కల్పనకు ఊతం ఇస్తుంది. బడ్జెట్ సుస్థిర సమ్మిళిత అభివృధికై స్థిరమైన స్థూల ఆర్ధిక వాతావరణం సృష్టించి శీఘ్రతర ఆర్థికాభివృదితో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉత్పాదకత ఉపాధి ఆదాయ స్రుష్టికి దోహద పడుతుంది.
చేతివృత్తులకు ప్రోత్సాహం
పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజీలో భాగంగా సంప్రదాయ చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తుల నాణ్యత పెంచుకునే విధంగా చర్యలు చేపట్టడం ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటి పథకం బడ్జెట్‌లో ఉంది.
సూక్ష్మ చిన్న మధ్య సాయి సంస్థల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ స్కీం ద్వారా ఎం ‘ఎస్,ఎం’ సంస్థలు యంత్రాలు, పరికరాలు కొనుగోలు కోసం ఎలాంటి తనఖా లేదా థర్డ్ పార్టీ గ్యారంటి అవసరం లేకుండా టర్మ్ లోన్ తీసుకునే అవకాశం కల్పించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల వ్యాపార అభివృద్ధి అంతర్జాతీయంగా పోటీ పడేట్లు చర్యలు చేపట్టను న్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ ఫైనాన్స్ ఫండ్ ప్రతి దరఖాస్తుదారుకు తీసుకునే రుణ విలువలో రూ. 100 కోట్ల వరకు ప్రభుత్వం గారంటీ కల్పిస్తుంది. ఈ చర్య సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రగతికి దోహదపడుతుంది.
స్వదేశీ ఉత్పత్తులు
మేకిన్ ఇండియా దేశంలో 14 రంగాలకు ఉత్పాదకతతో ముడివడిన ఆర్థిక ప్రోత్సాహకాల ద్వార 60లక్షల శాశ్వత ఉద్యోగాల కల్పన స్వదేశీ ఉత్పత్తులకు ఊతంగా నిలిచింది బడ్జెట్.
రహదారులు పట్టణాభివృద్ధి
14 పెద్ద నగరాలకు పట్టణాలకు ప్రతేక రవాణా అభివృధ్దికి అభివృద్ధిని నూతన పట్టణ ప్రణాళిక నిర్మాణ రంగంలో వికసిత్ భారత్‌లో భాగంగా 2024-25 బడ్జెట్లో పట్టణాభివృద్ధికి ప్రాధాన్యత దక్కింది. గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 82,576.57 కోట్లు కేటాయిం చారు. అది 2023`24 నాటి సవరించిన అంచనాల కన్న ఎక్కువ.
అల్పాదాయ వెనుకబడిన వర్గాల కోసం రూ. 3000 కోట్లు కేటాయించారు. దీని వల్ల సొంతింటి కల నిజమపుతుంది. మురికివాడల పునరావాసం, అభివృద్ధి కార్యక్రమానికి తగిన ప్రాధాన్యం దక్కలేదు. అక్కడ నివసించే ప్రజలకు తన భూమికి సంబంధించిన హక్కు పత్రాలు ఉండవు. అందువల్ల వారందరూ పీఎంఏవైకు (యూ) దూరమవుతున్నారు. ఫలితంగా పట్టణ పేదలతో పోలిస్తే ఈ పథకంతో మధ్య అధికాదాయ వర్గాలకే ప్రయోజనం కలుగుతుంది. ఈ క్రమంలో జిఐఎస్ మ్యాపింగ్ ద్వారా భూమి రికార్డులను డిజిటలీకరణ ప్రక్రియ సరిగ్గా అమలు చేయాలి.
బడ్జెట్లో పారిశ్రామిక కార్మికుల వసతి కోసం అద్దె ఇల్లుకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో చేసిన ప్రతిపాదన స్వాగతించదగ్గ చర్య. స్మార్ట్ సిటీస్ మిషన్‌కు 2023-24 సవరించిన అంచనాల్లో రూ. 8000 కోట్లు కేటాయించగా 2024-25 బడ్జెట్లో అవి రూ. 2400 కోట్లకు పరిమితమైనాయి. అమృత్ పథకం కింద 500 నగరాల కోసం రూ. 8వేల కోట్లు ప్రతిపాదించారు. ఇది గతం కన్నా 54 శాతం ఎక్కువ. స్వచ్ఛభారత్ మిషన్ పథకానికి రూ. 5వేల కోట్లు కేటాయించారు.
బడ్జెట్లో నదుల అనుసంధానం
బాల కార్మిక వ్యవస్థ, నిర్మూలన లింగ వివక్ష, కనీస వేతనాలు ప్రస్తావన లేదు బడ్జెట్‌లో లేదు. పట్టణ పేదల జీవనోపాధికి తగిన కేటాయింపులు లేవు. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ కార్యక్ర మానికి కేటాయింపులు తగ్గాయి. ప్రధానమంత్రి వీధి వ్యాపారులు ఆత్మ నిర్భర నిధి పథకం కేటాయింపుల్లో కోత పడిరది. ఎంపిక చేసిన నగరాల్లో 100 వార సంతలు ద్వారా పెద్ద సంఖ్యలో ఉన్న వీధి వ్యాపారుల పట్టణ సంఘటిత కార్మికుల జీవనోపాధి సమస్యను తీర్చడం కష్టమే. 30 లక్షల జనాభా దాటిన 14 పెద్ద నగరాల్లో ప్రయాణ ఆధారిత అభివృద్ధి ప్రణాళికలపై బడ్జెట్ పెట్టింది. ఇందుకోసం పిఎంఈ బస్సు సేవా పథకం కోసం తాజా పద్దులో రూ.1300 కోట్లు కేటాయించడంతో సిటీ బస్సు సేవలు విస్తరిస్తాయి. ప్రజల ప్రయాణ సౌకర్యాలు మెరుగు పడతాయి.
రాష్ట్రాల ప్రగతికి వడ్డీ లేని రుణం
రాష్ట్రాలకు చేయూత నిచ్చే విధంగా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధికి కేంద్రం ఎలాంటి వడ్డీ లేకుండా రూ. 1.5 లక్షల కోట్ల దీర్ఘకాలిక రుణ సదుపాయం కల్పిస్తుంది. రాబోయే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలు అభివృధి పరుస్తామని బడ్జెట్లో పేర్కొనడం గమనార్హం. రహదారి ప్రాజెక్టులకు మరో 26 వేల కోట్లతో అభివృద్ధి చేస్తారు.
విద్య వైద్య రంగాలకు పెద్దపీట
బడ్జెట్‌లో విద్యా రంగానికి గత బడ్జెట్‌తో పోలిస్తే రూ. 9 వేల కోట్లు తగ్గించారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు బడ్జెట్లో రూ .1300 కోట్ల నుండి రూ. 1800 కోట్లకు పెంచారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 28 శాతం పెంచారు. గత సంవత్సరం 12,000.08 కోట్లు ఇవ్వగా ఈసారి 15,472 కోట్లు నిధులు పెరిగాయి. కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు ఎన్సీఈఆర్టీ పీఎం శ్రీ పాఠశాలకు బడ్జెట్ పెరిగింది.
స్వదేశీ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యకు రూ. 10 లక్షల రుణం ఏటా లక్షమంది విద్యార్థులకు వడ్డీలో 3 శాతం రాయితీ ఇస్తారు. పేద వర్గాల విద్యాభివృద్ధికి దోహదపడే చర్య. గిరిజనుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ ప్రతేక పథకాన్ని ప్రవేశపెట్టి 63 వేల గిరిజన గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజనులకు లబ్ధి చేకూర్చబోతున్నారు.
ఏకలవ్య గురుకులాల ఏర్పాటు గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి మారుమూల ప్రాంతాలలో ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు రూ.6339 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యను అభ్యసించే ఎస్టీ విద్యార్థులకు నేషనల్ ఫెలోషిప్ స్కాలర్షిప్ కు రూ. 165 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీ సంక్షేమానికి రూ. 6611. 69 కోట్లు కేటాయించారు.
ఆరోగ్యరంగం
ఆరోగ్యరంగానికి 90.958 కోట్లు కేటాయిం చారు. ఇది గత ఏడాది కంటే 12.96% ఎక్కువ. మూడు రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ ప్రకటించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ. 3712.49 కోట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు రూ. 3.301 కోట్లు, ఆరోగ్య పరిశోధన శాఖకు రూ. 73 కోట్లు కేటాయించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.36 కోట్లు, పీఎంజేఏవైకి రూ. 7300 కోట్లు కటాయించారు.
ప్రాథమిక పరిశోధనలు ప్రత్యేక నిధి
యూనివర్సిటీలలో, కాలేజీల్లో లేబరేటరీల్లో ప్రాథమిక పరిశోధనల అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ‘అనుసంధాన్ జాతీయ పరిశోధన నిధిని’ ఏర్పాటు చేయడం అభినందనీయం.
అంతరిక్ష రంగానికి నిధుల పెంపు
అంతరిక్ష రోదసి పరిజ్ఞానాభివృద్ధికి, ఊతం ఇవ్వడానికి రూ.1000 కోట్లతో ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించి బడ్జెట్లో 18% నిధులు పెంచారు.
డిజిటల్ యూనివర్సిటీ సాకారం
ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్య అందించడం కోసం ఏర్పాటైన డిజిటల్ విశ్వవిద్యాలయం తాజా బడ్జెట్లో కేంద్రం రూ. 100 కోట్లు కేటాయించింది. ఈ విద్యా సంవత్సరంలో ఎస్డియూ అందుబాటులోకి రానుందని స్పష్టం చేసింది
నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు
పంచాయతీలు, వార్డ్ స్థాయిలో లైబ్రరీలు ఏర్పాటు చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహించడం వలన మానవ వనరుల వికాసానికి విజ్ఞాన వికాసానికి దోహదం పడుతుంది. వ్యవసాయ రంగం ఉత్పాదకత పెంచే లక్ష్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్లో రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించి రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల అభివృద్ధికి వ్యవ సాయ పరిశోధనలు ప్రోత్సహించడం, కూరగాయల సాగుకు భారీ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం, కూరగాయల సేకరణ, ‘నిల్వ, మార్కెటింగ్ సరఫరా, వ్యవస్థల ఏర్పాటుకు స్టార్టప్‌లు, సహకార సంఘాలు, రైతు సంఘాలను ప్రోత్సహించడానికి బడ్జెట్ అవకాశం కల్పించింది.
వాతావరణ మార్పులను తట్టుకునేలా 32 వ్యవసాయ ఉద్యాన కేటగిరిలకు 109 రకాల నూతన అధిక దిగుబడి వంగడాలను ప్రోత్సహిం చడం, పప్పుధాన్యాల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, ఆవాలు, వేరుశనగ, నువ్వులు, సోయబీన్, పొద్దుతిరుగుడు లాంటి నూనె ఉత్పత్తికి కూడా బడ్జెట్ చేయూతనిస్తున్నది. దేశవ్యాప్తంగా 400 జిలాల్లో డిజిటల్ పంటల సర్వేలు నిర్వహించడానికి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి.
బిందు సేద్యం ఆపరేషన్ గ్రీన్ పథకం కోసం నిధులు నిరాశ
బడ్జెట్లోపంటలకు సాగునీటి పొదుపుసూక్ష్మ సేద్యం పథకానికి బిందు తుంపర్ల పరికరాలపై రైతులకు రాయితీలు లేవు. జాతీయ ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెట్ (ఈనామ్) 1000 కొత్త మార్కెట్లను ఆన్‌లైన్ వేదికలోకి తీసుకు వచ్చే దిశగాచర్యలు లేకపోవడం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ దారుల ఉత్పత్తులకు మద్దతు ధరలు లభించని స్థితి రైతాంగాన్ని నిరాశకు గురిచేసేదే. దీర్ఘకాలిక దృష్టితో రూపొందించిన బడ్జెట్ వికసిత భారతానికి బాట వేస్తూ భారత్‌ను అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించి, ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దడానికి కావలసిన ఏర్పాట్లను బడ్జెట్ చేసింది. అందుకు అవసరమైన ఉపాధి, ఉద్యోగ, మౌలిక వసతులు, నైపుణ్యం, పారిశ్రామికీకరణ లాంటి ప్రధాన అంశాలకు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించి విశ్వగురు స్థాయికి ఈ బడ్జెడ్ చేర్చుతుందని ఆశిద్దాం.
– నేదునూరి కనకయ్య
అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం,
హైదరాబాద్, 9440245771