– డి. అరుణ

పొరుగున ఉన్న బాంగ్లాదేశ్‌ పరిణామాలు  సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మతాలవారికీ సిద్ధాంతాల వారికీ ‘హిందూ ధర్మం, హిందువులే’ లక్ష్యమని మళ్లీ రుజువైంది. ఈ నేపథ్యంలో హిందూ ప్రయోజనాల రక్షణే ధ్యేయంగా పని చేస్తున్న విశ్వహిందూ పరిషత్‌ భుజ స్కంధాలపై భారం మరింత పెరిగింది. కేవలం ఇస్లాం, క్రైస్తవమే కాదు, కమ్యూనిజం కూడా హిందువులకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్నది. వీరందరి లక్ష్యం ఒక్కటే – హిందూ అస్తిత్వాన్ని నేలరాయడం. అందుకు, కుల విభజన, లవ్‌జిహాద్‌, మతాంతరీకరణ సహా పలు ఆయుధాలను హిందూ సమాజానికి వ్యతిరేకంగా ప్రయోగించి, ఆ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే యత్నం చేస్తున్నారు. నిన్నటి వరకూ కశ్మీర్‌లో హిందువులపై అత్యాచారాలు నిజం కాదన్నారు.  నేడు  బాంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు సంబంధించి సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్న వీడియోలు, ఫోటోలు కల్పనలే అంటున్నారు. ఇలా వాదించడం కేవలం నిర్లజ్జతే కాదు, కుట్రలో భాగం. హిందువులపై ఎటువంటి దాడి జరిగినా, దానిపై ముసుగువేసి ఏమీ జరుగలేద నేందుకే వారు ప్రయత్నం చేయడానికి వెనుక ఉన్న కారణాలు ఇస్లాం, క్రైస్తవం పట్ల సానుభూతి, వామపక్ష భావజాలం.

1960ల్లో ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో నుంచి భారత పర్యటనకు వచ్చిన భారత సంతతి ఎంపీ డా॥ శంభునాథ్‌ కపిల్‌దేవ్‌ నాటి ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ గురూజీ (గోల్వాల్కర్‌)ని కలిసి తమ దేశంలో మట్టిలో కలిసిపోతున్న హిందూధర్మం, జీవనశైలి, విలువల గురించి, వాటిని కాపాడవలసిన ఆవశ్యకతను గురించి ఆందోళన వ్యక్తం చేసినప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను ఐక్యం చేసేందుకు, హిందూ ధర్మాన్ని, విలువలను కాపాడేందుకు ఈ అంతర్జాతీయ సంస్థ స్థాపనకు బీజాలు పడ్డాయి. ఆగస్టు 29,1964 కృష్ణాష్టమి రోజున ముంబైలో పలువురు ధర్మాచార్యులు, సంఘ పెద్దల ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషద్‌ ఆవిర్భవించింది. ‘హిందవ సోదర సర్వే, న హిందూ పతితో భవేత్‌’ (హిందు వులందరూ సోదరులే, ఏ హిందువూ పతితుడు కాడు) అన్న నినాదాలతో ఆరుదశాబ్దాలుగా దేశ, విదేశాలలో ఉన్న హిందువులలో తమ ధర్మం పట్ల అవగాహనను, హిందూ అస్తిత్వంపట్ల  చైతన్యం కలిగించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తున్నది. అంతేకాదు విశ్వ హిందూ సమాజం గర్వపడేలా పరిషత్‌ చేస్తున్న కృషి నిరుపమానమైనది. అమెరికా సహా ప్రపంచంలోని 29 దేశాలలో విశ్వహిందూ పరిషత్‌ తన ఉనికిని కలిగి ఉండడమే కాదు, క్రియాశీలకంగా పని చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను ఏకం చేసేందుకు ప్రపంచ సదస్సులను నిర్వ హిస్తోంది. సనాతన ధర్మంపట్ల అవగాహన, హిందువుల ప్రయోజనాలు, సంస్కృతి, వారసత్వాల పరిరక్షణ కోసమే కాదు, దేశ సంస్కృతి, సమగ్రత, ఏకీభావాన్ని కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విశ్వహిందూ పరిషత్‌ ఈ ఏడాది 60వ సంవత్సరంలోకి అడుగిడుతోంది.

అస్పృశ్యతకు వ్యతిరేకంగా..

హిందూ ధర్మంలోని కుల వ్యవస్థ శాశ్వతమైనది కాదు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ప్రాచీన సమాజంలో కులమనేది, గుణ, కర్మ విభాజితంగానే ఉం డేది. కానీ, మధ్యకాలంలో జరిగిన దాడుల నేపథ్యంలో సమాజంలో ఏర్పడిన సామాజిక సంక్షోభంతో ఇది జన్మతః వచ్చేదనే భావన ఏర్పడి, అదే కొనసాగుతోంది. దాని నుంచి పుట్టినదే అస్పృశ్యత అనే దురాచారం. ఈ విషయాన్ని గుర్తించింది కనుకనే, 1970లో జరిగిన పరిషత్‌ సమావేశంలో అస్పృశ్యత నిర్మూలనకు ఎస్‌ఎస్‌ ఆప్టే (దాదాసాహెబ్‌ ఆప్టే) పిలుపిచ్చారు. ఇది సామాజిక దురాచారమని, దానిని నిర్మూలించాలని కోరారు. మన దేశంలోని ధర్మాచార్యులు, సన్యాసులు వివక్షతో కూడిన కుల వ్యవస్థను నిరాకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిని తుచ తప్పకుండా వీహెచ్‌పీ ఆచరిస్తున్నది. తాము అన్న మాటలు గాలిమూటలు కాదని నిరూపించేందుకు, దళితుడైన రామేశ్వర్‌ చౌపల్‌ చేతనే అయోధ్యలో రామమందిర శిలాన్యాస సందర్భంలో పునాది రాయి వేయించారు.

వీహెచ్‌పీ చొరవతోనే ఆలయాలలో అన్ని కులాల వారినీ పూజాదికాలు నిర్వహించేందుకు పూజారులుగా, ట్రస్టీలుగా నియమించడంలో కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా, ఇందుకోసం 5000 మంది దళితులకు పూజాదికాల నిర్వహణ వంటి విధులలో శిక్షణనిచ్చి, ఆలయాలలో నియమించడంలో విశ్వ హిందూ పరిషత్‌ క్రియాశీలకంగా పనిచేసింది. వీరిలో 2500మంది తమిళ నాడు సహా దక్షిణాది రాష్ట్రాలలో పూజారులుగా నియమితులయ్యారు. కృత్రిమంగా హిందూ సమాజంలో సృష్టించిన ఈ వివక్షను రూపుమాపేందుకు పరిషత్‌ తాను చేస్తున్న కృషిని మాటలతో కాదు చేతలతో చూపుతోంది.

ఈశాన్య రాష్ట్రాలలో…

 నేడు ఈశాన్య రాష్ట్రాలలో హిందుత్వం మనకు కనిపిస్తోందంటే, దానిని కాపాడడం కోసం ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ కార్యకర్తలు చేసిన త్యాగాలే కారణం అన్నది నిర్వివాదం. బ్రిటిషువారు తమ విభజించి పాలించు విధానంలో భాగంగా, కొండ ప్రాంతాలలో ఉంటున్న వారిని గిరిజనులుగా, హిందూ సమాజం చేత నిర్లక్ష్యానికి గురైనవారిగా చిత్రీకరిస్తూ వారినీ మతాంతరీకరించేందుకు ఫాదరీలను పంపి, కొంతమేరకు విజయవంతం అయ్యారు కూడా. కానీ, వారిలో  నిద్రాణంగా ఉన్న హిందూ భావనలను తిరిగి జాగృతం చేసి, హిందూ జీవన విధానాన్ని అవలంబించేందుకు సంఫ్‌ు, పరిషత్‌ చేసిన కృషి చారిత్రకమైనదంటే అతిశయోక్తి కాదు. నేడు మణిపూర్‌లో మండుతున్న మంటలను చల్లార్చడంలో, బాధితులకు అండగా నిలువడంలో వీహెచ్‌పీ, అనుబంధ సంస్థలు ముందున్నాయి.

హిందూ చైతన్యం కోసం…

హిందువులను జాగృతం చేసేందుకు గంగా యాత్ర, ఏకాత్మతా యాత్రలను నిర్వహించగా, తమిళనాడులో మీనాక్షీపురంలో విచక్షణారహితంగా జరిగిన మతాంతరీకరణలను అడ్డుకునేందుకు ఉద్యమాన్ని పరిషత్‌ చేపట్టింది. శ్రీ రామ జన్మభూమి, శ్రీ అమర్‌నాథ్‌ యాత్ర, శ్రీ రామసేతు, హిందూ మఠ్‌ `మందిర్‌, ఇస్లామిక్‌ తీవ్రవాదం, ముస్లిం చొరబాట్లు సహా భిన్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడం ద్వారా విహెచ్‌పి హిందూ సమాజంలో దాని మూల విలువలను, పవిత్ర సంప్రదాయాలను సంరక్షించడంలో తిరుగులేని శక్తిగా రుజువు చేసుకుంటోంది.

నేటి అవసరం వీహెచ్‌పీ

గోహత్యలు, మతాంతరీకరణలు, లవ్‌జిహాద్‌, భూమి జిహాద్‌, హలాల్‌ ఆహార పదార్ధాలు, ప్రభుత్వ గుప్పిట్లో ఆలయాలు, ఆలయాల పరిరక్షణ ` ఒక్కటేమిటి పలు సమస్యలు నేడు భారత్‌ను పట్టి పీడిస్తున్నాయి. ఇటీవలి కాలంలో తమిళనాడు లోని తిరుచందురై గ్రామాన్ని వక్ఫ్‌ ఆస్తిగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఆ గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యుని ఆలయం ఇస్లాం మతం పుట్టకముందే నిర్మించింది. కానీ, ఈ విషయాన్ని మీడియాలో  సంచలనాత్మకంగా చూపేవారు కానీ, సమాజంలో చర్చించి, ఉద్యమించేవారు కానీ లేరు. ఇటువంటి నేపథ్యంలో వీహెచ్‌పీ వంటి సంస్థలు లేకుంటే, మధ్యప్రదేశ్‌లోని హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహించి అన్నట్టుగా ఒక్కొక్కటిగా కాక మొత్తం దేశాన్నే ఇస్లామిస్టులు వక్ఫ్‌ ఆస్తిగా ప్రకటించుకునే అవకాశం ఉంది.

మతాంతరీకరణల విషయంలో అయితే, అనేక రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులు కూడా ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. రaార్ఖండ్‌ వంటి రాష్ట్రంలో పొరుగు దేశాల నుంచి అక్రమంగా చొరబడిన ఇస్లామిస్టులు, అక్కడి అమాయక గిరిజన బాలికలను వివాహం చేసుకొని, ఏకకాలంలోనే లవ్‌ జిహాద్‌, భూమి జిహాద్‌కు పాల్పడుతున్న వైనాన్ని చూసి రaార్ఖండ్‌ హైకోర్టు కూడా విస్తుపోయింది. అలాగే ఉత్తరప్రదేశ్‌ హైకోర్టు కూడా క్రైస్తవ మిషనరీలు నిరుపేద గ్రామీణులను రకరకాల ఆశలు పెట్టి మతాంతరీకరించడాన్ని ఖండిరచి, ఆ పని చేస్తున్న వారి ని దోషులుగా శిక్షించిన వైనాన్ని మనం చూశాం. ఇటువంటి చోట్ల పరిషద్‌ మరింత కార్యోన్ముఖం అవుతోంది.

నిన్న కాక మొన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో కన్వర్‌ యాత్ర సందర్భంగా హోటళ్లు, బడులు నడిపేవారు తమ పేర్లను బహిరంగంగా ప్రదర్శించాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించినప్పుడు, దేశంలో అత్యంత హంగామా జరిగింది, అత్యున్నత న్యాయస్థానం కూడా దానిని వ్యతిరేకించింది. ఇటువంటి సందర్భాలలో, వీహెచ్‌పీ ఎక్కడ ఉందని వెతుక్కునే పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే ముందుకు వచ్చి, హిందువులకు తమ విశ్వాసాన్ని కాపాడుకునే హక్కు ఉందంటూ విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి డా॥ సురేంద్ర జైన్‌ స్పష్టం చేయడం గమనార్హం.

దక్షిణాదిలో కూడా క్రైస్తవ మతాంతరీకరణ, ఇస్లామీకరణ చాపకింద నీరు లాగా వేగంగా విస్తరిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో క్రైస్తవ మిషనరీలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనాభాను క్రైస్తవంలోకి మతాంతరీకరించారు. ఈ ఫాదరీలకు రాజకీయ అండదండలు ఉండడం ఒక విషాదం. వారిని తిరిగి ఘర్‌ వాప్సీ చేయించేందుకు పరిషత్‌ మరింత క్రియాశీలకంగా పని చేస్తోంది.

మతాంతరీకరణలకు వ్యతిరేకంగా బిల్లు

ఇస్లామిస్టులు తమ జనాభాను పెంచుకునేందుకే ఈ పని చేస్తున్నారన్నది నిర్వివాదం. పైగా, వారి మతంలో ఈ భూమి అంతా అల్లాదే, కనుక వేగంగా అందరినీ ముస్లింలను చేయాలన్న తపనలో వారుంటారు. ఈ క్రమంలో అందరినీ  అమాయకంగా నమ్మి, చేతులు సాచి ఆహ్వానించే సంప్రదాయం ఉన్న హిందువులను బుట్టలో పడేయడం తేలిక. అందులోనూ, ఇంకా అభివృద్ధి అందని మారు మూల గ్రామాలు, ఆ ప్రాంతాలలో అమాయక ప్రజానీకపు ఆర్ధిక దుస్థితిని ఆసరాగా చేసుకొని వారి మతం మార్చేసి, హిందూ జనాభాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే హిందువుల జనాభా 7.81 శాతం క్షీణించగా, ఇస్లామిస్టుల శాతం దాదాపు రెండిరతలు కావడం ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వాలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా మతాంతరీకరణ వ్యతిరేక బిల్లును తేవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో వీహెచ్‌పీ వైఖరి అత్యంత స్పష్టంగా ఉన్నది.

ఉత్తర ప్రదేశ్‌లో మతాంతరీకరణలకు వ్యతిరే కంగా జారీ చేసిన బిల్లును వీహెచ్‌పీ సమర్ధించింది. మాయ మాటలు చెప్పి, లవ్‌ జిహాద్‌ అనే ఆయుధంతో బలవంతపు మతాంతరీకరణలను చేయడాన్ని ఈ బిల్లు నిరోధిస్తోంది. నిజానికి, కేరళ హైకోర్టు పెట్టిన పేరైన ‘లవ్‌ జిహాద్‌’ అన్నది చాలా విస్తృతమైన అంశం. హిందువుల ఆడపిల్లలతో తాము హిందువు లమని ఇస్లామిస్టు యువకులు పరిచయం చేసుకొని, వారిని వివాహం చేసుకున్న తర్వాత వారిని మతం మారమంటూ బలవంతం చేయడం లేదా హత్య చేయడం అత్యంత దారుణ చర్యలు. ఈ వైఖరిని కేవలం కోర్టులు, పోలీసులు మాత్రమే నిలువరించ లేరు. సమాజానికి కీలక యూనిట్లు అయిన కుటుంబాలు తమ హిందూ అస్తిత్వం పట్ల చైతన్యంతో ఉండి, తమ పిల్లలకు చిన్నతనం నుంచే ఆ విలువ లను అలవరించినప్పుడు మాత్రమే ఈ సమస్యను నివారించడం సాధ్యమౌతుంది. మనం నిత్యం వార్తా పత్రికలలో సూట్‌కేసులో దొరికిన శవం, ఫ్రిజ్‌లో దాచిన యువతి అవయవాలు వంటి వార్తలను చూడవలసిన అవసరం ఉండదు. ఈ క్రమంలో హైందవ ధర్మాన్ని కాపాడేందుకు సమాజాన్ని ఏకీకృతం చేసేందుకు పరిషత్‌ వంటి సంస్థలు చేపట్టే కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా దీనిని నిలువరించవచ్చు. హిందువులలో చైతన్యం వస్తున్న విషయాన్ని కాదనలేం. వారు తమ హైందవ గుర్తింపును స్థిరపరచుకుంటున్నారంటే, పరిషత్‌ పలు సంస్థలు, కార్యక్రమాల ద్వారా వారిలో తెచ్చిన అవగాహన, సాహసమే కారణమని చెప్పాలి.

ఆలయాల వద్ద ముస్లిం దుకాణాలు

హిందూ ఆలయాల వద్ద ముస్లింలు పూలు, పూజా సామాగ్రి అమ్ముతుంటే, అనేకమందిమి వాటిని మరో ఆలోచన లేకుండా ఒక పావలా, అర్థ రూపాయ తక్కువకు ఇస్తున్నారని కొని భగవంతుడికి సమర్పిస్తాము. పూజకు అర్పించే పదార్ధాలు పవిత్రమైనవి. వాటి పవిత్రతను హిందూ ఆలయాల పట్ల విశ్వాసం కలిగిన వారు మాత్రమే కాపాడగలరని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి డా॥ జైన్‌ అభిప్రాయడ్డారు. పైగా, మసీదు బయట నమాజుకు సంబంధించిన వస్తువులను ముస్లిమేతరులను అమ్మనిస్తారా? అంటూ ప్రశ్నించి, అది సాధ్యం కాదని తనే సమాధానం చెప్పారు. కాబాలో ఉపయోగించే వస్తువులను ముస్లిమేతరుడు అమ్మగలడా అంటే, వారిని కాబాలోకే ప్రవేశించనివ్వరు కదా? అంటూ ప్రశ్నించిన జైన్‌, దేశ వ్యాప్తంగా ఉన్న ఈ వైఖరికి సంబంధించి, ఇంకా పూర్తి గణాంకాలు స్వీకరించ లేదని వివరించారు. కేవలం పరిషత్‌ మాత్రమే కాదు, ఈ విషయంలో హిందువులు కూడా జాగృతం కావలసిన అవసరం ఉన్నది.

ప్రభుత్వం నియంత్రణ నుంచి ఆలయాలకు విముక్తి

దేశంపైకి వచ్చిన ఇస్లామిస్టులు హిందువుల ఆలయాలపై దాడి చేసి, వాటి సంపదను దోచుకోగా, హిందూ ఆలయాలను బ్రిటిషువారి కాలంలో ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారి ఉండవలసింది. కానీ, దురదృష్టవశాత్తు ఆ వైఖరి మారలేదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పాడి ఆవుల్లా సంపదను ఆర్జించే హిందూ ఆలయాలు ఇంకా ప్రభుత్వ గుప్పిట్లోనే ఉన్నాయి. అంతేనా, ఇక్కడ వచ్చే సంపదను ముస్లింల హజ్‌ యాత్రలు, క్రైస్తవ మిషనరీలకు ప్రభుత్వాలు ఖర్చుపెట్టడం పట్ల డా॥జైన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు 2019లో ఆలయాల నిర్వహణ సమాజ బాధ్యత కానీ ప్రభుత్వ విధి కాదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం సుప్రీంకోర్టు మాటలు విని కూడా, తమ గుప్పిట నుంచి వాటిని విడుదల చేయడం లేదని, అందుకే, తాము హిందూ ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలనే ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నామని ఆయన చెప్పారు. కేవలం పెద్ద ఆలయాలే కాదు, చిన్న ఆలయాల జీర్ణోద్ధరణ విషయంలో కూడా విశ్వహిందూ పరిషత్‌ చురుకైన పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా, ఈ ఆలయాలను నిర్వహించేందుకు పురోహితులకు శిక్షణనిస్తోంది. మన ప్రాచీన ఆలయాలు సమాజానికి కేంద్రంగా ఉంటూ విద్యాలయాలుగా, కళలకు కేంద్రాలు సహా పలు పాత్రలను పోషించాయి.

గోవధ వ్యతిరేక బిల్లుకు డిమాండ్‌

హిందువులకు  గోవు అత్యంత పవిత్రమైంది. ఇటీవలి కాలంలో గోవధ పెచ్చరిల్లి, ఆందోళనకర స్థాయికి వెడుతున్నది. విశ్వహిందూ పరిషత్‌ ఏర్పడినప్పటి నుంచీ గోవధ నిషేధం అన్నది కీలక డిమాండ్‌గా ఉంటూ వస్తోంది. వీహెచ్‌పీ యువ విభాగం బజరంగదళ్‌ గోవధను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. అందుకే, పలు సందర్భా లలో వామపక్ష మీడియా వారిని సంఘ వ్యతిరేక శక్తులుగా, రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు పాల్పడేది అధికంగా ముస్లింలే కావడంతో ఇది ఒక సున్నితమైన అంశంగా మారింది. ఎప్పుడు గోసంరక్షకులు ముస్లింలను అడ్డుకున్నా మీడియా కూడా దీనిని వివాదాస్పదం చేస్తుంటుంది. అయినప్పటికీ, అటు వీహెచ్‌పీ కానీ ఇటు బజరంగ్‌ దళ్‌ కానీ వెనక్కి తగ్గడంలేదు. హైదరా బాదు సహా పలు గోవధ కేంద్రాలకు వ్యతిరేకంగా వీహెచ్‌పీ, దళ్‌ గతంలో ఉద్యమించాయి. ఇటీవల జరిగిన జగన్నాథ రథయాత్ర సందర్భంగా పూరీలో వీహెచ్‌పీ ఈ సమస్యలపైనే ‘సంత్‌ చింతన్‌ బైఠక్‌’ ఏర్పాటు చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సంత్‌ సన్యాసులు గోవధకు, మతాంతరీ కరణకు వ్యతిరేకంగా ప్రభుత్వం బిల్లు తీసుకురా వాలంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎందుకంటే, ఒడిషా రాష్ట్రంలో క్రైస్తవ మతాంతరీకరణలకు వ్యతిరేకంగా వీహెచ్‌పీ ఎంతోకాలంగా పోరాటం చేస్తున్నది. ఈ క్రమంలోనే ఒడిషా సమాజంపై అటు క్రైస్తవ, ఇటు ఇస్లామిక్‌ ప్రభావాలను తగ్గించాలని అది కోరుకుంటున్నది.

ఓటు బ్యాంకు రాజకీయాలతో చేటు

రాజకీయ పార్టీలు కూడా అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అన్నది సమాజానికి చేటు తెస్తున్నది. హిందువుల తర్వాత అతిపెద్ద సమూహంగా ఉన్న ముస్లింలకు మైనార్టీల బిరుదు తగిలించి, వారు ఏం చేసినా మెతగ్గా వ్యవహరి స్తుండడం వల్ల వారు నిర్భయంగా మరింత మతో న్మాదులగా మారి తమ ఆధిపత్యాన్ని చెలాయించు కుంటున్నారు. ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలే ఇందుకు ఉదాహరణ. బాంగ్లాదేశ్‌ నుంచి ఈ రాష్ట్రానికి అక్రమంగా వచ్చి స్థిరపడిన ముస్లింలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వ అండతో ఏం చేస్తున్నారో మనందరం ఇటీవలే సందేశ్‌ఖలీలో చూసి ఉన్నాం. అయినప్పటికీ, అక్కడి ప్రభుత్వం నిస్సిగ్గుగా ముస్లింలనే సమర్ధించడాన్ని వీహెచ్‌పీ తీవ్రంగా ఖండిరచింది.  ప్రస్తుతం బాంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇస్లామిస్టుల అక్రమ చొరబాట్లు పెరిగే అవకాశమున్నందున సరిహద్దులను కాపాడాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విహెచ్‌పి విజ్ఞప్తి చేసింది. దానితో పాటుగా, అక్కడ హిందువులపై జరుగుతున్న మారణహోమాన్ని నిలిపివేసేందుకు చర్యలు తీసుకోమని కూడా పరిషత్‌ అధ్యక్షులు అలోక్‌ కోరారు.

ప్రపంచం నలుమూలలకే కాదు, భారతదేశం లోని మారుమూల ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలలో క్షేత్రస్థాయి వరకూ విశ్వహిందూ పరిషత్‌ విస్తరించి, హిందువులను ఐక్యం చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ పనిని అడ్డుకునేందుకు దానిపై మత సంస్థ అని, హిందూ అతివాద సంస్థ అంటూ వామపక్ష  మేధావులు, మీడియా ముద్రలు వేశారు. అయినప్పటికీ, వెనక్కి తగ్గకుండా తన కార్య కలాపాలను పరిషత్‌ కొనసాగిస్తోంది. దాదాపు 80శాతం హిందూ జనాభా కలిగిన భారత దేశంలో, మెజారిటీ మాత్రమే సెక్యులరిజాన్ని పాటించి, తన ధర్మానికి దూరంగా ఉండాలన్న నియమం మెకాలే విద్యా విధానం నుంచి పుట్టిందేనన్నది నిస్సందేహం. ఈ భావన చదువుకున్న, మేధావులైన హిందువుల లోనే అధికంగా ఉందన్నది నిర్వివాదం. అయితే, వీరిని ఆ భావన నుంచి బయటపడేసి, తమ ధర్మం పట్ల గర్వపడేలా చేయడానికే పరిషత్‌ కంకణం కట్టుకుంది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE