భారతీయ సమాజాన్ని కులాల వారీగా విభజించి బలహీనం చేయాలన్న కుట్ర విఫలమై, తిరిగి నరేంద్ర మోదీ అధికారాన్ని చేపట్టిన తర్వాత, ఇక్కడి ప్రతిపక్ష నాయ కులు విదేశీ దుష్టశక్తులతో కలసి భారత్‌ను ఆర్ధికంగా కుదేలు చేయాలనే యత్నం మరొక్కసారి చేసినప్పుడు, వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. గత ఏడాది గౌతమ్‌ అదానీ లక్ష్యంగా హిండెన్‌బర్గ్ ‌సంస్థ వారి వ్యాపారాల్లో అవకతవకలు జరుగుతున్నా యంటూ నివేదికను విడుదల చేసి షేర్‌ ‌మార్కెట్‌ను కుదేలు చేయడం గుర్తుండే ఉంటుంది. అప్పుడు, ఆ నివేదిక అదానీ సంస్థలకు, అందులో షేర్లు కొనుగోలు చేసిన సామాన్య ప్రజలనేకమందికి భారీ ఆర్ధిక నష్టాన్ని కలిగించింది. ఈ క్రమంలో, అదే సాహసంతో మరొకసారి యత్నం చేసి హిండెన్‌బర్గ్ ‌భారతీయుల చేతి వాటాన్ని రుచి చూసింది.

ఈసారి నేరుగా అదానీపై ఆరోపణలు, దాడి చేయకుండా సెక్యూరిటీస్‌ అం‌డ్‌ ఎక్స్‌చేంజ్‌ ‌బోర్డ్ ఆఫ్‌ ఇం‌డియా (సెబీ) చెయిర్‌ ‌పర్సన్‌ ‌మాధవీ బుచ్‌ను లక్ష్యంగా చేసుకొని బురదజల్లే ప్రయత్నం హిండెన్‌బర్గ్ ‌రీసెర్చ్ ‌సంస్థ చేసింది. గత ఏడాది భారతీయ స్టాక్‌ ‌మార్కెట్లలో బీభత్సాన్ని సృష్టించిన ఈ సంస్థ, ఈసారి మార్కెట్‌ ‌సమగ్రతను కాపాడేందుకు, క్రమబద్ధీక రించేందుకు నియమించిన సెబీ చెయిర్‌పర్సన్‌పై తన అస్త్రాలను సంధిస్తోంది. అమెరికాకు చెందిన ఈ షార్ట్ ‌సెల్లర్‌ ‌సంస్థ (ధరలు తగ్గుతాయన్నప్పుడు షేర్లు కొన్నింటిని అరువు తీసుకొని, అమ్మి, ధరలు తగ్గినప్పుడు తిరిగి కొనుగోలు చేసి, ధరలు కోలుకు న్నాక వాటిని అమ్ముకొని లాభం పొందేందుకు వాటిని వాటి యజమానులకు తిరిగి ఇవ్వడం) విడుదల చేసిన నివేదిక అర్థసత్యాలు, అనుచిత వ్యాఖ్యలతో నిండి ఉంది. వీటితోనే భారత్‌లో అత్యున్నత ఆర్ధిక కాపలాదారు అయిన సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే యత్నం బొక్కాబోర్లా పడింది.

వ్యూహాత్మకంగా దెబ్బతీసే కుయత్నం

ఆగస్టు 10వ తేదీన హిండెన్‌బర్గ్ ‌విస్ఫోటనాన్ని సృష్టించగలదనుకుని తన నివేదికను విడుదల చేసింది. ఇందులో గౌతమ్‌ అదానీ సోదరుడైన వినోద్‌ అదానీకి ముడిపడి ఉన్నట్టుగా ఆఫ్‌షోర్‌ ‌నిధులతో సంబంధమున్నట్టు ఒక కల్పిత అవినీతిలో మాధవీ బుచ్‌ను ఇరికించే ప్రయత్నం చేసింది. మాధవీ, ఆమె భర్త ధవళ్‌ ‌బుచ్‌కు ఆ అనుమానాస్పదమైన ఆఫ్‌షోర్‌ ‌సంస్థల్లో వాటాలు ఉన్నట్టు హిండెన్‌బర్గ్ ఆరోపిం చింది. అయితే, నిజంగా సెబీ అధిపతి రాజీపడ్డారని సూచించేందుకు ఇది ఒక బలహీన ఆధారం మాత్రమే.

అదానీ కుటుంబానికి లంకె ఉన్నట్టుగా హిండెన్‌బర్గ్ ‌చెబుతున్న ‘గ్లోబల్‌ ‌డైనమిక్‌ ఆపర్చునిటీస్‌ ‌ఫండ్‌,’ ‘ఐపిఇ ప్లస్‌ ‌ఫండ్‌’‌లలో బుచ్‌లకు పెట్టుబడులు ఉన్నాయనే అంశంపైనే నివేదిక సాక్ష్యాలు ఆధారపడి ఉన్నాయి. కాగా, 2018లో ధవల్‌ ‌బుచ్‌ 900,000 ‌డాలర్లను వెనక్కి తీసుకున్నారని నొక్కి చెప్పడం ద్వారా, ఆదానీ గ్రూప్‌ను క్రమబద్ధీకరించడంలో ఈ లావా దేవీలు మాధవీ బుచ్‌ ‌సామ ర్ధ్యాన్ని బలహీన పరుస్తాయనే ట్విస్టు ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ వాస్తవాలు మరొక రకంగా ఉన్నాయి.

హిండెన్‌బర్గ్ ఆరోపణలు అయితే చేసింది కానీ, తాను కాలక్రమాన్ని విస్మరిస్తున్నాననే విషయాన్ని గుర్తించలేదు. నిజానికి, సెబీలో బాధ్యతలు స్వీకరించకముందే, ఈ నిధులలో మాధవి జోక్యం ముగిసిపోయింది. ఇంకా చెప్పాలంటే, ఆదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ‌తొలిసారి దాడి చేయడానికి ఐదేళ్ల ముందే ఆమె భర్త ఆ నిధులను తిరిగి తీసుకు న్నారు. పైగా, ఇది నష్టాన్ని కలిగించిన పెట్టుబడే తప్ప ఏదో ఒరిగి ఒళ్లోపడుతుందన్న వ్యామోహపడేది కాదు. కానీ, సత్యం కన్నా కథనం అల్లడం పట్లే హిండెన్‌బర్గ్ ఆసక్తి ప్రదర్శించినట్టు కనిపిస్తోంది.

అసత్యాల మాయాజాలం

ఆఫ్‌షోర్‌ ‌నిధుల గురించిన నిరాధార వాదనలు చాలవనట్టుగా, క్లిష్టమైన ఆ వ్యవహారం లోతుల్లోకి వెళ్లి, మాధవీ బుచ్‌, ‌వినోద్‌ అదానీ, ఇన్వెస్ట్‌మెంట్‌ ‌మేనేజర్‌ అనిల్‌ అహూజాలు కుమ్మక్కయ్యారనే విస్తృతమైన కథనాన్ని అల్లింది. ఐపిఇ ప్లస్‌ ‌ఫండ్‌ను నిర్వహించిన అహూజా, గతంలో ఎప్పుడో అదానీ బోర్డ్ ఆఫ్‌ ‌డైరెక్టర్‌గా వ్యవహరించాడు కనుక ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుందన్నదే అందుకు అది ఉపయోగించిన తర్కం.

కానీ, సత్యాన్ని కొద్దిగా తెలుసుకొనే ప్రయత్నం చేస్తే, అహూజా తన విశిష్టమైన కెరీర్‌లో లెక్కనేనన్ని ప్రతిష్ఠాత్మక కంపెనీల బోర్డులలో పదవులను నిర్వహించిన సంగతి తెలిసి ఉండేది. అదానీ ఎంటర్‌ ‌ప్రైజెస్‌లో స్వల్పంకాలం పాటు అతడు నిర్వహించిన పదవే, బుచ్‌లతో చట్టవిరుద్ధమైన సంబంధానికి రుజువని మనం నమ్మాలన్నది హిండెన్‌బర్గ్ అభిప్రాయం. కానీ, వాస్తవం అత్యంత సాధారణ మైంది- అదానీ సామ్రాజ్యంతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలూ లేకుండా, అహూజా నిర్వహించిన నిధికి బుచ్‌ ‌కేవలం వినియోగదారుడు మాత్రమే.

హిండెన్‌బర్గ్ ‌దుస్సాహసం ఒక అజెండానా?

తన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగంగా నిరాధారమైన ఆరోపణలు చేసేందుకు హిండెన్‌బర్గ్ ‌గడ్డిపోచలను పట్టుకు వేళ్లాడుతోందన్నది స్పష్టం. అది ఆశించిన స్థాయిలో అదానీ గ్రూప్‌పై చేసిన హైప్రొఫైల్‌ ‌దాడి ఫలి తాలను ఇవ్వకపోవడంతో, తడబడుతున్న తన ఇతివృత్తాన్ని సజీవంగా నిలబెట్టేం దుకు ఈ షార్ట్ ‌సెల్లర్‌ ‌సంస్థ సెబీని లక్ష్యంగా చేసుకుంది. కానీ ఈసారి కూడా గౌరవప్రదమైన వారినే లక్ష్యంగా చేసుకున్నారు. వారి వాదనలు అత్యంత దుర్బలంగా ఉండడంతో, వారు ఊహించిన స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించలేక పోతున్నాయి.

అంతేకాదు, సెబీలో తన పదవీకాలానికి ముందు బుచ్‌ ‌తన పెట్టుబడులను వైవిధ్యపరచడాన్ని విమర్శిం చడం, ఆమె భారతీయ మ్యూచ్యువల్‌ ‌ఫండ్స్‌కు కట్టుబడి ఉండటంలో విఫలం కావడాన్ని పట్టిచూపడ మంటే, ఆమె విధి నిర్వహణలో తప్పిదం జరిగినట్టుగా సూచించే యత్నం. అంతేకాదు, ఆమె ఆఫ్‌షోర్‌ ‌పెట్టుబడులన్నీ చట్టబద్ధమైనవేనని, ప్రస్తు•ం• ఆమె పోషిస్తున్న పాత్రకు ఎటువంటివి సంబంధం లేనివన్న వాస్తవాలు తెలిసి కూడా దుష్ప్రచారం చేసింది.

తుస్సుమన్న నివేదిక

తాను చేస్తున్న సత్యవిరుద్ధ వాదనలను సమర్ధించు కోవడంలో విఫలమవుతూనే, సంచలనాత్మకంగా దూసుకురావడం, అనుమాన బీజాలు వేయడం ద్వారా తన నిజమైన రంగులను హిండెన్‌ ‌బర్గ్ ‌రీసెర్చ్ ‌బయటపెట్టుకుంది. భారత ఆర్ధిక రెగ్యులేటరీ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పలచన చేసేందుకు చేసిన ఒక మొండి ప్రయత్నమే మాధవీ బుచ్‌పై దాడి. దుష్ప్రచారం చేయాలన్న హడావిడిలో, హిండెన్‌బర్గ్ అతి చేసింది. దాని వాదనలలోని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అంతా సర్దుకుంటున్న నేపథ్యంలో ఈ తాజా దాడి, ఎక్కడా కళంకం లేని చోట ఒకదానిని సృష్టించా లన్న తపనతో సరైన ఆలోచన లేకుండా, పేలవంగా అమలయిందన్నది సుస్పష్టం. మాధవీ బుచ్‌ ‌నైతికతకు ఎటువంటి భంగం కలుగలేదు, ‘నిజాయతీతో కూడిన నియంత్రణ’ అన్న సెబీ నిబద్ధత స్థిరంగా నిలిచింది. ఇక్కడ అసలు కథ ప్రయోజనాల సంఘర్షణకు సంబంధించింది కాదు, ఇది ఒక షార్ట్ ‌సెల్లర్‌ ‌తను ఏదో ఒకరకంగా అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు సత్యంతో ఓడిపోయినావేగంగా ఎత్తులు వేస్తూ చేస్తున్న యత్నం. ఈ క్రమంలో సత్యంతో ఓడిపోయినా దానికి లెక్కలేదు.

 రాహుల్‌ ‌గాంధీ ఆసక్తి

హిండెన్‌బర్గ్ ‌తన నివేదికను విడుదల చేయ బోతోందన్న సంకేతాలు అందగానే పెట్టుబడి దారులను స్టాక్‌ ‌మార్కెట్‌కు దూరంగా ఉండమంటూ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ ‌గాంధీ స్వయంగా చెబుతున్న వీడియోను సోషల్‌ ‌మీడియాలో విడుదల చేశారు. చిత్రం ఏమిటంటే, గత ఐదు నెలల్లో రూ. 46.5 లక్షల లాభాలను ఆర్జించిన రాహుల్‌, ఇతరులు పెట్టుబడులు పెట్టకుండా నిలువరించా లనుకోవడం. కేవలం హిండెన్‌బర్గ్ ‌నివేదిక ఆధారంగా భారతీయ ఆర్ధిక మార్కెట్ల స్థిరత్వంపై సందేహాలు రేకెత్తించడమనేది విదేశీ సంస్థలకు లాభాలను చేకూర్చేందుకే అన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. వాస్తవాన్ని తెలుసుకున్న ప్రజలు స్టాక్‌ ‌మార్కెట్‌ ‌పట్ల విశ్వాసాన్ని ప్రకటించి, గతంలోలా కుప్పకూలకుండా చూసి హిండెన్‌బర్గ్‌కు, రాహుల్‌కు ఏకకాలంలో బుద్ధి చెప్పారు.

మూడవసారి ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ స్టాక్‌ ‌మార్కెట్లు గణనీయ మైన వృద్ధిని చూపడమే కాక, సెన్సెక్స్, ‌నిఫ్టీ వంటి ప్రామాణిక సూచీలు రికార్డులను బద్దలు చేస్తున్నాయి. ఇంత ఆరోగ్యకరమైన పనితీరును మార్కెట్లు ప్రదర్శిస్తున్నప్పటికీ, సెబీ చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ ‌చేసిన ఆరోపణలపై జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలంటూ డిమాండ్‌ ‌చేయడం ద్వారా రాహుల్‌• ‌తన రంగు బయటపెట్టుకు న్నారు. ‘‘భారతీయ స్టాక్‌ ‌మార్కెట్లలో గణనీయమైన ముప్పు దాగి ఉందని, స్టాక్‌ ‌మార్కెట్‌ను పాలించే వ్యవస్థలు రాజీపడడమే అందుకు కారణమనే విషయాన్ని బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా మీ ముందుకు తేవడం నా విధి’’ అంటూ రాహుల్‌ ‌పేర్కొన్నాడు. కాగా, పెట్టుబడి దారులు ఈ మాటలను లెక్క చేయకపోవడంతో నివేదిక ప్రభావం మార్కెట్లపై కనిపించకపోగా అతడి ఉద్దేశాలు, మాటలపై అనుమానాలు తలెత్తాయి. తమ నాయకుడి మాటలకు మద్దతుగా కాంగ్రెస్‌ ‌కూడా సెబీ అధిపతి రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేయడమే కాక, సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందానికి అదానీపై దర్యాప్తును బదిలీ చేయాలని డిమాండ్‌ ‌చేసింది. కాగా, వీరంతా కూడా సెబీకి ఈ దర్యాప్తు చేసే సామర్ధ్యం ఉంది కనుక సిట్‌ ‌వంటివి నియ మించాల్సిన అవసరం లేదని ఆరునెలల కిందట సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయాన్ని మర్చిపోయి నట్టుగా నటిస్తున్నారు.

విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది

రుజువు చేయలేని, నిరాధారమైన ఆరోపణలను హిండెన్‌బర్గ్ ‌చేయడం, దానికి కాంగ్రెస్‌ ‌వంద పాడడంపై బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేదీ సోషల్‌ ‌మీడియా వేదిక ‘ఎక్స్’‌పై పోస్ట్ ‌చేసిన ఒక వీడియోలో విరుచుకుపడ్డారు. భారతీయ ఆర్ధిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు కంకణం కట్టుకున్న విదేశీ సంస్థల అభిప్రాయాలతో కాంగ్రెస్‌ అభిప్రాయాలు సమ లేఖనం కావడాన్ని ఆయన ప్రశ్నించారు. అటువంటి విదేశీ నివేదికల విడుదలకు సంబంధించి ఒక నిర్ధిష్టమైన సరళి కనిపిస్తోందని ఆయన ఆరోపిం చారు. అది బీబీసీ డాక్యుమెంటరీ అయినా, హిండెన్‌బర్గ్ ‌నివేదిక అయినా… విదేశీ నివేదికలన్నీ కూడా పార్లమెంటు సెషన్ల సమయంలో ఎలా వచ్చాయో ఆయన సోదాహరణంగా పట్టి చూపారు.

అంతేకాదు, ప్రతిపక్షాల ప్రవర్తన వీటి గురించి వీరికి ముందస్తుగానే తెలుసేమోనన్న అనుమానాలు తలెత్తేలా ఉంటోందని త్రివేది అన్నారు. ఆర్ధిక అస్థిరతను, అరాచకతను వ్యాప్తి చేసేందుకు కాంగ్రెస్‌, ‌ప్రతిపక్షాలు ఎప్పుడూ ఎందుకు యత్నిస్తాయంటూ సందేహాలు వ్యక్తం చేశారు. అది ప్రభుత్వ కంపెనీ అయినా ప్రైవేటుది అయినా, ప్రజల్లో అయో మయాన్ని సృష్టించడమే వారు లక్ష్యంగా పెట్టుకుంటా రని విమర్శించారు. గత ఏడాది ఎల్‌ఐసి, హెచ్‌ఎఎల్‌, ఎస్‌బిఐ అన్నీ నష్టాల్లో నడుస్తున్నాయని వారు ఆరోపించారని, కానీ ఈ ఏడాది ముందెన్నడూ లేని విధంగా ఎల్‌ఐసీ రూ.17 వేల కోట్ల లాభాలను నమోదు చేయగా, ఎస్‌బిఐ రూ. 21 కోట్లు, హెచ్‌ఎఎల్‌ ‌కోట్లు లాభాలను ఆర్జించడంతో ఇప్పుడు సెబీనే లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపిం చారు. గత ముప్పై, నలభై ఏళ్లుగా కాంగ్రెస్‌ ఎప్పుడూ విదేశీ సంస్థలకు అండగా ఎందుకు నిలబడింది? యూనియన్‌ ‌కార్బైడ్‌ ‌వెనుక ఎందుకు నిలబడ్డది? అంటూ విరుచుకుపడ్డారు.

గత ఏడాది డిసెంబర్‌ ‌మాసంలో షార్ట్ ‌సెల్లర్‌ ‌హిండెన్‌బర్గ్ ‌రీసెర్చ్ ‌కార్పొరేట్‌ ‌మోసం అంటూ గౌతమ్‌ అదానీపై చేసిన ఆరోపణలు హేతుబద్ధ మైనవి కానివని, అనుచితమైనవని యుఎస్‌ ‌ప్రభుత్వం స్వయంగా పేర్కొనడం గమనార్హం. దీనితో, అదానీ గ్రూపు కంపెనీల స్టాక్‌లు ఒక్కసారిగా బలపుంజుకున్న విషయం తెలిసిందే. ఈసారి పెట్టుబడిదారులు, ప్రజలు కూడా మూర్ఖుల్లా హిండెన్‌బర్గ్‌ను, ప్రతిపక్ష నాయకుడినీ నమ్మకుండా తమ బుర్రను మాత్రమే వాడడంతో, అటు ఆర్ధిక వ్యవస్థలనే కాదు, తమను తాము కూడా కాపాడుకున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఏదో ఒక రూపంలో, మార్గంలో అదానీని దెబ్బకొట్టడమే హిండెన్‌బర్గ్‌తో పాటు ప్రతిపక్షాల లక్ష్యంలా కనిపిస్తోంది. కానీ ప్రజలు, పెట్టుబడిదారులూ దాని ఎత్తులు పారకుండా అడ్డుకుంటున్నారు.

నీల

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE