జాగృతి వారపత్రిక, భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీ(2024)కి ఆహ్వానం
జాగృతి జాతీయ వారపత్రిక నిర్వహిస్తున్న భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి రచనలను ఆహ్వానిస్తున్నాం.
మొదటి బహుమతి రూ.12,000, ద్వితీయ బహుమతి,రూ. 7,000, తృతీయ బహుమతి రూ. 5,000. ఇవికాక మరొక ఎనిమిది ప్రత్యేక బహుమతులు

నిబంధనలు :

1. సమకాలీనం, చారిత్రకం, సైన్స్‌ ఫిక్షన్‌ ఇతివృత్తంతో కూడిన కథలను పంపవచ్చు. భారతీయ సామాజిక జీవనమే నేపథ్యంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఆంగ్ల పదాలను పరిహరించండి.

2. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఎనిమిది కథలకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహక బహుమతి, సాధారణ ప్రచురణకు స్వీకరించిన ప్రతి కథకు జాగృతి పారితోషికం ఉంటాయి.

3. కథ నిడివి 1500 పదాలకు మించరాదు. ఒక రచయిత 2 కథలకు మించి పంపరాదు.

4. కథ స్వంతమేనని, అనువాదం, అనుసరణ కాదని, బ్లాగుల్లోనూ, వెబ్‌ పత్రికల్లోనూ మరెక్కడా ప్రచురితం, ప్రసారం కాలేదని, పరిశీలనలో లేదని విడిగా హామీపత్రం జతచేయాలి. హామీపత్రంలో రచయిత పేరు, చిరునామా, ఇ-మెయిల్‌ ఐడి, ఫోన్‌ నంబర్‌ తప్పక రాయండి. కథ రాసిన పుటలలో ఎక్కడా రచయిత పేరు గానీ, ఇతర వివరాలేవి ఉండరాదు.

5. కథలను తెలుగులో అను లేదా యూనికోడ్‌ ఫాంట్‌లో డిటిపి చేసి [email protected] కు మెయిల్‌ చేయాలి.

6. పోస్టు లేదా కొరియర్‌ ద్వారా పంపాలనుకుంటే ‘కథల పోటీ’ జాగృతి వారపత్రిక, 3-4-228/4/1, జాగృతి భవన్‌, కాచిగూడ, హైదరాబాద్‌`500027 కు పంపొచ్చు. జాగృతికి కథల్ని చేర్చే బాధ్యత రచయితలదే.

7. కథల ఎంపికలో ఉత్తర, ప్రత్యుత్తరాలకు తావులేదు. సంపాదకునిదే అంతిమ నిర్ణయం.

8. దీపావళి సంచిక నుంచి ఆరంభించి, వరుసగా ఈ కథలను ప్రచురిస్తాం.

కథలు జాగృతికి చేరడానికి చివరి తేది : 31 ఆగస్ట్‌, 2024

About Author

By editor

Twitter
YOUTUBE