– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, దేవాలయాల సందర్శన. ఊహించని కాంట్రాక్టులు లభిస్తాయి. ఆదాయం మరింత పెరుగు తుంది. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. క్రీడాకారులకు పురస్కారాలు. 5,6 తేదీల్లో మనశ్శాంతి లోపిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీనృసింహస్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
సమాజంలో పలుకుబడి, దైవకార్యాలలో పాల్గొం టారు. ఇంటి నిర్మాణయత్నాలు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు, విద్యార్థుల కృషి కొంతమేర ఫలిస్తుంది. వ్యాపారులు పెట్టుబడులతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతం. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వైద్యులు, క్రీడా కారులకు నూతన ఉత్సాహం. దూరప్రయాణాలు. 7,8 తేదీల్లో బంధువు లతో వివాదాలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సన్నిహితుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. కష్టమే తప్ప ఫలితం లేని స్థితి. బంధువులతో విభేదిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దేవాలయ దర్శనాలు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. వ్యాపారులకు లావాదేవీలు అసంతృప్తి. ఉద్యోగులకు కొన్ని బాధ్యతలు సవాలుగా మారతాయి. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలలో ఆటంకాలు. శుభవార్తా శ్రవణం. 8,9 తేదీల్లో ఆకస్మిక ధనలాభం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సమాజంలో గౌరవప్రతిష్టలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో కష్ట సుఖాలు విచారిస్తారు. దైవారాధనలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. నిరుద్యోగుల ఆశలుఫలిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కు తాయి. పారిశ్రామిక, కళారంగాల వారు ఊహలు నిజం చేసుకుంటారు. రచయితలకు విశేష గౌరవం. 10,11 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. విష్ణుధ్యానం చేయండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకున్న కార్యక్రమాలలో పురోగతి. నిరుద్యోగు లకు అవకాశాలు. వాహనాలు, స్థలాలు కొనుగోలులో ఇబ్బందులు తొలగుతాయి. శుభకార్యాలకోసం ప్రయ త్నాలు. మొండిబాకీలు కూడా వసూలవుతాయి. వ్యాపారులకు అభివృద్ధి కని పిస్తుంది. రాజకీయ వేత్తలు, కళాకారులు విజయాల బాట. రచయితలు, వ్యవసాయదారుల యత్నాలు సఫలం. 6,7 తేదీల్లో వృథా ఖర్చులు. దుర్గామాతను స్మరించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగు తాయి. ఆలోచనలు కార్య రూపందాలుస్తాయి. వాహన, భూయోగం. రావలసిన డబ్బు అందు తుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. రాజకీయవేత్తలకు శ్రమ ఫలిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు మంచి గుర్తింపు. 10,11 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. గణేశాష్టకం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరి ష్కారం. వ్యాపారులకు భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు. రాజకీయవేత్తలకు పదవీయోగం. కళాకారులు, పరిశోధకులకు విశేష ఆదరణ. 5,6 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయదండకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్య కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆదాయానికి ఇబ్బందులు తీరుతాయి. అందరిలోనూ మీ మాటే చెల్లుబాటు. వ్యాపారులకు మరింత ప్రోత్సాహకరం. ఉద్యోగులకు సరైనగుర్తింపు. కళాకారులు, రచయితల ఆశయాలు నెరవేరతాయి. 9,10 తేదీల్లో శారీరక రుగ్మతలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
సన్నిహితుల సాయం పొందుతారు. కార్యక్రమాలలో విజయం. ఆదాయం మరింత అనుకూలం. కుటుంబసభ్యులతో మనస్పర్థలు తొలగును. ఆరోగ్యం మరింత మెరుగు. ఉద్యోగులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్లు లభించవచ్చు. రాజకీయ, కళారంగాల వారు విజయాలవైపు సాగు తారు. క్రీడాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 7,8 తేదీల్లో వృథా ఖర్చులు. శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. దైవకార్యాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘ టనలు ఎదురవుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న విధంగా మార్పులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు అనుకూలం. క్రీడాకారులు ప్రతిభను నిరూపించుకుంటారు. 8,9 తేదీల్లో మానసిక అశాంతి. నవగ్రహస్తోత్రాలు పఠించండి
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
సన్నిహితులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు పొందుతారు. వాహన, కుటుంబ సౌఖ్యం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందు కుంటారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యో గులకు విధుల్లో ఒత్తిడులు తొలగు తాయి. కళా కారులు, పరిశోధకులకు నూతనోత్సాహం. 10,11 తేదీల్లో దూరప్రయాణాలు. లక్ష్మీస్తోత్రాలు పఠిచండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
సమాజంలో గౌరవం. ఆశ్చర్యకరమైన సంఘ టనలు ఎదురవుతాయి. వాహన యోగం. దైవ కార్యాలు చేపడతారు. కొన్ని వివాదాల నుంచి బయట పడతారు. ఆకస్మికధనలాభాలు. వ్యాపారులు లాభాలు దిశగా పయనిస్తారు. ఉద్యోగులు ఓర్పుతో విధులు నిర్వహించి ప్రశంసలు. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు అనుకున్న అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు. 6,7 తేదీల్లో బంధువులతో విభేదిస్తారు. ఖర్చులు అధికం. శ్రీకృష్ణాష్టకం పఠించండి.