– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
అనుకున్న కార్యక్రమాలను కొంత నిదా నిస్తాయి. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఆస్తుల వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. బంధువులు, స్నేహితులతో కొన్ని వివాదాలు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు పర్యటనలు వాయిదా. 28,29 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. లక్ష్మీస్తుతి మంచిది.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. అదనపు ఆదాయం సంతృప్తినిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు. వాహనాలు, భూములు కొంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, రచయితలు, క్రీడాకారులకు విదేశీయానం. 30,31 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆంజనేయ దండకం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులు, స్నేహితు లతో అకారణంగా విభేదాలు. ఇంటి నిర్మాణాలు ముందుకు సాగవు. వ్యాపారులు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరిం చాలి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పడవచ్చు. పరిశోధకులు, రాజకీయ వేత్తలు, కళాకారులకు అవకాశాలు నిరుత్సాహం. 31,1 తేదీల్లో శుభవర్తమానాలు. సోదరుల నుంచి పిలుపు. కనకధారాస్తోత్రం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మొదట్లో ఇబ్బంది పడినా క్రమేపీ ఆదాయం పెరుగుతుంది. ముఖ్య కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. స్నేహితులతో సఖ్యత. వ్యాపారులు లాభాలు అందుకుని ఊరట. ఉద్యోగ వర్గాలకు ప్రమోషన్‌లు. క్రీడాకారులు, రచయితలు, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 27,28 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. సుబ్రహ్యణ్యాష్టకం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహన, గృహయోగాలు. సాహిత్య విష యాలపై ఆసక్తి. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూలత. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, రచయితలకు సన్మానాలు జరిగే వీలుంది. 31,1 తేదీల్లో వివాదాలు. శారీరక రుగ్మతలు. శివపంచాక్షరి పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయుల ఆదరణ చూరగొంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు మరింత పుంజుకుంటారు. ఉద్యోగులకు ఊహించని హోదాలు లభిస్తాయి. పారి శ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారుల యత్నాలు సఫలమవుతాయి. 26,.27 తేదీల్లో వివాదాలు. వృథా ఖర్చులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆకస్మిక ప్రయాణాలతో వ్యయప్రయాసలు. చేపట్టిన కార్యక్రమాలు మధ్యలోనే వాయిదా వేస్తారు. ముఖ్యనిర్ణయాలు మార్చుకుంటారు. ఆదాయం కొంత తగ్గి అప్పులు చేస్తారు. వ్యాపారులు మరింత నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. 28,29 తేదీలలో శుభవార్తలు. వాహన యోగం. ఆహ్వానాలు అందుతాయి. శ్రీరామరక్షా స్తోత్రం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
కొన్ని కార్యక్రమాలను శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆస్తుల ఒప్పందాలలో ఆటంకాలు. ఆరోగ్యం పై శ్రద్ధ. ఆధ్యాత్మిక కార్యక్రమాలు•. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. వ్యాపారులు స్వల్ప లాభాలు. ఉద్యోగు లకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు ఒత్తిడులు తప్పవు. 30,31 తేదీలలో విందువినోదాలు. ఆకస్మిక ధనలబ్ధి. హనుమాన్ ఛాలీసా పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాబడి మరింత పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొం టారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. వ్యాపారులు భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు. క్రీడాకారులు, కళాకారులకు అవార్డులు. 30,31 తేదీల్లో అనుకోని ప్రయాణాలు.గణేశాష్టకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆశించినంత ఆదాయం సమకూరుతుంది. రుణ బాధలు తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. బంధువుల నుంచి శుభ వార్తలు అందు తాయి. వ్యాపారుల యత్నాలు సఫల మవుతాయి, లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగు లకు విధుల్లో అనుకూల పరిస్థితులు. రాజకీయ వేత్తలు, క్రీడా కారులు, పరిశోధకులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. 27,28 తేదీల్లో అనారోగ్యం, దూరప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయం కొంత తగ్గి నిరాశ చెందుతారు. బంధువులు, స్నేహితులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు ఒడిదుడుకులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు విదేశీ పర్యటనలు. 31,1 తేదీల్లో శుభవార్తలు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురవుతాయి. కాంట్రాక్టులు చేజారవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తుల వివాదాలు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. స్వల్ప ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు చికాకులు. ఉద్యో గులకు మార్పులు సంభవం. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు అంచనాలు తప్పుతాయి. 26,27తేదీల్లో ధనప్రాప్తి. విందు వినోదాలు. నృసింహస్తోత్రాలు పఠించండి.