– నీల
హిందువులు అంటేనే హింస అంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో ఎంత అరచి గీపెట్టినా క్షేత్రస్థాయిలో వాస్తవాలు హింసకులు ఎవరో పట్టి చూపుతున్నాయి. అంతేనా, నిద్రిస్తున్న హిందువును తన కాళ్లకిందకు వస్తున్న నీరును గమనించకపోతే మునిగిపోతారని కోర్టులు కూడా హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ, మనకు సెక్యులరిజం ముసుగు తొలగించుకోవాలంటే భయం.
సెక్యులర్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో శాసనసభ్యుడు ఫిర్హాద్ హకీమ్, ‘‘మనం ముస్లిమేత రుల మధ్య ఇస్లాంను వ్యాప్తిచేయాలి. మనం ఎవరినైనా ఇస్లాం మార్గంలోకి తీసుకురాగలిగితే, విశ్వాసవ్యాప్తికి భరోసా ఇవ్వడం ద్వారా మనం నిజమైన ముస్లింలుగా నిరూపించు కుంటాము,’’ అంటూ బహిరంగంగా ప్రకటించడం అన్నది ఇస్లామిస్టులలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి తార్కాణం వేరొకటి అవసరం లేదు. వారిలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్న తేడా లేకుండా నలు దిక్కులా చొరబాటుదారులు అక్రమంగా ప్రవేశించ డమే కాదు, హిందువులపై చేస్తున్న అత్యాచారాలు, దాడులు ఎదుర్కోవాలంటే, హిందూసమాజం కులాలకు అతీతంగా ఏకం కావలసిందే. భారత దేశంలో హిందువుల ఉనికే లేకుండా చేయాలని ఇస్లామ్, క్రైస్తవ మతాలు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. రెండు వర్గాలవారూ పోటీపడి చేస్తున్న మతాంతరీకరణల వ్యవహారం కోర్టుల దాకా వెళ్లడంతో అవి కూడా సచేతనమై, హిందువులను అప్రమత్తం చేసే యత్నం చేస్తున్నాయి.
మతాంతరీకరణపై హైకోర్టుల వ్యాఖ్యలు
గతవారంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లో మతాంతరీకరణ చేస్తున్నాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్‌ను నిరాకరిస్తూ, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి హిందువులు అప్రమత్తంగా ఉండకపోతే, మెజార్టీ జనాభా మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించిన విషయం గుర్తుండే ఉంటుంది.
తాజాగా, చట్టవిరుద్ధంగా చొరబడిన బంగ్లాదేశీ వలసదారులైన రోహింగ్యాలను గుర్తించి, బహిష్కరించి వారి దేశానికి తిప్పి పంపమంటూ రaార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులను జారీచేసింది. షెడ్యూల్డు తెగలకు చెందిన ఆడపిల్లలపై అత్యాచారం చేసి దోచుకుంటున్నారంటూ డానియల్ డానిష్ అనే వ్యక్తి దాఖలుచేసిన పిటిషన్‌కు స్పందించి, విచా రించిన హైకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
బంగ్లాదేశ్‌లో నిషేధించిన సంస్థలకు చెందిన సభ్యులు భారత్‌లో చొరబడి ఇక్కడ గిరిజన బాలిక లను ఇస్లాంలోకి మతాంతరీకరిస్తున్నారు. ఇందులో వారు ఎంచుకున్న ప్రధాన పద్ధతి లవ్‌జిహాద్. బంగ్లాదేశ్ సరిహద్దులలో గల సంథాల్ పరగణాలో అకస్మాత్తుగా మదర్సాల సంఖ్య పెరగడమేకాదు, వారు జాతి వ్యతిరేక కార్యకలాపాలలో పాలుపంచు కుంటున్నారు. ఈ చొరబాటు దారులు కేవలం స్థానిక మహిళలను దోచుకోవడమే కాకుండా చట్టవిరుద్ధంగా వారి భూములను కూడా ఆక్రమించుకుంటున్నారు. వివాహంద్వారా భారతీయ ఐడి కార్డులను పొందుతూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. అంతేనా, వీరిలో కొందరు ఇక్కడ వ్యవస్థను ఉపయో గించుకొని రాజ్యాంగబద్ధమైన పదవులను కూడా పొంది, భూమి జిహాద్ కార్యకలాపాల్లో పాల్గొంటు న్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా, హిందూ సమాజం నిద్రలేవడం లేదు.
ఈ వ్యవహారం కేవలం రాష్ట్రప్రభుత్వం ఒంటరిగా నిర్వహించగలిగింది కాదంటూ కోర్టు నొక్కిచెప్పింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్రంతో సహకరించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ సమయంలో చొరబాటు దారులకు వ్యతిరేకంగా చర్య తీసుకునేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ అధికారాలు ఉన్నాయంటూ కేంద్రం నివేదించింది. ఇలా చర్య తీసుకునేందుకు స్వేచ్ఛను ప్రసాదించింది కూడా మోదీ ప్రభుత్వ విధానమే!
ఒకటి, రెండు రాష్ట్రాల సమస్య కాదు
వాస్తవానికి ఈ సమస్య కేవలం రaార్ఖండ్‌కు సంబంధించింది మాత్రమే కాదు. అన్ని సరిహద్దు రాష్ట్రాల్లోనూ ఇటువంటి మతాంతరీకరణలు, ఉద్దేశ్య పూరితంగా జనసంఖ్య సంబంధిత మార్పులను చేయడం అన్నది సర్వసాధారణంగా మారింది. నిజానికి, అనేక సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సమ స్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయి లేదా చర్య తీసుకుంటే తమ సెక్యులరిజానికి భంగం వాటిల్లుతుందేమోనని ఇష్టపడడం లేదు. ఈ చొరబాటుదారులు కేవలం భారతీయ వనరులను దోచుకోవడమే కాదు, చురుకుగా మతాంతరీకరణ లలో పాల్గొంటుండడంతో సమస్య వస్తోంది. ఈ రకంగా భారతీయ ఆత్మపై బహుముఖంగా జనాభా జిహాద్‌కు కూడా పాల్పడుతున్నారని నిపుణులు అంటు న్నారు. శాంతిదూతలమని చెప్పుకునే వీరు సనాతనుల ఉనికి లేకుండా చేసే యత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే లవ్‌జిహాద్‌కు పాల్పడడం. ఈ ఇస్లామిక్ చొరబాటుదారులు భారత్‌లో స్థిరపడేందుకు సహాయం చేస్తున్నది భారతీయ ముస్లింలే. అందుకే, సమస్య క్షేత్రస్థాయిలో తీవ్రంగా ఉండటమే కాదు, అంత తొందరగా ఎవరి దృష్టినీ ఆకర్షించడం లేదు.
ఇక, హిందువులపై అత్యాచారాలకు అయితే లెక్కే లేకుండా పోతున్నది. గతంలో హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు అంటే సామూహిక స్థాయిలో జరుగు తుండేవి. ఇవి ముస్లింలు పద్ధతి మార్చుకున్నట్టు కనిపి స్తోంది. తమ జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో తమ శాసనాలను అమలుచేస్తూ అరాచకాన్ని సృష్టిస్తు న్నారు. అది గ్రామ, మండల స్థాయిల్లో జరగడం, అక్కడి శాసనసభ్యులు భయంతోనో, పార్టీ విధానాల కారణంగానో వాటిని చూసీ చూడనట్టుగా వ్యవహ రించడం పెద్ద సమస్యగా మారుతున్నది. ఇలా కంటికి కనిపించకుండా జరుగుతున్న ఈ ఘటనల కారణంగా క్షేత్ర స్థాయిలో సామాజిక అల్లికే మారి పోతుండటం ఆందోళనకరమైన విషయం.
పశ్చిమ బెంగాల్‌లో పాశవికత
అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా, ఇస్లామిస్టులు, మిషనరీలు మెత్తగా ఉన్నవారిని మాయమాటలు చెప్పి మతాంతరీక రిస్తుండగా, తమతో విబేధించినవారిపై నిర్భయంగా దాడులకు పాల్పడుతున్నారు. కిందటివారంలోనే పశ్చిమ బెంగాల్లో షరియా శిక్ష తరహాలో కూచ్ బెహార్‌లో ఒక మహిళను, పురుషుడిని ఆ ప్రాంత ఎమ్మెల్యేకు సన్నిహితుడు అయిన షఫీకుల్, అతడి అనుచరులు నడిరోడ్డు మీద వివస్త్రులను చేసి మరీ కొట్టిన ఘటనను మరవకుండానే, బీజేపీ కార్యకర్త అయిన ఒక మహిళను వివస్త్రను చేసి పదునైన ఆయుధంతో దాడి చేశారు.
ఇప్పుడు ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఒకవైపు రాజకీయ బలం, మరోవైపు మతబలంతో ఇస్లామిస్టులు హిందువులకు నరకం చూపిస్తున్నారు. ఈ రాష్ట్రం కూడా సరిహద్దు రాష్ట్రం కావడంతో బంగ్లాదేశీ చొరబాటుదారు గ్రామాలకు గ్రామాలను ఆక్రమించుకొని ఏలేస్తున్నారు. సందేశ్ ఖాలీ దారుణం బయటపడే వరకూ వారి అత్యా చారాలు బయటపడలేదు. దీని తర్వాత మీడియా దృష్టి ఆ రాష్ట్రంపై పడడంతో ఒక్కొక్క ఘటనా బయటకు వస్తున్నది.
మహారాష్ట్రలో తక్కువ తినలేదు
మహారాష్ట్రలో అయితే, కేవలం పదిహేను రోజుల్లో ఎనిమిదిమంది హిందువులపై హింసాత్మక మైన దాడులు జరిగాయి. మూకుమ్మడిగా కాకుండా, అక్కడొకటి, ఇక్కడొకటి అన్నట్టుగా జరుగుతున్న ఘటనలను యాదృచ్ఛికంగా పరిగణించడం సరికాదు. ఒక పథకం ప్రకారమే, ఎంచుకొని మరీ ఈ దాడులకు ముస్లింలు పాల్పడుతున్నారు. ఇలా అకస్మాత్తుగా ఒక దానితో మరొకదానికి సంబంధం లేకుండా అక్కడక్కడ జరుగుతున్న ఇటువంటి దాడులను యాదృచ్ఛికంగా ఎడతెగని తక్కువస్థాయి చెదురుమదురు హింసగా కొందరు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ముఖ్యంగా, లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఆ రాష్ట్రంలో హిందువులపై హింసకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని వార్తలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (యుబిటి), కాంగ్రెస్‌కు ఓటువేసి ఎక్కువ సంఖ్యలో ఎంపీలను గెలిపించిన తర్వాత ఇస్లామిస్టులు మరింత నిర్భీతితో తిరుగుతూ, హిందూ యాక్టివిస్టులు, నాయకులపై అనవసరమైన దాడులకు పాల్పడుతున్నారని వార్తా కథనాలు వెలువడు తున్నాయి. ఒక ప్రాంతానికి చెందిన వారనే సాకుతో హిందూ సమాజంపై ఇస్లామిస్టులు చేసిన 7`8 దాడులతో రాష్ట్రం ఉలిక్కిపడిరది.
జైభీమ్ జైమీమ్ అన్నది అవకాశవాదమని రుజువు చేస్తున్న ఇస్లామిస్టులు
గతవారం పూణె జిల్లాలోని లోహియానగర్ ప్రాంతంలో హిందూ కార్యకర్త అక్షయ్ ధావ్రేపై పదిమంది ఇస్లామిస్టులు దాడి చేశారు. హిందూ దళిత యాక్టివిస్టు అయిన అతడిపై ఇస్లామిస్టులు దాడి చేయడానికి కారణం అతడు ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందినవాడు, బీజేపీతో సంబంధాలు కలిగినవాడు కావడమే.
ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు కాకుండా అదే ప్రాంతంలో రోహిత్ థోరట్ అనే హిందూ దళిత నాయకుడిపై దాడి జరిగింది. ‘జై భీమ్ `జై మీమ్’ అంటూ నినాదాలు చేసే ప్రతిపక్ష నాయకులు ఎవరూ ఈ ఘటనలను ఖండిరచి నట్టు కనిపించలేదు, వినిపించలేదు. హిందూ దళిత నాయకుడు రోహిత్ థోరట్‌పై అఫ్రీదీ షేక్ తన అనుయాయులతో కలిసి దాడిచేశాడు. తన వర్గానికి జరుగుతున్న అన్యా యాలు, ఎదురవుతున్న సవాళ్ల గురించి గొంతెత్తి పోరాడుతున్న అతడిని ఇస్లామిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. అలాగే, అదే ప్రాంతానికి, వర్గానికి ఆదర్శ్ భారత్ హనువతేపై జరిగిన దాడిని లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ (ఎల్‌ఆర్‌ఒ) అనే సంస్థ సోషల్ మీడియాలో ఉంచడంతో వెలుగులోకి వచ్చింది.
తాజాగా, భారత్ టి20 వరల్డ్ కప్‌ను గెలుచు కున్నందుకు నాందేడ్‌లో వేడుకలు చేసుకుంటున్న నలుగురు హిందూ విద్యార్ధులపై ముస్లిం విద్యార్ధులు దాడికి పాల్పడ్డారు. దాదాపు పాతికమంది ఇస్లామిస్టులు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో హిందూ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మొత్తం ఘటన సిసిటివిలో రికార్డు అయింది.
ఇక, థానెలో ఒక హిందూ మహిళపై అత్యాచారం చేయడమే కాదు ఎఫ్‌ఐఆర్ చేస్తే సహించ నంటూ షెహజాద్ షేక్ హెచ్చరించాడు. ఈ ఘటన ముస్లింలు అధికంగా ఉండే హజూరీ దర్గా ప్రాంతంలో గత వారం జరిగింది. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక హిందూ మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సకల్ హిందూ సమాజ్ సంస్థ ప్రకారం, ఘటన తర్వాత మహిళ తనను తాను కాపాడుకోవడానికి దగ్గరలో ఉన్న ఆలయంలో దాక్కుంటే దాదాపు వంద నుంచి నూట యాభైమంది ముస్లింలు చెప్పులు విడువకుండా ఆలయంలోకి ప్రవేశించి, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ బెదిరించారు.
పోలీసులు నిందితుడిని అనంతరం అరెస్టు చేసి నప్పటికీ వారి ఆగడాలను వెలుగులోకి తెచ్చేందుకు జూన్ 30వ తేదీన సకల హిందూ సమాజం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి, నింది తుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. వారు ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించడాన్ని నిరసిస్తూ, నిందితులకు కఠిన శిక్షనే కాకుండా ఆ ప్రాంతంలో హిందువుల భద్రతకు చర్యలు తీసుకోవాలని హిందువులు డిమాండ్ చేశారు.
థానే జిల్లాలోని భివాండీ నగరంలో మదర్సా ఆవరణలో ఒక పదకొండేళ్ల బాలుడిని నసీరుల్లా అనే రాక్షసుడు రేప్ చేశాడు. మదర్సాలో చదువుకుంటున్న ఆ బాలుడిపై నసీరుల్లా దారుణమైన అత్యాచారానికి పాల్పడ్డాడు.
అది పేరుకు మీరా రోడ్డే కానీ, అక్కడ ఆధిపత్యం ఇస్లామిస్టులదే. ఒక అపార్ట్‌మెంట్ సముదాయంలో బక్రీద్ సందర్భంగా గొర్రెలను కోయవద్దని కోరిన హిందువులను అవమానించి, దాడి చేశారు ఇస్లా మిస్టులు. గతంలో కూడా రామమందిర ప్రాణప్రతిష్ఠ సమయంలో జరిపిన ఊరేగింపు ఈ ప్రాంతంలోకి వచ్చినందుకు దానిపై రాళ్లు రువ్వి దాడి చేసిన ఘటన పలువురికి గుర్తుండే ఉంటుంది. ఇలా చెదురు మదురుగా ఘటనలు దేశవ్యాప్తంగా అనునిత్యం చోటు చేసుకుంటున్నాయి.
అస్సాంలో రాడికల్ ముస్లిం ముల్లా అరెస్టు
అధికారులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నందుకు, హేతుబద్ధంగా మాట్లాడు తున్న ఒక ఇస్లామిక్ మత గురువును బెదిరించి నందుకు జులై 2వ తేదీన అస్సాం పోలీసులు ముఫ్తీ అరaరీ అనే రాడికల్ ముస్లిం ముల్లాను అరెస్టు చేశారు. లఖీంపూర్ పోలీస్ స్టేషన్‌ను జులై 6న ఘెరావ్ చేయాలని ముఫ్తీ అరaరీ ప్రణాళిక వేశాడు. అంతేకాదు, 6 నుంచి 10వ తేదీ వరకూ రాష్ట్రంలో రోజువారీ జనజీవనానికి భంగం కలిగించే భారీ ఉద్యమాలు చేపడతానంటూ పోలీసులను బెదిరిం చాడు. అధికారులు వేగంగా స్పందించి, అతడిని అరెస్టు చేశారు.
గోవధ ఇస్లాంలో లేదంటూ కమాల్ ముస్తాఫా ఇస్లామిస్టులకు చేసిన అప్పీలు వారికి నచ్చలేదు. దీనితో ఇస్లామిస్టు వర్గాల నుంచి వ్యతిరేకత రావడమే కాక ముస్తాఫాను ముఫ్తీ ప్రత్యక్షంగా బెదిరించాడు. గోవధను నివారించి, హిందువుల భావనలను గౌర వించమంటూ కమాల్ చేసిన విజ్ఞప్తి అక్కడి ఇస్లా మిస్టులకు, వారి గురువు ముఫ్తీకి నచ్చలేదు. దీనితో, కమాల్ ఇస్లామ్‌ను, మహమ్మద్ ప్రవక్తను అవమా నించాడని నిందిస్తూ, అవసరమైన జిహాదీ ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ప్రకటిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఇందులో అతడు పోలీసు అధికారులను నిందించ డమే కాదు, బెదిరించాడు కూడా.
భారత్‌లో పెరుగుతున్న రాడికల్ ఇస్లామ్
అస్సాంలో జరిగిన ఘటన దేశంలో పెరుగుతున్న రాడికల్ ఇస్లామిక్ శక్తుల ప్రభావానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అంతేకాదు, ఇస్లామ్‌లో కూడా కాస్త హేతుబద్ధంగా మాట్లాడుతున్న వారి గొంతుకలను ఈ రాడికల్ ఇస్లామిస్టులు ఎలా నొక్కేస్తున్నాయో పట్టిచూపుతుంది. దేశం నుంచి వేరు చేయాలనే ప్రయత్నం చేస్తున్నవారు ఈ అతివాద ఇస్లామిస్టులు. ఇస్లామ్ పేరుతో ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఉన్నవారిని కూడా ఉన్మాద ఎంపికలు చేయాలని విజ్ఞప్తి చేస్తారు.
హిందూ సమాజం నిద్ర లేవడంమినహా మార్గం లేదు
అన్ని సమస్యలను కోర్టులు పరిష్కరించలేవు. హిందూ సమాజం ఐక్యంగా కలిసి పోరాడితేనే వీటిని నిర్మూలించవచ్చు. ఘజ్వా`ఎ`హింద్ అన్నది కేవలం భారతీయ సరిహద్దులపై దాడిచేసి, భూమిని ఆక్ర మించుకోవడమే కాదు, సనాతన సమాజం అంతర్గత విస్ఫోటనం చెందేలా లవ్ జిహాద్, భూమి జిహాద్, జనాభా జిహాద్ తదితరాలను ప్రయో గించడం. కులాలు, వర్గాలు, ప్రాంతాల పేరుతో అనైక్యంగా ఉన్న భారతీయ సమాజమే వారికి రక్షణ కవచంగా పనిచేస్తోంది. మన నాగరికతా మూలాలనే నిర్మూ లించాలని యత్నిస్తున్న వారిని నిలువరించాలంటే హిందూ సమాజం ఐక్యంగా ఉండటం మినహా మరో మార్గం లేదు.
అన్ని సమస్యలను కోర్టులు పరిష్కరించలేవు. హిందూ సమాజం ఐక్యంగా కలిసి పోరాడితేనే వీటిని నిర్మూలించవచ్చు. ఘజ్వా`ఎ`హింద్ అన్నది కేవలం భారతీయ సరిహద్దులపై దాడిచేసి, భూమిని ఆక్ర మించుకోవడమే కాదు, సనాతన సమాజం అంతర్గత విస్ఫోటనం చెందేలా లవ్ జిహాద్, భూమి జిహాద్, జనాభా జిహాద్ తదితరాలను ప్రయో గించడం. కులాలు, వర్గాలు, ప్రాంతాల పేరుతో అనైక్యంగా ఉన్న భారతీయ సమాజమే వారికి రక్షణ కవచంగా పనిచేస్తోంది. మన నాగరికతా మూలాలనే నిర్మూ లించాలని యత్నిస్తున్న వారిని నిలువరించాలంటే హిందూ సమాజం ఐక్యంగా ఉండటం మినహా మరో మార్గం లేదు.
అసలు నిజం
ప్రతీకారంగానే 2024 సార్వత్రిక ఎన్నికలలో ముస్లింలు బీజేపీని ఓడిరచేందుకు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని దారుల్` ఉలూం` దేవబంద్ ప్రిన్సిపల్, జమాయెత్ ఉలేమా` ఇ`హింద్ అధ్యక్షుడు అర్షద్ మదనీ వ్యాఖ్యానించి, అసలు గుట్టు రట్టు చేశాడు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ద్వేషాన్ని, మతతత్త్వ రాజకీయాలను తిరస్కరించాయని, ముస్లింలు తెలివిగా ఓటు వేయడంవల్లే ఈ ఫలితం సాధ్యమైందని వ్యాఖ్యా నించాడు. వారు తెలివిగా ఓటు వేయకపోయి ఉంటే ఫలితాలు మరొకరకంగా ఉండేవంటూ కూడా తాలిబన్‌ను సమర్ధించే అర్షద్ మదనీ వ్యాఖ్యా నించడాన్ని మించిన మతతత్వం వేరేమైనా ఉంటుందా? రాహుల్‌గాంధీ, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ సెక్యులర్ వైఖరిని కొనియాడాడు. అంతేనా, ముస్లింలు దేశభక్తులని, దేశాన్ని తమ ప్రాణాలకన్నా ఎక్కువగా ప్రేమిస్తారంటూ ఒక హాస్యాస్పదమైన వ్యాఖ్య చేశారు. మేధావులు, సెక్యులరిస్టులుగా భావించుకునే వారికి అతడు మాట్లాడినది సమంజసంగా అనిపించవచ్చేమో కానీ, ఇస్లాంలో ఉమ్మాకు తప్ప దేశమనే భావనకే చోటు లేదని తెలిసినవారు మాత్రం అందులోని కాపట్యాన్ని గ్రహిస్తారు. దేశ విభజన సమయంలో జమాయెత్ ఉలేమా`ఇ` హింద్, తబ్లీగీ జమాత్‌కు చెందిన నాయకులు అనేకమంది విభజన కోరిన జిన్నాను సమరిస్తూ ముస్లిం లీగ్‌లో చేరగా, భారతీయులను పూర్తిగా మతాంతరీకరించాలనే ఉద్దేశ్యంతో విభజన సమయంలో అనేకమంది జమాయెత్ నాయకులు భారత్‌లోనే ఉండిపోయారన్న వాస్తవాన్ని మరువలేం. పైకి సెక్యులరిజం గురించి మాట్లాడే ఈ నాయకులు దారుల్`ఉలూం` దేవ్‌బంద్‌ను అడ్డుపెట్టుకొని, అతివాద ఇస్లామిస్టులను తయారుచేసి ప్రపంచ వ్యాప్తంగా వేల (ఇప్పుడు లక్షలవరకూ ఉండచ్చు) సంఖ్యలో మదర్సాలు తెరిచి, ఏం చేస్తున్నారో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సెక్యులరిజం పేరుతో ఇస్లామిస్టుల పట్ల బుజ్జగింపు ధోరణిని అనుసరించడమే ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకులు చేస్తున్న తప్పులా కనిపిస్తోంది. లండన్, ఫ్రాన్స్ మొదలుకొని జర్మనీ వరకూ ఆ పొరపాటువల్ల నేడు శిక్షను అనుభవిస్తు న్నాయి. వేరే దేశంలో ఉన్న రెండవ తరం ముస్లింను కూడా బ్రెయిన్‌వాష్ చేసి ముస్లిం ఉమ్మా తప్ప దేశభక్తి అనే భావనలేకుండా చేసే మదర్సాలు, మదనీ వంటి నాయకులు తమ దేశభక్తి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా అనిపించక మానదు. ఒక్కటి మాత్రం నిజం, వారు హిందువుల పెద్ద మనసు కారణంగా వచ్చే లాభాలను అనుభవించి, బీజేపీ వంటి పార్టీని అణగదొక్కాలనుకున్నారు, ఓటు వేయలేదు. అయినా, బీజేపీ గెలవడాన్ని జీర్ణం చేసుకోలేక ఇటువంటి వ్యాఖ్యలను చేసి, వాతావరణాన్ని పాడు చేయాలని ప్రయత్నిస్తున్నారు. హిందువులు అప్రమత్తంగా ఉండడం తప్ప మరొక మార్గం లేదు.