– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం మరింత సంతృప్తినిస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. జీవిత భాగస్వామి నుంచి ధన, ఆస్తిలాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు మరింత ఊరట లభిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 26,27 తేదీలలో దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా ముగిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయవేత్తలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కళాకారులు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి. 22,23 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆదిత్య హృదయం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరణలో ముందుకు సాగుతారు. ఉద్యోగులు సమర్థత, నైపుణ్యాన్ని చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రచయితలు, క్రీడాకారులకు సమస్యలు తీరే సమయం. 24,25 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. గణేశ్ను పూజించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

అనుకున్న ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. యుక్తితో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వాహనసౌఖ్యం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవేత్తలు విశేష గుర్తింపు పొందుతారు. కళాకారులు, పరిశోధకులకు మరింత అనుకూలత. 25,26తేదీల్లో దుబారా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులతో  వివాదాలు తీరతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. కళాకారులు, రచయితలకు సమస్యలు తీరతాయి.  27,28తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొన్ని కార్యక్రమాలను శ్రమ్యాధిక్యంతో పూర్తి చేస్తారు. ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరతాయి. మీఖ్యాతి పెరుగుతుంది. కాంట్రాక్టర్లు దక్కించుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. వాహనాలు, ఇళ్లు కొంటారు. మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలున్నాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.26,27 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. హనుమాన్ఛాలీసా పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. ఆర్ధిక విషయాలు సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. కార్యజయంతో ఉత్సాహంగా సాగుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, పరిశోధకులకు అనుకూల సమయం. 23,24తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. దేవీఖడ్గమాల పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

మొదట్లో ఏర్పడిన సమస్యలు ఎట్టకేలకు పరిష్కారవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొని మీ సేవానిరతిని చాటుకుంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి తరఫున ఆస్తిలాభం ఉంటుంది. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు కలసివచ్చే కాలం. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులు మంచి పేరు సంపాదిస్తారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. రచయితలు అనుకున్నది సాధిస్తారు. 25,26 తేదీలలో అనుకోని ప్రయాణాలు. ధనవ్యయం. కాలభైరావష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగక డీలా పడతారు. బంధువులే మీ అభిప్రాయాలను గౌరవించకపోవడంతో ఇబ్బంది పడతారు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.వాహనాలు విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో నిర్ణయాలపై విభేదిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమ మరింత పెరుగుతుంది. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. రచయితలు, క్రీడాకారులకు ఒత్తిడులు. 27,28తేదీల్లో ధనలాభం. కార్యసిద్ధి.  అన్నపూర్ణాష్టకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. రియల్టర్లకు సంతోషకరమైన సమాచారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. గతానుభవాల రీత్యా నిర్ణయాలలోఆచితూచి వ్యవహరిస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. క్రీడాకారులకు, రచయితలకు శుభవార్తలు. 24,25 తేదీల్లో దుబారా ఖర్చులు. సోదరులతో వివాదాలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ముఖ్య కార్యాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్నది సాధించాలన్న తపనతో ముందడుగు వేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు లాభదాయకంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు పోటీపరీక్షలలో విజయం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు, ఇంక్రిమెంట్లు. కళాకారులు, రచయితలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 22,23తేదీలలో శారీరక రుగ్మతలు. మానసిక అశాంతి. శివాష్టకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. బ్యధువులతో  వివాదాలు సర్దుబాటు కాగలవు. రియల్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది.  రాజకీయవర్గాలకు మరింత  ఉత్సాహం. కళాకారులు, క్రీడాకారులకు విశేష ఆదరణ. 27,28 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. శివపంచాక్షరి పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE