టిఎన్‌. ‌భూషణ్

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన సాగాలని, ప్రజాహితం కోసం సుపరి పాలన అందిస్తోన్న నరేంద్రమోదీకి ప్రజలంతా చేయూత ఇవ్వాలని, పార్టీ బలోపేతం లక్ష్యంగా కార్యక్రమాలు సాగాలని భారతీయ జనతా పార్టీ ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ‘దేశంకోసం.. ధర్మం కోసం’ నినాదంతో రాజమహేంద్రవరంలో జులై 8న నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, ‌జాతీయ సంయుక్త కార్యదర్శి శివప్రకాష్‌, ‌కేంద్రమంత్రులు మురుగన్‌, ‌భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్రమంత్రి వై.సత్యకుమార్‌, ఎం‌పీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్డీఏకి ప్రజలు బ్రహ్మరథం పట్టిన నేపథ్యంలో వారి సమస్యల పరిష్కారానికి నిర్విరామంగా కృషిచేయాలని సూచించారు. మోదీ సారథ్యంలో అమలుచేసిన పథకాలు, లబ్ధిదారుల వివరాలను వెల్లడించారు. కూటమి నాయకులతో కలిసి ముందుకు సాగాలన్నారు. పార్టీల వారీగా నమోదైన ఓట్లు, గత ఎన్నికలతో పోల్చితే తగ్గిన, పెరిగిన ఓట్ల శాతాలపై సమీక్షించి చేపట్టవలసిన భవిష్యత్‌ ‌కార్యాచరణను వివరించారు. మూడోసారి ప్రధాని అయిన మోదీకి అభినందనలు తెలియజేస్తూ ఒక తీర్మానం, రాష్ట్రంలో అద్భుత ఫలితాన్ని ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మరొక తీర్మానం ఆమోదించారు. రాష్ట్ర కార్యాలయంలో ప్రతివారం ప్రజాదర్బార్‌ ‌నిర్వహించాలని నిర్ణయించారు. నేతల ప్రసంగాలు ఇలా ఉన్నాయి……
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకుని ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, అవినీతి రహిత పాలన అందించాలని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల జగన్‌ ‌పాలన మరో ఎమర్జెన్సీని తలపించిందని, నోరు విప్పి ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని నిప్పులు చెరిగారు. గుడులు కూల్చడంతోపాటు రథాలను కూడా కాల్చారని, ఇదేమని ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టారని మండిపడ్డారు. గతంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ చీకటి పాలనను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు. అదే విధంగా గత ఐదేళ్ల వైసీపీ పాలనను కూడా ప్రజలు మరిచిపోరని వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి చేస్తున్న ప్రకటనలపై ఆమె ఘాటుగా స్పందించారు. ‘గతంలో ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. గత ఐదేళ్ల జగన్‌ ‌పాలనలో ఇంచుమించు అలాంటి ఎమర్జెన్సీ వాతా వరణమే నడిచింది. గళం విప్పిన వారందరిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు మరచిపోయారేమో కానీ రాష్ట్ర ప్రజలు మరచిపోలేదు. రాష్ట్రంలో విధ్వంసం జరుగుతోందని జగన్మోహన్‌రెడ్డి అంటున్నారు. బహుశా ఆయనకు జ్ఞాపకశక్తి సన్నగిల్లిందేమో. ఐదేళ్ల కిందట వైసీపీ అధికారం చేపట్టాక ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అంతర్వేది రథం కాల్చివేత, పిఠాపురంలో ఆలయ విధ్వంసం వంటి ఎన్నో సంఘటనలు జరి గాయి. ఇవన్నీ విధ్వంసం కాదా?’ అని పురందేశ్వరి సూటిగా ప్రశ్నించారు.
డబులింజన్‌ ‌సర్కారుతో అభివృద్ధి : మురుగన్‌
‌ప్రధాని నరేంద్రమోదీ విజన్‌ ‌దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని కేంద్ర సమాచార శాఖ సహాయమంత్రి ఎల్‌. ‌మురుగన్‌ అన్నారు. ఈ సమా వేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. డబులింజన్‌ ‌సర్కార్‌ ‌ద్వారా దేశంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగానే ఏపీలోనూ రాబోయే రోజుల్లో అభివృద్ధి వేగం పుంజుకుంటుం దన్నారు. సామాజిక న్యాయం చేయడంలో మోదీనే రియల్‌ ‌హీరో అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
సమన్వయంతో కూటమి గెలుపు:శ్రీనివాసవర్మ
బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ చక్కటి సమన్వయంతో రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించిందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆన్నారు. అరుణ్‌సింగ్‌, ‌సిద్ధార్థనాథ్‌ ‌సింగ్‌ ‌వంటి పెద్దలు ఈ విషయంలో చేసిన కృషి అభినందనీయమన్నారు. గతంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‌లోనూ ఇలాంటి సమన్వయు పరిస్థితి ఉందని గుర్తుచేశారు. ఐపీసీ, ఐఏఎస్‌ ‌చట్టాలను, వాటిని భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం పేరుతో సత్వరమే అమలయ్యే చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వానికి ప్రజల తరపున ఆంధప్రదేశ్‌ ‌బీజేపీ కార్యవర్గ సమావేశం ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టినట్టు ఆయన పేర్కొన్నారు.
క్షీణిస్తోన్న కాంగ్రెస్‌ : అరుణ్‌సింగ్‌
‌సార్వత్రిక ఎన్నికలకు ముందు కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాదరణ కోల్పోయిన కాంగ్రెస్‌ ‌పార్టీ చిత్తుగా ఓడిపోయిందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ అన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను పేరు పేరునా అభినందిం చారు. మోదీ పథకాలు ప్రజలకు చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేయాలని సూచించారు. కూటమి ఏర్పడడంలో పవన్‌ ‌కల్యాణ్‌ ‌కీలక పాత్ర పోషించారని తెలిపారు.
కూటమితో సమన్వయం అవసరం : శివప్రకాష్‌
‌దేశంలో, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్న నేపథ్యంలో సహ పార్టీలతో విభేదాలు లేకుండా సమన్వయం చేసుకుని ముందుకుసాగాలని పార్టీ సంఘటన జాతీయ కార్యదర్శి శివప్రకాష్‌ ‌శ్రేణులకు సూచించారు. శ్రేణులతో అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వైసీపీ ఓడిన నేపథ్యంలో అనేకమంది బీజేపీలో చేరేందుకు పావులు కదుపు తున్నట్లు తెలుస్తోందని, ఈ విషయంలో తొందర పాటు నిర్ణయాలు వద్దని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
జగన్‌ ‌విధ్వంసం అనంత : సత్యకుమార్‌
‌వైసీపీపాలనలో రాక్షస, నియంతృత్వ, అవినీతి, ఆరాచకపాలనవల్ల వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని రాష్ట్రమంత్రి సత్యకుమార్‌ ‌విమర్శించారు.
రాష్ట్రం అన్నివిధాలా ధ్వంసమైందని, ప్రతి శాఖను తాకట్టుపెట్టి పెద్దమొత్తంలో అప్పులు చేశారని,ఈ ఆర్థిక విధ్వంసం పూడ్చాలంటే దశాబ్దాలు పట్టేటట్టు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ సంస్థల నుంచి విద్యుత్తు శాఖకు రూ.1.30 లక్షల కోట్ల అప్పులు తెచ్చారన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించలేదన్నారు. ఫైనాన్స్ ‌కమిషన్‌ ఏటా ఇచ్చే రూ.500 కోట్లు, వసతుల కల్పన కింద కేంద్రం ఇస్తున్న వడ్డీలేని రుణాలను దారి మళ్లించారన్నారు. వైద్య కళాశాలలను చూపించి తీసుకున్న రూ.2 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో తెలియడం లేదన్నారు. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మా ణానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందన్నారు. ‘గత ప్రభుత్వ చేతకానితనం వల్లే డయాఫ్రంవాల్‌ ‌దెబ్బతింది. ఆమరావతికి మొదటి నుంచి బీజేపీ మద్దతు ఉంది. ఒకే రాజుధాని అనేదే మా నినాదం. మొదట్లోనే కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చింది’’ అని సత్యకుమార్‌ ‌స్పష్టం చేశారు.
బీజేపీ శ్రేణుల సందడి
ఈ సమావేశానికి హాజరైన నాయకులు, శ్రేణు లతో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రి,ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు పలువురు ఈ సమా వేశానికి హాజరుకావడం వారితోపాటు అనుచరగణం కూడా కార్లు, ఇతర వాహనాల్లో తరలిరాగా, రాజ మహేంద్రవరంలోని ప్రధాన రహదారులపై హడా వుడి కనిపించింది. ఈ దారి పొడవునా బీజేపీ జెండాలు కట్టారు. పలు ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. మరో పక్క సమావేశం ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. ప్రతినిధుల పేర్ల రిజిస్ట్రేషను, ఇతర సమాచారం కోసం ప్రత్యేకంగా కౌంటరు ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ ‌జైలు రోడ్డులోని ఓ హోటల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన సమావేశానికి సుమారు 2,500 మంది హాజరయ్యారు.
డిజిటల్‌ ‌విధానంతో నమోదు
పార్టీ కార్యవర్గ సమావేశానికి వచ్చేవారి నమోదుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేశారు. సభ్యులు క్యూఆర్‌ ‌కోడు నమోదు చేసుకున్న వెంటనే డిజిటల్‌ ‌తెరపై జిల్లాల వారీ ప్రతినిధుల సంఖ్య చూపేలా ఏర్పాట్లు చేశారు. సభాప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసిన మోదీ కటౌట్లు, జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌, ‌డిజిటల్‌ -ఇం‌డియా, పార్లమెంట్‌ -‌నమూనా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజును పురందేశ్వరి సత్కరించారు.
ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌ ‌రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజనాచౌదరి, పీవీ పార్థసారథి, ఎన్‌.ఈశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, జీవీఎల్‌ ‌నరసింహరావు, సోము వీర్రాజు, రాష్ట్ర కార్యవర్గం, భాజపా రాజ మండ్రి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రొంగల గోపి, ఆడబాల రామకృష్ణారావు, ఎనుముల రంగ బాబు, కురగంటి సతీష్‌ ‌తదితరులతో పాటు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE