ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన, విధ్వంసం, వనరులు కోల్పోవడం వంటి వాటి వల్ల రాష్ట్ర ఆర్థ్ధిక పరిస్థితి అనిశ్చితిగా మారిందని రాష్ట్ర పునర్నిర్మాణం కష్టంగా ఉందని ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఆర్థ్ధిక అనిశ్చితి నుంచి నిలకడ సాగుతూ సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తామని ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రభుత్వం రాష్ట్ర వాస్తవ ఆర్థ్ధిక పరిస్థితిని తెలియచేసింది. 2024`25 ఏడాదికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ, అయిదేళ్ల జగన్ అరాచక పాలనపై జరిగిన నష్టాలను ప్రజలకు తెలియచేసింది. 2014లో రాష్ట్ర విభజన కారణంగా జరిగిన నష్టం కంటే జగన్ లో జరిగిన నష్టమే అధికంగా ఉందని పేర్కొంది. కూటమి ప్రభుత్వం తన ముందున్న సవాళ్లను తెలియజేసింది.
2014లో అశాస్త్రీయ విభజన వల్ల నవ్యాంధ్రకు 46శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయి. ఆర్థిక వ్యవస్థపై కనీవినీ ఎరుగని ఒత్తిడి కలిగించింది. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధి పథంలో పయనిస్తుండగా, 2019లో జరిగిన అధికార మార్పిడి, నవ్యాంధ్రó ప్రదేశ్‌కు మళ్లీ విఘాతం కలిగించింది. 2014లో రాష్ట్ర విభజన భారాన్ని చవిచూసిన రాష్ట్రం.. ఆ 2019-24 మధ్య అసమర్థ పాలన రూపంలో మరో పెద్ద పరాజయాన్ని చూసింది. ఇది దురదృష్టకరం. జగన్ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించిన విధ్వంసం ఇటీవల పదవీకాలం ముగిసే వరకు నిరంతరాయంగా కొనసాగించింది. ఈ ఐదేళ్లలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరది. ప్రతీకార రాజకీయాలు రాష్ట్ర శ్రేయస్సు, అభివృద్ధి అవకాశాలను దెబ్బతీశాయి.
గత ప్రభుత్వ దుష్పరిపాలన, ఐదేళ్లలో వ్యవస్థల విధ్వంసం, విపరీతమైన అవినీతి, నిధులు వినియో గంలో అంతరాలు, దుర్వినియోగం మూలంగా రాష్ట్ర ఖజానాకు వాటిల్లిన నష్టం, సహజ వనరుల దోపిడీ తదితర అంశాలను వివరిస్తూ కూటమి సర్కారు శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాంక్షిస్తూ.. ప్రజాహిత ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు 5 కోట్ల మంది ప్రజలు చూపిన సంకల్పాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది.
నవ్యాంధ్ర వృద్ధికి కేంద్ర బిందువుగా భావించిన అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశన మైంది. అమరావతి కలను నీరుగార్చేందుకు గత ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ ముసుగులో మూడు రాజధానుల ఆలోచనలతో ప్రజలను గందరగోళం లోకి నెట్టింది. మూడు రాజధానుల ఏకపక్ష ప్రకటన ఫలితంగా రాజధానివాసులు 1,631 రోజులు నిరసన చేయాల్సి వచ్చింది. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్‌డీఏ) అధికార పరిధిని 6,993 చ.కి.మీ.కు కుదించడం, ప్రాంతీయ బృహత్తర ప్రణాళికలను రూపొందించకుండా పక్కన బెట్టేయడంతో అమరావతి ప్రాంత పురోగతిని అడ్డుకున్నాయి. ఫలితంగా పెట్టుబడి అవకాశాలు, వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడిరది. 7 లక్షల ఉద్యోగావకాశాలతో పాటు రూ.2 లక్షల కోట్ల సంపద నష్టం జరిగింది.
మౌలిక వసతులేవీ..?
గత ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి అనే మాటకు దూరంగా ఉంది. కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నాటి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పూర్తికాలేదు. కొత్త పరిశ్రమలేవీ రాలేదు. రోడ్లు, భవనాలు, ఆస్పత్రులు, తాగునీటికి సంబంధించి ఎలాంటి మౌలిక సదుపా యాలు చేపట్టలేదు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసింది. కాంట్రాక్టులను రద్దుచేసి రివర్స్ టెండరింగ్‌ను ప్రవేశపెట్టి మరల ఇతర నిర్మాణాల పేరుతో ఆర్థ్ధిక భారం మోపింది.
వనరుల దోపిడీ
ఐదేళ్లలో భూమి, గనులు, ఖనిజాలు, అడవుల వంటి సహజ వనరుల దుర్వినియోగం, దోపిడీ జరిగింది. భూ ఆక్రమణలు, అనర్హులకు ఇంటి స్థలాలు, భూకేటాయింపుల్లో ఉల్లంఘనలు జరిగాయి. మొత్తంగా 1.75 లక్షల ఎకరాలకు సంబంధించి రూ. 35,576 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం కలిగింది. రీసర్వే, ఏపీ భూహక్కు చట్టం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. 2019-24 మధ్య కాలంలో ఇంధన రంగానికి కోలుకోలేని విధంగా రూ.1,29,503 కోట్ల నష్టం జరిగింది. ఇసుక, ఖనిజ సంపదను కొల్లగొట్టడంతో ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. ఈ రంగాల్లో అక్రమ కార్యకలాపాల వల్ల ప్రాథమికంగా రూ.19 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. అసమర్థ, అసమంజస విధాన రూపకల్పన, అమల్లో అలసత్వం కారణంగా ఖనిజ రాబడిలో రూ.9,750 కోట్ల మేర నష్టం వచ్చింది. ఎర్రచందనంలో 2014-19 మధ్య రూ.1,623 కోట్ల ఆదాయం రాగా, గత ఐదేళ్లలో అక్రమ రవాణా కారణంగా ఆ ఆదాయం రూ.441 కోట్లకు పడిపోయింది. విశాఖపట్నంలోని రుషికొండ, మడ అడవుల విధ్వంసంతో ప్రకృతి వనరులను, పర్యా వరణాన్ని ధ్వంసం చేశారు.
నాణ్యత లేని మద్యం విక్రయాలు
వైసీపీ ప్రభుత్వం నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ ప్రజలతో తీవ్ర విమర్శలపాలైంది. మద్యం దుకాణా లను తామే నిర్వహిస్తూ నాసిరకంలేని మద్యాన్ని రెట్టింపు ధరలకు అమ్మిన వ్యవహారంపై దేశ వ్యాప్త చర్చ జరిగింది. అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తామన్న ఆ పార్టీ అందుకు భిన్నంగా వ్యవహ రించింది. ఏపీఎస్‌సీ ద్వారా పొందిన రుణాలను తిరిగి చెల్లించేందుకు కార్పొరేషన్ ద్వారా విక్రయించే మద్యం ధరలపై అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం విధించింది. గుర్తింపులేని బ్రాండ్లను ప్రవేశ పెట్టింది. సరిహద్దు జిల్లాల్లో మద్యం అక్రమ రవాణాతో నల్లడబ్బు పెరిగింది. ఇలా రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయ మార్గాల్ని గత ప్రభుత్వం దెబ్బతీసింది. ఇక ఈ నాణ్యతలేని మద్యం తాగి ఎంతోమంది ఆనారోగ్యంతో ఆసుపత్రుల పాలైయ్యారు.
అధికార దుర్వినియోగం
తమ అవినీతి, అరాచకాలకు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసింది. కొందరు అధికారులు కూడా ప్రభుత్వానికి సహకరించి విమర్శల పాలయ్యారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన ప్రతిపక్షాల, ప్రజల గొంతు నొక్కేలా ప్రభుత్వం వ్యవహరించింది. విమర్శకులను, అసమ్మతి గళాలను వేధించి అణచివేసేందుకు ప్రయత్నించారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, బడుగు వర్గాలపై అఘాయిత్యాలు పెరిగాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిల్లుల చెల్లింపుల కోసం 25 వేల కేసులు దాఖలయ్యాయి. అనేక కేసుల్లో అధికారులు వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావడం, అరెస్టు, ధిక్కార కేసులు నమోదుతో బ్యూరోక్రసీ అవమానాల పాలైంది
ఉపాధికి ఎసరు
గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరవయ్యాయి. చదువుకున్న నిరుద్యోగులు పెరిగిపోయారు. విద్యలో నాణ్యత, నైపుణ్యంపై ప్రభుత్వం దృష్టిపెట్ట లేదు. నిర్మాణరంగం, ఐటీలపై ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించలేదు. ఫలితంగా నిరుద్యోగులు అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురై తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. అప్పటికే ఉన్న ఔత్సాహిక పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. సాగునీటి ప్రాజెక్టులు, కొత్త పరిశ్రమలు, రోడ్లు-భవనాలు, ఆసుపత్రులు, తాగునీటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇంధన రంగం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అవగాహన ఒప్పందాల్ని రద్దు చేశారు. విధ్వంసకర నిర్ణయాలు, వాటి పర్యవసనాలు యువత, ఉద్యోగార్థుల్లో అశాంతికి దారితీశాయి. ఈ అనిశ్చితి వాతావరణం వల్ల యువత మాదకద్రవ్యాలకు బానిసగా మారింది. తద్వారా మత్తు పదార్థాల ముప్పు ఏర్పడిరది. అలాగే ఇసుక విధానం వల్ల 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పో యారు.
సూపర్‌సిక్స్ అమలు చేస్తున్నాం…
కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రారంభించింది. సూపర్ సిక్స్ హమీల అమలుకు కట్టుబడి ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, పింఛన్లను రూ.4 వేలకు పెంచడం, నైపుణ్య గణన నిర్వహించడం, పేదలకు నాణ్యమైన ఆహారాన్ని రూ.5లకు అందిం చేందుకు అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం, ఉచిత ఇసుక వంటి వివిధ చర్యలతో తన ప్రజా కేంద్రీకృత పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమర్థ నాయకత్వం లోని ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడాన్ని అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. ఎన్నికల్లో గెలవడం, బాధ్యతలను స్వీకరించడం సంతోషకర మైన విషయమే అయినా.. దేశంలోనే మొదటిసారిగా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నందున సామరస్య పూర్వక పరిష్కారాలను త్వరగా కనుగొనాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢల్లీి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను, అధికారులను కలిశారు. తెలంగాణ ప్రభుత్వంతోనూ సమావేశ మయ్యారు.
పునర్నిర్మాణం వైపు
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అపూర్వమైన తీర్పుతో ప్రజాహిత ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఐదు కోట్ల మంది ప్రజలు చూపిన సంకల్పాన్ని అభినందించాలి. అలాగే ప్రస్తుత ఆందోళనకర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వానికి సహకరించాలి. సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించ డానికి సమష్టి ఆలోచన, మేధావులు, విద్యావేత్తలతో విస్తృతమైన చర్చలు అవసరం. 2047 నాటికి వికసిత్ భారత్ అనే నూతన అభివృద్ధి నమూనా దృష్ట్యా స్వల్ప, మధ్య స్థ, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా అభివృద్ధి సంబంధిత వ్యవస్థను ప్రారంభించే చర్యలు తీసుకుంటాం.
కేంద్ర బడ్జెట్‌లో ఎపీకి నిధుల కేటాయింపు
రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్‌ను గట్టెక్కించేలా కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు వెల్లడిరచారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు. విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని తెలిపారు. వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్-బెంగళూరు పారి శ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ-చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని తెలిపారు.
– టిఎన్. భూషణ్, సీనియర్ జర్నలిస్ట్