అదంతా లాంఛనమని ప్రపంచానికి తెలుసు. ఎన్ని సర్వేలు చేసినా వెలుగు చూసేది ఆ ఒక్క వాస్తవేమనని తెలుసు. అది తిరుగులేని చారిత్రక సత్యమేనని తెలుసు. భారతభూమిలోని వేలాది హిందూ దేవాలయాలు ముస్లిం దురాక్రమణదారుల మతోన్మాదంతో అపవిత్రమైనాయని, ధ్వంసమైపోయాయని చరిత్ర ఘోషిస్తున్న సంగతీ తెలుసు. మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల ‘కట్టడం’  గురించి వెల్లడైనది అలాంటి మరొక సత్యమే. ధార్‌ అనే చోట ఇది ఉంది. ధార్‌ ఒకప్పటి సంస్థానం. భోజ్‌శాల ఆలయం`కమాల్‌ మౌలానా మసీదు అంటూ పిలుస్తున్న ఈ కట్టడం అంతకు ముందే ఉన్న హిందూ దేవాలయం మీద నిర్మించినదేనని భారత పురావస్తు పరిశోధన శాఖ (ఏఎస్‌ఐ) తేల్చి చెప్పింది. మార్చి 22, 2024`జూన్‌ 30, 2024 వరకు ఆ ఆలయం`మసీదు ప్రాంగణంలో జరిపిన సర్వే చాటిన వాస్తవమిదే. ఈ మేరకు 150 పేజీల నివేదికను ఇందోర్‌లోని ఎంపీ హైకోర్టు ధర్మాసనానికి జూలై 15న సమర్పించింది. ఇప్పుడున్న మసీదు హిందూ దేవాలయం శిథిలాల మీదే నిర్మించారు. అంతకు ముందు అక్కడ ఉన్నది హిందూ దేవాలయమేనని ఎలాంటి శషభిషలు లేకుండానే లోకానికి వెల్లడిరచింది. ఈ నివేదిక రూపొందించినది ఏఎస్‌ఐ అయినా, సమర్పించినది హైకోర్టుకే అయినా యథాప్రకారం ముస్లిం మత పెద్దలకు ఆగ్రహం వచ్చింది. పనిలో పనిగా ఉదారవాదులకి పూనకం వచ్చింది.

భోజ్‌శాలను తిరిగి సాధించుకోవడానికి హిందువులు పెద్ద పోరాటమే ఆరంభించవలసి వచ్చింది. ఎప్పుడో 1552లో ఆరంభమైంది. మొగలులు, ఆంగ్లేయులు, స్వతంత్ర భారతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు హిందువులను చాలా హింసించారు. కాంగ్రెస్‌ హయాంలో వివక్ష సుస్పష్టం. అయినా సాధారణ హిందువులు ఆరంభించిన ఈ ఉద్యమం పాక్షికంగానే అయినా ఇప్పటికి విజయం సాధించింది. ప్రాంగణంలోకి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిషేధించిన ప్రవేశహక్కును తిరిగి సాధించుకున్నారు. ఇక్కడి అమ్మవారి విగ్రహాన్ని బెంగాల్‌ విభజన కుట్రదారు కర్జన్‌ ఇంగ్లండ్‌ తరలించాడు. ఇప్పుడు న్యాయపోరాటం ద్వారా హిందువులు భోజ్‌శాలమీద కాషాయ జెండా ఎగురవేసే ప్రయత్నంలో ఉన్నారు. తమవైన ప్రార్థనా స్థలాల కోసం, పురాణ ప్రశస్తి కలిగిన పుణ్యతీర్ధాల కోసం హిందువులు ఆరంభించిన న్యాయపోరాటాలు అయోధ్యతోనే ఆగిపోలేదు. దేశంలో పలుచోట్ల కొత్త పోరాటాలు జరుగుతున్నాయి. కొందరి వాదన ప్రకారం ముస్లింల పాలనలో 60,000 హిందూ దేవాలయాలు ధ్వంసమైనాయి. ఇంకొందరి వాదన ప్రకారం 30,000 నుంచి 40,000 హిందూ దేవాలయాలు ముస్లిం మతోన్మాద కరవాలానికి ఛిద్రమయ్యాయి. వీటిలో ప్రతి ఒక్క హిందూ దేవాలయం మాకు పవిత్రమైనదేనని కొన్ని హిందూ సంఘాలు గర్జిస్తున్నాయి. వీటి కోసమే ఇప్పుడు న్యాయపోరాటం ఆరంభమైంది. ఒకదాని తరువాత ఒకటిగా వీటిని స్వాధీనం చేసుకోవాలన్నదే హిందూ సంఘాల ఆశయం.

సర్వే సాక్షిగా అది వాగ్దేవి ఆలయం

భోజ్‌శాల పేరుతో ప్రసిద్దమైన ధార్‌లోని ఆ కట్టడం ఒకప్పటి హిందూ ఆలయం, అంటే సరస్వతి అమ్మవారి ఆలయం. కాబట్టి అక్కడ ముస్లింల నమాజ్‌ను నిషేధించాలని హిందువులు న్యాయ స్థానాన్ని కోరుతున్నారు. ఈ మేరకు హిందూ సంఘాలు దాఖలు చేసిన వ్యాజ్యంతో మధ్యప్రదేశ్‌ హైకోర్టు సర్వే జరపవలసిందిగా మార్చి 11, 2024న ఏఎస్‌ఐని ఆదేశించింది. సర్వేలో నిగ్గు తేలిన నిజాలన్నీ పొల్లుపోకుండా హిందువులు చెబుతున్నదానికీ, వాదిస్తున్న దానికీ అనుగుణంగానే ఉన్నాయి.ఆ సర్వే ప్రకారం ఈ ప్రాంగణంలో 94 గ్రంథాలు దొరికాయి. 106 స్తంభాలు, 82 పిలాస్టర్లు, 31 పునాతన నాణేలు, 150 శాసనాలు బయటపడ్డాయి. వినాయకుడు, బ్రహ్మదేవుడు దేవేరులతో కలసి ఉన్న ప్రతిమలు దొరికాయి. నరసింహ, భైరవ మూర్తులు కూడా బయటపడ్డాయి. ఈ ఆధారాలను బట్టి ఇది పూర్వం సరస్వతీ అమ్మవారి కోసం లేదా చారిత్రకంగా ప్రసిద్ధమైన వాగ్దేవి కోసం నిర్మించిన ఆలయం కావచ్చునని ఏఎస్‌ఐ వెల్లడిరచింది. ఇది సరస్వతీ అమ్మవారి ఆలయమేనని చిరకాలంగా ధార్‌ ప్రాంతం లేదా మాల్వా ప్రాంత హిందువులు విశ్వసిస్తున్నారు.

నివేదిక ఇంకా ఇలా చెప్పింది. శాస్త్రీయ పరిశోధనలు, సర్వే, పురావస్తు తవ్వకాలు, జరిపిన అధ్యయనం, విశ్లేషణ, తవ్వకాలలో బయల్పడిన శిథిలాలు, శిల్పాలు, శాసనాలు, వాస్తు, శైలి, శిల్పశైలిలను బట్టి ఇప్పుడు ఉన్న కట్టడం పూర్వం ఉన్న వేరొక కట్టడం మీద నిర్మించినదేనని చెప్పగలమని కోర్టుకు సమర్పించిన ఏఎస్‌ఐ నివేదిక వెల్లడిరచింది. ఇందుకు సంబంధించిన కొన్ని బలమైన ఆధారాలు కూడా ఏఎస్‌ఐ కోర్టు ముందు ఉంచింది. మొదట ఉన్న ఒక రాతి కట్టడం పైననే ఇప్పుడున్న రాతి కట్టడాన్ని మలిచారని, దానినే మసీదుగా మార్చారని దొరికిన శిలాశాసనాల భాగాలు, శిథిలశిల్పాలు, వాస్తుజాడలను బట్టి చెప్పవచ్చునని నివేదిక స్పష్టం చేసింది. మొదటి కట్టడం 11వ శతాబ్దానికి చెందినదనీ, దాని మీదనే ప్రస్తుత కట్టడాన్ని నిర్మించారనీ, ఇది 14వ శతాబ్దానికి చెందినదనీ నివేదికలో తెలియచేశారు. కొత్త కట్టడం ఆదరబాదరా నిర్మించినదేనని తేలింది. పాత కట్టడంలోని కొంత పాలరాయిని, కొంత సున్నపు రాయిని కొత్త కట్టడం కోసం ఉపయోగించారు.

హిందూ ప్రతీకలు, చారిత్రక ఆధారాలు

 హిందూధార్మిక గ్రంథాలలో, శిల్పాలలో కనిపించే సింహం, ఏనుగు, గుర్రం, కుక్క, కోతి, పాము, తాబేలు, హంస, పక్షి బొమ్మలు కూడా లోపల కనిపించాయి. ఒక రాయి మీద కూర్మావతారం కనిపించింది. విష్ణువు గురించి ప్రాకృత భాషలో ప్రస్తావించే పంక్తులు చెక్కారు. రెండు సర్పబంధ శాసనాలు దొరికాయి. వాటిలో ఒక దాని మీద సంస్కృత శ్లోకం ఉంది. ఈ శాసనాలు 11,12 శతాబ్దాలకు చెందినవి. అనుష్టుప్‌ ఛందస్సులో రాసిన మరొక రెండు శ్లోకాలు కూడా రాళ్ల మీద దొరికాయి. అందులో ఒకటి భోజుడి వారసులు ఉదయాదిత్య, నరవరమాన్‌లను కీర్తించింది. కాబట్టి ఇది నిస్సందేహంగా భోజుడు నిర్మించగా, ఆయన వారసులు పోషించిన విద్యా సంస్థ, అదే ఆలయం కూడా. మొదట ఇది ఆలయంగానే ఉండేది. ఈ సంగతిని మదన్‌ అనే కవి తన నాటకంలో ప్రస్తావించాడు. ఆయన వర్ణించిన సరస్వతి మాత విగ్రహమే ఇప్పుడు లండన్‌ మ్యూజియంలో ఉంది. అచ్చం అలాగే ఉండే మరొక శిల్పాన్ని చెక్కి అక్కడ ప్రతిష్ఠించారు. శివపురాణం ప్రస్తావించే కీర్తిముఖం కూడా ఈ ప్రాంగణంలో లభ్యమైంది. దక్షిణపు గోడ, పశ్చిమ ప్రాంతంలోని నిర్మాణం మీద అనేక చిన్న చిన్న బొమ్మలు యథాతథంగానే ఉన్నాయి. మనుషుల బొమ్మలు లేదా జంతువుల బొమ్మలు మసీదుల మీద నిషేధం. స్తంభాలు, గోడల మీద కొన్ని ఆకృతులను ధ్వంసం చేశారు. ఖిల్జీ వంశీకుడు ఒకటో మహ్మద్‌ షా (1455) స్మారక కట్టడం (ధార్‌లోనే) మీద అబ్దుల్లా షా ఛంగాల్‌ వేయించిన శాసనం ప్రకారం తమ మనుషులు కొందరు అక్కడి ప్రార్థనాలయాన్ని ధ్వంసం చేసి మసీదుగా మార్చారు. ఈ కట్టడం గురించి ఆ శాసనంలో చేసిన వర్ణన కూడా సరిపోలుతున్నది.

ఈ నివేదిక పట్ల హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కాశీ, అయోధ్యల మాదిరిగానే భోజ్‌శాల కూడా తన పూర్వపు అస్తిత్వాన్ని తిరిగి చాటుకుంటుందని తమకు తెలుసునని హిందూ ఫర్‌ జస్టిస్‌ సంస్థ సభ్యుడు ఆశిష్‌ గోయెల్‌ అన్నారు. కానీ ముస్లిం సంఘాలు మాత్రం, అప్పుడే ఏమైంది? దీని మీద తుది నిర్ణయం తీసుకోవలసినది సుప్రీంకోర్టు మాత్రమే అంటున్నాయి.

చిచ్చు రేపిన కాంగ్రెస్‌

ఈ ప్రాంగణంలో ఇరువర్గాలు ప్రార్థనలు చేసేవే. హిందువులు కట్టడంలో కేంద్ర బిందువు వంటి, గుమ్మటి కింది ప్రదేశంలో పూజలు చేస్తారు. ముస్లింలు ఒక్క శుక్రవారం మాత్రం నమాజ్‌ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇలా ప్రశాంతంగానే రెండు వర్గాలు ప్రార్థనలు చేసుకుంటున్న తరుణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 1997లో వివాదం రేగడానికి వీలుగా సాధారణ ప్రజల ప్రవేశం మీద నిషేధం విధించింది. కాని నమాజ్‌ చేసుకోవడానికి ముస్లింలను అనుమతించింది. అంటే నిషేధం హిందువుల మీదే. ఆ నేపథ్యంలో ఏప్రిల్‌ 7, 2003న ఏఎస్‌ఐతో రెండు వర్గాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాని ప్రకారం మంగళవారం హిందువులు పూజలు చేసుకోవచ్చు. శుక్రవారం ముస్లింలు నమాజ్‌ చేయవచ్చు.

నిజానికి భోజ్‌శాల వివాదానికీ, వారణాసి, మధుర ఆలయాల వివాదానికి చాలా సామ్యం ఉంది. హిందూ దేవాలయాలను తిరిగి హిందువులకు అప్పగించాలంటూ ఇటీవలి కాలంలో మొదలైన ఉద్యమం భిన్నమైది. కొన్ని హిందూ సంఘాలు తమ విశ్వాసాలను కాపాడుతూ తమ ఆలయాలను తిరిగి అప్పగించాలని న్యాయపోరాటం చేస్తున్నాయి. ఇందులో ఊరేగింపులు చేయడం, సెక్యులర్‌ పోలీసుల చేత లాఠీ దెబ్బలు తినడం, ప్రాణత్యాగాలు ఇవేమీ ఉండవు. ఫలితాలు కూడా ఈ పోరాటంలో వేగంగా, స్పష్టంగా లభిస్తున్నాయి. మొదట హిందూ సంఘాలు కింది కోర్టులకు వెళుతున్నాయి. తరువాత ఆ వివాదాలు పై కోర్టులకు వస్తున్నాయి. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదం కూడా కోర్టుల ప్రమేయంతో అనేక మలుపులు తిరిగి వేగంగానే ఒక కొలిక్కి వచ్చింది. అక్కడ కూడా హిందూ దేవాలయ శిథిలాల మీదనే మసీదు వెలిసిందని ఏఎస్‌ఐ తేల్చింది. అయితే మధురలో కూడా సర్వే జరగవలసిన ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు స్టేతో ఆగిపోయింది. ఈ వ్యాజ్యాలన్నింటిలోను హిందూ సంఘాల వాదన ఒక్కటే. మధ్య యుగాల నాటి ఏ ముస్లిం కట్టడమైనా హిందూ దేవాలయ అవశేషాల మీద నిర్మించినవే. కాబట్టి హిందువుల ఆలయాలను హిందువులకు తిరిగి అప్పగించాలి. కానీ 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం ఆగస్ట్‌ 15, 1947కు ముందు కట్టడాలు ఏ అస్తిత్వానికి చెందినవే దానికే చెందాలంటూ ముస్లింలు వాదిస్తున్నారు. ఈ చట్టం మీద న్యాయ పరమైన సందేహాలు ఉన్నాయి.

భోజ్‌శాలను 1909లో రక్షిత కట్టడంగా, 1951లో జాతీయ ప్రాధాన్యం కలిగిన పురావస్తు అవశేషమని ప్రకటించారు. ప్రస్తుతం ఇది ఏఎస్‌ఐ సంరక్షణలో ఉంది. అంటే 1958లో తీసుకువచ్చిన చట్టం మేరకు ఏఎస్‌ఐ రక్షణ కిందకు వచ్చింది. కాబట్టి 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం పరిధిలోకి భోజ్‌శాల రాదు. భోజ్‌శాల కట్టడంలో నమాజ్‌ను వ్యతిరేకిస్తూ మే, 2022లో హిందూ ఫ్రంట్‌ ఫర్‌ జస్టిస్‌ అనే హిందూ హక్కుల సంస్థ కోర్టును ఆశ్రయించింది. అందుకు కారణం 2003లో ఇక్కడ హిందువులు నిత్య పూజలు జరపకుండా ఏఎస్‌ఐ నిషేధించింది. హిందూ సంఘం వ్యాజ్యం మేరకు ఇందోర్‌ హైకోర్టు ధర్మాసనం శాస్త్రీయ సర్వే జరపాలని ఆదేశించింది. మొదట సర్వే నివేదిక సమర్పణకు ఆరు వారాలే ఇచ్చినా, తరువాత పద్నాలుగు వారాలకు పెంచింది. ముస్లింల వైఖరిని అనూహ్యం కాదు. ఎన్ని ఆధారాలు చూపించినా అవి హిందూ కట్టడాలుగా అంగీకరించడానికి వారు సిద్ధంగా లేరు. ఇక హిందువులకు అప్పగించడం అన్న ప్రక్రియ కోర్టుల ద్వారా మాత్రమే జరుగుతుంది.

ఏమిటీ భోజ్‌శాల?

భోజ్‌శాల మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఆ కట్టడం పేరులోనే అందుకు సంబంధించిన ఆధారం ఉంది. అది భోజుడి (క్రీస్తుశకం 1000`1055) జీవితంతో ముడిపడి ఉన్న కట్టడం. పార్మార్‌ వంశానికి చెందిన పాలకునిగా చరిత్రలో ఆయనకు సుస్థిర స్థానం ఉంది. సరస్వతి అమ్మవారి ఆలయం క్రీస్తుశకం 1034 సంవత్సరంలో నిర్మించారని చరిత్రకారులు భావిస్తారు. రాజస్తాన్‌ నుంచి ఒడిశా వరకు, ఇటు మధ్యప్రదేశ్‌ నుంచి మహారాష్ట్ర వరకు సామ్రాజ్యాన్ని విస్తరించిన భోజుడే దీని నిర్మాత. ధార్‌లోనే ఆ ఆలయం ఉంది. అదే భోజుడి రాజధాని. భోజ్‌శాల అంటే భోజున మందిరం లేదా సభ అని అర్థం. కాళిదాసు, వరాహ మిహిరుడు వంటి వారు ఆయన ఆస్థానంలోని వారేనని చరిత్ర. ఆయనే భోజ్‌శాల పేరుతో విద్యాలయం ఆరంభిం చారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు విద్యార్థులు వచ్చేవారు. హిందువులు సరస్వతీ అమ్మవారి ఆలయంగా, అంటే వాగ్దేవి ఆలయంగా భావిస్తారు. తరువాత ఈ విద్యాకేంద్రాన్ని భోజుని వారసులు పోషించారు. చాలా ఆలయాల మాదిరి గానే భోజ్‌శాల వెనుక గాథ కూడా ఇటీవలి వరకు మరుగున ఉండిపోయింది. అక్కడ శాస్త్రీయ సర్వే నిర్వహించాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఏఎస్‌ఐని ఆదేశించడంతో ఒక్కసారిగా దేశం దృష్టిలో పడిరది. ఆ సర్వే సరికాదంటూ ముస్లిం సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్లడం, అక్కడ కూడా సర్వేను నిరోధించ లేమంటూ సమాధానం రావడం కట్టడం గురించి ఇంకాస్త ఆసక్తి రేపింది.

మౌలానా మసీదుగా ఎలా మారింది?

భోజ్‌శాలను ముస్లింలు కమాల్‌ మౌలానా మసీదుగా చెబుతారు. భోజుడు పాలించిన ఉజ్జయినీ తదితర ప్రదేశాలు ఉన్న మాల్వా ప్రాంతానికి ముస్లిం ఫకీర్‌గా చెప్పుకునే కమాల్‌ మౌలానా క్రీస్తుశకం 1269లో మొదట వచ్చాడు. ఆనాడే అతడు హిందువులను ఇస్లాంలోకి మార్చడానికి కిరాతకంగా వ్యవహరించాడు. ఇతడే మాల్వా గురించి పూర్తి వివరాలు సేకరించి అల్లావుద్దీన్‌ ఖిల్జీకి అందచేశాడు. అల్లావుద్దీన్‌ బానిస వంశీకులలో అత్యంత క్రూరుడిగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వాడు. ఇతడే 1305 ఆ ఆలయం మీద దాడి చేశాడు. ఇదే ఆ ఆలయం మీద జరిగిన తొలి ముస్లిం దాడి. రాజా మహాకాల్‌ దేవ్‌ను యుద్ధంలో ఓడిరచి ఇతడు ఆలయం మీదకు వెళ్లాడు. అక్కడ ఉన్న 1200 మంది విద్యార్థులు మతం మారడానికి నిరాకరించారు.

సరస్వతి అమ్మవారి ఆలయంలోనే విజయ్‌ మందిర్‌ లేదా సూర్య మందిర్‌ను ధ్వంసం చేసినవాడు దిలావర్‌ ఖాన్‌. 1401 ఇతడే ఆలయంలో కొంత భాగం దర్గాగా మార్చాడు. సరిగ్గా ఇప్పుడు ముస్లింలు నమాజ్‌ చేసే ప్రదేశం ఒకప్పుడు సూర్య మంటపం ఉన్నదే. దిలావర్‌ నిర్మించిన దర్గాయే తరువాత లాత్‌ మసీదు అయింది. 1514లో దాడి చేసిన మహమ్మద్‌ షా ఆలయం మొత్తాన్ని దర్గాగా మార్చాలని అనుకున్నాడు. కానీ ఆలయానికి బయట ఉన్న భూమిని ఆక్రమించి అక్కడ కమాల్‌ మౌలానా మక్బారా నిర్మించాడు. అప్పటికి కమాల్‌ మౌలానా మరణించి 204 ఏళ్లు గడిచాయి. ఈ పరిణామాల ఆధారంగానే భోజ్‌శాల ఒక దర్గా మాత్రమేనని నిరూపించడానికి కుట్రలు సాగాయి. 1552లో మేదీనీరాయ్‌ అనే హిందూవీరుడు సైన్యాన్ని సమీకరించుకుని మహ్మద్‌ ఖిల్జీని ఓడిరచాడు. మేదినీరాయ్‌ ధార్‌ కోటలో వేలాదిమంది ముస్లిం సైనికులను చంపాడు. 900 మందిని నిర్బంధిం చాడు. ఆ సమయంలోనే మార్చి 25, 1552లో ధార్‌ కోటలో పనిచేసే ఒక ముస్లిం సైనికుడు సయద్‌ మసూద్‌ అబ్దుల్‌ సామర్ఖండ్‌ వెన్నుపోటు పొడిచి ముస్లిం సైనికులను విడిపించాడు. తరువాత ఇతడిని మేదినీరాయ్‌ చంపాడు. చిత్రంగా ఇప్పటికీ ధార్‌ కోటలో సయద్‌ మసూద్‌ను బందీ ఛోద్‌ దాతా పేరుతో పూజిస్తారు.

ఇంగ్లండ్‌కు తరలిన వాగ్దేవి ప్రతిమ

1703లో మాల్వా మరాఠాల పరమైంది. దీనితో ముస్లింల పాలన అంతమైంది. 1826లో మాల్వాను ఈస్టిండియా కంపెనీ ఆక్రమించింది. కంపెనీ కూడా భోజ్‌శాల మీద దాడి చేసింది. ఆలయంలో కొంత భాగం ధ్వంసం చేసింది. 1902లో కర్జన్‌ ఇక్కడి అమ్మవారి విగ్రహం (వాగ్దేవి)ని ఇంగ్లండ్‌ తరలిం చాడు (కొందరి వాదన ప్రకారం 1857 నాటికే ఆ ప్రతిమ ఇంగ్లండ్‌ చేరింది). 1930లో ముస్లింలు భోజ్‌శాలలో నమాజ్‌ చేయడానికి ప్రయత్నం చేశారు. ముస్లిం పాలన అంతమైన తరువాత జరిగిన ఆ ప్రయత్నం విఫలమైంది. ఆర్యసమాజ్‌, హిందూ మహాసభ కార్యకర్తలు ముస్లింలను దిగ్విజయంగా నిరోధించారు. 1952లో భోజ్‌శాలను భారత పురావస్తు శాఖకు అప్పగించారు. ఆ సంవత్సరమే ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ హిందువులను చైతన్యవంతం చేసే పని ఆరంభించాయి. శ్రీమహా రాజా భోజ్‌స్మృతి వసంతోత్సవ్‌ సమితి ఏర్పడిరది.

ఈ పరిణామాల తరువాత హఠాత్తుగా భోజ్‌శాలకు చెందిన నిజమైన అమ్మవారి ప్రతిమ గురించిన సమాచారం వెల్లడైంది. 1961లో డాక్టర్‌ విష్ణు శ్రీధర్‌ వాకంకర్‌ అనే పురావస్తు శాస్త్రవేత్త, రచయిత లండన్‌ మ్యూజియంకు వెళ్లారు. అక్కడ ఆయన చూసిన అమ్మవారి ప్రతిమ భోజ్‌శాల లోనిదేనని గుర్తించారు. అప్పుడే ఆయన ఆ మ్యూజియం అధికారులతో చర్చించారు. స్వదేశానికి వచ్చి 1961లో ప్రథమ ప్రధాని నెహ్రూను, 1977లో ఇందిరాగాంధీని కలుసుకుని వాగ్దేవి ప్రతిమ వివరాలు అందించారు. కానీ ఆ ఇద్దరూ కూడా ఆ ప్రతిమను వెనక్కి తెచ్చే ప్రయత్నమేదీ చేయలేదు. సరిగ్గా రెండు దశాబ్దాలకు మళ్లీ ముస్లిం పాలన ప్రవేశించినంత పనైంది. మార్చి 12, 1997లో నాటి ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ చిరకాలంగా హిందు వులు చేసుకుంటున్న పూజలను నిషేధించాడు. అయితే ముస్లింలు నమాజ్‌ చేయడానికి అనుమతి యథాతథంగా కొనసాగించాడు. ముస్లింలు యథాప్రకారం శుక్రవారం నమాజ్‌ చేయవచ్చు. హిందువులు లోపలికి వెళ్లవచ్చు. పూజలు చేయరాదు.

తలొగ్గిన దిగ్విజయ్‌సింగ్‌

హిందువులలో అప్పటికే పెరిగిన చైతన్యం కారణంగా భక్తుల రాక పెరిగింది. 2002లో వసంత పంచమికి జనం పోటెత్తారు. ఇది చూసి సెక్యులరిస్టులు కమాల్‌ మౌలానా జయంతి కార్యక్రమం ఆరంభించారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట వరకే హిందువులను అనుమతించారు. తరువాత ముస్లింల కార్యక్రమాలు మొదలు పెట్టాలి. రద్దీ బాగా ఎక్కువైంది. అదుపు చేసే సాకుతో పోలీసులు హిందువులను దారుణంగా కొట్టారు. కానీ మరుసటి సంవత్సరం హిందువులు మరింత పట్టుదలతో కార్యక్రమం నిర్వహించారు. మొదట రథయాత్రలు నిర్వహించారు. ఆ రథాలకు 9 లక్షల మంది పూజలు నిర్వహించారు. సాహసించి దాదాపు లక్ష మంది భోజ్‌శాలలో ప్రవేశించారు. వసంత పంచమి రోజున (ఫిబ్రవరి 6, 2003) విశ్వహిందూ పరిషత్‌ నాయకుడు డాక్టర్‌ ప్రవీణ్‌ తొగాడియా ప్రసంగించారు. ఫిబ్రవరి 18లోగా భోజ్‌శాలను అప్పగించాలని హిందువులు ఆదేశించారు. ఆ రోజు పోలీసులు కాల్పులు జరిపారు. 23 మంది భక్తులు గాయపడ్డారు. దిగ్విజయ్‌సింగ్‌ కర్ఫ్యూ విధించాడు. ఆఖరికి అతడే దిగివచ్చాడు. ఏప్రిల్‌ 8,2003న నిత్య దర్శనానికి హిందువులను లోపలికి అనుమతిం చాడు. తరువాత బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు న్యాయ పోరాటంతో విజయం సాధించే ప్రయత్నం జరుగుతున్నది.

హిందూ ఆలయాలను కూల్చి మసీదులు కట్టారని గట్టి ఆరోపణలు, ఆధారాలు ఉన్న ప్రతి మసీదు మీద హిందూ సంఘాలు గురిపెట్టాయి. డజన్ల కొద్దీ వ్యాజ్యాలు వేశాయి. కోర్టులు ఈ ఫిర్యాదులను విచారణకు ఆమోదిస్తున్నాయి కూడా. ఢల్లీిలోని కుతుబ్‌ మీనార్‌, ఆగ్రాలోని తాజ్‌మహల్‌ మీద కూడా ఇదే విధమైన వ్యాజ్యాలు నడుస్తున్నాయి.

 అయోధ్య తరువాత ప్రస్తుతం కాశీలోని జ్ఞాన్‌వాపి మసీదు పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నది. దీని మీద కూడా న్యాయపోరాటమే జరుగుతున్నది. భోజ్‌శాల కంటే ముందే ఇక్కడ అలహాబాద్‌

హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే కూడా జరిగింది. భోజ్‌శాలలో ఇప్పుడు రుజువైన అంశమే ఆనాడు అక్కడ నిరూపణ అయింది. దొరికినవన్నీ హిందూ ఆనవాళ్లే. ఇలాంటి పోరాటం చేస్తున్నవాళ్ల మీద కొందరు చరిత్రకారులు సహా, సెక్యులరిస్టు పార్టీలు, కమ్యూనిస్టులు చరిత్రను మార్చాలని చూస్తున్నా రంటూ విమర్శలకు దిగుతున్నారు. లేదా చరిత్ర కాషాయీకరణ అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అయోధ్య ఉద్యమం నుంచి ఇదే వరస. హిందూ సంఘాలు న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందుతున్నాయి. మెజారిటీలే అయినప్పటికీ, ఉన్నది ‘హిందూ ప్రభుత్వమే’ అయినప్పటికీ మధ్య యుగాల ముస్లిం మతోన్మాదుల పంథాను ప్రదర్శించడం లేదు. అయినా ఈ హిందూ వ్యతిరేక శక్తులు హద్దు మీరి మాట్టాడుతూనే ఉన్నాయి. అయోధ్య విషయంలో చరిత్రకారులు చేసిన మోసం గురించి సాక్షాత్తు సుప్రీంకోర్టు అభిశంసించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అయోధ్య పోరాటంలోని తాత్త్వికత ఆధారంగానే హిందూ సంఘాలు కొత్త పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. మధుర (ఉత్తరప్రదేశ్‌) మొగల్‌ నిరంకుశుడు ఔరంగజేబ్‌ నిర్మించిన మసీదు పైన కూడా హిందూ సంఘాలు పోరాడుతున్నాయి. కాశీలో విశ్వేశ్వరుని ఆలయాన్ని తాకుతున్నట్టు ఉండే మసీదు గుమ్మటాల మాదిరిగానే మధురలో కృష్ణభగవానుడి ఆలయం మీద కనిపిస్తాయి. మధుర కృష్ణుడి జన్మస్థలమని, ఇది హిందువులదేనని 12 వ్యాజ్యాలు నడుస్తున్నాయి.

జ్ఞానవాపితో పాటు..

మసీదులుగా మారిన ఆలయాలు దేశంలో ప్రతిచోటా ఉన్నాయి. ఎందుకంటే దేశంలో ముస్లిం దండయాత్రకు గురికాని ప్రదేశాలు కొన్ని మాత్రమే. కానీ వీటి గురించి పూర్తి సమాచారం బయటపడడం లేదు. చరిత్రకారులు కొందరు సెక్యులర్‌ ముసుగుతో వాస్తవాలు ఇవ్వడం లేదు. రగడకు భయపడి స్థానికులు ముందుకు రావడం లేదు. అయినా అలాంటి వాటి కోసం న్యాయ పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఉదాహరణకు వారణాసిలోని అలంగీర్‌ మసీదు. దీనినే ఔరంగజేబ్‌ మసీదు అని కూడా పిలుస్తారు. పంచగంగ ఘాట్‌ వద్ద ఉంది. వారణాసి మీద ఔరంగజేబ్‌ 1669లో దాడి చేసి, ఆక్రమించాడు. అక్కడే ఉన్న బిందుమాధవుడి (విష్ణువు) ఆలయాన్ని కూల్చాడు. ధార్హాదారా మసీదు లోపల ఉన్న బిందుమాధవుడికి పూజలు చేసే అవకాశం కల్పించాలని 2022లో హిందువులు కోర్టును ఆశ్రయించారు. ఆ మసీదు 12వ శతాబ్దం నాటి బిందుమాధవుని ఆలయాన్ని కూల్చి నిర్మించారని, ఔరంగజేబు కాలంలో మొదలైన నిర్మాణం అతడి వారసుడు షా ఆలం (1707`1712) వారణాసి సైనిక అధికారి అలీ ఇబ్రహీం ఖాన్‌ పర్యవేక్షణలో పూర్తి చేశారని చరిత్ర. కృత్తివాసేశ్వర శివాలయం శిథిలాల మీద మసీదును నిర్మించాడని వివాదం ఉంది.

బదయూన్‌ జామా మసీదు మొదట గుడే?

2022లో బయటకొచ్చిన మరొక వివాదం బదయూన్‌ (ఉత్తరప్రదేశ్‌) షమ్సి జామా మసీదు. ఈ భారీ మసీదును 800 ఏళ్ల క్రితం కట్టారని, దేశంలోనే పురాతనమైనదని అంటారు. ఇది మసీదు కాదనీ, హిందూ ఆలయమనీ చెబుతూ వీపీ సింగ్‌, బీపీ సింగ్‌ అనే న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. స్థానిక ముస్లింలు ఇది బానిస వంశీకుడు ఇల్‌టుట్‌మిష్‌ (1223) కట్టించాడని, చిరకాలంగా అందులో ముస్లింలు నమాజ్‌ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ వాదనను న్యాయవాది వీపీ సింగ్‌ అంగీకరించడం లేదు. ఇది హిందూ దేవాలయమని వాదిస్తూ హిందూ మహాసభ మద్దతుతో వారు 2022 జూలైలో కోర్టుకు వెళ్లారు. ఆ మసీదు 10వ శతాబ్దం నాటి శివాలయాన్ని మసీదుగా మార్చారని సింగ్‌ వాదన. కొన్ని ఇతర హిందూ దేవాలయాలు ఇప్పటికీ ఆ ప్రాంగణంలో మిగిలి ఉన్నాయని కూడా ఆయన చెబుతున్నారు.

వాస్తవాలను దాచడమే పనిగా…

ధార్మిక రంగం వరకు వాస్తవంగా నష్టపోయినది హిందువులేనని చరిత్ర సాక్ష్యం చెబుతున్నది. అయితే ముస్లింలే నష్టపోయారని విదేశీ రచయితలు, స్వదేశీ చరిత్రకారులు చిత్రిస్తున్నారు. ఉదాహరణకి జ్ఞానవాపి మసీదులో 1990 వరకు హిందువులకు ప్రవేశం ఉంది. సంవత్సరంలో ఒకరోజు వారికి గౌరి పూజకు అనుమతించే పద్ధతి ఉంది. దీనిని రామజన్మభూమి ఉద్యమం నేపథ్యంలో ములాయం సింగ్‌ యాదవ్‌ నిషేధించాడు. ఈ విషయాన్ని దాచి పెట్టి ముస్లింలకే చెందిన ఆ కట్టడాన్ని ఆక్రమించడానికి హిందూ సంఘాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయని వారు ఆరోపిస్తూ ఉంటారు. 1990 వరకు హిందువులకు ప్రవేశం ఉందన్న సంగతి అవాస్తవమని జ్ఞానవాపి మసీదు సంరక్షకుడు సయద్‌ మహమ్మద్‌ యాసీన్‌ అడ్డంగా అబద్ధం ఆడాడు. ఇందుకు సంబంధించి కోర్టు నిర్ణయం పక్కనే ఉన్నా, యాసీన్‌ మాటనే విదేశీ మీడియా ప్రచురించింది. దీనికి మించిన దుర్మార్గం మరొకటి. అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాయంలో చరిత్ర ఆచార్యునిగా పనిచేసే సయద్‌ అలీ నదీమ్‌ రెజ్వీ హిందువులు చేస్తున్న పోరాటాలన్నీ సమంజసమైనవి కాదని చెబుతున్నాడు. మొగలులు కొన్ని హిందూ కట్టడాలు కూల్చిన నిజమే అయినా హిందువులు చెబుతున్న అంత పెద్ద సంఖ్యలో కాదని అంటారీయన. దేశంలో ఒక చిత్రమైన పరిస్థితి ఉంది. న్యాయవాది, చరిత్రకారుడు, పత్రికా రచయిత, కళాకారుడు, ఆఖరికి జర్నలిస్ట్‌ ఎవరైనా సరే, వారు ముస్లింలైతే ఆ వర్గం వాదననే వినిపిస్తారు. వారి మాటలలో సత్యనిష్ట కానరాదు. అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం ఆచార్యుడు చేస్తున్నది ఇదే. అరిజోనా యూనివర్సిటీ ఆచార్యుడు రిచర్డ్‌ ఈటన్‌ ముస్లింలు భారతదేశంలో నాశనం చేసినది వేలాది దేవాలయాలు కాదని, కేవలం 80 అని అంటాడు. కానీ వీరెవరూ విల్‌ డ్యూరాంట్‌ ఏం చెప్పారో దాచి పెడతారు.

భారత్‌ మీద ముస్లిం దురాక్రమణదారుల దాడులు విశ్వమానవ చరిత్రలోనే రక్తసిక్తమైన గాథలు అన్నారాయన. క్రూసేడ్స్‌ (పవిత్ర యుద్ధాలు) మీద పరిశోధన చేసిన బ్రిటిష్‌ చరిత్రకారుడు పీటర్‌ జాక్సన్‌ ముస్లిం చరిత్రకారులు (సమకాలికులు) ఏమి రాశారో ప్రపంచానికి గుర్తుచేశారు. భారత్‌లో ఇస్లాం వ్యాప్తిని ఆ పాలకులు పవిత్రయుద్ధంగానే భావించారని జాక్సన్‌ తేల్చి చెప్పారు. ముస్లిం పాలకుడి సైన్యాన్ని ఇస్లాం సేనగానే వ్యవహరించారు. లక్ష్యంగా చేసుకున్న హిందువులు కాఫిర్లు లేదా అవిశ్వాసులు. అలాంటి దృక్పథం ఉన్న క్రూర పాలకులు ఆలయాలను నిలవనిస్తారా? 1990 ప్రార్థనా స్థలాల చట్టానికి ఉన్న చట్టబద్ధత, వాస్తవికతల మీద భారతీయ న్యాయస్థానాలలోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈ చట్టం ఉన్నా భారతదేశంలో అడుగున గుడులు ఉన్నాయంటూ మసీదులను కూలుస్తున్నారని వాదించేవారు విశ్వవ్యాప్తంగా ఉన్నారు.

ఇటీవలి కాలంలో హిందువులు ఏ విజయం సాధించినా, లేదా ఏ పోరాటం ప్రారంభించినా దానిని అయోధ్యతో ముడి పెడుతున్నారు. లేదా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువైన 2014 సంవత్సరం తరువాతి పరిణామంగా చూస్తున్నారు. అంతేతప్ప హిందువుల ఆత్మగౌరవ పోరాటాలుగా వీటిని పరిగణించే సంస్కారం ఇంకా రాలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావానికే ముందే (1925), బీజేపీ నిర్మాణానికి ముందే (1980) హిందువుల ఆత్మగౌరవ పోరాటాలు ఉన్నాయి. అయోధ్య రామజన్మభూమిని కేవలం న్యాయ పోరాటంతో హిందువులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1528 నుంచి 2019 వరకు సాగిన పోరాటమది. అంతిమంగా సుప్రీంకోర్టుకు చేరింది. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు అక్కడ ఆలయ నిర్మాణం, ప్రాణప్రతిష్ఠ జరిగాయి. అయోధ్య న్యాయపోరాటంతో సమాంతరంగానే దేశంలో మరిన్ని న్యాయపోరాటాలు మొదలయ్యాయన్నది నిజం. ఇప్పటికే పలు మసీదుల మీద హిందూ సంఘాలు వ్యాజ్యాలు నడుపుతున్నాయి. ఈ దేశంలో మధ్యయుగాల నుంచి 30,000 నుంచి 40,000 దేవాలయాలు విదేశీ దురాక్రమణదారుల చేతులలో ధ్వంసమైనాయని ఇటీవల సాక్ష్యాలతో చూపిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది.

దేశంలోని చాలా మసీదులు గుడుల మీద నిర్మించినవేనని లేదా గుడులను మసీదులుగా మలిచినవేనని వారి వాదన. తెలుగు ప్రాంతాలు సహా చాలాచోట్ల ఆలయాలలో దర్గాలు కనిపిస్తాయి. చాలాచోట్ల ఆలయాలు మసీదులుగా మారిపోయా యని ఆ ప్రాంగణం ఆనవాళ్లే తిరుగులేకుండా నిరూపిస్తూ ఉంటాయి. స్థల పురాణాలే కాదు, చరిత్ర కూడా మౌనసాక్షిగానే ఉండిపోయాయి. ఆ నిర్మాణం, వాస్తు, స్తంభాలు, ఆకృతి, గోడలమీద శాసనాలు, స్తంభాల మీది శిల్పాలు అన్నీ అది హిందూ ఆలయమని సాక్ష్యం చెబుతూనే ఉంటాయి. అయినా వాటి గురించి మాట్లాడరాదని, హిందువులు హక్కు కోసం ప్రయత్నించరాదని సెక్యులరిస్టు ప్రభుత్వాలు, ఉదారవాదులు గగ్గోలు పెడుతూ ఉంటారు. నివేదికలు లీక్‌ అయ్యాయంటూ, న్యాయస్థానాలను గౌరవిస్తాం కానీ, జరిగిన నిర్ణయాలను కాదంటూ ముస్లిం సంఘాలు ఇప్పటికీ మాట్లాడుతున్నాయి.

న్యాయస్థానాల తీర్పులను తప్పు పట్టేవారు కూడా లేకపోలేదు. మొత్తంగా చూస్తే తమదైన హక్కు కోసం, చరిత్రలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేసు కోవడానికి కోర్టుల ద్వారా కూడా హిందువులు ప్రయత్నం చేయకూడదన్నదే, జరిగిన దానికే కాదు, జరగబోయే దానికి కూడా వారు మౌనంగా ఉండాలనే ఇక్కడ ముస్లింలు, మేధావులు, ఉదార వాదుల లక్ష్యంగా కనిపిస్తున్నది.

– జాగృతి డెస్‌

About Author

By editor

Twitter
YOUTUBE