‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

‘‘నేను తల్లిని కావాలి. నాకా అవకాశంలేదు. నా భర్త తండ్రి కావాలి. కానీ నా ద్వారా తండ్రి కాలేడు. మా ఇద్దరి అండం, వీర్యాల్ని సేకరించి మాకు పాపనిచ్చే అద్దె తల్లి కావాలి. తొమ్మిది నెలలు మా సంతానాన్ని తన కడుపులో మోయటానికి గర్భాన్ని అద్దెకిచ్చే అమ్మ కావాలి. అందుకు సహాయపడే తల్లికి ఎంత డబ్బయినా ఇస్తాను’’ డాక్టర్‌ వరదతో చెప్పింది ఉష.

వరద విని తరువాత గీరాతో సంప్రదించింది.

ఆలోచిస్తానంది గీరా, ఆ విషయం విని.

‘అది కొత్తేమీ కాదు. సంపాదన కోసం అందరూ చేస్తున్న పనేె!’’ వివరించింది వరద. ఒక పక్క ధనం, ప్రలోభం, అవకాశం.. మెల్లిమెల్లిగా ఆలోచనల్ని పక్కకు పెట్టి అవకాశాన్ని ఉపయోగించుకోమన్నది.

అది వివేకం కాదు. త్యాగం అంతకన్నా కాదు. వివేకమయితే అమ్మతనాన్ని అద్దెకివ్వదు. త్యాగమయితే పుట్టిన బిడ్డను పంచి ఇవ్వదు. ఈ రెండూ కాని ధన ప్రలోభం.. ద్రవ్య జగత్తులోకి ఆమెను నడిపించింది.

కూతురు హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. తాము బతకటానికి గ్రామాన్ని విడిచి ‘వలస’ వెళ్లారు గీరా తల్లిదండ్రులు. తాను హాస్టల్లో ఉంటానంటే, మొదట కాదన్న తల్లిదండ్రులు తరువాత ఒప్పుకున్నారు.

అమ్మా నాన్నలు అంగీకరించకపోయినా, విషయం విని ఆలోచిస్తాననటమే ఉషలాంటివారికి అవకాశాన్నిచ్చి ‘సంతాన సాఫల్యకేంద్రానికి’ నడిపించిందామెను. ఐ.యు.ఐ. (ఇంట్రా యుటిరైన్‌ ఇంజక్షన్‌) ద్వారా ఇప్పుడు తల్లిగా నిలబడిరది.

ఇక్కడ గీరా తల్లి కాదు. కనే తల్లి గీరా. తండ్రి అనిరుద్‌. ఆ సంతానాన్ని చేతుల్లోకి తీసుకునేది ఉషా, అనిరుద్‌. తల్లి గీరా, తండ్రి దుష్యంత్‌. ఆ పాపను చేతుల్లోకి తీసుకునేది కుంతలా దుష్యంత్‌ గాంధారి అండం. వ్యాస్‌ శుక్రకణం. ఆ పాపాయిని చేతుల్లోకి తీసుకునేది గాంధారి, రాష్ట్రాయ్‌.

ఇందరికి చెందిన గర్భాల్ని గీరా మోస్తుందిప్పుడు మూడో వ్యక్తిగా. డాక్టర్‌ వరద నర్స్‌ వెనకాల నిలబడి స్కానింగ్‌ చూస్తున్నది దీక్షగా.

టెక్నిషియన్‌ నూతన స్కాన్‌ చేస్తున్నది.

పరిశీలిస్తున్న వరద క్షణం ఆశ్చర్యపోయింది. పదే పదే గీరా తలవైపున్న మానిటర్‌ను చూస్తున్నది. అతి సూక్ష్మప్రాణులు చిన్న చిన్న చుక్కల్లా ఉమ్మనీటి ఉయ్యాల్లో చేపగుడ్లలా ఉన్నాయి. అయితే వరద ఆశ్చర్యపోయింది అందుకు కాదు. ఆమె లెక్క ప్రకారం, ముగ్గురు పిల్లల్ని గీరా మొయ్యాలి. కాని, ఇక్కడ, మరో ప్రాణి, ఆ చిన్ని ప్రపంచంలో, చోటు కోసం వెతుక్కుంటున్నది.

‘‘నాకూ చాలమంది పిల్లల్ని కనాలనుంది డాక్టర్‌. నేను ఒంటరిదాన్ని, ఒంటరిగా పెరిగాను. ఆ ఒంటరితనాన్ని ఛేదించటానికి, బహు సంతానానికి తల్లిగా బ్రతికి, అమ్మా అనిపించుకోవాలనుంది. కాని, నేనొక బాధ్యతా బంధానికి కట్టుబడి పోయాను. నేను అమ్మగా కన్నా, అమ్మకానికో అమ్మగా నిలబడ్డాను. తొమ్మిది నెలలు నా ప్రాణంలో ప్రాణంగా పెంచి, కనీసం కంటితో నయినా చూడకుండా వారిని దూరం చేసుకుం టాను. ఇది తప్పదు. కానీ కనీసం ఆ అనుభూతుల నయినా నన్ను పొందనీండి’’ అన్న గీరా మాటలు గుర్తొచ్చాయి.

డాక్టర్‌ వరద ఆలోచిస్తున్నది.

గీరా అగ్రిమెంట్‌ చేసుకుంది ముగ్గురు దంపతులతో. వాళ్లు ఉషా అనిరుద్‌, కుంతలా దుష్యంత్‌, గాంధారి రాష్ట్రాయ్‌. కాని, మరి..ఈ న్యూలీ బేబి… ఆ చిన్నప్రాణి ఉనికి ఆమెకే సవాలుగా నిలిచింది.

ఉషా, కుంతల దంపతులకు వేర్వేరు జీవకణాలు, అండాలు. అలాగే గాంధారి… ఈ గర్భం కూడా. కానీ, ఒప్‌ా, ముగ్గురికి మాట ఇచ్చి, అగ్రిమెంట్‌ తీసుకున్నారు కాబట్టి ఓకే.

కానీ ముందు జాగ్రత్తగా, ఎందుకైనా మంచిదని, గీరాలో మూడు అండాల్ని ప్రవేశపెట్టింది.

అందులో ఒకటి ఉష సంతానం కోసం, రెండోది కుంతలకు అబ్బాయిని కనివ్వడం కోసం. మూడోది ముందు జాగ్రత్త కోసం.

నిజానికది నిర్వీర్యం కావాలి. కారణం ఒక్కోసారి, గర్భంలో సరైన పోషణ లభించక, చోటు లభించక ఎదగదు. తరువాత నిర్వీర్యంగా జారిపోతుంది. కానీ… ఈ పాప అవే కారణాలయినా, రెండు రోజులు ఆలస్యంగా ఫలదీకరణం చెంది ప్రాణిగా మారింది.

అదే లాబరేటరీలో కాక, అతి సహజంగా గర్భంలో.

ఓ… ప్రస్తుతం గీరా నలుగురు బిడ్డల తల్లి. ఓ గాడ్‌! ఇందులో కుంతలకు అబ్బాయే కావాలి. లక్కీగా మగపిల్లవాడయితే చాలు అనుకుంది. స్కాన్‌లో పరిశీలిస్తున్న నూతన ‘‘డాక్టర్‌! వాట్‌ ఏ వండర్‌. ఫోర్‌ బేబీస్‌’’ అంటూ ఆశ్చర్యపోయింది.

గీరా… మగతగా పడుకునుంది, వినడం లేదు. లేకుంటే, ఎగ్జయిట్‌ అ య్యేదే. ఒక గర్భం. అందులో నలుగురు పిల్లలు. ఇదేమి అద్భుతం కాదులేె నూతనా! ఒక్కోసారి పాలిసిస్టు అండాలు ఉత్పత్తి అవుతాయి. అంటే, ఒకే అండానికి జతగా మరో అండం తయారై, అది కూడా ఒకేసారి ఫలదీకరణ చెందితే కవలలు పుడతారు. వీరి రూపాల్లోను, లింగనిర్ధారణలోనూ తేడాలుంటాయి. అలా కాక, ఒక్కోసారి ఫలదీకరణ చెందిన అండమే ‘సెల్‌ డివిజన్‌’లో అనూహ్య మార్పులు జరిగి, రెండు బదులుగా, నాలుగు, ఎనిమిదిగా విడిపోతే కవలలు పుడతారు.

అయితే, వీరిలో తేడాలుండవు. ఇద్దరూ ఒకే రూపంతో, ఇద్దరు ఆడకాని, ఇద్దరు మగకాని పుడతారు. వీరినే ‘సారుప్యకవలలూ’ లేదా ఐడెంటికల్‌ ట్విన్స్‌ అంటారు’’ చెప్పింది డాక్టర్‌ వరద.

ఆ విషయం గీరాకు సర్‌ప్రయిజింగ్‌గా చెప్పాలని, ఇప్పుడే చెప్పలేదు డాక్టర్‌ వరద.

* * *  *

గీరాకు, మూడు నెలలు నిండాయి. గర్భంలోని శిశువుల్లో కదలిక మొదలయింది. డాక్టర్‌ వరద కనుసన్నల్లో, గీరా సంతానం అపురూపంగా పెరుగుతున్నది.

ఆసుపత్రికి దగ్గరగా, అన్నీ వసతులున్నా డబుల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్‌ తీసుకుని అందులో ఉంచింది గీరాను. ఆమెను ఇరవె ౖనాల్గు గంటలు కంటికి రెప్పలా చూసుకుంటూ తోడుగా ఉండే నర్స్‌ సహాయకురాలిగా ఉంటుంది.

బలమైన ఆహారం, అదీ సమయం ప్రకారం. బ్రేక్‌ఫాస్టు పదకొండు గంటలకు. గ్లాస్‌ పాలు, ఒక యాపిల్‌, పన్నెండున్నరకు. తరువాత మంచి పుష్టికల సమీకృత ఆహారంతో కూడిన లంచ్‌. రెండు గంటలు విశ్రాంతి.

తరువాత తన పని తను చేసుకుంటుంది. మూడు గంటలకు ప్రోటిన్‌ బిస్కట్లు, ఒక ఆరెంజ్‌, గ్లాస్‌ ద్రాక్ష రసం, నాలుగు గంటలకు ‘టి’ వాకింగ్‌, తోడుగా నర్స్‌ ఉంటుంది. ఆరు గంటలకు చిన్న గ్లాసు పైనాపిల్‌ రసం. ఎనిమిది గంటలకు ఒక చపాతితో మితంగా భోజనం` తొమ్మిదిన్నరకు గ్లాస్‌ పాలతో కార్యక్రమం పూర్తవుతుంది.

ఆమె నిద్రపోతున్నా బీపీ షుగర్‌ టెస్టు చేస్తుంది నర్స్‌. మళ్లీ ఉదయం రొటీన్‌ ప్రారంభమౌతుంది. గీరాకే ఆశ్చర్యం వేస్తుంటుంది.

నిజంగా మాతృమూర్తి కాబోయే వారికి ఇంత శ్రద్ధ అవసరమా? అసలు మనవాళ్లు ఇస్తున్నారా? పాపం, ప్రసవం పునర్జన్మతో సమానమంటారు. కానీ నాకు, ఇది కమర్షియల్‌ ప్రసవం మరి, అనుకుని నవ్వుకుంది. ఆ రోజూ డాక్టర్‌ స్కానింగ్‌ రిపోర్టు చూస్తూ ‘‘గుడ్‌ ప్రొగ్రెస్‌ గీరా! నీవనుకున్నట్లే, చక్కటి పెరుగుదల కనిపిస్తుంది. యు ఆర్‌ లక్కీ. బీపీ, షుగర్‌ లాంటివేవి లేవు. ఎలాంటి కంప్లయింట్లూ లేవు.

‘‘సాధారణంగా ఇలాంటి కేసుల్లో, న్యూలీ బేబీతో తల్లికి, మొదటి రెండు వారాల్లోనే సమస్యలొస్తాయి. నీవు ఆ దశ నుంచి బయటపడినట్ల్లేె! యూ ఆర్‌ సక్సెస్‌’’ అని చెప్పింది.

‘‘ఇందులో మీ సహకారం ఎంతో ఉంది డాక్టర్‌! నేను అమ్మనవుతున్నానంటే, అందులో సగం మీ శ్రమే!’’ అంది గీరా.

వరద నవ్వుతూ ‘‘మరి ఫీజు రావాలిగా!’’ అంది.

‘‘డాక్టర్‌! ఆ పిల్లల్లో ఆడా, మగా అనేది తెలుస్తుందా?’’ ఆత్రుతగా అడిగింది.

‘‘తెలుస్తుంది. మరీ అంత ఎగ్జయిట్‌ కాకు మరి, కుంతలా దుష్యంత్‌లకు, వారు కోరుకున్నట్లె అబ్బాయి. ఉషా, అనిరుద్‌లకు అబ్బాయె. గాంధారికి మాత్రం ఆడపిల్ల’’ చెప్పింది.

‘‘అలా… ఎలా తెలుస్తుంది?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించింది.

‘‘డి.ఎన్‌.ఎ. టెస్టు. కన్న తరువాతయినా మళ్లీ చేసే ఇస్తాం. ఇలాంటి కేసుల్లో చాలా గుట్టుగా ఉంటాం. నీవు ఎవరో వాళ్లకు తెలవదు. వాళ్ల గురించి నీకు తెలవదు పేర్లు తప్ప. నీ కష్టం, శ్రమ చూసి చెప్పాను’’ అంది వరద.

గీరా ఒక్కసారి, కుడిచేత్తో పొట్టని తడుముకుంది. బొడ్డు క్రింది భాగమంతా కొంచెం గట్టి పడి, ముడుతలు లేకుండా నిండుగా ఉంది.

చెయ్యి తగలగానె చిన్న కదలిక. అది సన్నగా తెలిసింది గీరాకు. గీరా దేహమంతా పులకరించి పోయింది. ఎంతటి భాగ్యం తనది. ఇలాంటి అదృ ష్టానికి నోచుకోని ఆ తల్లులదెంత దురదృష్టం’’ అనుకుంది.

మనసు పులకరింతలతో కూడిన సంతోషంతో కదలిపోతుంటే, ధరిత్రి వెంట వాకింగ్‌కు వెళ్లింది.

* * *  *

ఉష అనిరుద్‌, గాంధారి రాష్ట్రాయ్‌, కుంతలా దుష్యంత్‌లను విడివిడిగా పిలిచి వారితో మాట్లాడిరది. విషయం చెప్పింది.

‘‘మిసెస్‌ కుంతలా! మీకు అబ్బాయి. మీరు కోరుకున్నట్లుగా అబ్బాయి అయ్యి, ఎంత అదృష్టవంతులయ్యారో! కానీ మీరు అప్పుడు కాదు దురదృష్ట వంతులు. ఇప్పుడు. మీకిప్పుడు పుట్టేది, ఐ మీన్‌…సరోగేట్‌ మదర్‌ ద్వారా పుట్టేది అబ్బాయి… కానీ, ఆ నవజాత శిశువును మీ స్వయం కృతాప రాధం వల్ల, కుంతల కనలేకపోయింది. దీనికి బాధ్యత మీ అమ్మగారిది.’’

అది వినగానే దుష్యంత్‌లో క్షణంపాటు బాధా వీచికలు కనిపించి మాయమయ్యాయి. కుంతలయితే కూర్చున్న చోటనే కూలబడిపోయింది.

చెట్టుకు కాసిన ఫలం, చేతిలోకి తీసుకుని, తినటానికి నోచుకోకపోవటం ఎంత దురదృష్టం, మరెంత దుఃఖం? ప్రాప్తం లేదనుకోవటానికి, ఇదేమి భగవంతుడు చేసింది కాదు, ప్రకృతే నా మాతృత్వాన్ని నిలపకుంటే, నేనింత బాధపడేదాన్ని కాదు. దానితో అనుబంధం నాకింతే! చెట్టుకు పూసిన పూతంతా కాయలు కావు. ఇది, అలాగెే అనుకునేదాన్ని. కానీ మా ఇంటివాళ్లే, బలవంతంగా ఆ పసిప్రాణాల్ని తొలగించారు.’’ కళ్లు తుడుచుకుంది.

అలాంటి అనుబంధాలకూ, అనుభూతులకూ, వృత్తిరీత్యా దూరం అయిన డాక్టర్‌ వరదకే బాధనిపించింది.

తన హాస్పిటల్లో బిడ్డల్ని కని, బ్రతికించుకోలేని తల్లులు తనకు తెలుసు! కానీ, కుంతలలాంటి కేసులు చాల అరుదు. తనసలు, ఇలాంటి కేసులే పట్టుకోదు. అందుకే ఓదార్చింది.

‘‘రిలాక్స్‌ కుంతలా! ఇక్కడికైనా నీ అదృష్టం. నీవు తలచుకుంటే, నీ బిడ్డే నీ ఇంట్లోకి వస్తుంది. మీ ఇద్దరి ఎక్స్‌, వై క్రోమోజోములతో రూపుదిద్దుకున్న బిడ్డనే మీ సరోగేట్‌ ఇస్తుంది. నీవు ఆడదానివయి నందుకు ప్రకృతి నీకింకా, వరాలిస్తూనే ఉంది. దాన్ని నిలుపుకుంటున్నారు. అది చాలు కుంతలా! పూర్వ కాలంలోనైతే పిల్లలు పుట్టక పోవటానికి కారణం ఎవరైనా, ఆ లోపాన్ని ఆ ఇల్లాలి మీద రుద్ది భర్తకు మరో పెళ్లి చేసేవారు.

దానివల్ల ఒకటికి మరో దుఃఖం తోడయి భర్తను మరొకరితో పంచుకున్న దుఃఖం తోడయ్యేది. ఈ రోజుల్లో విజ్ఞానం పెరిగి ఆడవాళ్లని అలాంటి అపవాదు నుంచి తప్పిస్తున్నది’’ చెప్పింది ఓదార్పుగా.

– సంబరాజు లీల (లట్టుపల్లి)

About Author

By editor

Twitter
YOUTUBE