‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక
నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

అమెరికాలోని అత్యంత ఖరీదైన ఆసుపత్రిలో శాస్త్రవేత్త డాక్టర్‌ ‌వ్యాస్‌కు అన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయి. అతడు ఏసీ గదిలో అత్యంత ఖరీదైన ‘సూట్‌’ ‌లో మంచం మీద పడుకుని ఉన్నాడు. అది తొలిసారి. అతడు తన పనులు మానుకుని మంచం మీద పడుకుని ఉండటం. అతనికి కొన్ని హార్మోన్‌ ఇం‌జక్షన్లనిచ్చి మాత్రలు ఇచ్చారు.
వాటి పని తీరు చదివి నవ్వుకున్నాడు వ్యాస్‌.
‌కోరికలు పెరిగి అత్యంత సహజంగా సహధర్మచారిణితో సుఖించే విషయమది. నిజానికి తనలో ఎలాంటి లోపం లేదు. ఆ విషయం తనకు తెలుసు! కానీ, ఇప్పుడు ప్రపంచ ప్రభుత్వమైన యు.ఎన్‌.ఓ. ‌చేతుల్లోకి తన జీవితం వెళ్లిపోయింది. భారత ప్రభుత్వ అనుమతితో ప్రపంచ దేశాల కోసం తనీ ట్రీట్‌మెంట్‌కు ఒప్పుకున్నాడు.
వరుసగా వారం రోజులు తను ‘స్పెర్ము డొనెట్‌’ ‌చేశాడు. అందుకే ఈ చికిత్స ముందు తన వయసు, శరీరధారుఢ్యం, మెంటల్‌ ‌కండిషన్‌, ‌స్పెర్ములో శుక్రకణాల శాతం, వాటి పని తీరు లాంటివి పరిశీలించటాని•కే ఈ తతంగం.
అన్నీ అనుకూలంగా ఉన్నాయి.
అతనికీ విషయం చెప్పి సెమన్‌ ‌తీసి ఉంచమని, వెంటనే తనకు ఇన్‌ఫాం చేయమని చెప్పి వెళ్లాడు మేల్‌నర్స్.
అక్కడికి ఏడుసార్లు అయిపోయింది.
ఈ రోజు చివరి రోజు. దాన్ని ఎక్కడ, ఏ ప్రభుత్వం రిజర్వు చేస్తుందో, దాన్ని ఎవరికి ఉపయోగిస్తారో ఏ విషయం తెలియదతనికి.
కానీ అతడితో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొదటి డొనేషన్‌ ‌భారత ప్రభుత్వానికే పంపిస్తారు. మిగిలింది ప్రపంచ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల కోసం యు.ఎన్‌.ఓ ‌తన మెడికల్‌ ‌కౌన్సిల్‌ ‌ద్వారా భద్రపరిచి అవసరమైన వారికి ఇస్తుంది.
నవ్వుడున్నాడు వ్యాస్‌.
‘‘‌నిజానికి నా వ్యక్తిత్వాన్ని, ఆదర్శాలను, పని విధానాల్ని ప్రక్కకుపెట్టి, నా స్వంత జీవితంలోకి వెళ్లిపోతే సంసారిక జీవితంతో రోజువారి కార్యక్రమం ఇది’’ అనుకుంటున్నాడు.
* * *
ఉషా, అనిరుద్‌ ‌డాక్టర్‌ ‌వరదను కలిశారు. ఆమె విశ్రాంతిగానే ఉండటంతో వెంటనే కలిసింది. కూర్చున్నాక మంచినీళ్లు, టీ ఆఫర్‌ ‌చేసింది. ‘‘మిసెస్‌ ఉషా! మీకు ఎగ్‌ ‌డొనేట్‌ ‌చేసేవాళ్లు దొరికారు. ఇక మీ భర్త అనిరుద్‌ ‌సమయమిస్తే ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు’’ చెప్పింది వరద.
‘‘అందుకు మేమూ సిద్ధమే! అనిరుద్‌ ఉనికితోనే నేను అమ్మననిపించుకోవాలి. అందుకు నాకు మాతృదానం చేస్తున్న ఆ దేవతనోసారి చూడొచ్చా?’’ ఆసక్తిగా ప్రశ్నించింది.
‘‘నో…అలాంటి ఆలోచన ఎప్పుడూ కుదరదు. పైగా ఆమెకు ‘దేవత’ అనేంత గొప్ప పేరు పెట్టనవసరంలేదు. ఆమె కేవలం డబ్బు కోసమే మీ దగ్గర లేని దాన్ని మీకిచ్చి తన అవసరం తీర్చుకుంటున్నది.
‘‘విజ్ఞానశాస్త్రం బాగా ఎదగటంతో అది సాధ్యమవుతుందంతే!’’ అతి తేలికగా చెప్పింది వరద.
‘‘ఎంత ఆర్థిక లావాదేవీలయినా, ఎవరి బిడ్డనో తన గర్భాన తొమ్మిది నెలలు మోసే ఆమె నిజంగా దేవతే!’’ కృతజ్ఞతగా అంది ఉష.
‘‘నాకూ ఆమెను చూడాలనే ఉంది. నా సంతానాన్ని భరిస్తూ పూర్ణగర్భంతో తిరగబోయే ఆ స్త్రీమూర్తి రూపం ఒకసారి, ఒక్కసారే చూస్తాను’’ అన్నాడు అనిరుద్‌ ఉద్వేగంగా.
‘‘నో… దానికెంత మాత్రం ఒప్పుకోను. ఇది ఒక కాంట్రాక్టు మాత్రమే. అయితే, మానవ సంబంధాలతో కూడుకున్నది కావటాన రహస్యంగా ఉంచటం తప్పనిసరి. మీ కోరిక సహజమే కావచ్చు. కానీ ఇక్కడ మీ సంతానాన్ని మోసేది మీ భార్య కాదు, మరో స్త్రీ. ఆమెకు పర్సనల్‌ ‌లైఫ్‌ ఉం‌టుంది. ఆమె భావి జీవితం దెబ్బతినకూడదు కదా? ఆమె మీ బిడ్డను మీకిచ్చి, మీరిచ్చిన డబ్బు తీసుకుని వెళ్లిపోవటమే సహజం కదా?
‘‘దానికిలా కలుసుకోవటం, ఆశలు పెంచుకోవటం, వాటిని నిరాశ చేసుకోవటం, అనుబంధాలు పెంచుకోవటమెందుకు?’’ నిర్మొహమాటంగా చెప్పింది వరద.
‘‘నిజమే! కొంతవరకూ అది కరెక్టే! కానీ, మాతృత్వమంటే ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది. ప్రసవమంటే స్త్రీకి పునర్జన్మంటారు. అలాంటి కష్టాల కోర్చి ఏ తల్లయినా తన బిడ్డను తనే కన్నదంటే అది ప్రకృతి ధర్మం. వింతేమీ కాదు. కానీ మా బిడ్డను తనదిగా మోస్తూ, ప్రాణాన్ని పణంగా పెట్టి మోయబోయే ఆ స్త్రీ మూర్తి ఎవరో ఆమెకు నా నమోవాకాలు.
‘‘డబ్బు మాట పక్కన పెడితే, ఇది ఎంత గొప్ప దాతృత్వమో, మరెంత గొప్ప త్యాగమో కదా?’’ అన్నాడు.
‘‘ఒప్పుకుంటాను. కాని ఇది మన మధ్య ఒప్పందం. ఆమె లాంటి తల్లులను పర్సనల్‌గా కలవకూడదని ‘మెడికల్‌ ‌కౌన్సిల్‌’ ‌చట్టం చేసింది. అందుకు మీరంగీకరించే అగ్రిమెంట్‌ ‌పేపర్స్‌పై సంతకాలు చేశారుగా’’ వివరించింది డాక్టర్‌ ‌వరద.
ఎంత తీవ్రంగా చెప్పినా ఆమె గొంతు సౌమ్యతనే తప్ప నిప్పులు కురిపించదు.
‘‘రేపు మేము వస్తాం. ఉష అవసరం లేదు కదా?’’ అడిగాడు.
‘‘అవసరంలేదు. మీరు వస్తే చాలు. లేదా ఇంటి నుంచి కూడా సెమన్‌ ‌తేవచ్చు. కాని అది నిర్వీర్యం కాకుండా మైనస్‌ ‌డిగ్రీల్లో నిలువచేయాల్సి ఉంటుంది. మైనస్‌ ‌డిగ్రీల ఉష్ణోగ్రత మన దగ్గర ఉండదు కాబట్టి మీరిక్కడి రావాలి. మధ్యాహ్నం వచ్చేయండి. నేనప్పుడు ఫ్రీగా ఉంటాను’’ చెప్పింది.
ఉషా, అనిరుద్‌ ‌నమస్కారం పెట్టి లేచారు.
* * *
కుంతలా, దుష్యంత్‌ల అనుమతితో గీరా వారికి ‘అండం’ దానం చేసింది. గీరా అండం, దుష్యంత్‌ ‌శుక్రకణంతో లాబరేటరీలో ఫలదీకరణ జరిపింది. ప్రస్తుతం ఆ అండంలో సెల్స్ ‌డివిజన్‌ ‌జరుగుతున్నట్లుగా మార్పులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం దాని వయసు మూడురోజులు.
అయినా డాక్టర్‌కు, కుంతలకు అనుమానమే! అది అబ్బాయేనా అని. డాక్టర్‌కు హాండ్రెడ్‌ ‌పర్సెంట్‌ ‌తెలుసు! అది అబ్బాయి రూపేనని! కారణం తను ఎక్స్, ‌వై క్రోమోజోములతోనే ఫలదీకరణ జరిపింది. అది ఎంత విజయమౌతుందనేది సందేహమే!
మరోసారి మార్పుల్ని గమనించింది. ఏదో తేడా….! హమ్మయ్యా! అబ్బాయే అనుకుంది. అయినా అనుమానంతో మరో రెండు వేరు వేరు అండాలతో పరీక్షించింది.
ప్రతి క్షణం వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నది. నిజానికి అది చెప్పినంత తేలిక కాదు. అవి జన్యుపరమైన చిక్కులతో ఉంటాయి. వాటి నుంచి ఎన్నో సమస్యలుంటాయి.
ఒక్కోసారి శిశువు చనిపోవచ్చు కూడ. అలాంటి సమయంలో డాక్టర్‌ ‌వరద ఒక మనిషిగా క్షణంసేపు బాధపడుతుంది. అయితే అది ఎంతోసేపు ఉండదు. వెంటనే దాన్ని మనసులోంచి తీసేస్తుంది.
తనెవరు? ఒక డాక్టర్‌! అవసరమయిన వారికి, అన్ని రోగాలకు మందులిచ్చినట్లు ఇలాంటి సమస్యలూ తీర్చాలి. తనీ రంగాన్ని ఎంచుకుంది. ఈ మార్గంలోనూ ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాల్ని ఎదుర్కోవాలి.
తన ప్రయోగం విజయవంతమయినప్పుడు ఆ శిశువును చేతుల్లోకి తీసుకున్నా ఆ తల్లి కళ్లలోని ఆనందాన్ని తను చూస్తూ, దాన్ని తనూ పంచుకుంటుంది.
మరి అలాంటి సమయంలో ఆనందించినట్లుగానే ఇలాంటి సమయాల్లో తను డాక్టర్‌గా కాక ఒక మనిషిగా దుఃఖపడుతుంది. అయితే తనా దుఃఖపు వలయం దాటి మరో విజయసూచిక కోసం పరిగెత్తాలి. జయాన్ని సాధించాలి.
అప్పుడే తను డాక్టర్‌గా నిలబడుతుంది అనుకుంది. లాబరేటరీలోని శిశువును పరిశీలిస్తూ అతి చిన్న ఆ పసిప్రాణం, ఒక చిన్న గాలి తెరలా, వెంట్రుక కదిలినట్లుగా కృత్రిమంగా తయారైన ఉమ్మనీటిలో ఉనికిని తెలుపుకుంటున్నాయి.
ఇంక కొద్దిరోజుల్లో గీరా గర్భంలో ప్రవేశపెట్టాలి. మగ శిశువు కాబట్టి కుంతల గర్భంలోనే ప్రవేశపెట్టొచ్చు- కానీ కృత్రిమంగా, బలవంతంగా జరిపిన గర్భస్రావాలతోఉన్న కుంతల గర్భాశయం మూడు విభిన్నమైన జన్యుపరమైన మార్పుల్ని తట్టుకుంటుందో లేదో…? ఆ విషయం చెబితే కుంతలనే నిరాకరించింది. గీరా మరో చోట రహస్యంగా ఉన్నట్టు ఉండే గదిలో విశ్రాంతి తీసుకుంటున్నది. సరిగ్గా ఆమెకు రుతుక్రమం మొదలయిన పన్నెండు, పదమూడు రోజుల్లో మాత్రమే ఆ ప్రయోగం జరుగుతుంది.
ఆ రోజుల్లో మాత్రమే ఆమెకు పిండాన్ని ప్రవేశపెట్టాలి. లేకుంటే సహజమైన అండాశయపు పొరలు పెరుగుదల్లో మార్పు రావచ్చు.
వీలయినంతవరకూ సహజ వాతావరణమే బిడ్డ ఎదుగుదలకు అవసరం అనుకుంటుంది. ఆ పుత్రకామేష్టి యజ్ఞంలో గీరా మాతృదానంతో అగ్నిపురుషుడిగా మారి వారికి పుత్రోదయాన్ని కలిగించటానికి గీరా చాల ధైర్యాన్ని, రిస్కును ఎదుర్కొంటుంది.
గీరా వివాహితయిన అవివాహిత.
భర్త లేడు, అమ్మ కావాలని కోరుకుంది. ఆమెకు ఆ అవకాశం లేక దీనికి ఒప్పుకుంది.
డాక్టర్‌ ‌వరద, గీరా నుంచిన స్ట్రేచర్‌ను లాబరేటరీలోకి తెచ్చింది. వెనక ఒక సిస్టర్‌, ‌డాక్టర్‌ అసిస్టు చెయ్యటానికొచ్చారు.
అయితే అందులో గీరా నిజమైన తల్లా, సరోగేటా? ఆ జీవకణం ఏ పురుషుడిదో, అండం ఎవరిది? అన్న విషయాలు ఒక్క డాక్టర్‌ ‌వరదకు తప్ప ఎవరికి తెలియవు.
గీరా మంచి నిద్రలో ఉంది. ఆ నిద్రలోనే తన పని పూర్తి చేసింది వరద. ఆమె కళ్లు తెరిచేసరికి, ఆమె గదిలోనే ఉంది.
* * *
గీరా నీరసంగా పడుకుని ఉంది. ఆమెకు గర్భం నిలిచి ఎనిమిది వారాలయింది. నాలుకకు ‘రుచి’ తగ్గింది. ముఖ్యంగా అన్నీ తినాలని ఉంది. కానీ, ఏమీ తినలేకపోతున్నది.
డాక్టర్‌ ‌వరద అక్కడికి వచ్చింది.
‘‘హలో హౌ ఆర్‌యూ!’’ అంటూ పలకరిస్తూ, స్కానింగ్‌ ‌మానీటర్‌ ‌రెడీ చేయమంది సిస్టర్‌ని. ‘‘ఫైన్‌! ‌కానీ, ఎలాగో ఉంది. ఏమి తినలేకపోతున్నాను. ఆకలిగా ఉంటుంది. తింటే కాస్త ‘వాంతి’ లా అనిపిస్తుంది’’ చెప్పింది.
‘‘గుడ్‌ ‌జీవరసాయనాల మార్పులు సూచిస్తున్నాయి. దటీజ్‌ ‌గుడ్‌. ‌నీకేం తినాలనిపిస్తే అదే• తిను. ఎలాంటి అభ్యంతరాలు లేవు. నేనీలోపల ఫైవ్‌ ‌మినిట్స్ ‌రిలాక్స్ అవుతాను’’ అంటు ఇంకో బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది వరద. మెత్తటి పరుపు… అలసిన శరీరం అయినా విశ్రాంతి తీసుకుంటున్నా గీరా గురించే ఆలోచిస్తున్నది.
గీరాతో మొదటి అగ్రిమెంట్‌ ‌గుర్తొచ్చింది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE