గ్లోబలీకరణతో అతలాకుతలమైన గ్రామీణ భారతాన్ని, విచ్ఛిన్నమైన చేతివృత్తులు, వ్యవస్థలను ఒక్కొక్కటిగా పునరుద్ధరించ డంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల చేతివృత్తి పనివారు, హస్తకళాకారులు కూడా అంతర్జాతీయ మార్కెట్‌ను అందుకునేందుకు అవసరమైన జాగృతిని, సాధనాలను అందిస్తూ సమ్మిళిత వృద్ధి సాధించే దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు ప్రధాని మోదీ. వికసిత భారతాన్ని సాధించే దిశగా వడివడిగా అడుగులు వేసేందుకు వీలుగా రూపొందించి, అమలు చేస్తున్న పథకాలు మరికొన్ని ఈ వారం తెలుసుకుందాం.

గ్రామాలకు నాణ్యమైన, నిలకడైన విద్యుత్‌ ‌సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డిడియుజిజెవై) అనే సమగ్ర విద్యుత్‌ ‌పంపిణీ పథకాన్ని 2014లోనే ప్రారంభించింది. ఈ పథకం అమలుకు నోడల్‌ ఏజెన్సీగా రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ ‌కార్పొరేషన్‌ ‌వ్యవహరిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఫీడర్లను వేరు చేయడం ద్వారా గృహ వినియోగదారులకు, వ్యవసాయ వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్తును అందచేస్తున్నారు. నిర్దేశిత మైలురాళ్లను సాధించిన వారికి ఈ పథకం కింద 60శాతం ప్రాజెక్టు విలువ (ప్రత్యేక రాష్ట్రాలకు 85శాతం)ను భారత ప్రభుత్వం గ్రాంట్‌ ‌రూపంలో అంద చేస్తుండగా, 15శాతం వరకు (ప్రత్యేక రాష్ట్రాలకు 5శాతం అదనంగా) నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలలో అన్ని ఈశాన్య రాష్ట్రాలు, మ్ముకశ్మీర్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ఉన్నాయి. దేశాభివృద్ధి కోసం అదనంగా పునరావృత ఇంధనాలతో పని చేసే విద్యుత్‌ ‌కేంద్రాల స్థాపనకు పూనుకోవడమే కాదు, ప్రస్తుతం గ్రామీణ ఆవాసాలకు 23 గంటలపైన విద్యుత్‌ ‌సరఫరా చేస్తోంది.

పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి, మాన్‌ధన్‌ ‌యోజన, రైతు ఉత్పత్తిదారు సంస్థలు

మోదీ 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచీ ‘రైతు ఆదాయం పెంపు, సాగు వ్యయం తగ్గింపు, విత్తు నుంచి విపణి దాకా అన్నదాతకు ఆధునిక సౌకర్యాల కల్పన’ అన్నవి ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పలు చర్యలు చేపట్టారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కోసం కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డ్, ‌పిఎం పంటల బీమా, పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌నిధి సహా అనేక పథకాలు, సంస్థలు ప్రారంభమయ్యాయి. పీ•ఎం కిసాన్‌ ‌యోజన ప్రపంచంలోనే అత్యంత భారీ డీబీటీ పథకాలలో ఒకటి. ఇది భూ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది.

ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద 55.49 కోట్ల మంది రైతులు నమోదు కాగా, రూ.1.50 లక్షల కోట్లు రైతుల అభ్యర్ధన కింద చెల్లించిన పరిహారం సొమ్ము. రైతులకు 24 కోట్ల భూసార కార్డులను సూక్ష్మ పోషకాల సద్వినియోగం లక్ష్యంతో 2014-15 నుంచి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలో 11.27 కోట్లమంది రైతులకు 15 విడతలుగా 2.81 లక్షల కోట్లను చెల్లించారు. అరవై ఏళ్లు నిండిన రైతులకు పెన్షన్‌ ఇచ్చే లక్ష్యంతో ప్రారంభమైన పిఎం మాన్‌ధన్‌ ‌యోజన కింద 23.38 లక్షల మంది నమోదు చేసుకున్నారు. 2019లో ప్రారంభించిన ఈ పథకం కింద రైతుకు నెలకు రూ.3,000 పింఛను ఇస్తున్నారు.

నమో డ్రోన్‌ ‌దీదీ

వినూత్నమైన ఈ పథకం కింద 2024-25లో ఎంపిక చేసిన, 14,500 మంది మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం డ్రోన్లను పంపిణీ చేస్తుంది. వీటికి గరిష్టంగా 80శాతం మేర కేంద్రం చేయూతనిస్తుంది. మిగిలిన మొత్తాన్ని సాముదాయిక స్థాయి సమాఖ్య రుణాల ద్వారా సమకూరుస్తుంది. ఇది రైతు సామర్ధ్యం సహా పంట దిగుబడి పెంపు, నిర్వహణ ఖర్చుల తగ్గింపులో తోడ్పడనుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీలు తమ సొంత వనరులతో 500 డ్రోన్‌ ‌చోదిత ఎరువులను కొనుగోలు చేసి, ఆయా స్వయం సహాయక సంఘాలకు అందిస్తాయి. వీటిని అద్దెకు ఇచ్చే సదుపాయం కూడా కల్పిస్తున్నారు.

స్వయం సమృద్ధ భారత్‌

ఈ ‌పథకం కింద రూ.1 లక్షల కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రారంభ మైంది. దీనికింద రూ. 32వేల కోట్ల విలువైన 42వేలకు పైగా ప్రాజెక్టులకు ఆమోదముద్రపడింది.

ఇ-నామ్‌

‌వినూత్న పంటల విక్రయ పథకమైన ఇ-నామ్‌ ‌కింద వెయ్యి మండీలతో రెండు కోట్ల మంది రైతులను అనుసంధించారు. అటుపైన 2021- 33లో కనీస మద్దతు ధర కింద రికార్డు స్థాయిలో రూ. 2.75 కోట్ల విలువైన కొనుగోళ్లు నమోదయ్యాయి,

ప్రత్యామ్నాయ ఇంధనాల వృద్ధిలో గణనీయమైన విజయాలు

పర్యావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని, వాటి దుష్పరిణామాలను తగ్గించేందుకు పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేసేందుకు హరిత ఇంధనంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటి వరకూ, శిలాజేతర ఇంధన ఆధారిత ఇంధన సామర్ధ్యం 81 గిగావాట్ల నుంచి 188 గిగావాట్లకు పెరిగింది. ఇదే సమయంలో సౌర విద్యుత్‌ ‌సామర్ధ్యం 26 రెట్లు పెరగగా, పవన విద్యుత్‌ ‌సామర్ధ్యం రెట్టింపు అయింది. పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్ధ్యంతో ప్రపంచంలోనే నాలుగవ స్థానానికి చేరుకోవడం విశేషం.

2030 నాటికి శిలాజేతర ఇంధనాల నుంచి 50 శాతం విద్యుత్‌ ‌స్థాపిత సామర్ధ్యాన్ని సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం పని చేస్తోంది. గత దశాబ్దంలో 11 సోలార్‌ ‌పార్కులను నిర్మించగా, మరొక 9 పార్కుల పనులు సాగుతున్నాయి. అలాగే సోలార్‌ ‌రూఫ్‌ ‌టాప్‌ ‌వ్యవస్థాపనల కోసం నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద కోటి కుటుంబాలకు సాయం అందించనున్నారు. దీనివల్ల ప్రజల విద్యుత్‌ ‌బిల్లులు తగ్గడమే కాదు, మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నారు. కొత్తగా 10 అణు ఇంధన కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించింది. ఉదజని ఇంధన రంగంలో భారత్‌ ‌శరవేగంగా పురోగ మిస్తోంది. నేటివరకూ లద్దాఖ్‌, ‌డామన్‌, ‌డయ్యూలో రెండు ప్రాజెక్టులను ప్రారంభించారు.

ఇథనాల్‌ ‌రంగంలో మా ప్రభుత్వం అపూర్వమైన కృషి చేసింది. దేశం 12 శాతం ఇథనాల్‌ ‌బ్లెండింగ్‌ ‌లక్ష్యాన్ని సాధించింది. 20 శాతం ఇథనాల్‌ ‌బ్లెండింగ్‌ ‌లక్ష్యాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. నేటివరకు ప్రభుత్వ కంపెనీలు లక్ష కోట్లకు పైగా విలువైన ఇథనాల్‌ను కొనుగోలు చేశాయి. ఈ చర్యలన్నీ ఇంధనం కోసం మనం విదేశాలపై ఆధారపడటం తగ్గించి, విదేశీ మారక నిల్వలను పెంచుతాయి.

పన్నుల వ్యవస్థ సంస్కరణ – జీఎస్టీ

(వస్తు సేవల పన్ను)

జీఎస్టీ ప్రవేశపెట్టడానికి ముందు దేశంలో 440కిపైగా వివిధ శాతాలతో రకరకాల పన్నులు, సుంకాలు అమలవుతూ ఉండేవి. ఫలితంగా భారత అంతర్గత వాణిజ్యంలో స్వేచ్ఛ, ఐక్యత ఉండేవి కావు. జీఎస్టీ రూపేణా పన్నుల సంస్కరణ అమలుతో 29 రాష్ట్రాలు/ 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ వ్యవస్థలో ఏకీకృతం చేశారు. దీనిద్వారా రాజకీయ ఏకాభిప్రాయ సాధన, ఉమ్మడి స్వతంత్ర అధికారం గల వస్తు సేవల పన్నుమండలి (జీఎస్టీ కౌన్సిల్‌) ఏర్పాటుతో కొత్త పన్ను వ్యవస్థ రూపొందింది.

కొవిడ్‌ -19 ‌మహమ్మారి సమయంలో పన్ను శాతాలు తగ్గడంతోపాటు విస్త్రత ఉపశమన చర్యలు చేపట్టినప్పటికీ 10.9 శాతం మేరకు పెరుగుదల నమోదైంది. దేశంలోని కుటుంబాలకు 2017 డిసెంబర్‌ ‌నుంచి 2023 మార్చి మధ్య నెలకు దాదాపు రూ. 45,000 కోట్లు కావడంలో జీఎస్టీ తోడ్పడిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. జీఎస్టీ ద్వారా నెలవారీ సగటు రాబడి 2018లో 90వేల కోట్లు కాగా, 2023-2024లో రూ.1.7 లక్షల కోట్లకు పెరిగింది.

ఈ పన్నులను రెండు యంత్రాంగాల ద్వారా రాష్ట్రాలకు నిధుల బదలీ చేయడం జరుగుతోంది. ఈ వ్యవస్థ సహకారాత్మక సమాఖ్య తత్వాన్ని ప్రోత్సహించడమే కాక సరళం, పారదర్శకం కావడంతో అవినీతిని, పన్ను ఎగవేతను నిరోధిస్తుంది.

స్టార్ట్-అప్‌ ఇం‌డియా (అంకుర భారత్‌)

దేశంలో ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, పెట్టుబడులను ప్రోత్సహించే బలమైన పర్యావరణ వ్యవస్థ సృష్టి లక్ష్యంగా 2016 జనవరి 16న స్టార్ట్- అప్‌ ఇం‌డియా పథకాన్ని ప్రారంభించారు. భారతదేశ యువత కేవలం ఉద్యోగార్ధులు కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా రూపొందాలన్న లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. కేవలం ఐదుగురికి ఉపాధి కల్పించగలది కూడా అంకుర సంస్థే, ఆ విధంగా దేశానికి అది ఎంతో గొప్ప సేవ అవుతుందంటూ ప్రధాని మోదీ పథకాన్ని ప్రారంభిస్తున్న సమయంలో వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో 2023 డిసెంబర్‌ ‌వరకూ గుర్తింపు పొందిన 1.16 లక్షల అంకుర సంస్థలతో ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర పర్యావరణ వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించింది. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 10 లక్షల ఉద్యోగాలు సృష్టి అయ్యాయి. నాస్కామ్‌ అధ్యయనం ప్రకారం, 2017-2021 మధ్య సాంకేతిక అంకుర సంస్థలు సృష్టించిన ప్రత్యక్ష -పరోక్ష ఉద్యోగాల సంఖ్య 23 లక్షలుగా ఉండడం గమనార్హం. దేశంలో నేడు యూనికార్న్‌ల సంఖ్య 115కు చేరగా, వీటి విలువ 350 బిలియన్‌ ‌డాలర్లకు పైగా నమోదైంది. ప్రపంచంలోని ప్రతి 10 యూనికార్న్‌లలో ఒకటి భారత్‌లోనే రూపొందుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారి ఒక ప్రైవేట్‌ ‌రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం దేశంలోని ఉదారవాద అంకుర విధానానికి నిదర్శనం.

ఆయుష్మాన్‌ ‌భారత్‌

‌రాంచీలో 2018 సెప్టెంబర్‌ 23‌న ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక పథక లక్ష్యం సమాజంలోని చిట్టచివరి వ్యక్తి, కటిక పేదలు అనారోగ్యం పాలైతే తగిన చికిత్స పొందగలగడంతోపాటు అందరికీ మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు లభింపచేయడం. గతంలో ప్రతి ఏటా 6-7 కోట్లమంది ప్రజలు చికిత్సకు భారీ ఖర్చు ఫలితంగా దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయే దుస్థితి ఉండేది. అయితే, ప్రపంచంలోనే అత్యంత భారీ పథకం కింద నేడు రూ. 5లక్షల వరకూ ప్రభుత్వం ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకాన్ని ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న దాఖలాలు లేవు.

ఈ పథకం కింద కేన్సర్‌, ‌గుండె జబ్బులు, మూత్రపిండ-కాలేయ వ్యాధులు, మధుమేహం సహా పలు వ్యాధులకు చికిత్స లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.60 లక్షలకు పైగా ఆయుష్మాన్‌ ‌భారత్‌ ఆరోగ్య – శ్రేయో కేంద్రాలు నిర్మించారు. అలాగే దేశవ్యాప్తంగా 10వేల జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు, వీటిద్వారా 90 శాతం మందులు చౌకగా లభిస్తాయి. ఈ విధంగా మందులు కొనుగోలు ద్వారా 3 కోట్ల మందికి నెలవారీ ఖర్చు ఆదా అయింది.

మిషన్‌ ఇం‌ద్రధనుష్‌ ‌ద్వారా 5.65 కోట్లమందికి పైగా తల్లులు -పిల్లలు టీకా రక్షణ పొందారు. కొవిడ్‌ ‌సమయంలో దేశవ్యాప్తంగా 220 మిలియన్లకు పైగా కొవిడ్‌ ‌టీకాలు ఇచ్చారు. దేశంలో 15 కొత్త ఎయిమ్స్ ఆసుపత్రులతో పాటు దాదాపు 300 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. 3.7 కోట్లకు పైగా డిజిటల్‌ ఆరోగ్య గుర్తింపు కార్డులు సృష్టించారు. ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌డిజిటల్‌ ‌మిషన్‌ ‌ద్వారా ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణతో 25 కోట్లకు పైగా ఆయుష్మాన్‌ ‌భారత్‌ ఆరోగ్య ఖాతాలు జోడించారు.

దాదాపు 55 కోట్ల మంది పేదలు ఏటా రూ. 5 లక్షల దాకా ఉచిత చికిత్స పొందుతుండగా, ఆయుష్మాన్‌ ‌భారత్‌ – ‌ప్రధానమంత్రి జనారోగ్య యోజన కింద 28.3 కోట్ల ఆయుష్మాన్‌ ‌కార్డులు జారీ అయ్యాయి. సుమారు 27,592 ఆసుపత్రులు ఈ పథకం కింద నమోదు కాగా, ఇప్పటివరకూ 6 కోట్లమంది ఈ పథకం ద్వారా చికిత్స పొందారు. ఈ పథకం లబ్ధికి అర్హతపై సమాచారమిచ్చే ఉచిత ఫోన్‌ ‌నెంబర్‌ 14555.

‌ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన

కట్టెల పొయ్యిమీద వం• చేసే ఒక పేద తల్లి శరీరంలోకి ఒక రోజులో 400 సిగరెట్లు కాల్చినంత పొగ చేరుతుందని, ఇంట్లో ఉన్న పిల్లలు కూడా దీని బారిన పడతారని శాస్త్రవేత్తలు చెప్పిన మాటలను పరిగణనలోకి తీసుకుని, నిరుపేద మహిళలను ఈ బాధాకర జీవితం నుంచి విముక్తం చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది కనుక ఈ ఉజ్జ్వల పథకాన్ని చేపడుతున్నామంటూ మే1, 2016 న ప్రారంభిస్తూ ప్రధాని మోదీ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. దేశంలో 1955 నుంచి 2014వరకు14.52 కోట్లగా ఉన్న గ్యాస్‌ ‌కనెక్షన్లు ఉజ్జ్వల పథకం అమలులోకి వచ్చిన ఎనిమిదేళ్లలోపే 31.40 కోట్లకు పెరిగాయి. పొగరహిత వంటిల్లుపై కేంద్ర ప్రభుత్వ హామీ దాదాపు సంతృప్తి స్థాయికి చేరింది. సుమారు 10 కోట్ల కుటుంబాలకు గ్యాస్‌ ‌కనెక్షన్లు కొత్తగా లభించాయి. దీనితో మహిళల స్వావలంబనకు, కుటుంబాల్లో విద్యకు తగినంత సమయం లభించింది. వంట చేసేందుకు బొగ్గు వినియోగం కారణంగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల కేసులు 20 శాతం తగ్గాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అంతర్జాతీయ ఇంధన సంస్థ నుంచి కూడా ఈ పథకం ప్రశంసలు అందుకుంది. అనేకదేశాలు భారత్‌ ‌విజయం ఆదర్శంగా ఈ పథకాన్ని తమ దేశాల్లో అమలు చేశారు.

బేటీ బచావో బేటీ పఢావో

దేశంలో పరివర్తనకు తోడ్పడేలా బాలికల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రసవం నుంచి పోషకాహారం, పాఠశాల, విద్య, ఉద్యోగం, సైన్యంలో ప్రవేశం, సేవ, వ్యవస్థాపన, కుటుంబ భద్రత వంటి అన్నింటిలోనూ మహిళలు పరిష్కారాలను కనుగొన్న సంగతి తెలిసిందే. దేశంలో 1876 నాటి తొలి జాతీయ జనగణన తర్వాత తొలిసారిగా ప్రతి 1,000 మంది పురుషులకు ప్రస్తుతం 1020 మహిళలు ఉన్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ తేల్చింది.

బాలికల సామాజిక భద్రత కల్పన కోసం 2015లో ‘సుకన్య సమృద్ధి యోజన’ ప్రారంభమైంది.

ఉజ్జ్వల కొళాయి ద్వారా నీరు, స్వచ్ఛ భారత్‌, ‌సౌభాగ్య వంటి సామాజిక భద్రత పథకాల ద్వారా మహిళల దైనందిన జీవిత కష్టాల నుంచి విముక్తి లభించింది. జమ్ము కశ్మీర్‌లో ‘35ఎ’ ఆర్టికల్‌ ‌రద్దుతో మహిళలకు ఆస్తి హక్కు కూడా లభించింది. ఇక త్రిపుల్‌ ‌తలాక్‌ ‌రద్దు వారి ఆత్మాభిమానాన్ని కాపాడింది. లోక్‌సభ శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించే మహిళా రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర పడింది.

సుకన్య సమృద్ధి యోజన

ఖాతాల సంఖ్య – 4 కోట్లు

బేటీ బచావో బేటీ పఢావో – అమలుతో పాఠశాలల్లో 10 ఏళ్లు ఆ పై వయసున్న బాలికల సంఖ్య 15 శాతం పెరుగుదల.

2021-22లో ప్రాథమిక నుంచి ఉన్నత మాధ్యమిక విద్య దాక నమోదైన బాలికల సంఖ్య – 12.28 కోట్లు.

ఉన్నత విద్యకు నమోదైన బాలికల సంఖ్య 2.01 కోట్లు.

ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన

 దేశంలోని ప్రతి పేద పౌరుడూ ఆత్మగౌరవంతో తనదైన ఇంట్లో నివాసించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి ఆవాస్‌ ‌యోజన ప్రవేశపెట్టారు. ఈ పథకం లబ్ధిదారులలో 70 శాతం మహిళలే.

ప్రధానమంత్రి ముద్ర యోజన

చిన్నపాటి వ్యాపారాలను చేసుకునేందుకు ఔత్సాహిక వ్యాపారులకు రూ.10 లక్షల వరకూ రుణాన్ని మంజూరు చేసేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ముద్ర యోజనలో రుణాన్ని పొందిన సంస్థలలో 68 శాతం మహిళలు నిర్వహించేవే ఉన్నాయి. దాదాపు 27 కోట్లమందికి పైగా మహిళలకు ముద్ర రుణం లభించింది. దేశవ్యాప్తంగా మహిళల యాజమాన్యంలోని సూక్ష్మం-చిన్న – మధ్య తరహా పరిశ్రమల సంఖ్య 84.07 లక్షలకు పెరిగింది. అంకుర సంస్థలను ప్రోత్సహించే మహానిధి (ఫండ్‌ ఆఫ్‌ ‌ఫండ్స్) ‌లోని మూలనిధి మొత్తంలో 10 శాతం మహిళలు నడిపే అంకురాలకు కేటాయించారు.

-జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE