పేదరికం, వెనుకబాటుతనం ఎక్కడ ఉంటే, క్రైస్తవ మిషనరీలు, ఇస్లామిస్టుల కన్ను అక్కడ ఉంటుంది. ముఖ్యంగా ఒడిషా రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలలో దుర్భర పరిస్థితుల్లో ఉన్న ప్రజలను క్రైస్తవంలోకి మార్చేందుకు జరిగిన ప్రయత్నాలు, వాటికి ప్రతిఘటనలకు ఉదాహరణలే గ్రహం స్టెయిన్స్‌, స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్యోదంతాలు. అమాయకు లైన గిరిజనులను మతాంతరీకరిస్తూ, అనేక ఘోరాలకు పాల్పడుతున్న గ్రహం స్టెయిన్స్‌, అతడి కుమారులతో కలిసి హత్యకు గురికాగా, మతాంతరీకరణలను వ్యతిరేకించి, ప్రతిఘటి స్తున్నందుకు వేదాంత కేసరి స్వామి లక్ష్మణానంద సరస్వతి దారుణ హత్య జరిగింది. రెండు హత్యలూ ఎనిమిదేళ్ల తేడాతో జరిగినప్పటికీ, అంతర్లీనంగా ఉన్న కారణం ఒక్కటే` మతాంత రీకరణ. రెండు హత్యలకు మధ్య ఎనిమిదేళ్ల కాలవ్యవధి ఉంది. అంటే, రాష్ట్ర ప్రభుత్వం మిషనరీ కార్యకలాపాలను నిలువరించడంలో అలసత్వం వహించింద న్నమాట! ఈ మతాంతరీకరణ భూతం ఇంకా దేశాన్ని పట్టి పీడిస్తోందనేందుకు ఇటీవలే అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పే సాక్ష్యం. పౌరులు తమ మతాన్ని అనుసరించి, ప్రచారం చేసుకోవ డానికి రాజ్యాంగం అనుమతిస్తుందే తప్ప మతాంతరీకరించడానికి కాదని, మతపరమైన హక్కులో ఇతరులను మతాంతరీకరించే హక్కును పొందుపరచలేదని స్పష్టం చేసింది.

కానీ అన్ని న్యాయస్థానాలూ అలహాబాదు, జార్ఖండ్‌ హైకోర్టులు అంత స్పష్టమైన తీర్పులు ఇవ్వడం లేదు. అనేక సందర్భాలలో కోర్టుల దృష్టిలో హిందువుల పట్ల జరిగిన నేరాలు పట్టించుకోదగినవి, ఘోరమైనవి కావు. కానీ, మరొక వర్గంపై జరిగిన నేరాలు అత్యంత దారుణమైనవి, వెంటనే చర్య తీసుకోదగినవి. హిందువులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి తిరగబడినా అది న్యాయస్థానాల అభిప్రాయంలో ఘోరమైన పాపం. ఒడిషా రాష్ట్రానికి చెందిన కోర్టు మాత్రం గ్రహంస్టెయిన్స్‌ అనే మిషనరీ హత్య కేసులో దోషిగా 24 ఏళ్లకు పైగా శిక్షను అనుభవిస్తున్న దారాసింగ్‌ ఉరుఫ్‌ రబీంద్ర కుమార్‌ పాల్‌ విడుదలలో జరుగుతోంది అదే అనిపిస్తోంది.

24 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న దారాసింగ్‌

క్రైస్తవ మిషనరీ అయిన గ్రహం స్టెయిన్స్‌, అతని పిల్లల హత్య కేసులో 2000వ సంవత్సరంలో దారా సింగ్‌ అరెస్టు అయ్యాడు. అతడికి విధించిన మరణశిక్షను 2005లో హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. అయితే, 2000వ సంవత్సరం నుంచీ పెరోల్‌ కూడా లేకుండా దారాసింగ్‌ జైల్లో మగ్గిపోతున్నాడు. ప్రపంచమంతా అతడి గురించి మర్చిపోయింది. కానీ, జులై 9వ తేదీన దారా సింగ్‌ను త్వరితగతిన విడుదల చేయాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది విష్ణుశంకర్‌ జైన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఈ విషయమై ఒడిషా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందన్న విషయంతో సహా వివరాలను విష్ణుశంకర్‌ జైన్‌ ‘ఎక్స్‌’పై పోస్టు చేశాడు.

దారాసింగ్‌ నిర్దేశిత 14 ఏళ్ల జైలుశిక్షను అనుభ వించాడని, ఎటువంటి మినహాయింపులూ లేకుండా 24ఏళ్లు జైలులోనే ఉన్నాడని, అతడి తల్లి మరణించి నప్పుడు అంతిమ సంస్కారాలు నిర్వహిం చేందుకు కూడా కోర్టులు అతడికి పెరోల్‌ ఇచ్చేందుకు తిరస్క రించారని జైన్‌ అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం 61 ఏళ్ల దారాసింగ్‌ రెండు దశాబ్దాల కిందట చేసిన పనికి పశ్చాత్తా పడుతున్నాడని కూడా అందులో ఆయన అన్నారు. తన పిటిషన్‌లో శిక్షపడిన వ్యక్తు లను ముందస్తుగా విడుదల చేసేందుకు కోర్టులు అంగీకరించిన విషయాన్ని అతడు ప్రస్తావించాడు.

రాజీవ్‌ గాంధీ హంతకులు

రాజీవ్‌గాంధీ హంతకులలో ఒకడైన ఎజి పెరారి వలన్‌ మరణశిక్ష ఖరారు అయి అనంతరం జీవిత ఖైదుగా మార్చినప్పటికీ, అతడిని కోర్టు ముందస్తుగానే విడుదల చేసింది. రాజీవ్‌గాంధీ హత్యకు గురైనప్పుడు అతడు మాజీ ప్రధాని అయినప్పటికీ ఆó హత్య కేసులో ఆర్‌.పి.రవిచంద్రన్‌, నళిని, మరికొందరిని విడుదల చేశారు. చిత్రమైన విషయం ఏమిటంటే, రాజీవ్‌ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు, దోషి అయిన నళినికి 2016లో తన తండ్రి అంతిమ సంస్కారాలకు వెళ్లేందుకు పెరోల్‌ ఇచ్చారు.

నిజానికి ఆమె జైలు నుంచి అది రెండవసారి పెరోల్‌పై బయటకు వెళ్లడం. మొదటిసారి, తన సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు ఆమె పెరోల్‌ నుంచి జైలు బయటకు వెళ్లింది. ఒక మాజీ ప్రధానిని హత్య చేసిన కేసులో దోషి అయిన నళిని తన 25ఏళ్ల జైలు జీవితంలో రెండుసార్లు పెరోల్‌ పొందింది. కానీ, ఒక మిషనరీని హత్య చేసిన కేసులో దారాసింగ్‌కు తన 25ఏళ్ల జైలు జీవితంలో ఒక్కరోజు కూడా పెరోల్‌ లేదా శలవు లభించలేదు.

పెళ్లి చేసుకునేందుకు పెరోల్‌

ఇటీవలే, గాంగ్‌స్టర్‌ వివాహం చేసుకునేందుకు మార్చి 2024లో పెరోల్‌ ఇచ్చారు. ఈ రకంగా పెళ్లి చేసుకునేందుకు, వివాహాలకు హాజరయ్యేందుకు, అంతిమ సంస్కారాల కోసమంటూ పెరోల్‌ పొందిన ప్రమాదకరమైన గాంగ్‌స్టర్ల, హంతకుల, రేపిస్టుల జాబితా చెప్పుకుంటూ పోతే చేంతాడు అంత అవుతుంది.

వాస్తవానికి, ప్రతి పాపికీ భవిష్యత్తు ఉంటుందని కోర్టులు తాత్వికంగా వ్యాఖ్యానిస్తూ పిల్లలపై అత్యాచారం చేసినవారిని క్షమించిన కేసులు కూడా ఉన్నాయి.

దారాసింగ్‌ను విడుదల చేయవచ్చని సూచించిన జిల్లా మేజిస్ట్రేటు

ఈ కేసులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఔరియా జిల్లా మేజిస్ట్రేటు 2018లోనే సింగ్‌ను విడుదల చేయవచ్చంటూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. కొయెంరaర్‌ జిల్లా జైలుకార్యాలయం అతడి సత్ప్రవర్తన గురించి 2022లో సర్టిఫికెట్‌ ఇచ్చింది. అయితే, అదే ఏడాది ఔరియా ఎస్పీ అందుకు అభ్యంతర పెట్టడంతో అతడిని విడుదల చేయలేదు.

కీలకమైన సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

దారాసింగ్‌ మరణశిక్షను జీవిత శిక్షగా మార్చాలన్న ఒడిషా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు 2011లో సమర్ధించింది. ఆ సమయంలో హిందువులను గ్రహం స్టెయిన్స్‌ మతాంతరీకరిస్తు న్నందుకు అతడికి వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు, గ్రహం స్టెయిన్స్‌ అతడి ఇద్దరి మైనర్‌ కుమారులను పెట్రోల్‌ పోసి చంపడం నిజమే అయినా, ఆ పని చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం అతడు చేస్తున్న మతపరమైన కార్యకలాపాలు ` పేద గిరిజనులను క్రైస్తవంలోకి మతాంతరీక రించడంపై అతడికి బుద్ధి చెప్పడమంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అంతేకాదు, ఒత్తిడి, రెచ్చగొట్టడం, మతమార్పిడి లేదా ఒక మతం కన్నా మరొక మతం మెరుగైనదనే కారణంతో వేరొకరి విశ్వాసాలలో జోక్యం చేసుకోవ డాన్ని సమర్ధించలేమన్నది నిర్వివాదం అంటూ కోర్టు అభిప్రాయపడిరది.

వామపక్షుల ప్రతిఘటన

వామపక్ష ఈకోసిస్టమ్‌ నుంచి వచ్చిన తీవ్ర ప్రతిఘటన కారణంగా, దారాసింగ్‌ ఈ హత్యకు పాల్పడడానికి కారణం క్రైస్తవ మిషనరీలు, వారి దుర్మార్గమైన మతపరమైన కార్యకలాపాల వల్ల ఉన్న ప్రమాదం అంటూ సుప్రీంకోర్టు చేసిన తన వ్యాఖ్యలను తొలగించుకోవలసి వచ్చింది.

స్వామి లక్ష్మణానంద సరస్వతి కేసులోనూ అన్యాయం

ఒడిషాలోని కంధమల్‌ జిల్లాకు చెందిన స్వామి లక్ష్మణానంద 1965లో గోరక్ష ఉద్యమంలో చేరారు. అనంతరం, అక్కడ అటవీ ప్రాంతంలోని చక్రపాదలో గురుకుల విద్యాలయాన్ని, కళాశాలను నెలకొల్పి గిరిజనుల సామాజిక, మతపర అభివృద్ధి కోసం నాలుగు దశాబ్దాలకు పైగా పని చేశారు. ఈ కార్యకాలంలో చట్టవ్యతిరేకమైన, మోసపూరిత మతాంతరీకరణలను అడ్డుకోవడం, గోవధకు వ్యతిరేకంగా ప్రచారం, క్రైస్తవ మోసపూరిత భూకబ్జాదారుల బండారం బయట పెట్టడం వంటి కారణాల వల్లనే, ఆయనను లక్ష్యంగా చేసుకొని, వేటాడి హత్య చేశారు.

అంతకుముందు ఎనిమిదిసార్లు ఆయనపై హత్యా యత్నాలు జరిగాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా తగినంత భద్రతను కల్పించలేదు. స్వామీజీ హత్యానంతరం కంధమల్‌లో జరిగిన అల్లర్లలో దాదాపు 37మంది వ్యక్తులు మరణించినా, క్రైస్తవులకు అన్యాయం జరిగిందంటూ తీవ్రమైన ప్రచారం జరిగిందే తప్ప వాస్తవాలు బయటపెట్టే యత్నం చేయలేదు. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్న క్రైస్తవ మిలిటెంట్లను అరెస్టు చేయడానికి బదులుగా పాలనా యంత్రాంగం హిందువులను అరెస్టు చేసింది.

అక్కడి క్రైస్తవ స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలపై దర్యాప్తు చేయలేదు. ఈ ఘటనలో లక్ష్మణానంద సరస్వతితో పాటుగా ఐదుగురు మరణించారు. కానీ ప్రభుత్వం, న్యాయస్థానాల కళ్లకు నాడు అవి కనిపించ లేదు. నాటి కేంద్ర హోంమంత్రి శివరాజ్‌ పాటిల్‌ కంధమల్‌కు వచ్చినప్పటికీ, ఆయన క్రైస్తవ సెటిల్మెంట్లను, సహాయక శిబిరాలను సందర్శించారే తప్ప ఆశ్రమానికి రాలేదంటే కారణమేమిటో ఊహించవచ్చు.

ఈ ఘటనలలో విచక్షణారహితంగా హిందువు లను అరెస్టు చేశారే తప్ప నాటి యూపిఏ ప్రభుత్వం నుంచి వారికి హామీగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. పోలీసులు కూడా అసలు విషయం బయటకు రాకుండా, మొత్తం మావోయిస్టులపైనే కేసు నమోదు చేసి, క్రైస్తవ మిషనరీల నుంచి దృష్టి మళ్లించారు. మావోయిస్టుల హస్తం ఉన్నప్పటికీ, ఛార్జిషీటులో ఉన్నవారందరూ మావోయిస్టులే కావడం వల్ల ఈ అనుమానం కలుగుతుంది. ఐదేళ్లలో అందులో కొందరికి కోర్టులు కఠిన కారాగార శిక్ష విధించగా, మరికొందరు ఇప్పటికీ పట్టుబడలేదు!

దారా సింగ్‌ నుంచి నూపుర్‌ శర్మ వరకూ

చిత్రమైన విషయమేమిటంటే, కన్హయ్యా లాల్‌ను జిహాదీలు హత్య చేయడానికి కారణం నూపుర్‌ శర్మేనంటూ సుప్రీం కోర్టు ఆరోపించడం. మరొకవైపు, హిందువుల హననం విషయాన్ని ప్రస్తావించడంతోనే వారు చేసే వ్యాఖ్యలకు సామాన్యుల నుంచి విమర్శలు వచ్చినా ఇంతవరకూ ఏ సందర్భంలోనూ తొలిగించ లేదు. ఇందుకు కారణం వామపక్ష ఈకో సిస్టమే నన్నది నిర్వివాదం.

హిందువులను గ్రహం స్టెయిన్స్‌ సహా పలువురు మిషనరీలు మతాంతరీ కరిస్తున్నా, మతపరమైన నేరాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకునేందుకు నిరాకరించడం వల్లే దారాసింగ్‌ ఈ నేరానికి పాల్ప డ్డాడు, స్వామి లక్ష్మనానంద హత్యకు గురయ్యారన్నది నిర్వివాదం. ఈ రెండు కేసుల్లోనూ బాధితులకు న్యాయం జరగవలసిందే.

  • నీల

About Author

By editor

Twitter
YOUTUBE