అత్యంత ఘాతుకమైన పేలుడు పదార్ధాన్ని, బాంబును అభివృద్ధి చేయడం ద్వారా రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్‌ మరొక అంగవేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసిన సెబెక్స్‌-2 (SEBEX-2) అన్న పేలుడు పదార్ధం ట్రినిట్రోటోల్యూన్‌ (టిఎన్‌టి) కన్నా రెండిరతలు ఘాతుకమైంది.

భారత ప్రభుత్వం ‘మేకిన్‌ ఇండియా’ కింద గత కొన్నేళ్లుగా పలు విధానపరమైన చొరవలను తీసుకుంటూ, రక్షణ పరికరాలను దేశీయంగా రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహిం చేందుకు పలు సంస్కరణలను కూడా చేపట్టింది. ప్రస్తుతం భారత్‌ ఆయుధాలను దేశీయంగా తయారు చేయడమే కాదు దాదాపు 85 దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నది. దాదాపు 100 సంస్థలు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. దీనిద్వారా భారతీయ పరిశ్రమ తమ రూపకల్పన, అభివృద్ధి చేయగల సామర్ధ్యాలను ప్రపంచానికి చాటుకుంది.

ఏమిటీ సెబెక్స్‌…

నాగపూర్‌కు చెందిన సోలార్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ ఎకనమిక్‌ ఎక్స్‌ప్లోజి వ్స్‌ లిమిటెడ్‌, కేవలం విధ్వంసక శక్తిని, పేలుడు ప్రభావాన్ని పెంచి నూతనంగా మూడు సూత్రీకరణలను అభివృద్ధి చేసింది. ఈ సూత్రీకరణలే మన సాయుధ దళాల కార్యాచరణను గణనీయంగా మార్చనున్నాయి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఘన పేలుడు పదార్ధాలకన్నా శక్తిమంతమైన పేలుడు ప్రభావాన్ని సెబెక్స్‌-2 కలిగి ఉంది. ఏ పేలుడు శక్తిని అయినా టిఎన్‌టిని కొలమానంగా పెట్టుకొని కొలుస్తారు. అధిక టిఎన్‌టి తుల్యత కలిగిన పేలుడు పదార్ధాలకు ఎక్కువ ఘాతుక, విధ్వంసకశక్తి ఉంటుంది. సంప్రదాయ అస్త్ర ముఖంలో, ఆకాశం నుంచి విసిరే బాంబులు, అనేకానేక ఇతర ఆయుధాలలో ఉపయో గించే డెంటెక్స్‌/ టోర్పెక్స్‌ (DENTEX/TORPEX)ల టిఎన్‌టి తుల్యత 1.25-1.30 మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.

బ్రహ్మోస్‌ క్షిపణి సహా పలు ఆయుధముఖాలలో ఉపయో గించే టిఎన్‌టికన్నా రెండిరతలు ఘాతుక మని చెప్తున్న సెబెక్స్‌`2 ను భారతీయ నావికాదళం సర్టిఫై చేసింది.

అణుయేతర పేలుడు పదార్ధాలలో అత్యంత శక్తిమంతమైనదని పేర్కొంటున్న సెబెక్స్‌-2, అదనంగా బరువు పెంచకుండా వాటి విధ్వంసక శక్తిని పెంచడం ద్వారా ఫిరంగి గుండ్లు, అస్త్రముఖా లని విప్లవీకరించ నుందని వార్తలు చెబుతున్నాయి. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పేలుడు పదార్ధాలకన్నా శక్తిమంతమైన పేలుడు ప్రభావం సెబెక్స్‌`2కి ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

నావికాదళ రక్షణ ఎగుమతి ప్రోత్సాహక పథకం కింద సెబెక్స్‌-2 సూత్రీక రణను కఠినంగా పరీక్షించి నట్టు వార్తాపత్రికలు పేర్కొన్నాయి. ఈ వర్గంలో మొత్తం మూడు నూతన సూత్రీకరణలను రూపొందిం చారు.

మేకిన్‌ ఇండియా చొరవ కింద అభివృద్ధి చేసిన సెబెక్స్‌`2 అధిక ద్రవీభవన పేలుడు పదార్ధం (హెచ్‌ఎంఎక్స్‌) ఆధారిత మిశ్రమాన్ని వినియో గిస్తుంది. కంపెనీ మరింత అధిక ఘాతుక శక్తి కలిగిన మరొక వేరియంట్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది.

సెబెక్స్‌`2 కు అదనంగా భారతీయ నావికాదళం సిట్‌బెక్స్‌ 1 కూడా సర్టిఫై చేసింది. పేలుడు వ్యవధికి, తీవ్రమైన వేడిని ఉత్పత్తి చేసేదిగా పేరుగాంచిన థెర్మోబారిక్‌ (పేలినప్పుడు అగ్నిగోళంలా కనిపిస్తూ ఆ ప్రాంతంలోని ఆక్సిజన్‌ను పీల్చుకొని శక్తిమంత మైన ఒత్తిడిని కలిగిస్తుంది) పేలుడు పదార్ధం సిట్‌బెక్స్‌ 1. ఇది శత్రువుల బంకర్లను, సొరంగాలను, ఇతర ఆస్తులను విధ్వంసం చేసేందుకు భారత్‌కు తోడ్పడు తుంది.

భారతీయ నావికాదళం సైమెక్స్‌ 4 అనే మరొక నూతన సూత్రీకరణను కూడా సర్టిఫై చేసింది. నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ప్రామాణిక పేలుడు పదార్ధాలకన్నా ఈ మందుగుండు సామాగ్రి సురక్షితమైంది. కనుక, భద్రతకు సంబంధించిన ఆయుధ వ్యవస్థలకు ఇది తగినది.

ప్రాముఖ్యత

సిట్‌బెక్స్‌ 1, సైమెక్స్‌4తో కలిసి సెబెక్స్‌`2 భారతదేశ రక్షణ సామర్ధ్యాలను బలోపేతం చేయడమే కాదు, సైనిక సాంకేతికతలో దేశ స్థాయిని పెంచు తుంది. ఈ పురోగతి మన సాయుధ దళాలు మరింత స్వయంసమృద్ధితో ఉండేలా చేయడమే కాదు, అత్యాధునిక పేలుడు సాంకేతికతల ఎగుమతి దారుగా భారత్‌ను నిలబెడుతుంది. భారతీయ ఆయుధాలను, మందుగుండు సామగ్రి సామర్ధ్యాన్ని, శక్తిని సెబెక్స్‌-2 గణనీయంగా పెంచనుంది. ఈ పురోగతి, సర్టిఫికేషన్లు అంతర్జాతీయ భద్రతలో వ్యూహాత్మక భాగస్వామ్యాలకు దారితీస్తున్న విషయం తెలిసిందే.

రక్షణ ఉత్పత్తుల ఎగుమతి

భారత్‌ ప్రధానంగా ఎగుమతిచేస్తున్న వాటిలో డోర్నియర్‌ 228, బ్రహ్మోస్‌ క్షిపణులు, ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థలు, సిమ్యులేటర్లు, రాడార్లు, మైన్‌ ప్రొటెక్టెడ్‌ వాహనాలు, ఆర్మర్డ్‌వాహనాలు, పినాకా రాకెట్లు, లాం చర్లు, మందుగుండు సామాగ్రి, థర్మల్‌ ఇమేజర్లు, బాడీ ఆర్మర్లు, విడిభాగాలు,ఏవియానిక్స్‌, చిన్న ఆయుధాలుసహా పలురకాలవి ఉన్నాయి. దేశీయంగా తయారు చేస్తున్న ఎల్‌సిఎ- తేజస్‌, లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ కారియర్‌, ఎంఆర్‌ఒ కార్య కలాపాలు తదితరాలకు అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరుగుతోంది.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE