– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఏ కార్యక్రమమైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. భూములు,వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. అనుకున్న రాబడి దక్కుతుంది. సొంత ఆలోచనలతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడి మరింత పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు సమస్యలు, వివాదాలు తొలగుతాయి. 3,4 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం. శివస్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కొత్త కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. ఆదాయం గతం కంటే కొంత మెరుగుపడే అవకాశం. కొత్త వ్యక్తుల పరిచయం. సమాజంలో విశేష గౌరవం పొందుతారు. మీ పరిశోధనలు మరింత విస్తృతం చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు ముఖ్య విషయాలు తెలుస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు విశేష లాభదాయకమైన కాలం. 29,30 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వృథా ఖర్చులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారి సహాయపడతారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. కళాకారులు, రచయితలు, పరిశోధకులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. 2,3తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. శివాష్టకం పఠించండి..
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారస్తులు ఆశించిన లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఒక సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు కలసివచ్చే సమయం. 1,2 తేదీల్లో అనుకోని ప్రయాణాలు . ఆరోగ్యసమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఇతరుల కష్టసుఖాలు సైతం పంచుకుంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందడుగు వేస్తారు. ఆదాయం మొదట్లో నిరాశ పర్చినా క్రమేపీ అనుకూలిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. అప్పగించిన బాధ్యతలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. దైవకార్యాలలో పాల్గొంటారు. కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారస్తుల యత్నాలు సానుకూలం. ఉద్యోగులకు విధుల్లో మరింత ఉత్సాహం. పారిశ్రామికవేత్తలు, రచయితలు, క్రీడాకారులకు అనుకూల వాతావరణం. 29,30 తేదీల్లో శుభవార్తలు. వాహనసౌఖ్యం. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ఎంతటి వారినైనా చాకచక్యంగా ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. అనుకున్న కార్యక్రమాలు పూర్తి కావడంలో మిత్రులు చేయూతనందిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఒక వ్యక్తి పరిచయం మీలో ఉత్సాహాన్నిస్తుంది. వివాహాది వేడుకల నిర్వహణపై బంధువులతో చర్చిస్తారు. భూములు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కొంత కలసివస్తాయి. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తుల యత్నాలలో పురోగతి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు కృషి ఫలించే సమయం. 30,31 తేదీల్లో దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. దత్తస్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ఆదాయం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. మీ మనస్సును నొప్పించిన వారే ప్రశంసలు కురిపిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు తగినంత గుర్తింపు లభిస్తుంది. 2,3 తేదీలలో ధనవ్యయం. శారీరక రుగ్మతలు. కాలభైరవాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. సన్నిహితులు, బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. విద్యార్థుల శ్రమ ఫలించే సమయం. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితం అందుకోబోతున్నారు. వ్యాపారస్తులకు నూతనోత్సాహం. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. కళాకారులు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 3,4 తేదీల్లో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువర్గంతో అకారణంగా వివాదాలు నెలకొనే అవకాశం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో మార్పులు చేస్తారు. ఓర్పు, మనోధైర్యంతో ముందుకు సాగడం ఉత్తమం. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. వ్యాపారస్తులు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులు మరింత పనిభారం మోయాల్సిన పరిస్థితి. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు ఒడిదుడుకులు, ఒత్తిడులు. 30,31 తేదీల్లో శుభవార్తలు. వాహనసౌఖ్యం. స్వల్ప ధనలబ్ధి. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ముఖ్య కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో అంది అవసరాలు తీరతాయి. యుక్తితో కార్యసాధనలో విజయం పొందుతారు. కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలత ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు మరింత ప్రోత్సాహం. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. 29,30 తేదీల్లో దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతవిషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కొన్ని హఠాత్తు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులు కొన్ని సమస్యలు అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు.31,1 తేదీల్లో ఖర్చులు. బంధువులతో తగాదాలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
చేపట్టిన కార్యక్రమాలు కొంత నిదానిస్తాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించవచ్చు. ఆస్తుల వ్యవహారాలలో అవాంతరాలు అధిగమించి ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపండి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కొంత ఆలస్యంగా పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ప్రోత్సాహకరమైన కాలం. 30,31 తేదీల్లో వృథా ఖర్చులు. స్నేహితులతో వివాదాలు. దుర్గాదేవికి కుంకుమార్చనలు మంచిది.