– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కొన్ని రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పూర్వపు మిత్రులను కలుసుకుని పాతజ్ఞాపకాలు నెమరువేసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో నెలకొన్న వివాదాలు సర్దుకుంటాయి. దైవకార్యాలలో పాల్గొంటారు.  వ్యాపారులకు అనుకున్నంత లాభాలు దక్కే సూచనలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. రచయితలు, క్రీడాకారులకు కార్యసిద్ధి.19,20తేదీల్లో శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో  పూర్తి కాగలవు. రాబడి మునుపటి కంటే పెరుగుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తులపై వివాదాలు పరిష్కరించుకుంటారు.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు కొంత పెరుగుతాయి.  ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. కళాకారుల యత్నాలు సఫలమవుతాయి. రచయితలు, పరిశోధకులకు మరిన్ని అవకాశాలు దక్కవచ్చు. 20,21 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఎటువంటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకర్షిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్న  సమయానికి నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై సోదరులతో చర్చిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులు,  విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. స్థిరాస్తి కొనుగోలులో నెలకొన్న అవాంతరాలు తొలగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.  దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగులకు  విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు అన్ని విధాలా కలసివస్తుంది. క్రీడాకారులకు విశేష ఆదరణ. 15,16 తేదీల్లో దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆదాయం  కొంత పెరిగే సూచనలు. ఆస్తుల వివాదాల నుంచి క్రమేపీ బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్నేహితులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. మీ నిర్ణయాలు అందర్నీ ఆలోచింపజేస్తాయి.  వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పనిభారం కాస్త తగ్గవచ్చు.  కళాకారులకు నూతనోత్సాహం. క్రీడాకారులు, పరిశోధకులకు విజయాలు వరిస్తాయి. 17,18 తేదీల్లో వృథా ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం కొంత పెరిగి ఖర్చులు అధిగమిస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సోదరులతో ఆస్తులపై ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు ఎంతటి కార్యభారాన్నైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. కళాకారుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. పరిశోధకులు, క్రీడాకారులకు మరింత సానుకూలమైన కాలం. 19,20 తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఆదాయం అంతంత మాత్రంగా ఉండి అప్పుల కోసం యత్నిస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.శ్రమ తప్ప ఫలితం కనిపించదు. గృహ నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. సోదరులు, స్నేహితులతో  విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా  పాల్గొంటారు. విద్యార్థులకు అవకాశాలు కొన్ని చేజారవచ్చు.  మీపై కొందరు వ్యతిరేక భావాలు వ్యక్తం చేయవచ్చు. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడుల్లో నిదానం అవసరం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలకు కొన్ని అంచనాలలో పొరపాట్లు. కళాకారులు, రచయితలకు వివాదాలు. 20,21 తేదీల్లో శుభవార్తా శ్రవణం.  విందువినోదాలు. గణేశాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయమార్గాలు మరింత పెరుగుతాయి. అప్పుల బాధలు తొలగుతాయి. కొత్త కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రత్యర్థులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణయత్నాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారులకు విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి.  ఉద్యోగులకు పనిఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయవేత్తలకు అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. రచయితలు, క్రీడాకారులు ప్రతిభాపాటవాలు నిరూపించుకుంటారు. 17,18 తేదీల్లో ఆస్తి వివాదాలు. స్వల్ప అనారోగ్యం.  శ్రీకృష్ణాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆదాయం మొదట్లో కొంత తగ్గినా క్రమేపీ పెరుగుతుంది. తరచూ ప్రయాణాలు సంభవం. ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నిదానిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులతో వివాదాలు నెలకొని కొంత చికాకు పరుస్తాయి. భూముల విషయంలో  ఒప్పందాలు చేసుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు.  ప్రముఖులతో చర్చలు  కొనసాగిస్తారు. వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు కొంత ఉపశమనం లభిస్తుంది. రచయితలు, క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. 15,16తేదీల్లో  ఖర్చులు అధికం. మానసిక అశాంతి. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఏ కార్యక్రమమైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.  సమాజసేవలో నిమగ్నమవుతారు. మీ నిర్ణయాలు అందర్నీ ఆకర్షిస్తాయి. పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులు, విద్యార్థుల ప్రతిభ వెలుగు చూస్తుంది. పడిన కష్టం ఫలితాన్నిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు సత్తా చాటుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు విధినిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు అన్ని విధాలా కలసివచ్చే సమయం. రచయితలు, క్రీడాకారులకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. 20,21 తేదీల్లో శారీరక రుగ్ముతలు. బంధువులతో విభేదాలు. శ్రీనృసింహస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు. ఆదాయం మరింత పెరిగి అవసరాలు తీరతాయి. పలుకుబడి, హోదాలు కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ ప్రతిపాదనలు కుటుంబంలో ఆమోదం పొందుతాయి. బంధువులలో మీపై ఆదరణ, అభిమానం పెరుగుతాయి. వ్యాపారులు ఉత్సాహంగా సాగి లాభాలబాట పడతారు. కొత్త పెట్టుబడులతో పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు దగ్గరకు వచ్చే సూచనలు. పరిశోధకులు, క్రీడాకారులకు కొన్ని వివాదాలు తీరతాయి. 18,19  తేదీల్లో అప్పులు చేస్తారు. స్నేహితుల నుంచి విమర్శలు. శారీరక రుగ్మతలు. హనుమాన్ఛాలీసా పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ముఖ్య కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి.  బంధువులు, స్నేహితులతో విభేదాలు  నెలకొన్నా సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబబాధ్యతలు పెరిగినా సమర్థతను చాటుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో అనుకూలిస్తాయి. వ్యాపారులు పెట్టుబడుల్లో మరింత నిదానించి ముందుకు సాగడం ఉత్తమం. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉన్నా అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు కొంత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, రచయితల ఆశలు ఫలిస్తాయి. 16,17 తేదీల్లో ఖర్చులు అధికం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. సూర్యారాధన చేయండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొన్ని కార్యక్రమాలు శ్రమపడ్డా పూర్తి చేస్తారు.  ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయం క్రమేపీ పుంజుకుంటుంది. అయితే అవసరాలు పెరిగి కొంత అప్పులు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో  అధిగమిస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు నిదానంగా అందుతాయి.   ఉద్యోగులపై అదనపు బాధ్యతలు పడవచ్చు.  రాజకీయవేత్తల యత్నాలు కలిసివస్తాయి. క్రీడాకారులు, పరిశోధకులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.  15,16 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

About Author

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE