– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల నుంచి కీలక సమాచారం రాగలదు. నిరుద్యోగుల యత్నాలు కొలిక్కి వస్తాయి. ఆదాయానికి ఏ మాత్రం లోటు లేకుండా గడుస్తుంది. వ్యాపారులకు లాభాలు. పారిశ్రామికవేత్తలకు ప్రగతి కనిపిస్తుంది. రచయితలు, క్రీడాకారులకు శుభవార్తలు. 6,7 తేదీల్లో శారీరక రుగ్మతలు. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు.  కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.  రాబడికి ఇబ్బందులు తీరతాయి. సోదరులతో వివాదాలను పరిష్కరించుకుంటారు.  ఇంటి  నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు మరింత లాభాలు. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.  రాజకీయవేత్తలకు శుభవార్తలు. రచయితలు, క్రీడాకారులు ఉత్సాహవంతంగా సాగుతారు. 1,2 తేదీలలో కుటుంబసమస్యలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. ఆదాయం కొంత సంతృప్తినిస్తుంది. సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. ప్రముఖుల నుంచి  ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. వ్యాపారులకు కొత్త ఆశలు. కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. క్రీడాకారులు, పరిశోధకులకు సమస్యలు తీరే సమయం. 3,4 తేదీల్లో ధనవ్యయం. సూర్యారాధన చేయండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొత్త  కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. రాబడి సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో కీలక విషయాలపై చర్చలు. ఆభరణాలు, వాహనాలు కొంటారు. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు ఉద్యోగాలలో ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.  పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు. 5,6 తేదీల్లో శారీరక రుగ్మతలు. వృథా ఖర్చులు. ఆంజనేయ దండకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో ఎట్టకేలకు పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబసభ్యుల సలహాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు సంస్థలను విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు విజయవంతమైన కాలం. 2,3 తేదీల్లో అనారోగ్యం, కుటుంబంలో చికాకులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.  విద్యార్థులకు నూతనోత్సాహం. రాబడి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. వ్యాపారులకు లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, రచయితలు అనుకున్నది సాధిస్తారు. 5,6 తేదీల్లో బంధువులతో విభేదాలు. శివపంచాక్షరి పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు కొన్ని విజయవంతంగా సాగుతాయి. శ్రేయోభిలాషుల సూచనలు అమలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో  పాల్గొంటారు. అనుకోని విధంగా కాంట్రాక్టులు దక్కుతాయి. సోదర, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు లాభాలు దక్కవచ్చు. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  4,5 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు నిదానించినా చివరికి పూర్తి కాగలవు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. ప్రత్యర్థులు స్నేహితులు మారి చేయూతనందిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు  పరిష్కారమై ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు కాస్త ఊరట. 6,7 తేదీల్లో  వృధా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. శారీరక రుగ్మతలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సజావుగా పూర్తి చేస్తారు.  ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని  వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు పెట్టుబడులకు తోడు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు. రచయితలు, క్రీడాకారులు లక్ష్యాలు సాధిస్తారు. 1,2 తేదీల్లో అనుకోని ఖర్చులు. బంధువులతో వివాదాలు. శారీరక రుగ్మతలు. గణేశాష్టకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు.  ఆపదలో ఉన్న వారికి చేయూతనందిస్తారు.  నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు  విధుల్లో అనుకూల పరిస్థితులు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని సమాచారం. రచయితలు కొంత ఊరట చెందుతారు. 2,3 తేదీల్లో  కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృథా ఖర్చులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

చిత్రవిచిత్ర విషయాలు తెలుస్తాయి. రాబడి మరింత  ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు తగినంత లాభాలు అందుకుంటారు. కొత్త పెట్టుబడులు అందుతాయి.  ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కే సూచనలు. పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు. కళాకారులు, రచయితలు పట్టుదలతో అవకాశాలు సాధిస్తారు. 4,5 తేదీలలో స్నేహితులతో వివాదాలు. అనుకోని ఖర్చులు.నృసింహస్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు. కొన్ని కార్యక్రమాలు అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి.  కష్టమే తప్పితే ఫలితం అంతగా కనిపించదు. సోదరులతో భూవివాదాలు నెలకొంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలు కొంత మందగిస్తాయి. వ్యాపారులకు సామాన్యంగా లాభిస్తుంది. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు. రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలు ముందుకు సాగవు. రచయితలకు కొద్దిపాటి చికాకులు. 5,6 తేదీల్లో శుభవార్తలు. వాహనసౌఖ్యం. గణేశ్‌ ‌స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE