ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రమాణస్వీకారం, ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ.. వారిద్దరిలో కన్పించిన భావోద్వేగాలు ఈ సన్నివేశాన్ని తిలకిస్తోన్న ప్రజల కన్నుల్లో ఆనందబాష్పాలు తెప్పించాయి.  బీజేపీ, టీడీపీ, జనసేనలతో కూడిన ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం తాము కోరుతున్న లక్ష్యాలు, ఆశించిన అభివృద్ధి సాధించగలదనే ఆనందం వారిలో కనిపించింది. ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన అధినేత  పవన్‌ ‌కల్యాణ్‌ ‌ప్రభావవంతమైన నేతగా అవతరించారు. అయిదేళ్లుగా జగన్‌ ‌ప్రభుత్వపు ఆరాచకత్వాన్ని ఎదుర్కొంటూ కూటమి ద్వారానే ఈ ప్రభుత్వాన్ని ఓడించగలమనే సత్యాన్ని ముందుగానే గ్రహించారు. తెదేపా,బీజేపీలను ఒప్పంచి కూటమి కట్టించారు. తమ పార్టీ ఆశించిన సీట్లు కూడా తగ్గించుకుని కూటమి కట్టి అవిశ్రాంత ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారు. కూటమికి 164 స్థానాలు  రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది.

ఆంధప్రదేశ్‌ ‌నూతన ముఖ్యమంత్రిగా అశేష ప్రజానీకం సమక్షంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జూన్‌ 12‌న ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలోని ఐటీపార్కు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో గవర్నర్‌ ‌జస్టిస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌చంద్రబాబు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ• నడ్డా, నితిన్‌ ‌గడ్కరీతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ, సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్‌ ‌దంపతులు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే వారందరూ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రధాని అభినందనలు తెలియచేస్తున్నప్పుడు చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మోదీ కూడా అదే రీతిలో స్పందిం చారు. జగన్‌ ‌ప్రభుత్వంపై ఆయిదేళ్ల పోరాటం, 54 రోజుల జైలు జీవితంలో పడిన ఆవేదన, ఎన్నికల్లో ప్రభుత్వం తప్పులపై ప్రచారం చేస్తూ పడిన బాధను ప్రధాని గాఢ పరిష్వంగంలో సాంత్వన పొందారు. మోదీ కూడా తన సహచరుడిని అనునయిస్తూ తానున్నానని ధైర్యంచెప్పారు. ఈ సన్నివేశం మూడు పార్టీల కార్యకర్తలు, నాయకుల్లో కూడా భావోద్వేగాన్ని కలిగించింది. కార్యక్రమానికి హాజరైన ఎన్‌టిఆర్‌ ‌కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సన్నివేశం చూస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. బాధితులకు నేనున్నానని సాక్షాత్‌ ‌దేశ ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇవ్వడంతో ఈ ప్రమాణ స్వీకారాన్ని టీవీల్లో చూస్తున్న ప్రజల్లో కూడా ఆనందబాష్పాలు వచ్చాయి.

 రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కారు ఇక అత్యంత వేగంతో పనిచేసి అభివృద్ధి సాధిస్తుందనే భరోసా కూడా ప్రజలకు కలిగింది. అంతకుముందు పదవీ ప్రమాణ స్వీకారంతో పాటు, ప్రభుత్వ రహస్యాల పరిరక్షణ ప్రమాణాన్ని కూడా చంద్రబాబు చేత గవర్నర్‌ ‌చేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాల్గవసారి. ఉమ్మడి రాష్ట్రంలో 1995లో మొదటిసారి, 1999లో రెండోసారి ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

పవన్‌ ‌ప్రమాణ స్వీకారం

చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్‌ ‌కల్యాణ్‌ ‌రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో సభాప్రాంగణం నినాదాలతో హోరెత్తింది. కొందరు జనసేన కార్యకర్తలు సీఎం, సీఎం అంటూ నినాదాలు చేయడం వినిపించింది. పవన్‌ ‌ప్రమాణం చేస్తున్న సమయంలో చిరంజీవి, నాగబాబులతో పాటు ఈ కారక్రమానికి ప్రత్యేకంగా హాజరైన మెగా కుటుంబ సభ్యులు ఉద్విగ్నతకు లోన•య్యారు. ప్రమాణస్వీకారం పూర్తయ్యాక వేదికపై ఉన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తదితరుల ఆశీస్సులు తీసుకున్నారు. చిరంజీవికి పాదాభివందనం చేశారు. పవన్‌ ‌తరువాత వరుసగా నారా లోకేష్‌, అచ్చెన్నా యుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌, ‌పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్‌ ‌యాదవ్‌, ‌నిమ్మల రామా నాయుడు, ఎన్‌ఎం‌డి ఫరూక్‌, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల, కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, ‌కొలుసు పార్ధసారధి, డొలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌, ‌కందుల దుర్గేష్‌, ‌గుమ్మడి సంధ్యారాణి, బిసి జనార్దన్‌ ‌రెడ్డి, టిజి భరత్‌, ‌సంజీవరెడ్డి సవిత, వాసంశెట్టి సుభాష్‌, ‌కొండపల్లి శ్రీనివాస్‌, ‌మండిపల్లి రామ్‌‌ప్రసాద్‌ ‌రెడ్డిల చేత గవర్నర్‌ ‌ప్రమాణం చేయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ ‌కుమార్‌ ‌ప్రసాద్‌ ఈ ‌కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర నలు మూలల నుంచి పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు తరలివచ్చాయి. ట్రాఫికు సమస్య కారణంగా 10 నుంచి 12 కిలోమీటర్ల మేర నడుచుకుంటూనే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వాహన పార్కింగ్‌ ‌స్థలం వద్ద ఏర్పాటు చేసి స్క్రీన్లవద్దే మరికొందరు ఆగిపోయారు. చంద్రబాబునాయుడు 13వ తేదీ సాయంత్రం సచివాలయంలో మొదటి బ్లాకులో బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకిచ్చిన హామీల మేరకు 5 కీలకఫైళ్లపై సంతకాలు చేశారు. 16,347 పోస్టులతో మెగా డీడిఎస్‌సి ఫైలుపై తొలి సంతకం చేశారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ ‌టైటిలింగ్‌ ‌యాక్ట్‌ను రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు. సామాజిక పింఛన్‌ ‌మొత్తాన్ని రూ.4వేలకు పెంచుతూ మూడవ ఫైలుపై, స్కిల్‌ ‌సైన్సెస్‌ ‌ఫైలుపై నాల్గవ సంతకం, అన్న క్యాంటిన్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైళ్లపై ఐదవ సంతకం చేశారు.

బీజేపీ నేత సత్యకుమార్‌కు మంత్రి పదవి

కూటమి నుంచి బీజేపీ అభ్యర్ధి ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్‌ ‌యాదవ్‌కు రాష్ట్ర మంత్రి వర్గంలో స్ధానం లభించింది. ఆయన వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సత్యకుమార్‌ ‌యాదవ్‌ ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. క్రమశిక్షణ కలిగిన నేతగా ఆయనకు పార్టీలో పేరుంది. ఎంఏ పొలిటికల్‌ ‌సైన్స్ ‌చదివిన ఆయన విద్యార్ధి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. మదనపల్లెలో చదువుతున్నప్పుడే ఏబీవీపీ తరపున కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 2018లో పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ ఏడాది మార్చి వరకు అండమాన్‌ ‌నికోబార్‌ ‌పార్టీ ఇన్‌ఛార్జిగా, ఉత్తరప్రదేశ్‌ ‌సహ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కేతినేని వెంకట్రామిరెడ్డిపై విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందారు.

పవనమా! ప్రభంజనమా?

‘ఆయన పవన్‌ ‌కాదు, తుపాన్‌…’ ‌జనసేనానిని చూపిస్తూ ఒక సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నమాట ఇది. ఇప్పుడు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు సహా అంతా ముక్తకంఠంతో చెబుతున్న మాట- ఆంధప్రదేశ్‌లో ఎన్‌డీఏ కూటమి గెలుపులో జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌ ‌కీలక పాత్ర పోషించారు. వైసీపీకి కేవలం 11 స్ధానాలు రావడానికి ఒక రకంగా పవన్‌కల్యాణ్‌ ‌ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యం, ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ఒక్కటి చేయడం కూడా కారణమే. పవన్‌లోని అన్ని పార్శ్వాలను పరిశీలిం చడంలో జగన్‌ ‌భజన బృందం దారుణంగా విఫలమైంది. ఆయన ఆవేశపూరితంగా ఉపన్యాసాలు ఇచ్చేవారు. నిజమే, కానీ ఆ ఆవేశం వెనుక ఆయన దృఢదీక్షను నాటి అధికార పక్షం గుర్తించడానికి నిరాకరించింది. ఆయన సినిమాలలో నటించారు. కానీ రాజకీయ నేతగా వాస్తవికంగా ఉన్నారు. అది గమనించడంలోను ప్రస్తుత విపక్షం విఫలమయింది. ప్రజలకు ఏదో చేయాలన్న ఒక ఆర్తి ఆయనలో చాలామంది చూసిన మాట కూడా నిజమే.

 అయిదేళ్లలో జగన్‌ ‌సాగించిన అరాచకాలు, అవినీతికి అంతే లేకుండా పోయింది. చంద్రబాబు, లోకేశ్‌, ఇతర టీడీపీ నాయకులు నిజంగానే ఒక క్లిష్ట పరిస్థితిలో, సందిగ్ధంగా ఉండిపోయిన కాలంలో పవన్‌ ‌వారిని మళ్లీ రంగంలో దిగేలా చేశారు. జైలులో ఉండగా పవన్‌ ‌వచ్చి కలవడం పెద్ద మలుపు అని సాక్షాత్తు చంద్రబాబునాయుడే అంగీకరించిన మాట నిజం. అప్రజాస్వామిక వ్యవహారం, ప్రజా వ్యతిరేకవిధానాలు, పన్నుల భారాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటిని ప్రశ్నించిన ప్రతిపక్షాలను అణచివేసేందుకు ప్రయత్నించింది. బీజేపీ, టీడీపీ నాయకులతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా అణచివేతకు గురై, అక్రమ కేసుల బారిన పడ్డారు. ఈ అణచివేత ప్రయత్నం నుంచే పవన్‌లో కసి పెరిగింది. ‘‘జగన్‌ను అథః పాతాళానికి తొక్కక పోతే నా పేరు పవన్‌ ‌కల్యాణ్‌ ‌కాదు.. నా పార్టీ జనసేన కాదు’’ అని హెచ్చ రించారు. నిజానికి గర్జించారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్‌ను ఓడించడానికి వైసీపీ ఎంతో మంది నాయకులను ఇన్‌ఛార్జులుగా దించింది. భారీగా డబ్బు వెదజల్లింది. పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శించేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. దీంతో జనసేనలో కార్యకర్తల్లో మరింత పట్టుదల పెరిగింది. వైసీపీ పార్టీ ఎంతగా ప్రలోభ పెట్టినా స్థానికులు మాత్రం పవన్‌నే గెలిపించారు. ఇక మొత్తంగా పవన్‌ ‌తన పదునైన విమర్శలతో జగన్‌కు పగలే చుక్కలు చూపించారు. పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను దక్కించుకుని వంద శాతం స్ర్టెక్‌ ‌రేటుతో అద్భుతమే చేశారు. ముద్రగడ వంటి వారు కూడా పవన్‌ ‌విషయంలో తడబడ్డారనే చెప్పాలి. తన పేరు, నిజానికి కులం మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం వ్యర్థ ప్రలాపం చేసి అభాసు పాలయ్యారు. 1982లో ఎన్‌టీఆర్‌ను చూసి కాంగ్రెస్‌ ఏ ‌విధంగా తక్కువ అంచనా వేసిందో, ఇవాళ పవన్‌ను చూసి వైఎస్‌ఆర్‌ ‌సీపీ కూడా అదే విధంగా వ్యవహరించింది. ఒక ప్రయత్నంలో పవన్‌ ఎన్నికల సమరం వీగి పోయి ఉండవచ్చు. అంతమాత్రాన అదే ఆయన అంతిమ పోరాటమని ఎద్దేవా చేయడం జగన్‌ ‌బృందం చేసిన పెద్ద తప్పిదం. జగన్‌ ‌బృందంలోని వాక్సూరు లందరికీ, గూండాలందరికీ కూడా పవన్‌ ‌సమాధానం ఇవ్వగలిగారు.

పదేళ్ల పోరాటం

జనసేనను నెలకొల్పి టీడీపీ, బీజేపీతో కలిసి 2014లో తొలి ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఆ ఎన్నికల్లో పవన్‌ ‌పోటీచేయలేదు. కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఆయన చొరవతో ఏర్పడిన కూటమి ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం అందుకుంది. 2019లో కూటమిలోని మూడు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేశాయి. అప్పట్లో పవన్‌ ఒం‌టరి పోరుకు మొగ్గు చూపారు. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు కూడా ఆయనే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. 2019 నుంచి ఐదేళ్లుగా జగన్‌ ఆరాచక పాలనను అంతం చేయడానికి పవన్‌ ‌పెద్ద యుద్ధమే చేశారు. పపన్‌ ‌పవర్‌ ‌తెలిసిన వైసీపీ తొలినుంచీ ఆయననే టార్గెట్‌ ‌చేసింది. ‘నాలుగు పెళ్లిళ్లు, దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్‌’ అం‌టూ.. వ్యక్తిత్వ హననానికి పెద్దఎత్తున పాల్పడింది. ఆయన రచిస్తున్న పొత్తు వ్యూహ బలం ముందుగానే గుర్తించి వేసిన ఎత్తు ఇది. మరోవైపు ‘సింహం సింగిల్‌గా వస్తుంది’ అంటూ పొత్తు కుదరకుండా చివరిదాకా వైసీపీ పెద్దలు ప్రయత్నించారు. జనసైనికుల్లోకి కొంతమేర ఈ ప్రచారం పోయింది. దీంతో పవన్‌ ‌తగ్గుతారని వైసీపీ పెద్దలు అంచనావేశారు. అయినా ఆయన ‘తగ్గేదే లేదన్న’ట్టు జనంలోకి దూసుకెళ్లారు. ఇటు జగన్‌.. అటు కాపు పెద్దలుగా చెలామణి అవుతున్నకొందరితో తలపడుతూనే, పార్టీని చక్కదిద్దు కున్నారు. నిజానికి, ఎన్నిక ఏదైనా ఎవరు గెలవాలో… ఎవరు ఓడాలో నిర్ణయించేది జనసేన పార్టీనే అని ఎప్పుడో పవన్‌ ‌ప్రకటించారు.

కూటమిలో కీలకం

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో పవన్‌ ‌కీలక పాత్ర పోషించారు. అసలు మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా అన్న అనుమానాలు తొలుత వ్యక్తం అయ్యాయి. అయిదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఒంటరి పోరాటం చేసి విజయం అంచుకు చేరి ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న తరుణంలో పవన్‌ ‌పొత్తు ప్రస్తావన తెచ్చారు. ఇటు చంద్రబాబు, అటు బీజేపీ పెద్దలను ఒప్పంచి కలసి పోటీ చేసేందుకు అన్నీ తానై వ్యవహరించారు. ఈ క్రమంలో తన పార్టీ పోటీచేసే స్థానాలను తగ్గించుకో వాల్సి వచ్చినా, ఆయన సంతోషంగా సమ్మతించారు. తొలుత టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఆ తర్వాత బీజేపీని పవన్‌ అం‌దులో భాగస్వామిని చేశారు. జగన్‌ ఓడించడమే లక్ష్యమని ఆయన చేసి చూపించారు..

 మోదీ ప్రశంస

ఢి•ల్లీలో జరిగిన ఎన్‌డిఏ కూటమి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, పవన్‌ ‌పోరాటాన్ని ప్రశంసించారు. ఈ పక్కన కూర్చున్నది జనసేన అధ్యక్షుడు పవన్‌ ‌కాదు.. ఒక తుఫాన్‌’.. అని ప్రధాని నరేంద్రమోదీ ఓరకంటితో నవ్వుతూ చేతివేలిని సమీపంలోనే కూర్చుని ప్రసంగాన్ని వింటున్న పవన్‌ ‌వైపు చూపిస్తూ అన్నారు.

అంతే, ఒక నిమిషం పాటు సెంట్రల్‌ ‌హాల్‌ ‌కరతాళ ధ్వనులతో మోగింది. పవన్‌ ‌పోరాటాన్ని తుపాన్‌ ఉధృతితో పోల్చారు. ఈ వ్యాఖ్యలు దేశం యావత్తూ విస్తృతంగా దూసుకెళ్లాయి. ఆంధప్రదేశ్‌ ‌ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారని, దాని వెనుక చంద్రబాబు, పవన్‌ ‌కల్యాణ్‌ ‌కృషి ఎంతో ఉందని మెచ్చుకున్నారు. ప్రధాని ప్రశంసకు ప్రతిగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ పవన్‌ ‌కల్యాణ్‌ ‌ధన్యవాదాలు తెలిపారు.

-టి.ఎస్. భూషన్

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE