– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆత్మీయుల నుంచి పిలుపు రాగలదు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. ఒక సమస్య నుంచి బయటపడే అవకాశం. పలుకుబడి పెరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారస్తులు కొత్త భాగస్వాములను చేరదీస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలు, కళాకారులు, పరిశోధకుల యత్నాలు సఫలం. 28,29 తేదీల్లో ధనవ్యయం. శారీరక రుగ్మతలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలు స్యాధిస్తారు. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. వివాహాది యత్నాలు సానుకూలమవుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు అందుతాయి. 24,25 తేదీల్లో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలను సజావుగా పూర్తిచేసి సత్తాచాటుకుంటారు. కొత్తవ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగయత్నాలు సానుకూలం. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అనూహ్యంగా లభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలు, పరిశోధకులు, రచయితలకు అవకాశాలు పెరుగుతాయి. 25,26 తేదీల్లో ధనవ్యయం. శారీరక రుగ్మతలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల మరింత దగ్గరవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీ అంచనాలు, ఊహలు నిజం కాగల సమయం. ఆదాయం మరింత పెరిగి అవసరాలు తీరతాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆదరణ పెరుగుతుంది. 26,27 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సహాయసహకారాలు అందిస్తారు. వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. కుటుంబంలో మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది. ఆదాయం గతం కంటే మరింత మెరుగుపడుతుంది. ఒక మరపురాని సంఘటన ఎదురవుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆశయాలు నెరవేరతాయి. 28,29 తేదీల్లో దుబారా ఖర్చులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
అనుకున్న కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి విశేష ఆదరణ పొందుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేసి సత్తాచాటుకుంటారు. రాబడి కాస్త పెరిగి అవసరాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులు లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు కలసివచ్చే సమయం. 24,25 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో కలహాలు. ఆంజనేయ దండకం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
చేపట్టిన కార్యక్రమాలు కొన్ని నిదానిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగి లబ్ధి పొందుతారు. కొన్ని ఆటుపోట్లు తొలగి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారస్తులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు లక్ష్యాలు నెరవేరతాయి. 25,26 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
మొదట్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉండి రుణాలు సైతం తీరుస్తారు. విద్యార్థుల కలలు ఫలించే సమయం. కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు అమలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరిగే సూచనలు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు మరింత అనుకూల పరిస్థితి. 27,28 తేదీల్లో వృథా ఖర్చులు. ప్రయాణాలలో ఆటంకాలు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం అంతగా కనిపించక డీలా పడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు, సమస్యలు ఎదురవుతాయి. మీ నిర్ణయాలను మార్పుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు కాస్త ఉత్సాహాన్నిస్తాయి. ఇంటి నిర్మాణాలు మధ్యలో విరమిస్తారు. స్నేహితులు శత్రువులుగా మారతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. కళాకారులు, పరిశోధకులు, వైద్యులకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. 25,26 తేదీలలో శుభవార్తలు. వాహనయోగం. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
అనుకున్న కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతస్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు మార్చుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత శ్రేణి నుంచి పిలుపు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు విశేష గుర్తింపు లభిస్తుంది. 29,30 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. శారీరక రుగ్మతలు.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. మీ శక్తియుక్తులు అందరూ గుర్తిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మారతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఉత్సాహం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగల అవకాశాలు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు సమస్యల నుంచి విముక్తి. 24,25 తేదీలలో దూరప్రయాణాలు. బంధువిరోధాలు. అనారోగ్యం. శివపంచాక్షరి పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టినా విజయం సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే. 27,28తేదీల్లో అనుకోని ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.