– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఆదాయం తగ్గి అప్పులు చేయాల్సిన పరిస్థితి. ముఖ్య కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. దేవాలయ దర్శనాలు. ఆప్తులు కూడా శత్రువులుగా మారతారు. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. స్థిరాస్తి విషయంలో చిక్కులు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. వ్యాపారులు స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు మరింత శ్రమపడాల్సిన సమయం. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా. ర చయితలు, క్రీడాకారులకు గందరగోళంగా ఉంటుంది. 21,22 తేదీల్లో శుభవార్తలు. ధనలబ్ధి. కుటుంబసౌఖ్యం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

అదనపు రాబడి సమకూరుతుంది. స్నేహితులు మీకు చేదోడుగా నిలుస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారవచ్చు. గృహ నిర్మాణాలు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి, హోదాలు కలిగిన వారితో పరిచయాలు. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగుల శ్రమ ఫలించి ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కళాకారులు ఊహించని అవకాశాలు దక్కుతాయి. క్రీడాకారులు, పరిశోధకులు ప్రతిభ నిరూపించుకుంటారు. 17,18 తేదీల్లో బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు. గణేశ్స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ విజయాల బాటలో సాగుతారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. స్నేహితులతో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ మరింత ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు సన్మానాలు. పరిశోధకులు విశేష గుర్తింపు రాగలదు. 19,20 తేదీల్లో అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యతిరేకులు కూడా మీకు మద్దతుగా నిలుస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసేవీలుంది. నిరుద్యోగులు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విశేషంగా కలిసివస్తుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. రచయితలకు శుభవార్తలు. 21,22 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో చికాకులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

స్నేహితుల నుంచి కీలక సమాచారం. రాబడి మరింత పెరుగుతుంది. ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయులతో మరింత ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. వేడుకలు, ఉత్సవాలకు హాజరవుతారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులకు మరిన్ని లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు ఆశ్చర్యకరమైన విధంగా పదోన్నతులు పొందుతారు. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు. కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు.22,23 తేదీలలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. విష్ణుధ్యానం మంచిది.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఎటువంటి సమస్య ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. బంధువర్గంతో మరింత సఖ్యత నెలకొంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఆత్మీయులు, బంధువుల నుంచి పిలుపు రావచ్చు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారులు లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. క్రీడాకారులు తమ ప్రతిభ నిరూపించుకుంటారు. 20,21తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. శివపంచాక్షరి పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కొన్ని ఇబ్బందులు, సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభించవచ్చు. ఆశించినంత రాబడి పొందుతారు.ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. కాంట్రాక్టర్లు ఆశాజనకంగా ఉంటుంది. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరణలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఉద్యోగులు తమ సత్తా చాటుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత అనుకూలం. కళాకారులు, క్రీడాకారులు తమ ప్రతిభ చాటుకుంటారు.18,19 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. శివాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆదాయం కొంత పెరుగుతుంది. బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. అనుకోని ఆహ్వానాలు రాగలవు. విద్యార్థులు విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారులు, రచయితలకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. 21,22 తేదీల్లో విచిత్ర సంఘటనలు. దూరప్రయాణాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఊహించిన విధంగా సొమ్ము సమకూరుతుంది. యత్నకార్యసిద్ధి. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. మీ వ్యుహాలు అర్థంకాక ప్రత్యర్థులు కంగుతింటారు. విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగుల సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు మరింతగా లాభాలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ద్వారా సన్మానాలు. పరిశోధకులు, రచయితలు తమ ప్రజ్ఞాపాటవాలు చాటుకుంటారు. 22,23 తేదీల్లో దుబారా ఖర్చులు. శారీరక రుగ్మతలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు.స్నేహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. రాబడి సంతృప్తికరంగా ఉండి అప్పులు తీరుస్తారు. భూములు, వాహనాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉత్సవాలు, వేడుకలకు హాజరవుతారు. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు లభించే సమయం. రాజకీయ, పారిశ్రామికవేత్తలు నైపుణ్యతను ప్రదర్శిస్తారు. క్రీడాకారులు, పరిశోధకులు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. 17,18 తేదీలలో దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక ఆందోళన. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. అనుకున్నంత రాబడి సమకూరి అవసరాలు తీరతాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాహన, కుటుంబసౌఖ్యం. స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. కొత్త వ్యక్తుల పరిచయం. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారులు లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. రచయితలు, కళాకారులకు ఊహించని అవార్డులు19,20 తేదీల్లో వృథా ఖర్చులు. సోదరులతో విభేదాలు. శారీరక రుగ్మతలు. నృసింహస్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్తవారు పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్య కార్యక్రమాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. నిర్ణయాలు సకాలంలో తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు మరింత ఉత్సాహంతో సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఉన్నతస్థాయివారి ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూల పరిస్థితి. క్రీడాకారులు, పరిశోధకులు వివాదాల నుంచి బయటపడతారు. 20,21 తేదీలలో బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE