ఓ ఐదేళ్ల పాలననో, రేపు జరగబోయే ఎన్నికలనో దృష్టిలో ఉంచుకుని  అడుగులు వేసిన వ్యక్తి కాదు భారత ప్రధాని నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ. వేయేళ్ల వికసిత భారత్‌, విశ్వగురు స్థానంలో భారత్‌ ఆయన మహాస్వప్నం. ఈ పదేళ్ల పాలన దానినే ప్రతిబింబిస్తుంది. ఆయన దేశీయాంగ విధానంలో అదే దృఢంగా కనిపిస్తుంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణం రద్దు సాహసోపేత నిర్ణయం. త్రిపుల్‌తలాక్‌ రద్దు ఆయన దయార్ద్ర దృష్టికి నిదర్శనం. భారత సమాజంలో ఏకాత్మత కోసం ఉద్దేశించినదే ఉమ్మడి పౌరస్మృతి.   

స్వచ్ఛభారత్‌తో శ్రీకారం చుట్టి, చంద్రయాన్‌ వరకు, ముద్రా రుణాల మొదలు అంకుర పరిశ్రమల వరకు, గరీబ్‌ కల్యాణ్‌ రోజ్గార్‌ యోజన మొదలు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి వరకు, పీఎం ఫసల్‌ యోజన మొదలు, పీఎం ఉజ్జ్వల యోజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లు వరకు సంక్షేమ పథకాల మొదలు, మౌలిక సదుపాయల కల్పన వరకు ప్రతి రంగంలో దేశం ముందడుగు వేసింది. విపక్షాలు మోదీ ప్రభుత్వ వైఫల్యాలు ఇవీ, అని చూపలేకపోతున్నాయి. ఓటమిని ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాయి. అంతేకాదు మోదీ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మెచ్చు కుంటున్నాయి. మరోవంక భయపడుతున్నాయి.

ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం నోచుకోని ఎన్నో సమస్యలను పరిష్క రించింది. ఐదు పదులకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ అసాధ్యమని చేతులేత్తేసిన అనేక సంక్లిష్ట సమస్యలకు మోదీ ప్రభుత్వం పరిష్కారం చూపింది. నిజానికి, ఇంతకాలం ఏలినవారు జటిల సమస్య లుగా చిత్రించిన వీటిలో ఏ ఒక్కటీ పరిష్కరించ లేనివేమీ కాదు. కుహన లౌకికవాదులు రాజకీయ ప్రయోజనాల కోసం భయాలను సృష్టించి, వాటిని సున్నిత సమస్యలుగా చిత్రించారు.

ఆ వైఖరి ఫలితం`భారతమాత నుదిటి కుంకుమ… జమ్ముకశ్మీర్‌ ఏడు దశాబ్దాలకు పైగా ఆర్టికల్‌ 370 ప్రత్యేక చట్టం చట్రంలో బందీ అయి పొయింది. ఆ చట్టం పాకిస్తాన్‌కు ఉపకరించింది. మతోన్మాదాన్ని పెంచింది. సామాజిక న్యాయాన్ని కాలరాచింది. నిజానికి 370 తాత్కాలిక ప్రాతిపదికను రాజ్యాంగంలో చేరినదే. దానికి శాశ్వత ప్రాతిపదిక లేనేలేదు. అయినా, కాంగ్రెస్‌ పాలకులు 370 రద్దు చేసే సాహసం చేయలేదు. 370, రద్దయ్యే ప్రశ్నే లేదని, రాదని, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులతో సమానంగా అబ్దుల్లాలు, హస్తం పార్టీ నేతలు, ఉగ్ర గర్జనలు చేశారు. అయినా, ఆర్టికల్‌ 370 రద్దయింది. అందుకే, మోదీ గ్యారెంటీ అంటే… గ్యారెంటీగా జరిగి తీరుతుందనే విశ్వాసం స్థిరపడిరది. దశాబ్దాలుగా భారత జాతీయ జీవన స్రవంతికి దూరంగా, ‘ప్రత్యేకం’గా ఉండిపోయిన జమ్ముకశ్మీర్‌, జాతీయ జీవన స్రవంతిలో అంతర్భాగం అయింది. మోదీ సంకల్ప బలంతో అది సాధ్యమైంది. 370 రద్దు కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన జనసంఫ్‌ు వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఆశయం నెరవేరింది. రక్త కాసారంలో శాంతి సుమాలు పూయించిన 370 రద్దును అడ్డుకు నేందుకు, పునరుద్ధరించేందుకు జాతీయ అంతర్జా తీయ స్థాయిలో కుట్రలు జరిగాయి. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం 370 రద్దును సమర్ధిస్తూ తీర్పు ఇచ్చి 370 తిరిగి ప్రాణం పోసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది.

దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటుగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు మోదీ ప్రభుత్వం తెచ్చిన పథకాలతో 25 కోట్ల మంది ప్రజలు బహుముఖ పేదరికం నుంచి విముక్తి పొందారు. నిజానికి, పదేళ్ల పాలనలో జరిగిన మేళ్లను స్థాలీపులాక న్యాయంగా సృజించినా ఆ చిట్టా ఎన్నో మైళ్లు సాగుతుంది. నాలుగు కోట్ల 70 లక్షల బ్యాంకు ఎకౌంట్లు .. ఆ ఎకౌంట్లలో నేరుగా వచ్చి పడుతున్న సంక్షేమ ఫలాలు, కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌’ వంటి ఉచిత బీమా. ఇలా… వందకు పైగా పథకాలతో మోడీ ప్రభుత్వం పేదలను ఆదుకోవడంతో పాటుగా పేదరిక శాశ్వత నిర్మూలనకు ముందు చూపుతో అడుగులు వేస్తోంది.

నిజానికి, సంక్షేమ పథకాలు మన దేశానికి కొత్త కాదు.. గత ప్రభుత్వాలు కూడా సంక్షేమానికి ఎత్తు పీటలే వేశాయి, అయితే, అప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది. ఇప్పడు కూడా కాంగ్రెస్‌, ‘ఇండి’ కూటమి హామీ ఇస్తున్న సంక్షేమ పథకాలకు, మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్‌ దృష్టిలో సంక్షేమం అంటే, ప్రజల జేబుల్లో కరెన్సీ పెట్టడం. బీజేపీ దృష్టిలో సంక్షేమం అంటే పేద ప్రజల సాధికారిత. మోదీ ప్రభుత్వం సాధికారిత లక్ష్యంగా సంక్షేమ పంధాను అనుసరిస్తున్నది. అందుకే, 2014లో రూ.86 వేలుగా ఉన్న తలసరి ఆదాయం 2024 నాటికి రూ.1 లక్షా, 72 వేలకు చేరింది. అంటే ఇంచు మించుగా రెట్టింపు. ఒక్కసారి గతాన్ని గమనిస్తే, ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హఠావో నినాదం ఎన్నికల నినాదంగా మిగిలిపోయింది. మరో వంక స్వయంగా రాజీవ్‌గాంధీ ప్రధాని హోదాలో సంక్షేమం పేరున ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే నిజమైన లబ్దిదారులకు చేరుతోందని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌ పేరున పేదల సాధికారిత సాధన లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పుటికే ఫలితాలు ఇస్తున్నాయి.

అయితే, ఎంత చేసినా, ఎన్నిపథకాలు అమలు చేసినా చేయవలసింది ఎంతో మిగిలే వుంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘దస్‌ సాల్‌ మే తో సిర్ఫ్‌ ట్రైలర్‌ హీ దేఖా థా.. పిక్చర్‌ అభీ బాకీ హై’ అన్నారు. అవును, ఈ పదేళ్ల మోదీ పాలనలో మనం ఇంత వరకు చూసింది ట్రైలర్‌ మాత్రమే, చూడవలసిన అసలు సినిమా ముందుంది.

అదలా ఉంటే, మోదీ ప్రభుత్వం దేశ దృక్పథాన్నే మార్చేసింది. ఒక నిర్దిష్ట లక్ష్యం, ఒక నిర్దేశిత గమ్యం లేకుండా, ఓటు బ్యాంకు రాజకీయాలే విధానాలుగా సాగుతూ వస్తున్న, ప్రభుత్వ పంధాను మోదీ ప్రభుత్వం మార్చేసింది. అందులో భాగంగా మోదీ ప్రభుత్వం ప్రధానంగా, గత ప్రభుత్వాలు పెంచి పెద్ద చేసిన ఆత్మన్యూ నతా భావాన్ని ప్రజల మనసుల్లోంచి తుడిచేసింది. ఆత్మ విశ్వాసాన్ని పెంచి ప్రపంచ దేశాల ముందు, ‘మనం’ తలెత్తుకునేలా చేసింది. ‘ఆత్మ నిర్బర్‌ భారత్‌’ను ఆవిష్కరిం చింది. అగ్ర రాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు మన పట్ల తమ దృక్పథాన్ని మార్చుకునేలా చేసింది. మోదీ పదేళ్ల పాలనలో ఇటు జాతీయంగా, అటు అంతర్జాతీ యంగా అద్భుత విజయాలను సొంతం చేసుకుంది.

నిజం. మోదీ ప్రభుత్వం తీసుకున్న అసాధారణ నిర్ణయాలు, అసాధ్యం అనుకున్న జటిల సమస్యలకు చూపిన పరిష్కారాలు, సాధించిన అద్భుత విజయాలు, పదేళ్ల పాలన ప్రత్యేకతగా ప్రపంచం ముందుంచింది. దేశ చరిత్రను మోదీకి ముందు మోదీ తర్వాత అనే కోణంలో చూసేలా దేశ గతిని, గమ్యాన్ని మార్చివేసింది. ముందు ఎన్నికల తేదీలు ఉన్నా బడ్జెట్‌లో తాయిలాల పందేరం చేయకుండా నిభాయించుకున్న ప్రభుత్వం భారత చరిత్రలో బహుశా ఇదొక్కటే. ఎన్నికలు, అధికారం వంటి అంశాలకే పరిమితమైన పార్టీ కాదు బీజేపీ. దానికొక నిర్దిష్ట లక్ష్యం ఉంది. గతం నుంచి నేర్చుకుంటూ, భవిష్యత్తును చూసే నిర్మాణాత్మక దృష్టి ఉంది. సాంస్కృతిక జాతీయవాదం, సాధారణ ప్రజల సంక్షేమం అనే విధానాలతో ముందుకెళుతూ విజయం సాధించిన నాయకుడు నరేంద్ర మోదీ.

ఆర్థిక ప్రగతితో పాటుగా అంతర్జాతీయంగా భారత దేశం ప్రతిష్ట పదేళ్ల కాలంలో వంద రెట్లు పెరిగింది. విశ్వగురు పీఠాన్ని అధిరోహించేందుకు సిద్దమవుతోంది. ఈ పదేళ్ల కాలంలో అంతర్జాతీయ యవనికపై మన దేశం నమోదు చేసిన విజయాలు ఒకటీ రెండు కాదు, ఎన్నో ఉన్నాయి. విజయ వంతంగా నిర్వహించిన జీ 20 సదస్సు, భారతదేశం పట్ల ప్రపంచ దేశాల దృక్పథాన్ని మార్చివేసింది. కొవిడ్‌ వాక్సిన్‌ విషయంలో మన దేశం పోషించిన పాత్రకు ప్రపంచమే తలవంచింది. ఇలా ఇటు వికసిత్‌ భారత్‌ అటు విశ్వగురు లక్ష్యంగా వేస్తున్న మోదీ ప్రభుత్వం వేస్తున్నఅడుగులు ‘మోదీ’ని ఒక విశ్వస నీయ ‘ప్రపంచ బ్రాండ్‌’గా ప్రపంచం ముందుం చింది. అవును.. అందుకే .. భారతీయ ఓటరు ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌ అంటున్నారు.

– రాజనాల బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE