హైదరాబాద్‌ ‌శివార్లలోని చెంగిచర్ల వద్ద ముస్లిం మూకలు రెచ్చిపోయిన ఘటన రాష్ట్ర ప్రజలు మరచిపోక ముందే, పార్లమెంట్‌ ‌పోలింగ్‌ ‌రోజు, పట్టపగలు కొమురం భీం-ఆసిఫాబాదు జిల్లా, జైనూరు మండలంలోని వడ్డెర బస్తీ మీద ముస్లిం మూకలు మళ్లీ రెచ్చిపోయాయి. ఈ మూక దాడి, హింస సంచలనం రేపాయి. యథాప్రకారం పైకి వేరే కారణాలు చెబుతున్నా, బస్తీవాసులు బీజేపీ మద్దతుదారులు కావడమే ముస్లిం మూకలకు కన్నెర్ర అయిన మాట వాస్తవం. బడుగువర్గాల హిందువులు కూడా తమ అస్థిత్వాన్ని ప్రకటించడం ముస్లిం మతోన్మాదులకు కంటగింపుగా ఉందనీ, దానితోనే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మతోన్మాదులు చిన్న చిన్న కారణాలు చూపి వారిపై హింసకు తెగబడుతున్నారనీ హిందూ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

గొడవ ఎలా మొదలయింది?

 మే 13, 2024న వడ్డెర బస్తీవాసులంతా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో రోడ్డుపై నడుస్తున్న ఓ యువకుడిని ఒక ద్విచక్ర వాహనదారు గుద్ది గాయపరిచాడు. వారిద్దరి మధ్య ఘర్షణ జరిగి, కొట్టుకున్నారు.స్థానికులు సర్దిచెప్పడంతో ఘటనా స్థలం నుంచి ఆ ఇద్దరూ వెనుదిరిగారు. వడ్డెర బస్తీ రోడ్డు ఆ రోజు బాగా రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇది జరిగిన గంటకే 500 నుంచి 600 మంది ముస్లింలు ఇనపకడ్డీలు, కర్రలు, కత్తులు, గొడ్డళ్లతో బస్తీ మీద దాడికి దిగారు. కొన్ని వార్తల ప్రకారం దాడికొచ్చిన వారిలో ఒక వ్యక్తి బస్తీకి చెందిన ఆరుమాసాల చిన్నారిని విసిరేశాడు. అయితే ఆ చిన్నారికి ఏమీ కాలేదు. ఆఖరికి అటుగా వెళుతున్న వారినీ, గొడవేమిటో అని పరిశీలిస్తున్న ఒక ఎస్‌టీ వర్గీయుడినీ కూడా ముస్లిం మూకలు విడిచిపెట్టలేదు. స్థానికి మీడియా సమాచారం ప్రకారం వడ్డెర బస్తీకి చెందిన బైలమేతుల గంగారామ్‌, ఎన్‌. ‌పరశురామ్‌, ‌మర్సికోలు లక్ష్మణ్‌ (‌గోండు గిరిజనుడు) బాగా గాయపడ్డారు. వీరిలో లక్ష్మణ్‌ ‌పరిస్థితి విషమంగా ఉండడంతో జైనూరు ఆసుపత్రికి ఆపై ఆదిలాబాద్‌, ‌చివరికి హైదరాబాద్‌ ‌గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంగతి తెలిసిన వెంటనే ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే (బీజేపీ) పాయల్‌ ‌శంకర్‌ ‌సంఘటనా స్థలానికి వెళ్లారు. దాడి చేసిన వారి మీద 24 గంటలలోగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇంతవరకు 13 మంది ముస్లింలను, బస్తీకి చెందిన ఏడుగురు హిందువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు పరారీలో ఉన్నారు.

బీజేపీ మద్దతుదారులు కావడం వల్లే

సంఘటన జరిగిన కొద్దిసేపటికి అక్కడికి వెళ్లిన ప్రత్యక్ష సాక్షి విజయ ఆర్గనైజర్‌కు చెప్పిన వివరాల ప్రకారం దారుణమైన విధ్వంసం జరిగింది. బస్తీ వాసులంతా బీజేపీ సభ్యులు కావడమే దాడి వెనుక అసలు కారణమని కూడా విజయ అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో ముస్లిం మూకలు చిన్న చిన్న కారణాలతో దిగువ తరగతి హిందువుల మీద దాడులకు దిగడం సర్వసాధారణంగా మారిందని విశ్వహిందూ పరిషత్‌ ‌నాయకుడు డాక్టర్‌ ‌రావినూతల శశిధర్‌ ఆరోపించారు. ఈ సంవత్సరం మార్చి 24న మేడ్చెల్‌- ‌మల్కాజ్‌గిరి జిల్లాలోని చెంగిచర్లలో దాడి కూడా పథకం ప్రకారం చేసినదేనని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

వీహెచ్‌పీ ఫిర్యాదు

జైనూరులో హిందువులపై జరిగిన మూక దాడి గురించి తెలంగాణ విశ్వహిందూ పరిషత్‌ ‌జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆసిఫాబాద్‌ ‌జిల్లా జైనూరు మండలంలోని వడ్డెర బస్తీ మీద పోలింగ్‌ ‌రోజు, మే 13న ఈ దాడి జరిగింది. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ తెలంగాణ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ ‌రావినూతల శశిధర్‌ ‌మే 17న కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

హక్కుల కమిషన్‌ ‌స్పందన

కొమురం భీం-ఆసిఫాబాద్‌ ‌జిల్లాలో వడ్డెరబస్తీ మీద ముస్లిం మతోన్మాదులు చేసిన దాడి ఘటన మీద జాతీయ మానవ హక్కుల సంఘం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. దాడితో సంబంధం ఉన్నవారిపై వెంటనే చర్యలు తీసుకుని తమకు నివేదిక సమర్పించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ను కమిషన్‌ ఆదేశించింది. బాధితులకు తగిన వసతులు కల్పించవలసిందిగా జిల్లా కలెక్టర్‌కు సూచించింది. డాక్టర్‌ ‌రావినూతల శశిధర్‌ ‌ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు వచ్చాయి. పోలింగ్‌ ‌రోజు మే 13న ఒక పథకం ప్రకారమే కొందరు ముస్లింలు వడ్డెర బస్తీపై కర్రలు, కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి పిల్లలు వృద్ధులు అన్న విచక్షణ లేకుండా దాడి చేశారని శశిధర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టపగలు 12 గంటలకే ముస్లిం దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు.

హద్దు మీరుతున్న ముస్లిం ముష్కరులు

నిన్నటిదాకా బీఆర్‌ఎస్‌ ‌తెలంగాణలో అధికారంలో ఉంది. దీనికి మజ్లిస్‌ ‌తైనాతీగా పనిచేసింది. రొహింగ్యాలు, అక్రమవలసదారులు తెలంగాణలో ఎక్కువగా ఉనికిని చాటుకుంటున్నారన్న ఆరోపణ కూడా ఇటీవల గట్టిగా వినిపిస్తున్నది. అస్సాంలో బంగ్లా నుంచి వలస వచ్చిన ముస్లింలు  స్థానికులైన గిరిజనుల మీద, బడుగవర్గాల హిందువుల మీద హింసకు పాల్పడి, అడవులను ఆక్రమించుకుంటున్నట్టు వింటున్నాం. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నదీ అదే అంటే అతిశయోక్తి కాదు. ఆదివాసీలు చేసిన తీర్మానాలు, చేస్తున్న డిమాండ్లు అందుకు అద్దం పడుతున్నాయి. ఆదివాసి యువకుడు మర్సుకోల లక్ష్మణ్‌పై గిరిజనేతర వర్గం దాడి చేయడం ఆదివాసీ అస్థిత్వంపై జరిగిన దాడేనని వారు విమర్శిస్తున్నారు. ఆదివాసీ సమాజంపై దాడిచేసినవారు, దాడి చేయించిన వారు ఎంతటివారైనా వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, హత్యానేరం కింద వెంటనే కేసు పెట్టాలని వారు పోలీస్‌ ‌శాఖను కోరారు.

రాయి సెంటర్‌ ‌కమిటీ తీర్మానం

 జైనూర్‌ ‌దాడికి నిరసనగా ఇటీవల కొమరం భీం జిల్లా సిర్పూర్‌-‌యు మండలంలో మహగావ్‌ ‌శ్రీగోండ్వానా పంచాయితీ రాయి సెంటర్‌ ‌కమిటీ సమావేశమైంది. దోషులను పట్టుకోవాలని కోరుతూ తీర్మానాలు చేసి పోలీసు ఉన్నతాధికారులకు అందించింది. ఇలాంటి ఘటనలు ఏజెన్సీలో పునరావృతం కాకుండా చూడాలని కోరింది.

ఆదివాసీ న్యాయవ్యవస్థ వంటి రాయి కమిటీ చర్చించిన అంశాలను, డిమాండ్లను తీర్మానాల రూపంలో పోలీసువారికి ఇచ్చామని, కానీ పోలీసుల వైఖరి తమకు నిరాశను మిగిల్చిందని వారు వాపోయారు. విన్నపాలను నిశితంగా పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాల్సి ఉండగా అదేమీ జరగలేదని ఆదివాసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రశాంత వాతావరణం ఏర్పడే వరకు జైనూర్‌ ‌మార్కెట్‌ను కొన్ని రోజులు మూసివేయాలని తీర్మానంలో ప్రధానంగా కోరినా పోలీసుశాఖ ప్రక్కన పెట్టింది. అంతేకాదు, మార్కెట్‌ ‌మూసివేయాలని ఎవరైనా అలజడి చేస్తే వారిపై చర్యలు తీసుకుంటా మని చెప్పడంలో అంతర్యం ఏమిటని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. ఇది దాడి చేసిన వర్గాన్ని వెనుకేసుకు రావడమే. బాధితులైన ఆదివాసీల పక్షాన అధికారులు నిలబడటం లేదనేది స్పష్టంగా కనిపిస్తోందని ఆదివాసులు తేల్చి చెబుతున్నారు.

రాజ్యంగంలోని షెడ్యూల్డ్ ఏరియాలో భాగంగా ఆదివాసులకు అనేక హక్కులు ఉన్నప్పటికీ అందుకు సంబంధించిన చట్టాలను సైతం అధికారులు, ప్రభుత్వం గౌరవించడం లేదని ఆదివాసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా, మరో వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గూడెం గ్రామాలలో చర్చ జరుగుతోంది. పోలీసు వ్యవస్థకు 1/70, పెసా చట్టాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ, కావాలని చేస్తున్నారా? తెలియక చేస్తు న్నారా? అనే సందేహం ఉందన్నారు ఆదివాసీలు. తమ హక్కులు, చట్టాలకు లోబడి చట్టాలను గౌరవిస్తూ ఈ ప్రాంతంలో పోలీసు వ్యవస్థ పనిచేయాలి కానీ, ఇలా జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులే చట్టాన్ని నిర్వీర్యం చేయడమేమిటని నిలదీస్తున్నారు.

ఆదివాసులు తీర్మానాలలోని అంశాలు

మే 18, 2024న సిర్పూర్‌, ‌లింగాపూర్‌, ‌జైనూర్‌లోని గోండ్వానా పంచాయితీ రాయి సెంటర్‌ ఆధ్వర్యంలో ఆదివాసులు చేసిన తీర్మానంలోని అంశాలు.

  1. ఏజెన్సీ మండలాలు సిర్పూర్‌, ‌జైనూర్‌, ‌లింగపూర్‌ ‌మండలాలలో 1/70 పెసా చట్టాలను ప్రభుత్వ అధికారులు పకడ్బందీగా అమలు చేయాలి.
  2. మర్సకోల లక్ష్మణ్‌పై దాడి చేసిన ముస్లిం, గిరిజనేతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అతని కుటుంబానికి రూ.10 లక్షలు, నాణ్యమైన వైద్యం అందించాలి.
  3. మసీదుల పరిమితిని తగ్గించాలి.
  4. అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతర ముస్లింలను మైదాన ప్రాంతానికి పంపాలి.
  5. ఐస్‌‌క్రీం, ఇతర వ్యాపారాల కోసం వచ్చే ముస్లింలను గ్రామాలలో ప్రవేశించనివ్వరాదు. వారు అక్కడ ఎలాంటి వ్యాపారం చేయకూడదు.
  6. వలస వచ్చినవారు ఆక్రమించిన భూములను ఐటీడీఏ కోర్టు ద్వారా తిరిగి ఆదివాసీలకు అప్పగించాలి.
  7. కత్తులతో, కర్రలతో ఏజెన్సీ ప్రాంతం జైనూర్‌లో భయానక వాతావరణం సృష్టించి ఆదివాసీ యువకుడు మర్సుకోల లక్ష్మణ్‌పైన దాడి చేసిన ముస్లింలపై అట్రాసిటీ, హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలి.
  8. జైనూరులో ఉన్న ఆదివాసీలపై దాడి చేసి, బీభత్సం సృష్టించిన ముస్లింలకు ఈ ప్రాంతంలో జీవించే హక్కు లేదు. వారిని మైదాన ప్రాంతానికి పంపే బాధ్యత ప్రభుత్వాలే వహించాలి.

ఏజెన్సీలోకి వారికి ప్రవేశం లేదు

ఏజెన్సీ ప్రాంత హక్కులు, చట్టాలకు భంగం కలిగించడమే కాకుండా ఏజెన్సీలో అక్రమ వ్యాపారాలు చేస్తూ, ఆదివాసి జాతి అస్థిత్వంపై దాడి చేయడం రాజ్యాంగం విరుద్ధమని ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు. అల్లరిమూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆదివాసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. తాము నిరసన తెలుపకూడదా? భావ ప్రకటనా స్వేచ్ఛ ద్వారా సమాజానికి జరిగిన అన్యాయంపై మాట్లాడవద్డా? చట్టం ఏం చెబుతుందో పోలీసువారే చెప్పాలని అడిగారు. ధర్ణాలు చేస్తే అరెస్టు చేస్తామంటున్న పోలీసులు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓ వర్గం దాడి చేస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపైన, పోలీసుశాఖ పైన లేదా? అని ప్రశ్నించారు. నేరం చేసిన ఎంతో మంది తప్పించుకు తిరుగుతున్నారని, కొందరు కళ్లెదురుగానే ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదివాసుల గొంతు కట్టడి చేయమని ఏ రాజ్యాంగ సూత్రం చెబుతుందని అడిగారు.

దాడి స్వరూప స్వభావాలను బట్టి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ / కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లుపైన, కొమురం భీం జిల్లా పోలీసు ఉన్నతాధికారులపైన కూడా విచారణ జరిపించాలని ఆదివాసీ నేతలు డిమాండ్‌ ‌చేశారు. జైనూర్‌ ‌ఘటన నేపథ్యంలో ఆదివాసిల డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వానికి తెలపకుండా, ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఏకపక్షంగా అవతలి వర్గం చెప్పినట్లు నడుచు కోవడంపై ఆదివాసులందరం తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామన్నారు. ఈ పరిణామాలపై రాష్ట్ర గవర్నర్‌, ‌కేంద్ర, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ-కమీషన్లు, మానవ హక్కుల కమీషన్లు స్పందించాలని, అవసరం అయితే కోర్టు సైతం సుమోటోగా కేసు తీసుకోని ఆదివాసీల హక్కులను పరిరక్షించి చట్టాలను అమలు చేయాలని, గోండ్వాన రాయి సెంటర్‌లో ఆదివాసీలు చేసిన తీర్మానాలను తక్షణమే అమలు చేసేలా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఏ విధంగా చూసినా జైనూరు వడ్డెర బస్తీ ఉదంతం హిందూ సమాజానికి కొత్త పాఠాలు నేర్పుతుంది. ఆదివాసీలను హిందువులుగా పరిగణించడానికే కాదు, గొంతెత్తడానికి కూడా ముస్లిం మతోన్మాదులు అంగీకరించలేకపోతున్నారు. ఇదీ విభజించే కుట్రే.

About Author

By editor

Twitter
YOUTUBE