తాము ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చు. కానీ తమ ముందుతరాలు, ఆ ముందుతరాలు పట్టువిడవకుండా శతాబ్దాలపాటు పోరాడి సాధించుకున్న రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠను చూసి భారతీయులు పులకించారంటే అతిశయోక్తి కాదు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారివరకూ సామాన్య ప్రజలు ఒక ఆ పుణ్య కార్యక్రమాన్ని ఉత్సవంలా జరుపుకున్నారు. ప్రతిపక్షాలు… ముఖ్యంగా కాంగ్రెస్‌ మాత్రం ఆహ్వానం అందినా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. బుజ్జగింపు ధోరణికి తోడు హ్రస్వదృష్టితో తీసుకున్న నిర్ణయం ప్రస్తుత ఎన్నికలలో వారి మెడకు చుట్టుకుంటున్నది. మెజారిటీ హిందువుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా మైనార్టీలు, వామపక్షవాదుల కోసం వారు తీసుకున్న ఈ నిర్ణయం వారిని కొన్ని తరాలపాటు వెంటాడనుంది.

ఆలయ నిర్మాణానికి, ఏర్పాట్లకు బాధ్యత వహించిన శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సహా దేశం నలుమూలలకు చెందిన ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపింది. అయితే, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్‌ నాయకులు సోనియాగాంధీ, అధీర్‌ రంజన్‌ చౌదరి కార్యక్రమానికి గైర్హాజరవ్వాలని నిర్ణయించు కున్నారు. ప్రాణప్రతిష్ఠను ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ వ్యవహారంగా అభివర్ణించడమే కాదు, మతమనేది వ్యక్తిగత విషయమంటూ కాంగ్రెస్‌ పార్టీ ఈ ఆహ్వానాన్ని మన్నించలేదు. ఈ సందర్భంగా విడుదల చేసిన తన అధికారిక ప్రకటనలో కాంగ్రెస్‌, ‘‘…మతమనేది వ్యక్తిగత విషయం. కానీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు అయోధ్యలో ఆలయాన్ని ఎప్పుడో రాజకీయ ప్రాజెక్టుగా మార్చివేశారు. నిర్మాణం పూర్తికాని ఆలయాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ముందస్తుగానే ప్రారంభించాలనుకోవడం ఎన్నికల లబ్ధి కోసమే. 2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటూనే, శ్రీరాముడిని ఆరాధించే కోట్లాదిమంది ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే, శ్రీ మల్లిఖార్జున ఖర్గే, శ్రీమతి సోనియాగాంధీ, శ్రీ అధీర్‌ రంజన్‌ చౌదరి ఈ ఆర్‌ఎస్‌ఎస్‌/ బీజేపీ కార్యక్రమానికి ఆహ్వానాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నారు’’ అని పేర్కొంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రాజకీయం చేసే యత్నం

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడాన్ని తిరస్కరించడమే కాదు, దానిని రాజకీయ చేసి, బీజేపీపై బురదజల్లేందుకు యత్నించి కాంగ్రెస్‌ భంగపడ్డ వైనం మనకు తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కనుకనే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించలేదంటూ, గుజరాత్‌లో జరిగిన ఒక సభలో రాహుల్‌ గాంధీ ఆరోపించడం పట్ల శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఖండిరచారు. షెడ్యూల్డు కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలవారు, కటిక దరిద్రంలో ఉన్నవారికి కూడా ఆహ్వానాలు వెళ్లాయని వారు హజరయ్యారన్న విషయాన్ని, మందిర నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణకార్మికులు కూడా కార్యక్రమానికి హాజరైన సంగతిని ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి జనవరి 12వ తేదీన విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆలోక్‌ కుమార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు రామ్‌లాల్‌, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా ఒక బృందంగా వెళ్లి రాష్ట్రపతి శ్రీమతి ముర్మును ఆహ్వానించారు. కానీ, రాహుల్‌ మాత్రం ఆమె ఆదివాసీ కనుకే ఆమెను ఆహ్వానించలే దంటూ ఇంకా గోబెల్స్‌లా ప్రచారం చేస్తూనే ఉన్నారు. కాగా, ఇటీవలే రాష్ట్రపతి ముర్ము అయోధ్యను దర్శించి పూజాదికాలను నిర్వహించారు.

కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి

చరిత్రాత్మక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాలుపంచుకోకూడదన్న కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం సొంత పార్టీలోనే చాలామందికి రుచించ లేదు. అసంతృప్తిని రగిల్చి అనేకమంది వరుస రాజీనామాలు చేయడానికి కారణమైంది. సనాతన వ్యతిరేక వైఖరితో పార్టీ పట్ల తమకు భ్రమలు తొలిగి పోయాయంటూ రాజీనామా చేసిన నాయకులు, కార్యకర్తలు పేర్కొనడం గమనార్హం. సనాతన ధర్మం పట్ల పార్టీ వైఖరి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రవాహంలా పార్టీని వదిలిపెడుతున్న వారిని నిలవరించడం ఎలాగో తెలియక కాంగ్రెస్‌ పార్టీ స్తంభించినట్టు కనిపిస్తోంది. ఇది ఒక ఎత్తు అయితే, ఢల్లీిలో కాంగ్రెస్‌పై ఆరోపణలు, నిందల ఆధారంగా ఏర్పడిన ఆప్‌ పార్టీతో పొత్తుపెట్టుకున్నందుకు, కన్హయ్యకుమార్‌ వంటి అభ్యర్ధిని నిలిపినందుకు నిరసనగా ఢల్లీిలో రాజీనామాల పరంపర కొనసాగు తున్నది. ఢల్లీి కాంగ్రెస్‌ అధ్యక్షుడు అరవిందర్‌ సింగ్‌ లవ్లీ, నీరజ్‌ బసోయా తమ పదవులకు చేసిన రాజీనామాలు దీనిని ప్రతిఫలిస్తున్నాయి.

ఇటీవలే, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అయిన గౌరవ వల్లభ్‌ నాయకత్వం పట్ల అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తూ పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేసి వార్తలలోకెక్కిన విషయాన్ని చూశాం. సనాతన వ్యతిరేక నినాదాలకు తాను మద్దతు ఇవ్వలేనని నిస్సహాయతను వ్యక్తం చేస్తూ, దేశంలో సంపదను సృష్టిస్తున్నవారిపై పార్టీ వైఖరిని వల్లభ్‌ విమర్శించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ఉద్దేశించి రాసిన లేఖలో పార్టీ ఆర్ధిక వైఖరి తమను ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని పట్టి చూపుతూ, అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా విమర్శించారు. తన హిందూ అస్తిత్వాన్ని నొక్కి చెప్తూ, సనాతనానికి సంబంధించిన అంశాలపై పార్టీ మౌనం పట్ల తన నిరాశను వ్యక్తం చేశారు. ఈ కారణాలే, ఆయన ఏప్రిల్‌ 4వ తేదీన భారతీయ జనతాపార్టీలో (బీజేపీ) చేరాలన్న నిర్ణయానికి కారణమయ్యాయి.

అదే పంథాలో, బీహార్‌ మాజీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌ శర్మ కూడా అయోధ్యలో కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ తిరస్కరించడమే తాను బీజేపీలో చేరడానికి నిర్ణయాత్మక కారణమైందని పేర్కొన్నారు. రామమందిర నిర్మాణానికి తన మద్దతును నొక్కి చెపుతూ సనాతనుల సమస్యల పట్ల కాంగ్రెస్‌ వైఖరిని ప్రశ్నించారు.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి గౌర్హాజరు కావాలన్న అధిష్ఠానం నిర్ణయాన్ని విమర్శించి నాయకత్వం ఆగ్రహానికి గురైనవారు ఆచార్య ప్రమోద్‌ కృష్ణమ్‌. ఈ విమర్శతోనే ఆయన బహిష్కృతులయ్యారు. ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తం చేసిన భావనలను పునరుద్ఘా టిస్తూ, సోషల్‌ మీడియాలో కృష్ణమ్‌ చేసిన వ్యాఖ్యలు రాముడు, దేశం పట్ల అతడి నిబద్ధతను నొక్కి చెప్పాయి.

ఒలంపిక్‌ పతక గ్రహీత, బాక్సర్‌ అయిన విజేందర్‌ సింగ్‌ కూడా కాంగ్రెస్‌ను విడిచి బీజేపీలో చేరిపోవడం ఆ పార్టీకి షాకిచ్చింది. అతడిని మధు రలో హేమామాలినికి వ్యతిరేకంగా నిలబెడతాయనే పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో సింగ్‌ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణం అనూహ్యం కాదు.

గుజరాత్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అర్జున్‌ మోధ్‌వాడియా, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, గుజరాత్‌లో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా మాజీ అధిపతి రోహన్‌ గుప్తా వంటివారు పార్టీని విడిచివెళ్లడం అన్నది,`కీలక సామాజిక, సాంస్కృతిక అంశాలతో కాంగ్రెస్‌ పార్టీ విడివడడం వల్ల అందులో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమని చెప్పవచ్చు.

ఇక యూపీఏ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేయడమే కాదు, రాహుల్‌ ప్రియాంకలకు సన్నిహితమని భావించే పలువురు నాయకులు నేడు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తుండడం మనం గమనించవచ్చు. తన కుటుంబానికి గల ఐదున్నర దశాబ్దాల బంధాన్ని తెంచుకొని మిలింద్‌ దేవరా ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలోని శివసేనలో చేరగా, కేరళలో ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ ఆంటోనీ బీజేపీలో చేరి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. యూపీఏలో మంత్రి పదవులు నిర్వహించిన జ్యోతిరాదిత్య సింథియా, జితిన్‌ ప్రసాద, ఆర్‌పిఎన్‌ సింగ్‌, సునీల్‌ జాఖడ్‌, అశ్వినీ కుమార్‌, హార్దిక్‌ పటేల్‌ వంటి వారు కాంగ్రెస్‌ను విడిచిపెట్టడమే కాదు, బీజేపీలో అత్యంత సులువుగా ఇమిడిపోయారు.

ఈ స్థితికి సైద్ధాంతిక అయోమయమే కారణమా?

నాయకత్వం, సంస్థాగత విషయాలతో పాటు, రామ మందిరం, అదానీ` అంబానీ అంశాలతో ముందుకు వచ్చిన సైద్ధాంతిక అంశాలైన ‘సెక్యుల రిజం’, ‘సోషలిజం’ అన్న భావనలతో కాంగ్రెస్‌ పార్టీ కుస్తీ పడుతున్నదన్నది వాస్తవం.

ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ పార్టీని విడిచివెళ్లిన సీనియర్‌ నాయకులలో సంజయ్‌ నిరుపమ్‌ ఒకరు. కాంగ్రెస్‌ పార్టీలో వామపక్షవాదుల ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉందని నిరుపమ్‌ ఆరోపించారు. సిద్ధాంతపరంగా కమ్యూనిజంకు 1991లో కాలం చెల్లిపోయినా, ‘నెహ్రూవియన్‌ సెక్యులరిజం’ జీవిత కాలం 70 ఏళ్ల తర్వాత కూడా ఉనికిలో ఉంది. ‘రాహుల్‌ గాంధీ చుట్టూ అనేకమంది వామపక్ష వాదులు పరిభ్రమిస్తుంటారు, వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అటువంటి వ్యక్తులు రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై ఎవరూ ప్రశ్నలను లేవనెత్తకపోయినా, కేవలం కాంగ్రెస్‌ లేఖ మాత్రమే (కార్యక్రమానికి హాజరు కావడాన్ని తిరస్కరిస్తూ) దానిని బీజేపీ దుష్ప్రచారమని ఆరోపించింది. ఇలా, ఆ ఆధ్యాత్మికక్షణాలు అందకుండా పార్టీ చేసింది’ అని సంజయ్‌ నిరుపమ్‌ విమర్శించారు.

పార్టీలో ఏకాభిప్రాయం లేదు

ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందినప్పుడు దానిని తిరస్కరించే ముందు కనీసం వర్కింగ్‌ కమిటీలో కూడా దీనిని చర్చించలేదన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు రషీద్‌ కిద్వాయీ పేర్కొనడం గమనార్హం. ‘ఆర్గనైజర్‌’ పత్రికతో మాట్లాడుతూ, ఒకవేళ దానిపై చర్చ జరిగి ఉంటే ఒక ఏకాభిప్రాయం వచ్చి ఉండేదని, ఆ తర్వాత ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండేది కాదని అభిప్రాయడ్డారు.

రెండేళ్ల కిందట మేలో జరిగిన కాంగ్రెస్‌ చింతన శిబిరాన్ని గుర్తు చేసుకుంటూ, ‘ఉదయపూర్‌లో జరిగిన ఈ శిబిరంలో ఉత్తర, మధ్య భారతదేశానికి చెందిన 150మంది పార్టీ ప్రతినిధులు జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయాలలో దహీ హండీ, నవరాత్రి, గణేశ్‌ చతుర్ధి వంటి పండుగలను, క్రతువులను జరి పేందుకు అనుమతి కోరారు. అయితే, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ప్రతినిధులు కొందరు దీనిని వ్యతిరేకించడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. జైరామ్‌ రమేష్‌, ఇతరులు దీనిని సాకారం కానివ్వలేదు. కాంగ్రెస్‌పై పెరుగుతున్న వామపక్ష ప్రభావం, నాయకత్వ అంశాలను గురించి మాట్లాడుతూ, నాయకత్వ స్వభావాన్ని బట్టే పార్టీని చూస్తారు. చాలామంది పార్టీ స్వభావాన్ని మార్చేం దుకు యత్నిస్తారు కానీ అంతిమంగా నిర్ణయం నాయకత్వానిదే. ఇందిరాగాంధీ పాలనా కాలంలో కూడా వామపక్షాల ఉనికి ఎక్కువగా ఉండేది. కానీ ఎవరు ఇందిరను వామపక్ష వాది అనలేదు కదా? ఆఖరకు జవాహర్‌లాల్‌ నెహ్రూ కూడా కమ్యూనిస్టు లను ఆమడదూరంలో ఉంచారు, జాతి ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ దృఢసంకల్పంతో ఉన్నారు,’ అని ఆయన వివరించడం గమనార్హం.

‘‘కాంగ్రెస్‌ నేడు దేశ ప్రజల మనోభావాలను గుర్తించి, వినియోగించుకో వడంలో విఫలం కావడమే కాదు, దేశ రాజకీయాలలో సీదాగా ప్రయాణించేం దుకు మార్గాన్ని కనుగొనడం పట్ల విముఖంగా ఉంది. ఏమైనా, పార్టీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేస్తోంది, కనుక దాని వ్యవస్థలలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. కర్ణాటకలో, తెలంగాణలో విజయాలను రాహుల్‌ గాంధీకి ఆపాదిస్తే, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో పరాజయాలకు అతడే బాధ్యతను, విమర్శలను స్వీకరించాలని కిద్వాయ్‌ అభిప్రాయపడ్డారు.భారతీయ ఆత్మను గమనించడంలో, గౌరవించడంలో గడచిన ఏడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌ దారుణమైన అలసత్వాన్ని చూపుతున్నది. అదంతా వేరు. ఇప్పుడు బాలక్‌ రాముడి ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని నిరాకరించడం ద్వారా తన పాత వైఖరిని పునరావృతం చేసింది. కానీ ఇది దిద్దుకోలేని తప్పిదం. ఆ వాస్తవాన్ని ఇప్పటికీ ఆ పార్టీ గుర్తించదని అనిపించడం లేదు.

– ‘ఆర్గనైజర్‌’ నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE