‘మాతృ’ అంటే అపారశక్తి, అద్భుత సంపద.

పూజనీయ, ఆదరణీయ.

వందనం అనేది గౌరవ అభివాదం, ఆత్మీయ అభినందనం.

మాతృవందనం = అపురూప తేజోమయ వనితామూర్తులకు ప్రణులు, ప్రశంసనం, ప్రస్తుతి, సంస్తవం. భారతీయ భాగ్య దీప్తి, జాతీయ విస్ఫూర్తి.

యుగయుగాల మానవజాతికి ఉజ్జీవనం

జగజగాల జాగృత జ్యోతికి సంభావనం

అపూర్వ సత్కార గ్రహీతలందరికీ శతాభిషేకం.

సారస్వత లోకాన అత్యంత విశిష్ట ప్రక్రియ. నాటి ` నేటి మేటి కలాలకు, కళలకు, సత్కృతులతో భావితరాల కవయిత్రులు / రచయిత్రులకు మేలిమి బాట. భాగ్యనగరంలోని తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్‌ చారిటబుల్‌ ట్రస్టు ఉమ్మడి నిర్వహణలో షష్టిపూర్తి కలం బలానికి పురస్కృతి. వర్సిటీ ఆవరణలోని కళామందిరంలో సాంస్కృతిక, విద్య, భాష, పాలన రంగాల సుప్రసిద్ధుల సమక్షాన ఇంతటి విలక్షణత. ప్రత్యేకించి ఆహ్వానించి సన్మానించడం ఇది మూడో వసంతమైనా, ఇంతమందికీ ఏకీకృత వేదిక ఇదే ప్రథమం. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మరెన్నో ప్రాంతాలుÑ విదేశాల్లోని తెలుగువారందరికీ పర్వదినోత్సాహం కలిగించిన శుభ సందర్భం, బహు సంతోషదాయకం. ప్రధాన నిర్వాహక మహిళామణులు అయినంపూడి శ్రీలక్ష్మి, రాణి నల్లమోతు మాటల్లో….చరిత్రాత్మక తరుణం. గడచిన రెండు సంవత్సరాల్లో ఏర్పాటు చేసిన పురస్కార వేడుకలకు కొనసాగింపుగా ఇప్పటివారి సంఖ్యనీ కలిపితే వందమందిపైగా ప్రజ్ఞాధురీణలను సారెతో అభిషేకించినట్లు!


ఏడు దశాబ్దాల వయసుపైబడిన స్త్రీ రత్నాలను, కలం అలంకృతులను సన్మానించుకోవడంతో పరిపూర్ణత సమకూరింది. మాతృ‘వంద’నంగా ఇదంతా రికార్డు సృజించింది. శతవసంత ప్రతిబింబ తెన్నేటి మాణిక్యాంబ, వాగ్గేయ లహరి కర్త, సంగీత వ్యవహర్తగానేకాకÑ రచనా వ్యాసంగాన విస్తృత. ఆ మహనీయతతో పాటు పలు అవార్డుల విజేత బీనాదేవిని, ప్రాచీన భాషకు ఆధునికత అద్దిన అరుణావ్యాస్‌ని, ప్రయోగశీల శోభారావు తదితరులను సత్కరించారు. ఏటా  70  పురస్కారాల   ప్రదానం యూనివర్సిటీ సంప్రదాయం. అలా 70 ఏళ్లు పైబడిన ప్రతిభావంతులను శతాధికంగా సత్కరించుకోవడం మహత్తర అనుభూతిని పరిపోషించింది. కీర్తికిరీటాన ఇదే కలికితురాయి అని విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడు కిషన్‌రావు, రిజిస్ట్రార్‌ భట్టు  రమేష్‌ అభివర్ణించారు. నిర్వహణపరంగా ఎంతో సంతృప్తి, సంతోషం పెంచిన చక్కని కార్యక్రమమని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అంతరంగ తరంగం.

కలలన్నీ పరిపూర్ణమైన వేళ అని శ్రీలక్ష్మి, నేత్రానంద ప్రదాయకమని రాణి వ్యక్తీకరించారు. సరస్వతీ సమర్చనగా భావించిన మరెందరో సహాయ సహకార సమన్వయాలందించడంతో ప్రాంగణ మంతటా కళకళలూ, తళతళలూ. విద్యాబోధనల విఖ్యాత గౌరి తంగవేలు, అక్షరమకరంద అరవింద, నవీన కథాగానాభిలాషి ఆకెళ్ళ విశాలాక్షి, మహాక్షర రaరి శ్రీలక్ష్మి ఉంగుటూరి, ఆధ్యాత్మిక  రచనా సమాలోచన బుగ్గారపు సులోచన, విభిన్న భావనల పూదోట ఉమాదేవి ఆచంట, సామాజికాంశాల విలక్షణి ద్రోణంరాజు సుబ్బలక్ష్మి, కథల కీలకదీవి డి.సుజాతాదేవి ఆహ్వానిత ప్రముఖులు.

ఇంకా ` శాస్త్రాంశాల ధీర విజయలక్ష్మీ ధారా, రచనా సాహిత్య వరలక్ష్మి, మన్నిక కథనాల ముదిత మన్నె లలిత, హృదయభాషి లలితాదేవి మాడభూషి, లలితా సహస్రనామ రాణేశ్వరి ముదిగొండ మల్లీశ్వరి, భారతీయతా ప్రవచనవేణి సత్యవాణి, ఛందస్సుల రచనాంశాల ఉమాదేవి జంధ్యాల, కావ్య చూడా మణులు సత్యవాడ సోదరీమణులు, నాటి సాహిత్యరామ ముదిగొండ సీతారామమ్మ, భక్తి శతక సుమబాల మున్నంగి లలితకళ, ప్రత్యేకతల గంగ ఓల్గా, రుబాయిల కొమ్మ మరుదాడు అహల్యమ్మ, గేయమాలికాదేవి చాడా లలితాదేవి, సారస్వత వారధి దివాకర్ల రాజేశ్వరి… సన్మానితులు.

సామాజిక సేవల రాణి పసుమర్తి పద్మజవాణి, అన్నమార్య శోధనార శోభాదేవి రేవూరి, రూపకల్పనలకోన మీనా, నవ్యతలపుట్టి పాప ఎర్రంశెట్టి, పద్యనాటక గరిమ ఉప్పలపాటి కుసుమ, సేవారచనల సాగుబడి సంధ్య గోళ్ళమూడి, ధ్యానసాగరమంజరి జీవీ రాజేశ్వరి, ధారావాహికల స్ఫూర్తి భవానీ కృష్ణమూర్తి, వార్తా విషయిక సంచారి అఖిలేశ్వరి, సాహిత్య వనిత సుమన్‌లత; కల, గళకారి ఝాన్సీ కేవీకుమారి; భావ వ్యక్తీకరణల ప్రబల జానకీ ప్రభల, బహుభాషా భూషణ పుట్టపర్తి నాగపద్మిని, పత్రికా రంగవరమాల తిరుమల నీరజ, సాహితీభారతి సి.భవానీదేవి, చామంతుల మత్తడి బి.లీలారెడ్డి ` సహా సన్మానిత ప్రఖ్యాతులెందరో.

వయోధిక రీత్యా, జ్ఞాన ఆధిక్యతపరంగా సభావేదికను సుసంపన్నం చేసిన వారెందరో. హైదరాబాద్‌తోపాటు రాజమండ్రి, విశాఖపట్నం, మచిలీపట్నం, ఢిల్లీ, గుర్గావ్‌; అదేవిధంగా అమెరికాలోని కలంయోధులకు / కళామూర్తులకు గృహాల్లో సత్కారాలయ్యాయి. జార్ఖండ్‌లో కూడా.

పురస్కృతుల స్వీకర్తలోనూ పలువురు తమ ప్రాంతాలకు సంబంధించి ప్రదాతలుగా ఉంటు న్నారు. మాడభూషి లలితాదేవి రెండు దశాబ్దాలుగా కథల సంపుటాలకు పురస్కారాలందిస్తున్నారు.మరో  ప్రత్యేకత ఏమిటంటే, 75 వత్సరాలు దాటిన సారస్వత మూర్తుల గురించిన పుస్తకాల ప్రచురణ. ఆకాశవాణిలో ధారావాహికంగా అందించిన 150మంది పైగా ధీమంతుల జీవన సందేశాల పుస్తకానికి సహసంపాదకత్వం వహించారు అయినంపూడి శ్రీలక్ష్మి. తన అక్షరయాన్‌ సంస్థ ద్వారా ఇదివరలోనూ గౌరవ సన్మానాలు నిర్వర్తించిన నేపథ్యముంది. ఆ అనుభవం అనిర్వచనీయమని చెప్తుంటారు నేటికీ. వయసులవారీగా 100, 94, 88, 86,85,80,78,76,75,74,73,72, 71,70… ఇవన్నీ ‘మాతృవందనం’ అందుకున్నవారి వయో వివరాలు! అప్పటికీ, ఇప్పటికీ పట్టిన కలాన్ని పక్కనపెట్టనివారున్నారు. కళారాధనలోనే జీవితాల్ని చరితార్థం చేసుకుంటున్నవారూ ఎందరెందరో.

అందుకే-

మాతృ అంటే అపారశక్తి, అద్భుత సంపద, ఉజ్జీవనం, సంభావనం.

మునుపు పురస్కృతుల గ్రహీతల్లో – చిలుకూరి శాంతమ్మ, తుమ్మల, చలసాని వసుమతి, రాజ్యలక్ష్మి పోలాప్రగడ, అన్నంగి వెంకట శేషలక్ష్మి, సుశీలభట్టు, విజయభారతి, యల్‌.సీత, కె.వి.కృష్ణకుమారి, జయప్రద, పెద్దకూరి, చాగంటి కృష్ణకుమారి, సి.ఉమాదేవి, లక్ష్మీరాఘవ, పి.యస్‌.ఎం.లక్ష్మి, మాణిక్యాంబ, జి.యస్‌.లక్ష్మి, అమృతలత ఉన్నారు.

వారిలోని మరికొందరు: టి.సి.వసంత, లక్క రాజు నిర్మల, విద్యావతి, ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, కమలాకర రాజేశ్వరి, వేముగంటి శుక్తిమతి, విజయలక్ష్మి పండిట్‌, పెబ్బలి హైమవతి, స్వాతి శ్రీపాద, పొత్తూరి విజయ (లక్ష్మి, మణినాథ కోపల్లె, కొల్లూరు వెంకటరమణమ్మ, ఆచంట హేమలతాదేవి, రంగి కమల.

ఇంకా – వాసిరెడ్డి కాశీరత్నం, శారదా శ్రీనివాసన్‌, డి.కామేశ్వరి, హైమావతి భీమన్న, శారదా అశోక్‌వర్ధన్‌, చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ, చింతపల్లి వసుంధరా రెడ్డి, ముక్తేవిభారతి, సరస్వతి, పునుగోటి, ముదిగంటి సుజాతారెడ్డి, పరిమళా సోమేశ్వర్‌, పోల్కంపల్లి శాంతాదేవి, ఆలూరి విజయలక్ష్మి, ఇంద్రగంటి జానకీబాల, మంధా భానుమతి, తమిరిశ జానకి, రాజీవ్‌, జ్యోత్సా, శీలాసుభద్రాదేవి.

అదేవిధంగా ఇంకొందరు: యన్‌.అవరీతలక్ష్మి, వావిలికొలను రాజ్యలక్ష్మి, సుమతీ నరేంద్ర, గంటి భానుమతి, కె.ఎ.ఎల్‌.సత్యవతి, వనం సావిత్రీనాథ్‌, తిరునగరి దేవకీదేవి, సుజలగంటి, తెన్నెటి సుధాదేవి, రంగరాజు పద్మజ, కేతవరపు రాజ్యశ్రీ. ఈ అందరూ అప్పట్లో సన్మానాల ద్వారా నవ యువతరంలో నూతనోత్సాహానికి కారకులయ్యారు. ప్రాయంలో, ప్రతిభా వైదుష్యంలో మిన్నగా నిలిచిన  ఆ తత్వం వేదికముందు ఉన్న అసంఖ్యాకులకు నేత్రానందం అందించింది. వీనుల విందునూ కలిగించి, అనుభవశక్తిశీలతను చాటిచెప్పింది.

తాజాగా, ఈ సన్మానోత్సాహం పెద్దతరంలోని యువస్వభావానికి కీలక సూచికగా ప్రభవించింది. ‘తల్లీభారతి వందనం, నీ ఇల్లే మా నందనం / మేమంతా నీ పిల్లలం, నీ చల్లని ఒడిలో మల్లెలం / తెలుగుజాతికీ అభ్యుదయం, నవభారతికే నవోదయం / మీకు జయం జయం, అనుసరిస్తాం మేమందరం’ అనేంతగా గౌరవభక్తిపూరిత వాతావరణం వెల్లివిరిసింది. నాడూ నేడూ అదే ఉత్తేజం, అంతే సముల్లాసం.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE