– సంబరాజు లీల (లట్టుపల్లి)

‘జాగృతి’ నిర్వహించిన  కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


ఇంకా కొన్నేండ్లు పోయాక పురిటి నొప్పులంటే డాక్టర్‌ ఇంజక్షనిచ్చాకే వస్తాయనీ, శిశోదయాలు వృశ్చిక సంతానం సామెతను గుర్తు చేస్తూ కడుపు కోస్తేనే సాధ్యమనీ. ప్రసవం అంటే జననాంగాల ద్వారా కాక, పొట్ట కోస్తేనే జరుగుతుందనీ అనుకుంటారు. గర్భంలో ఉయ్యాలలూపిన పాపాయిని అంత భద్రంగా, పురిటి నొప్పులతో బద్దలు చేసి, శిశువుకు ఎలాంటి అపాయం రాకుండా, తలను క్రిందికి దించి, తల్లి కనుకూలంగా ఉమ్మినీటితో శిశోదయం జరుగుతుంది.

శిశుకేక విన్న తల్లి దేహం పుచ్చపువ్వులా పులకరించి, గుండెల్లో పాల సంద్రాల్ని నిలుపుకుని, తన బిడ్డ ఆకలి తీర్చే సాధనంగా తయారవుతుందనేది అంతా మరిచేపోయారు.

రక్తసిక్తధారలలో, మాయపొరను చీల్చుకుంటూ మంత్రసాని చేతుల్లోకి జరిగేవి శిశోదయాలు. ఇప్పుడు.. కృత్రిమంగా ఇంజక్షన్లతో నొప్పులు తెప్పించి పురుళ్లు పోస్తున్నారు.

అందుకే నేటి మెటర్నటి హోమ్స్‌ సేవాకేంద్రాలు కావు. పక్కా వ్యాపార కేంద్రాలు. వాటికి సంబంధించిన చర్చలేె జరుగుతున్నాయక్కడ.

డాక్టర్‌ వరద, రోజు మొత్తం పేషంట్లతోనే గడుపుతుంది. వారి సమస్యలూ వింటుంది. అందుకు శాస్త్రీయ పరిష్కారాలు సూచిస్తుంది. వారి అవసరాల్ని తన అనుభవానికి ఆధునికతను జోడిరచి తన చదువుతో వైద్యరంగంలో వెలిగిపోతున్నది.

హాస్పిటల్‌ నుండి వెళ్లగానే, రిలాక్సయి, తన గదిలో, పుస్తకాలతో, కంప్యూటర్లతో కుస్తీ పడుతుంది. ప్రయోగాలు చేస్తుంది. ఆరోజు, ఐ.వి.ఎఫ్‌. పద్ధతిలో ఫలదీకరించిన పిండాన్ని ఓ తల్లి కడుపులో ప్రవేశ పెట్టి, మరో పిండాన్ని ట్యూబ్‌లో పెంచుతూ మార్పుల్ని పరిశీలిస్తున్నది. ఒకసారి సిస్టర్‌ పొరపాటో, డాక్టర్‌ అజాగ్రత్తో మరే కారణమోగాని, టెస్టుట్యూబ్‌లోని బేబికి ఆక్సిజన్‌ అందలేదు.

వరద చూస్తుండగానే రెండు నెలల ఆ న్యూ బేబి శ్వాస ఆగిపోయింది. ఆ ‘ప్రతిసృష్టి’లో అండాన్ని ఇచ్చిన అమ్మాయి ముక్త అని తెలిసి బాధపడిరది.

డాక్టర్‌ వరద,‘‘ముక్తా! టేకిటీజీ! ఇది ప్రయోగం. మనం అన్నిటికి అనుభూతుల్ని జోడిరచి చూడొద్దు!’’ అంటూ ఆ ట్యూబర్న్‌ బేబిని గ్లవుస్‌ వేసుకున్న చేతులతో, గోడలోంచి రాలిపడిన ఇటుకను తొలగించినట్లుగా అతి సునాయసంగా తీసి సిస్టర్‌ కందించింది.

రోజు ప్రయోగాలతో కుస్తీ పడుతుంది వరద. అంతవరకూ ప్రాణంతో కదిలిన జీవి. అప్పుడు తను చూస్తుండగానే నిర్జీవమైపోయినా అదో తేలికపాటి సంఘటనగా చూసింది.

ఆ ప్రయోగంలో ఆమెకు ప్రాణాలు గడ్డి పరకతో సమానం.

అవన్నీ చూస్తూ ‘‘మాతో మీకు పనేమిటి డాక్టర్‌? ఎస్‌.ఎమ్‌.ఎస్‌. పంపించారు’’ అడిగింది గీర.

‘‘చిన్న పని. మాకు ఆరోగ్యవంతమయిన ఎగ్‌ డోనర్స్‌ కావాలి. మానవ దేహంలోని స్త్రీ శరీర నిర్మాణంలోని రెండు అండాశయాల్లోంచి రెండు అండాలు నెలకొకటి చొప్పునా, విడుదలవుతాయి. ఆ అండం, వీర్యకణంతో కలిసి, ఫలదీకరణం చెంది, పిండంగా మారుతుంది.

‘‘ఆ ఫలదీకరించిన పిండం, అద్దె అమ్మ గర్భంలో పెంచబడి, శిశువుగా మారుతుంది. అయితే, ప్రస్తుతం ఒకరికి సంతానం కావటానికి ఒక అండం అవసరం. అండం అవసరమయిన పార్టీ శరీరంలో ఎక్స్‌ఎక్స్‌ క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి. కాబట్టి, ఆమెకెన్నిసార్లు గర్భం వచ్చినా అమ్మాయే పుడుతుంది. కాబట్టి ‘వై’ క్రోమోజోముల ఫలదీకరించిన అండాన్ని, ఆమె గర్భంలో ప్రవేశ పెట్టటానికి ‘అండం’ కావాలి. ఆ ప్రయోగానికి ఒప్పుకుని, ఎగ్‌ డొనేెట్‌ చెయ్యగలరా? అవసరమయి నంత ప్రతిఫలం ముడుతుంది.’’ వ్యాపార లావాదేవీలను అనుకరించి మాట్లాడుతున్నా, పక్కా వ్యాపారవేత్తలా ఉంటారామె కూడా.

‘‘ఓ.కె. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఈలాంటి ప్రయోగాలకు కాలేజి అమ్మాయిలనే ఎందుకు ఎంచుకుంటున్నారు?’’ ప్రశ్నించింది నాన్సీ.

‘‘సింపుల్‌.  వారికి పెళ్లికాదు. అండాలు వృథా అవుతాయి.’’ చెప్పింది, నవ్వి.

ఒక్కసారిగా ఆమెలోని వ్యాపార ధోరణికి ప్రాణాలుపోయాల్సిన డాక్టర్‌, అంత తేలిగ్గా ప్రకృతిని తన చేతుల్లోకి తీసుకుని సహజత్వానికి విరుద్ధంగా విజ్ఞానాన్ని మలుచుకున్న తీరుకు ఆశ్చర్యపోయారు.

‘‘దానికి, ఎంత ‘పే’ చేస్తారు?’’ వరూధిని అడిగింది.

‘‘మీరు అడిగినంత! ప్రొఫెషనల్స్‌ అయితే, వారికి ఫిక్స్‌డు రేట్లున్నాయి. మీరు పెళ్లికాని అమ్మాయిలు. అందులోనూ అవసరాలున్న వాళ్లు. అవతల పార్టీకి అవసరముంది. ఇక్కడ జరిగేది మీరిచ్చే ‘అండం’ ఐ.వి.ఎఫ్‌ పద్ధతిలో, అంటే, శుక్రకణాన్ని, అండాన్ని – ల్యాబ్‌లో ఫలదీ కరించి, గర్భాశయంలో ప్రవేశ పెట్టటం. ‘ఎగ్‌’ డోనర్‌కు, ఎలాంటి పురుష స్పర్శ ఉండదు. అయితే, నేను ప్రస్తుతం కాల్‌ చేయడానికి కారణం, ఒక జంట ఏ బేబి అయినా సరేనంది. మరో జంటకు మాత్రం ప్రత్యేకించి అబ్బాయి కావాలిట.’’

‘‘అలా కూడా ఉంటుం దా?’’ ఆశ్చర్యంగా అడిగింది కల్పలత. ‘‘మేబీ. ప్రయోగం చెయ్యాలి’’ చెప్పింది డాక్టర్‌ వరద.

‘‘ఇలాంటి షరతులున్న ప్పుడు, డబ్బు ఇవ్వటం, ఎంతలో ఉంటుంది?’’ నాన్సీ అడిగింది.

‘‘అవి.. ఎలా ఉన్నా, మీ అవసరాలు, డిమాండ్స్‌ చెప్పండి’’ అంది వరద.

‘‘ఒక్కో అండానికి, మూడులక్షల వరకు, డిమాండ్‌ చేస్తాం’’ చెప్పింది నాన్సి.

‘‘అంత కుదరదు. అయితే, రెండు వరకు ఇప్పించగలం. అది చాల రహస్యంగా ఉంటుంది. అటు ఆ వైపు జంటను మీరు చూడరు. మిమ్మల్ని వాళ్లు చూడరు. ఇద్దరి మధ్య మీడియేటర్‌ను నేనేె. వాళ్లకు బేబినిప్పించి, మీకు అనుకున్న డబ్బు, ఇచ్చి పంపగలనంతేె’’ వివరించింది వరద.

‘‘అది.. మీపరంగా మాకూ సమస్య లుంటాయిగా! అవి పునరుత్పత్తికి సంబంధించినవి. మా భావి సంసారిక జీవితానికి సంబంధించినవి. మా దాంపత్యంలో మాతృత్వ జీవితానికి సంబంధించి నవి. ఉండవుగా?’’

‘‘అలాంటి ఏ సమస్యలూ రావు. ముందే పదిహేను రోజులూ, ప్రాజెస్తాన్‌ మాత్రలు, బలవర్ధక మైన ఆహారం, వైటమిన్‌.. అన్నీ ఇస్తాం. దాని వల్ల సరోగసి మదర్‌కు ఎలాంటి పునరుత్పత్తి సమస్యలు రావు. రెండోది, డొనెట్‌ చేసే గర్భస్థ పిండం అనువుగా పెరగటానికి. దీని ప్రభావంతో గర్భాశయంలోని లోపలి పొరలు గట్టిపడి ఆరోగ్యంగా ఉంటాయి. ఆ ఆరోగ్యం ముందు ముందు మీకూ ఉపయోగపడుతుంది’’ చెప్పింది.

‘‘సరోగసి మదర్స్‌ ఎన్నిసార్లు గర్భం ధరించ వచ్చు?’’ అడిగింది గీర.

‘‘మూడుసార్ల కన్నా ఎక్కువగా సరోగసిగా ఉండకూడదు. అద్దె అమ్మలు మూడుసార్లు మాతృదానం చేయవచ్చని ఇండియన్‌ కౌన్సిలాఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పర్మిషనిచ్చింది.

‘‘దానికి కొన్ని మార్గదర్శక సూత్రాల్ని రూపొందించింది. అవి` ఒకటి సరోగసి మదర్‌కు నలభై ఐదు సంవత్సరాలు మించకూడదు. రెండు, బంధువులే ఈ బాధ్యత తీసుకుంటే ఇద్దరు తల్లుల మధ్య, తరాల వ్యత్యాసం ఉండకూడదు’’ చెప్పింది వరద.

‘‘పుట్టే బిడ్డపై హక్కులు ఎవరికుంటాయి?’’ నాన్సి ప్రశ్నించింది.

‘‘అద్దె గర్భంలోని శిశువుపై హక్కులన్నీ అద్దెకు తీసుకున్న తల్లిదండ్రులవే! అయితే, మరో సంవ త్సరంలోపలే, మరోసారి గర్భాన్ని ధరించవచ్చు. అది వారి స్వంతానికి కూడ ఉండవచ్చు’’ వివరించింది వరద.

‘‘ఎవరికైనా ఈ విషయం తెలిస్తే, అద్దెతల్లి భవిష్యత్తు పాడవదా?’’ ప్రశ్నిం చింది భద్రి.

‘‘లేదు. అంతా చాలా రహస్యంగా, డాక్టర్‌ పర్యవేక్షణలో ఉంటుంది. కొత్తదనాన్ని ఆహ్వానించ టంలో బెరుకు ఉండి, సంప్రదాయం, ఆచారాలు, సంస్కృతి మట్టి కలుస్తాయనే భయమూ ఉంటుంది. మానవసంబంధాలు దెబ్బ తింటున్నాయనే వాదనా ఉంది’’ చెప్పింది వరద.

‘‘ప్రసవ సమయంలో గాని, ఇతరత్రా, ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే…?’’ కల్పలత ప్రశ్నించింది.

‘‘ప్రసవ సమయంలోగాని, లేదా ఇతర సమస్యల వల్ల ఏమైయినా జరిగినా, మరణించినా ఇన్సూరెన్స్‌ ఉంటుంది. మా సెంటర్స్‌కు, అంటే, సంతాన సాఫల్య కేంద్రాలకు, ఇండియన్‌ కౌన్సిలాఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్స్‌ పర్మిషనిచ్చింది’’ వివరించింది వరద.

జాలిపడ్డారంతా, అది విని.

కేవలం డబ్బుకోసం ఇంత కష్టపడి ఎవరి బిడ్డనో తనదిగా భావించి తొమ్మిది నెలలు మోసి, మరణిస్తే, ఇన్స్‌రెన్స్‌తో సరిపెడతామా? ప్రసవమంటేనేె స్త్రీకి పునర్జన్మ అంటారు.

‘‘అఫ్‌కోర్స్‌ తప్పదు. అన్ని ఆర్థిక ఒప్పందాల్లాగెే ఇదీనూ. వీటిల్లో, అనుబంధాలకు తావుండదు. నిజంగా తన సొంత బిడ్డకు తల్లయినా ఈ బాధ తప్పదుగా? దానిలాగెే ఇదీనూ. తేడా ఏమిటంటే, సొంత బిడ్డయితే ప్రేమానుబంధాలతో పెంచు కుంటుంది. అద్దెబిడ్డను మోస్తే, పేగు తెంచుకు పుట్టిన బిడ్డతో బంధం తెంచుకుని, డబ్బు తీసుకుని వెళ్లిపోతుందంతే!ె’’ ఎలాంటి భావాలు లేకుండా చెప్పేసింది వరద.

‘‘ఒకవేళ ఎంత కష్టపడ్డా జన్యుపరంగా వికటించి శిశువు మరణిస్తే….’’ భయంగా అడిగింది వరూధిని.

‘‘తప్పదు, శిశువు జన్మిస్తే ఎలా స్వీకరిస్తారో, రెండో దానినీ అద్దెకు తీసుకున్న దంపతులు భరించాల్సిందే. డబ్బు ఇవ్వాల్సిందే’’ చెప్పింది వరద.

‘‘ఓ.కె. డాక్టర్‌! నమస్తే!’’ లేచారంతా.

‘‘అన్ని సందేహాలు తీరాయిగా?’’ అడిగింది డాక్టర్‌ వరద నవ్వుతు.

‘‘తీరాయి!’’ వాళ్లు చిరునవ్వును సమాధానంగా ఇచ్చి వెళ్లారు.

******

డాక్టర్‌ వ్యాస్‌, మొదటిసారి విశ్రాంతి సమయంలో ఆ విషయం ఆలోచిస్తున్నాడు. ఇంత వరకతడు ఇలాంటి సమయం దొరికితే, మరో రాకెట్‌ ప్రయోగ నిర్మాణం గురించి ఆలోచించేవాడు. అతని మెదడు నిండా దాని నిర్మాణం, ప్రయోగం, ప్రయోజనం, పెట్టుబడి అంచనా, రాడార్స్‌ లాంటివే నిండిపోయేవి.

అతడీ రోజే ప్రభుత్వాలు తన ఉనికిని గుర్తించి, భావితరాల్లో తన తెలివి తేటల్ని, దేశ ప్రయోజనాల కోసం, స్టోర్‌ చేసుకోవచ్చన్న ఆలోచనల్ని అమల్లో పెట్టటానికి ప్రపంచ ప్రభుత్వాల ప్రపోజల్స్‌ గురించి, ఆలోచిస్తున్నాడు.

‘నా స్వంత ప్రయోజనం కోసం చేసే ఈ ఆలోచన.. ఇదే మొదటిది ` చివరిది కావాలి!’ అనుకున్నాడు.

నిజానికి, డాక్టర్‌ వ్యాస్‌, ఇప్పటివరకు యౌవనం వచ్చాక ఈ ఇరవై ఏండ్లలో ఎప్పుడూ ఆలోచించలేదు. కుటుంబమంటే తనకు బంధనమైపోతుందని దాని నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అందులోనూ శృంగారపరమైన కోరికలకు తావివ్వ లేదు. అతనికే ఆశ్చర్యంగా ఉంటుందప్పుడప్పుడు. పసిపిల్లలపై, అమ్మాయిలపై, వ్యక్తిగతంగా, సామూహికంగా జరుగుతున్న అత్యాచారాల గురించి చూస్తుంటే, వింటుంటే మరీను.

కోరిక, వ్యామోహం ఇంత హేయమైనవా?

ఇంతగా ఉచ్ఛం నీచం తెలియకుండా ఉంటాయా? సమయం, వయసు తారతమ్యం ఏవి ఆలోచించరా అనిపిస్తుంది.

అతనికిప్పుడనిపిస్తుంది. నిజమే! తప్పేముంది. తను ‘క్లోనింగ్‌’ద్వారానో, లేదా జన్యుపరంగా స్పెర్మ్‌ డొనేషన్‌తో మరో శాస్త్రవేత్తని దేశానికందించొచ్చు. నిజానికి, ఓ పౌరుడిగా అది తన బాధ్యత కూడా. భారతదేశానికి, ప్రపంచానికి శాస్త్రవేత్తల అవసరం ఎంతో ఉంది.

అయితే తనింతవరకు ఎలా ఉన్నాడు?

About Author

By editor

Twitter
YOUTUBE