ప్రపంచమంతా ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో భారతదేశం మాత్రమే ప్రగతి పథంలో పయనించడం, అసాధారణ రీతిలో పురోగమించడాన్ని ఆర్ధికవేత్తలు, ప్రపంచ నాయకులు గమనిస్తున్నారు. ‘కటిక దారిద్య్రాన్ని’ నిర్మూలించి దేశాన్ని ‘వికసిత భారత్‌’ దిశగా నడిపిస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వంపై అంతర్జాతీయ సంస్థలు ప్రశంసల వర్షం కురిపించే స్తున్నాయి. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాల నుంచి చంద్రయాన్‌ వరకూ, జి`20 నుంచి రష్యా, యుఎస్‌లతో ఏక కాల మైత్రివరకు భారత్‌ సాధించిన విజయాల పట్ల దేశ ప్రజలు కూడా ఉప్పొంగిపోతున్నారు. మోదీ ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే అని లబ్ధిదా రులు భావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ‘మోదీ కా గ్యారెంటీ’ మీద దాదాపు యావద్దేశా నికీ భరోసా వచ్చేసింది. ప్రస్తుతం భారత్‌ అతి భారీ పరివర్తనకు లోనవుతున్నది. దీని పూర్తి ఫలితాన్ని చూసేందుకు మరొక దశాబ్దం పట్టవచ్చన్నది నిపుణుల భావన. సమాజంలోని ప్రతి వర్గాన్నీ కలుపుకుపోతూ, వారిని కూడా ఆర్ధిక వ్యవస్థలో భాగం చేస్తూ, సంప్రదాయ వృత్తులను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తూ, వారికి చేయూతనిస్తూ ప్రధాని మోదీ వేస్తున్న ప్రతి అడుగూ భారత దేశానికి పునర్వైభవాన్ని తీసుకువచ్చేందుకేనన్నది నిర్వివాదం.


ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఐదవదిగా ఉన్న భారతదేశం మరొక రెండేళ్లలో మూడవ స్థానానికి చేరుకోనుందని నిపుణులు అంటున్నారు. భారతదేశం ఆర్ధిక సరళీకృత విధానాలకు ద్వారాలు తెరిచిన అనంతరం విదేశీ పెట్టుబడులు మన దేశంలోకి వచ్చినా, వాటి ఫలాలు ప్రజలకు సమానంగా అందలేదు. ముఖ్యంగా 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి, దాదాపు దశాబ్ద కాలంపాటు ప్రధానిగా ఒక ఆర్ధికవేత్త ఉన్న కాలంలో జరిగిన అవినీతి అనూహ్యమైంది. దాదాపుగా అదే సమయంలో, అంటే 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోదీ 2014 నాటికి ఆ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను 26 బిలియన్ల డాలర్ల నుంచి 260 బిలియన్‌ డాలర్లకు తీసుకు వెళ్లారు. ఇక ఆయన ప్రధాని అయ్యే నాటికి సుమారు రెండు ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడు రెండిరతలు అయింది. సమాజంలోని అట్టడుగు వ్యక్తి నుంచి అత్యున్నత స్థాయి వ్యాపారవేత్తల వరకు తగిన విధానాలను రూపొం దిస్తూ అందిరికీ లబ్ధి చేకూరుస్తున్న ఆయన ఆర్ధిక ప్రణాళికను ‘మోదీనామిక్స్‌’గా అభివర్ణిస్తున్నారు.

ఇంతకీ, ఏమిటీ మోదీనామిక్స్‌?

అంతర్జాతీయ విలువలను అనుసరిస్తూనే, అందులో భారతీయ విలువలను రంగరించి మానవ కేంద్రిత అభివృద్ధిని ప్రధానం చేసి రూపొందించిన విస్తృతమైన యవనికనే క్లుప్తంగా మోదీనామిక్స్‌ అని అభివర్ణించవచ్చు. పాశ్చాత్య ఆర్ధిక వ్యవస్థలలా లాభార్జన ప్రధానం కాకుండా సమాజంలోని అన్ని వర్గాలూ సమానంగా వృద్ధి చెందేందుకు రూపొందిం చిన ప్రణాళిక. దేశం స్వాతంత్య్రాన్ని ఆర్జించిన నూరవ సంవత్సరం, అంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించాలన్న సంక ల్పంతో ప్రధాని తన వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఆ దిశగా రానున్న దాదాపు రెండున్నర దశాబ్దాలలో జరుగనున్న కృషిని ‘అమృత్‌ కాలాన్ని’ అభివర్ణిస్తూ, ఆ లక్ష్యంతో ప్రధాని తన ప్రణాళికలను అమలు చేస్తున్నారు. భారతీయ పౌరుల జీవన నాణ్యతను మెరుగు పరచి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య గల అభివృద్ధి అంతరాలను పూరించడమే దీని లక్ష్యం. ప్రజాజీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని కనీసం చేస్తూనే నూతన సాంకేతికతలకు మోదీ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. భారతదేశానికి అంతర్గతంగా ఉన్న సామర్ధ్యాలను ఉపయోగించుకోవడమే కాక అంతర్జాతీయ వేదికలపై ఉనికిని చాటుకుంటున్నా మన్న ప్రధాని అన్న మాటలు జి20 నిర్వహణతో అర్థమవుతుంది. తాను ఏదైనా పనిని మొదలుపెట్టిన ప్పుడు దాని అంతిమ ఫలితం ఎలా ఉంటుందో తెలుసునని, కానీ తాను పని ప్రారంభించినప్పుడు దాని అంతిమ లక్ష్యాన్ని మొదటే ప్రకటించనని ప్రధాని మోదీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.

అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు

 2010లో అస్థిరమైన ఆర్ధిక వ్యవస్థగా పేరొందిన భారత్‌ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. అందుకే, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకులు కూడా దీనిని ప్రపంచ యవనికపై ప్రకాశిస్తున్న ధ్రువతారగా అభివర్ణిస్తు న్నాయి. ఇటీవలే అంతర్జాతీయ విత్త సంస్థ (ఐఎంఎఫ్‌), ఎన్నికల సంవత్సరంలో కూడా ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ ఆర్ధిక క్రమశిక్షణను అనుసరిస్తోందంటూ ప్రశంసల వర్షం కురిపించింది. నిన్నటివరకూ అత్యంత బలమైన ఆర్ధిక వ్యవస్థలుగా ఉన్న యుకె, జపాన్‌ వంటి దేశాలు అధికారికంగా తాము ఆర్ధిక మాంద్యంలోకి వెళ్లినట్టు బహిరంగం గానే ప్రకటించాయి. అనూహ్యంగా భారత్‌ మాత్రం శరవేగంతో దూసుకుపోతున్నది. ఒకప్పటి దరిద్ర దామోదర దేశం కాదు భారత్‌ అన్న విషయాన్ని ప్రపంచం కూడా గుర్తించి, అంగీకరించక తప్పడం లేదు.

అభివృద్ధి అజెండా ప్రకటన, అమలు

‘అభివృద్ధి’ అన్న నినాదంతోనే 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. నాడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ తన రాష్ట్రంలో విజయవంతమైన వృద్ధి నమూనాను ప్రజల ఎదుట ఆవిష్కరించిన క్రమంలో`యూపీఏ అవి నీతితో విసిగి ఉన్న ప్రజలు మోదీకి అవకాశమిచ్చారు. అంతే, అప్పటి నుంచీ అటు దేశం కానీ, ఇటు ప్రజలు కానీ వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2014లో ఎర్రకోటపై నుంచి తొలి ఉపన్యాసం చేసిన మోదీ అన్ని వర్గాల ప్రజలను ఆర్ధికంగా కలుపుకుపోయేందుకు ‘ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన’ను ప్రకటించారు. దీని ద్వారా అప్పటి వరకూ బ్యాంకు ఖాతాలు లేని పేదలకు ఖాతాలను తెరిచి, డెబిట్‌ కార్డుతో పాటు లక్ష రూపాయిల బీమాను ఇస్తున్నారు. వీటితో పాటుగా, ఆ ఏడాది అక్టోబర్‌ 2నుంచి స్వచ్ఛ భారత్‌ చొరవ ప్రారంభం, ఏడాది లోపల అన్ని పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం, ప్రణాళికా సంఘం స్థానంలో నూతన వ్యవస్థ (నీతీ ఆయోగ్‌)తో పాటుగా భారతీ యులను సాధికారం చేసేందుకు డిజిటల్‌ మౌలిక సదుపాయాలు అత్యంత ప్రధానమైనవిగా ప్రధాని ఆ ఉపన్యాసంలో ప్రకటించారు. పదేళ్ల తర్వాత అవన్నీ సాకారం అయ్యాయన్నది మన కళ్ల ఎదుట ఉన్న వాస్తవం. యుపిఐ అమలు కావడానికి ఈ జన్‌ధన్‌ ఖాతాలే కారణం అంటూ ఐఎంఎఫ్‌ తన నివేదికలలో అంగీకరించింది. భారత్‌లో నిరక్షరాస్యు లెక్కువంటూ టెక్కులు చూపిన అభివృద్ధి చెందిన దేశాలు నేడు అట్టడుగు స్థాయివారి నుంచి పైవరకు యుపిఐ సాంకేతికతను ఉపయోగించడం చూసి బిత్తరపోతున్నాయి. దీనిని తమ దేశంలో అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

వీటితో పాటుగా, మారుతున్న ప్రపంచంలో యువతను భవిష్యత్‌ అవసరా లకు సంసిద్ధం చేసేలా నైపుణ్యాలను అందించేందుకు, మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా ‘స్కిల్‌ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీనితో పాటుగా, భారత్‌లో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రపంచంలో నలుమూలల నుంచి ఉత్పత్తిదారులు వచ్చి భారత్‌లో పెట్టుబడులు పెట్టి, మేకిన్‌ ఇన్‌ ఇండియా (భారత్‌లో ఉత్పత్తి)ని ప్రారంభించాలని కోరారు. వారితో పాటుగా, మనం దిగుమతి చేసుకునే వస్తువులలో కొన్నింటినైనా వ్యవస్థాపక స్ఫూర్తితో భారత్‌లో ఉత్పత్తి చేయవలసిందిగా యువతను కోరడమే కాదు అందుకు తగిన ఏర్పా ట్లను మోదీ ప్రభుత్వం తక్షణమే ప్రారంభించింది.

లైసెన్స్‌ రాజ్‌లా కాకుండా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (వ్యాపారం చేయడం సులభతరం) కోసం చట్టాలలో అనేక సవరణలను చేసింది. వ్యాపారం చేయాలనుకునేవారు ఏకగవాక్షం ద్వారానే అన్ని అనుమతులను పొందేలా అవకాశం కల్పించింది.ఉత్పత్తి చేయడంతో పాటుగా వాటి బట్వాడా ఖర్చును తగ్గించేందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. నేడు, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న కారణంగా లాజిస్టిక్స్‌ మెరుగుడ్డాయి. వీటి కారణంగా ప్రయాణ సమయం తగ్గడమే కాదు, ఇంధనం ఆదా కూడా అవుతున్న దంటే అతిశయోక్తి కాదు.

కొవిడ్‌ సమయాన్ని కూడా ఫలవంతంగా ఉపయోగించి, ‘ఆత్మనిర్భర’ భారత్‌ ఎలా ఉంటుందో అటు ప్రపంచానికి, ఇటు దేశ ప్రజలకు ప్రదర్శిం చారు. పరిశోధన, అభివృద్ధికి ప్రాముఖ్యతను గుర్తించి దానికి పెద్ద పీటవేశారు. కొవిడ్‌ కాలంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా, దేశీయంగా వాక్సిన్‌ను ఆవిష్కరించి, ఉత్పత్తి చేయడం నుంచి వాటిని పేద దేశాలకు ఉచితంగా ఇవ్వడం వరకూ ఆయన భారతీయ విలువలనే ప్రదర్శించారు. ఆ సమయం లోనే ‘ఆయుర్వేద’ వంటి దేశీయ వైద్యపద్ధతులపై ఉన్న వదంతులకు ముగింపు పలికి, వాటిలో ఉన్న మేలును ప్రపంచానికి పట్టి చూపి, ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులపై ఆసక్తి పెంచారు.

ఇక రక్షణ రంగంలో ఆయుధాల తయారీ నుంచి వాటిని ఇతర దేశాలకు అమ్మడం వరకూ అన్నీ ఒక దశాబ్ద కాలంలో జరిగిపోవడం వెనుక ఉన్నది ప్రధాని ప్రోత్సాహం, ప్రోద్బలమేనన్నది నిస్సందేహం. అత్యంతాధునిక ఆయుధాలను తయారు చేసి, ప్రదర్శించడం ద్వారా భారత్‌ తన సామార్ధ్యాలను ప్రపంచానికి ప్రదర్శించేలా ప్రోత్సహించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ అంత రిక్షంలో పరిశోధనలు, విజయాలు సాగుతు న్నాయి. చంద్రయాన్‌ నుంచి ఆదిత్య ఎల్‌1 వరకు, అంతరిక్షంలో ఏకకాలంలో సుమారు 90కి పైగా ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం వరకూ అంతరిక్ష సంస్థల విజయాలను చూసి ప్రపంచ దేశాలు నిశ్చేష్టుమవుతున్నాయి. దీనితోపాటుగా, పర్యా వరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాలను వృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు సామాన్యు లను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణ అనుకూల విద్యుత్‌ వాహనాల అమ్మకాలు నేడు పెరుగు తున్నాయి. వీటన్నింటితో పాటుగా, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు పర్యా వరణ కాలుష్యాన్ని తగ్గించే సాంకేతికతలను కొనుగోలు, ఉపయోగం కోసం అభివృద్ధి చెందిన దేశాలు ఆర్ధిక సహాయాన్ని అందించాలంటూ డిమాండ్‌ చేశారు.

మార్పునకు పునాది వేసిన నిర్ణయాలు

దేశంలో పన్నుల వ్యవస్థను క్రమబద్ధీకరించి, పన్ను ఎగవేతలను నివారించేందుకు గుడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ (జీఎస్టీ)ని సాహసోపేతంగా అమలు చేసింది మోదీ ప్రభుత్వం. అంతకు ముందు ఉన్న యూపీఏ ప్రభుత్వం వ్యాపారుల ఆగ్రహానికి భయపడి దీనిని అమలు చేయలేదు. ఏకరూప పన్ను కావడంతో తమ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో వ్యాపారం చేసుకునే అవకాశం లభించింది.

దీనితో పాటుగా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టడా నికి రుణాలు తీసుకుని, లాభాలను వ్యక్తిగతంగా మేస్తూ, నష్టాలను ప్రజలపై రుద్దుతున్న సంస్థలను ఆటలను కట్టించేందుకు ‘ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌ రప్ట్సీ కోడ్‌ (ఐబిసి)’ని మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ బిల్లు తీసుకురాకముందు, ఒక కేసు పరిష్కారమయ్యేందుకు 3, 4 సంవత్సరాలు పట్టేదని, ఇది వచ్చిన తర్వాత 270రోజుల్లో పరిష్కారమై పోతోం దని ప్రపంచబ్యాంకు సర్వే పేర్కొనడం గమనార్హం.

ఇక, నల్లధన నిర్మూలన కోసం ఉరుములేని పిడుగులా ప్రవేశపెట్టిన పథకం ‘డీమానిటైజేషన్‌.’ పన్ను ఎగవేతల కోసం నగదు రూపంలో డబ్బు ఖర్చు చేస్తూ విలాసాలు అనుభవిస్తున్న వారి అలవాట్లను అరికట్టేందుకు వచ్చిందే ఈ పెద్ద నోట్ల రద్దు. పన్ను ఎగువేతదారులు తమ ఇళ్లల్లో దాచుకున్న పెద్ద నోట్లన్నీ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వాటిని మార్చుకోవాలన్న నిబంధన కారణంగా చాలా వరకు అక్రమ సంపాదన బ్యాంకులలో వచ్చి చేరింది. అక్కడి నుంచి ఇన్సూరెన్స్‌ కంపెనీలు, మ్యూచ్యువల్‌ ఫండ్స్‌ ద్వారా వచ్చి ఈక్విటీ మార్కెట్లలోకి ప్రవేశించి, అక్కడి విదేశీ పెట్టుబడులను సమతులం చేసింది. సహజవన రుల పారదర్శకంగా వేలం వేయడం, రహదారులు, రైల్వేలు, విద్యుత్‌ ప్రసారాలలో అవాంతరాలు లేకుండా ఉండేందుకు ఆయా రంగాలలో భారీ పెట్టుబడులను పెట్టడం ద్వారా వ్యాపారం చేయడం సులభతరం చేస్తున్నారు. ఈ పనులన్నింటిలో కూడా వివిధ స్థాయిల్లో ఉపాధి కల్పన జరుగుతున్నది.

కేవలం పెద్ద నగరాలు, పట్టణాలు మాత్రమే కాకుండా వెనుకబడిన జిల్లాలపై దృష్టి పెట్టి, వాటిని ‘ఆకాంక్షిత జిల్లాలు’గా నామకరణం చేసి వాటి అభివృద్ధిని ఒక ప్రాజెక్టుగా మార్చడంతో ఇప్పుడు దేశంలో గల 112 వెనుకబడిన జిల్లాల్లో 50 శాతం రెండవ శ్రేణి, మూడవ శ్రేణి పట్టణాలుగా రూపు దిద్దుకున్నాయి. అక్కడి మౌలిక సదుపాయాలు మెరుగుపడిన నేపథ్యంలో, ఆ ప్రాంతాలకు తగిన వ్యాపారాలు తరలి వెళ్లే అవకాశాలు, ఉపాధి పెరిగే అవకాశాలు పెరిగాయి.

సామాన్యులను ప్రభావితం చేస్తున్న విధానాలు

దాదాపు నూటయాభై కోట్ల జనాభా ఉన్న దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల గురించి ఆలోచించి, అభివృద్ధి ఫలాలను వారికి చేర్చడమన్నది చిన్న విషయం కాదు. కోట్లాదిమంది ప్రజలకు ఉచిత బియ్యాన్ని అందించడం నుంచి, సిలెండర్లు, వ్యక్తిగత మరుగుదొడ్లతో ఆవాసాల నిర్మాణం, ఆయుష్మాన్‌ భారత్‌ పేరిట ఆరోగ్య బీమా పథకం, మహిళలకు డ్రోన్లను ఎగురవేయడంలో శిక్షణనిచ్చి, వారిని కూడా నైపుణ్య వర్గాల కిందకు తీసుకురావడం, లాభార్ధుల అకౌంటుకు ప్రత్యక్ష నగదు బదిలీ, రైతులకు కిసాన్‌ నిధి… దేశానికి వెన్నుముకగా ఉన్న గ్రామీణ ప్రాంతా లలో ప్రతి వర్గానికీ మెరుగైన జీవితాన్ని అందించేం దుకు పథకాలు అమలు చేయడం సాధారణ విషయం కాదు. తాను కూడా అట్టడుగు స్థాయి నుంచే వచ్చా నని, కనుక వారి సమస్యలను తనకు తెలుసంటూ, వారితో కలిసిపోయి, వారికి అవసర మైన ఆహారం, ఆవాసంతో పాటుగా వారిని కూడా ఏదో ఒక రూపంలో ఉపాధిమార్గంలోకి తెస్తున్నందునే ప్రధాని ‘మోదీ కా గ్యారెంటీ’ అన్న నినాదమిచ్చిన ప్పుడు ప్రజలంతా ఆయన నిలుస్తున్నారు.

అలాగే, చేతివృత్తిపనివారు, టైలర్లు, కుమ్మరి, జాలరి, మంగలి సహా అనేక వృత్తులను చేపట్టదలచు కున్న యువత నైపుణ్యాలను పెంపొందించి, వారి వృత్తికి అవసరమైన సరంజామాను అందించేందుకు విశ్వకర్మ వంటి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టారు. కేవలం డిగ్రీ ఉంటేనే ఉద్యోగం అన్న భావన నుంచి నైపుణ్యం ఉంటే ఉపాధి ఉన్నట్టే అన్న భావన దిశగా దేశాన్ని ప్రధాని నడిపిస్తున్నారు. దేశ యువతను ఉద్యోగమే జీవిత పరమావధి అన్న భావన నుంచి వ్యవస్థాపకత ద్వారా సంపాదన అన్న దిశగా మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. అందుకోసం ముద్ర వంటి రుణాలను అందించేం దుకు ఏర్పాట్లు చేసింది.

కేవలం దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా భారత్‌ గ్లోబల్‌ సౌత్‌ (వెనుకబడిన దేశాలు)కు నాయకత్వం వహిస్తోంది. శ్రీలంక వంటి దేశాలు ఆర్ధిక సంక్షోభంలో పడినప్పుడు ప్రతిఫలాపేక్ష లేకుండా ఆ దేశాన్ని ఆదుకోవడమే కాదు నిన్నటికి నిన్న భారత్‌పై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించిన మాల్దీవులకు ఇచ్చే ఆర్ధిక సహాయాన్ని ఈ ఏడాది బడ్జెట్‌లో పెంచడం ద్వారా తన ఉదార తను ప్రదర్శిం చింది ప్రపంచం బహుళ ధృవంగా మారుతున్న తరుణంలో పెద్ద పెద్ద దేశాలు కూడా భారత్‌ వైపు చూస్తున్నాయి. అది రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ కావచ్చు భారత సలహా వినేందుకు వారు సిద్ధంగా ఉన్నా, ఎవరి పక్షమూ తీసుకోకుండా తటస్త వైఖరిని అవలంబించడంతో ఇతర దేశాలకు కూడా భారత్‌ మీద నమ్మకం ఏర్పడు తున్నది. అంతర్జాతీయ వేదికపై భారత్‌ పేరును ప్రతి ధ్వనింప చేస్తున్న మోదీ పట్ల ఉన్నంత సానుకూలత మరే దేశంలోనూ ఏ నాయకుడికీ లేదేమో!

About Author

By editor

Twitter
YOUTUBE