ప్రపంచంలోనే ఏ అంతరిక్ష సంస్థ కూడా ఊహించలేనంత సరసమైన ధరల్లో విజయవంతమైన ప్రయోగాలను చేయడంలో పేరుగాంచిన అగ్రగామి సంస్థ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). అంతేకాదు, ఒక అభివృద్ధి చెందుతున్న దేశం సాధిస్తుందని ఎవరూ ఊహించని విజయాలను సాధించిన సంస్థ కూడా ఇదే. అది దక్షిణ ధృవంపై విజయవంతమైన చంద్రయాన్ ప్రయోగం కావచ్చు, సూర్యుని కక్షలో ఉపగ్రహాన్ని నిలపిన ఆదిత్య ఎల్ 1 మిషన్ కావచ్చు… వీటన్నింటినీ విజయవంతంగా ప్రయోగించడమే కాదు, ఇతర దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఖర్చుతో సాధించిన ఘన విజయాలు ఇవి. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అసూయ చెందే విధంగా ఒక విజయం తర్వాత మరొక విజయాన్ని సాధిస్తూ పురోగమిస్తున్న ఇస్రో తాజాగా మరొక ఘన విజయాన్నిన సాధించింది. అదే పునర్వినియోగ వాహనమైన పుష్పక్ ప్రయోగం. దీనితో, అంతరిక్షంలో అతితక్కువ ఖర్చుతో ఉపగ్రహా లను నిలపడం సాధ్యం అవుతుంది.
ప్రతి రంగంలోనూ ఆత్మనిర్భరతను సాధించా లన్న భారతదేశ పట్టుదలను మరింత పటిష్టం చేసే ప్రతిష్ఠాత్మకమైన విజయాన్ని ఇస్రో సాధించింది. దేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నంలో గణనీయమైన పురోగతిని సూచిస్త్తూ భారతదేశపు మొట్టమొదటతి పునర్వినియోగ ప్రయోగ వాహనం (రీయూజ బుల్ లాంచ్ వెహికల్`ఆర్‌ఎల్‌వి) ‘పుష్పక్’ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించి, పరీక్షించింది. ఇది భారతదేశపు అంతరిక్ష చరిత్రలో ఒక భారీ మైలురాయిగా చెప్పుకోవాలి.
ఇస్రో నిర్వహించినన కచ్ఛితమైన, ప్రణాళికా బద్ధమైన పరీక్ష అనంతరం ‘స్వదేశీ అంతరిక్ష షటిల్’గా నామకరణం చేసిన పుష్పక్, ఎస్‌యువి పరిమాణ రెక్కలతో కూడిన రాకెట్ కర్ణాటకలోని రన్‌వేపై దిగింది. వైమానిక దళ హెలికాప్టర్ నుంచి రాకెట్‌ను దించే పరీక్షలో, అద్భుతమైన, కచ్చితమైన ఫలితాలు వచ్చాయని ఇస్రో వర్గాలు వెల్లడిరచాయి. వాహనపు రోబోటిక్ ల్యాండిరగ్ సామర్ధ్యాలను విజయవంతంగా ధృవీకరిస్తూ, అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే ఆర్‌ఎల్‌వి అత్యధిక వేగంతో ల్యాండిరగ్ అయ్యే పద్ధతిని మిషన్ అనుకరించింది.
‘పుష్పక్’ అని నామకరణం చేసిన రెక్కల వాహనాన్ని భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా పైకి తీసుకువెళ్లి 4.5కిమీల ఎత్తు నుంచి దానిని విడుదల చేశారు. రన్‌వే నుంచి 4 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టిన తర్వాత, పుష్పక్ స్వయంప్రతిపత్తితో క్రాస్ రేంజ్ సవరణలతో రన్‌వే వద్దకు చేరుకుని, కచ్ఛితంగా రన్‌వే బ్రేక్ పారా చూట్‌ను, ల్యాండిరగ్ గేర్ బ్రేకులను, నోస్‌వీల్ స్టీరింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి తన ల్యాండిరగ్‌ను పూర్తి చేసి నిలిచింది.
సరసమైన ధరలలో అంతరిక్షాన్ని చేరుకోవాలన్న భారతదేశ అన్వేషణలో భాగంగా విజయవంతంగా పుష్పక్ ల్యాండిరగ్ చేయడం అన్నది మన శాస్త్రవేత్తల నిబద్ధతకు చిహ్నం. ‘పుష్పక్ ప్రయోగ వాహనం అంతరిక్ష వాహనాన్ని అత్యంత అందుబాటు ధరలో ఉంచేందుకు భారతదేశం చేసిన సాహసోపేత ప్రయత్నం’ అని వాహన సంభావ్య ప్రభావాన్ని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ నొక్కి చెప్పారు. ఇది భారత దేశపు భవిష్యత్ పునర్వినియోగ ప్రయోగ వాహనం. ఇందులో అత్యంత ఖరీదైన భాగం – అన్ని ఎలక్ట్రానిక్‌లను అమర్చిన పై భాగం. దీనిని అత్యంత సురక్షితంగా భూమిపైకి తీసుకురావడం ద్వారా పునిర్వనియోగపరచదగినదిగా మార్చడం జరిగిందని వివరించారు.
ఒక దశాబ్దకాలం కిందట ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు నిబద్ధతతో ఆర్‌ఎల్‌వి ప్రాజెక్టును ప్రారంభించారు. అంతరిక్ష వ్యర్ధాలను తగ్గించడం, ఉపగ్రహ విస్తరణ, నిర్వహణలో విప్లవాత్మక మార్పులు చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. పునర్నిర్మాణం కోసం కక్ష్య నుంచి ఉపగ్రహాలను తిరిగి స్వాధీన పరచుకొని, మరమ్మత్తులు చేయగల, కక్ష్యలోని ఉపగ్రహాలకు ఇంధనాన్ని నింపగల సామర్ధ్యంతో పుష్పక్ స్థిరమైన అంతరిక్ష అన్వేషణ దిశగా గణనీయ మైన పురోగతిని సూచిస్తోందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
భారతీయ ఇతిహాసం రామాయణంలో ప్రస్తావించిన ‘పుష్పక విమానం’ నుంచి ప్రేరణ పొంది ఈ వాహనానికి ‘పుష్పక్’ అని నామకరణం చేశారు. సంపదకు అధిదేవత అయిన కుబేరుడి అంతరిక్ష వాహనమే పుష్పక విమానం.
ముఖ్యంగా, 2016లో బంగాళాఖాతంలో వర్చువల్ రన్‌వే ల్యాండిరగ్‌పైన, 2023లో చినూక్ హెలికాప్టర్ నుంచి ఆకాశం నుంచి విడుదల చేసే పరీక్ష సహా గతంలో చేసిన పరీక్షల తర్వాత ఈ విజయవంతమైన ల్యాండిరగ్ సాధ్యపడిరది.
ఈ మైలురాయి ఘట్టాన్ని పూర్తి చేయడం అన్నది అంతరిక్ష సాంకేతికతలో పెరుగుతున్న భారతదేశ సామర్ధ్యాన్ని, సాహసాన్ని, తన అంతరిక్ష అన్వేషణ సామర్ధ్యాలను పెంపొందించుకోవడంలో నిబద్ధతను నొక్కి చెబుతుంది. అంతరిక్షశాస్త్ర రంగంలో ఇస్రో పరిధులను దాటి నూతన ఆవిష్కరణలను కొనసా గిస్తున్న క్రమంలో పుష్పక్‌ను విజయవంతంగా ల్యాండిరగ్ చేయడం ద్వారా దేశానికి తక్కువ ఖర్చుతో కూడుకున్న, స్థిరమైన అంతరిక్ష యాత్రల నూతన శకానికి నాంది పలికింది.
భారతదేశ అంతరిక్ష పరిశోధన రోడ్‌మ్యాప్‌లో దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను పట్టి చూపుతూ పుష్పక్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. పుష్పక్ విజయవంతమైన ల్యాండిరగ్‌తో ఇస్రో తన సామర్ధ్యాలను మరింత మెరుగుపరచుకునని, అంతరిక్ష పరిశోధనలో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడం పై దృష్టి పెట్టింది.
– జాగృతి డెస్క్